లలితా సహస్ర నామములు- 201-300

లలితా సహస్ర నామ స్తోత్రం
లలితా సహస్ర నామములు : 01-100  • 101-200  • 201-300  • 301-400  • 401-500  • 501-600  • 601-700  • 701-800  • 801-900  • 901-1000

లలితా సహస్ర నామ స్తోత్రములోని మూడవ నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.[1][2]

లలితా త్రిపుర సుందరి

శ్లోకము 52 మార్చు

 1. సర్వశక్తిమయీ - సర్వశక్తి స్వరూపిణి.
 2. సర్వమంగళా - సర్వమంగళ స్వరూపిణి.
 3. సద్గతిప్రదా - మంచి మార్గమును ఇచ్చునది.
 4. సర్వేశ్వరీ - జగత్తు లేదా విశ్వమునంతకు ప్రధానాధికారిణి.
 5. సర్వమయీ - సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉంది.
 6. సర్వమంత్ర స్వరూపిణీ - అన్ని మంత్రములును తన స్వరూపముగా గలది.

శ్లోకం 53 మార్చు

 1. సర్వయంత్రాత్మికా - అన్ని యంత్రములకు స్వరూపముగా గలది.
 2. సర్వతంత్రరూపా - అన్ని తంత్రములను తన రూపముగా గలది.
 3. మనోన్మనీ - మననస్థితిలో మేల్కాంచిన మననము చేయబడునట్టిది.
 4. మాహేశ్వరీ - మహేశ్వర సంబంధమైనది.
 5. మహాదేవీ - మహిమాన్వితమైన ఆధిపత్యము కలది.
 6. మహాలక్ష్మీ - గొప్పవైన లక్ష్మలు గలది.
 7. మృడప్రియా - శివుని ప్రియురాలు.

శ్లోకం 54 మార్చు

 1. మహారూపా - గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము గలది.
 2. మహాపూజ్యా - గొప్పగా పూజింపబడునది.
 3. మహాపాతక నాశినీ - ఘోరమైన పాతకములను నాశనము చేయునది.
 4. మహామాయా - మహిమాన్వితమైన మాయా లక్షణం కలది.
 5. మహాసత్వా - మహిమాన్వితమైన ఉనికి గలది.
 6. మహాశక్తిః - అనంతమైన శక్తి సామర్థ్యములు గలది.
 7. మహారతిః - గొప్ప ఆసక్తి గలది.

శ్లోకం 55 మార్చు

 1. మహాభోగా - గొప్ప భోగమును పొందునది లేదా అనుభవించునది.
 2. మహైశ్వర్యా - విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చునది.
 3. మహావీర్యా - అత్యంత శక్తివంతమైన వీర్యత్వము గలది.
 4. మహాబలా - అనంతమైన బలసంపన్నురాలు.
 5. మహాబుద్ధిః - అద్వితీయమైన బుద్ధి గలది.
 6. మహాసిద్ధిః - అద్వితీయమైన సిద్ధి గలది.
 7. మహాయోగేశ్వరేశ్వరీ - గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ప్రభవి.

శ్లోకం 56 మార్చు

 1. మహాతంత్రా - గొప్పదైన తంత్ర స్వరూపిణి.
 2. మహామంత్రా - గొప్పదైన మంత్ర స్వరూపిణి.
 3. మహాయంత్రా - గొప్పదైన యంత్ర స్వరూపిణి.
 4. మహాసనా - గొప్పదైన ఆసనము గలది.
 5. మహాయాగ క్రమారాధ్యా - గొప్పదైన యాగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడునది.
 6. మహాభైరవ పూజితా - శివుడి యొక్క వివిధ రూపములలో 'మహా కాల భైరవ' రూపం కలదు. భయము గొలిపే మహాభైరవుడు చేత పూజింపబడే దేవి.

శ్లోకం 57 మార్చు

 1. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ - సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమును సాక్షి స్వరూపిణి.
 2. మహా కామేశ మహిషీ - మహేశ్వరుని పట్టపురాణి.
 3. మహాత్రిపుర సుందరీ - గొప్పదైన త్రిపురసుందరి.

శ్లోకం 58 మార్చు

 1. చతుష్షష్ట్యుపచారాఢ్యా - అరువది నాలుగు ఉపచారములతో సేవింపబడునది.
 2. చతుష్షష్టి కళామయీ - అరువది నాలుగు కళలు గలది.
 3. మహాచతుష్షష్టి కోటియోగినీ గణసేవితా - గొప్పదైన అరువది కోట్ల యోగినీ బృందముచే సేవింపబడునది.

శ్లోకం 59 మార్చు

 1. మనువిద్యా - మనువు చేత ఉపాసింపబడిన విద్యారూపిణి.
 2. చంద్రవిద్యా - చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి.
 3. చంద్రమండలమధ్యగా - చంద్ర మండలములో మధ్యగా నుండునది.
 4. చారురూపా - మనోహరమైన రూపము కలిగినది.
 5. చారుహాసా - అందమైన మందహాసము కలది.
 6. చారుచంద్రకళాధరా - అందమైన చంద్రుని కళను ధరించునది.

శ్లోకం 60 మార్చు

 1. చరాచర జగన్నాథా - కదిలెడి, కదలని ఈ జగత్తుకు అధినాథురాలు.
 2. చక్రరాజ నికేతనా - చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది.
 3. పార్వతీ - పర్వతరాజు (హిమవంతుడి) పుత్రి.
 4. పద్మ నయనా - పద్మములవంటి నయనములు కలది.
 5. పద్మరాగ సమప్రభా - పద్మరాగముల కాంతికి సమానమగు శరీరకాంతి కలది.

శ్లోకం 61 మార్చు

 1. పంచప్రేతాసనాసీనా - పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది.
 2. పంచబ్రహ్మ స్వరూపిణీ - పంచబ్రహ్మలైన సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన స్వరూపమైనది.
 3. చిన్మయీ - జ్ఞానముతో నిండినది.
 4. పరమానందా - బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము.
 5. విజ్ఞానఘన రూపిణీ - విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది.

శ్లోకం 62 మార్చు

 1. ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా - ధ్యానము యొక్క, ధ్యానము చేయువాని యొక్క, ధ్యాన లక్ష్యము యొక్క సమన్వయ రూపము కలది.
 2. ధర్మాధర్మ వివర్జితా - విహితకర్మలు, అవిహిత కర్మలు లేనిది.
 3. విశ్వరూపా - విశ్వము యొక్క రూపమైనది.
 4. జాగరిణీ - జాగ్రదవస్థను సూచించునది.
 5. స్వపంతీ - స్వప్నావస్థను సూచించునది.
 6. తైజసాత్మికా - తేజస్సువంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్ఠాత్రి.

శ్లోకం 63 మార్చు

 1. సుప్తా - నిద్రావస్థను సూచించునది.
 2. ప్రాజ్ఞాత్మికా - ప్రజ్ఞయే స్వరూపముగా గలది.
 3. తుర్యా - తుర్యావస్థను సూచించునది.
 4. సర్వావస్థా వివర్జితా - అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండునది.
 5. సృష్టికర్త్రీ - సృష్టిని చేయునది.
 6. బ్రహ్మరూపా - బ్రాహ్మణ లక్షణము గల రూపము గలది.
 7. గోప్త్రీ - గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం కలది.
 8. గోవింద రూపిణీ - విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది.

శ్లోకం 64 మార్చు

 1. సంహారిణీ - ప్రళయకాలంలో సమస్త వస్తుజీవజాలాన్ని తనలోనికి ఉపసంహరణ గావించి, లీనము చేసుకొనునది.
 2. రుద్రరూపా - రుద్రుని యొక్క రూపు దాల్చింది.
 3. తిరోధానకరీ - మఱుగు పరచుటను చేయునది.
 4. ఈశ్వరీ - ఈశ్వరుని యొక్క శక్తిరూపములో ఉండునది.
 5. సదాశివా - సదాశివ స్వరూపిణి.
 6. అనుగ్రహదా - అనుగ్రహమును ఇచ్చునది.
 7. పంచకృత్య పరాయణా - సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే అయిదు కృత్యముల యందు ఆసక్తి కలది.

శ్లోకం 65 మార్చు

 1. భానుమండల మధ్యస్థా - సూర్య మండలములో కేంద్రము వద్ద ఉండునది.
 2. భైరవీ - భైరవీ స్వరూపిణి.
 3. భగమాలినీ - వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించునది.
 4. పద్మాసనా - పద్మమును నెలవుగా కలిగినది.
 5. భగవతీ - భగశబ్ద స్వరూపిణి.
 6. పద్మనాభ సహోదరీ - విష్ణుమూర్తి యొక్క సహోదరి.

శ్లోకం 66 మార్చు

 1. ఉన్మేషనిమిషోత్పన్న విపన్నభువనావళి - తెరువబడుటతోను, మూయబడుటతోను పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది.
 2. సహస్ర శీర్ష వదనా - వెయ్యి లేదా అనంతమైన శిరస్సులతో, ముఖములు కలది.
 3. సహస్రాక్షీ - వెయ్యి లేదా అనంతమైన కన్నులు కలది
 4. సహస్రపాత్ - అనంతమైన పాదములు కలది.

శ్లోకం 67 మార్చు

 1. ఆబ్రహ్మకీట జననీ - బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి.
 2. వర్ణాశ్రమ విధాయినీ - వర్ణములను, ఆశ్రమములను ఏర్పాటు చేయునది.
 3. నిజాజ్ఞారూప నిగమా - తనయొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినది.
 4. పుణ్యాపుణ్య ఫలప్రదా - మంచిపనులకు, చెడ్డపనులను వాటి వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చునది.

శ్లోకం 68 మార్చు

 1. శృతి సీమంత సిందూరీ కృతపాదాబ్జ ధూళికా - వేదములనెడు స్త్రీలయొక్క పాపిటలను, సిందూరము ధరించునట్లు చేసిన పాదపద్మము యొక్క ధూళిని కలిగినది.
 2. సకలాగమ సందోహశుక్తి సంపుటమౌక్తికా - అన్ని ఆగమ శాస్త్రములనెడు ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము.

శ్లోకం 69 మార్చు

 1. పురుషార్థప్రదా - పురుషునకు కావలసిన ప్రయోజనములు (ధర్మ అర్థ కామ మోక్షములను) చక్కగా ఇచ్చునది.
 2. పూర్ణా - పూర్ణురాలు.
 3. భోగినీ - భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చునది.
 4. భువనేశ్వరీ - చతుర్దశ భువనములకు అధినాథురాలు.
 5. అంబికా - తల్లి.
 6. అనాది నిధనా - ఆది, అంతము లేనిది.
 7. హరిబ్రహ్మేంద్ర సేవితా - విష్ణువు చేత, బ్రహ్మ చేత, ఇంద్రుని చేత సేవింపబడునది.

శ్లోకం 70 మార్చు

 1. నారాయణీ - నారాయణత్వ లక్షణము గలది.
 2. నాదరూపా - నాదము యొక్క రూపము అయినది.
 3. నామరూప వివర్జితా - పేరు, ఆకారము లేనిది
 4. హ్రీంకారీ - హ్రీంకార స్వరూపిణి.
 5. హ్రీమతీ - లజ్జాసూచిత బీజాక్షర రూపిణి.
 6. హృద్యా - హృదయమునకు ఆనందము అయినది.
 7. హేయోపాదేయ వర్జితా - విడువదగినది, గ్రహింపదగినది, లేనిది.

మూలాలు మార్చు

 1. "Untitled | PDF". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2023-07-08.
 2. Incarnation 14 (2020-08-31). "శ్రీ లలితా సహస్ర నామములు – 79 / Sri Lalita Sahasranamavali – Meaning – 79". Prasad Bharadwaj Incarnation 14 Blog (in ఇంగ్లీష్). Retrieved 2023-07-08.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)