లలితా సహస్ర నామములు- 301-400

లలితా సహస్ర నామ స్తోత్రం
లలితా సహస్ర నామములు : 01-100  • 101-200  • 201-300  • 301-400  • 401-500  • 501-600  • 601-700  • 701-800  • 801-900  • 901-1000

లలితా సహస్ర నామ స్తోత్రములోని నాలుగవ నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.[1][2]

లలితా త్రిపుర సుందరి

శ్లోకం 70

మార్చు
  1. నారాయణీ - నారాయణత్వ లక్షణము గలది.
  2. నాదరూపా - నాదము యొక్క రూపము అయినది.
  3. నామరూప వివర్జితా - పేరు, ఆకారము లేనిది
  4. హ్రీంకారీ - హ్రీంకార స్వరూపిణి.
  5. హ్రీమతీ - లజ్జాసూచిత బీజాక్షర రూపిణి.
  6. హృద్యా - హృదయమునకు ఆనందము అయినది.
  7. హేయోపాదేయ వర్జితా - విడువదగినది, గ్రహింపదగినది, లేనిది.

శ్లోకం 71

మార్చు
  1. రాజరాజార్చితా - రాజులకు రాజులైన వారిచేత అర్చింపబడునది.
  2. రాజ్ఞీ - రాణి.
  3. రమ్యా - మనోహరమైనది.
  4. రాజీవ లోచనా - పద్మములవంటి కన్నులు కలది.
  5. రంజనీ - రంజింప చేయునది లేదా రంజనము చేయునది.
  6. రమణీ - రమింపచేయునది.
  7. రస్యా - రస స్వరూపిణి.
  8. రణత్కింకిణి మేఖలా - మ్రోగుచుండు చిరుగజ్జెలతో కూడిన మొలనూలు లేదా వడ్డాణము గలది.

శ్లోకం 72

మార్చు
  1. రమా - లక్ష్మీదేవి.
  2. రాకేందు వదనా - పూర్ణిమ చంద్రుని పోలిన ముఖము గలది.
  3. రతి రూపా - ఆసక్తి రూపమైనది.
  4. రతి ప్రియా - ఆసక్తి యందు ప్రీతి కలది.
  5. రక్షాకరీ - రక్షించునది.
  6. రాక్షసఘ్నీ - రాక్షసులను సంహరించునది.
  7. రామా - ఎప్పుడూ సంతోషంగా, క్రీడాత్మకంగా వుండేది.
  8. రమణ లంపటా - రమణునితో అత్యంత సాన్నిహిత్య, సామ్య సంబంధము గలది.

శ్లోకం 73

మార్చు
  1. కామ్యా - కోరదగినటువంటిది.
  2. కామకళారూపా - కామేశ్వరుని కళయొక్క రూపమైనది.
  3. కదంబ కుసుమప్రియా - కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది.
  4. కళ్యాణీ - శుభ లక్షణములు కలది.
  5. జగతీ కందా - జగత్తుకు మూలమైనటువంటిది.
  6. కరుణా రస సాగరా - దయాలక్షణానికి సముద్రము వంటిది.

శ్లోకం 74

మార్చు
  1. కళావతీ -కళా స్వరూపిణీ.
  2. కలాలాపా - కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది.
  3. కాంతా - కామింపబడినటువంటిది.
  4. కాదంబరీ ప్రియా - పరవశించుటను ఇష్టపడునది.
  5. వరదా - వరములను ఇచ్చునది.
  6. వామనయనా - అందమైన నేత్రములు గలది.
  7. వారుణీ మదవిహ్వలా - వరుణ సంబంధమైన పరవశత్వము చెందిన మనోలక్షణము గలది.

శ్లోకం 75

మార్చు
  1. విశ్వాధికా - ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు.
  2. వేదవేద్యా - వేదముల చేత తెలియదగినది.
  3. వింధ్యాచల నివాసినీ - వింధ్యపర్వత ప్రాంతమున నివాసము గలది.
  4. విధాత్రీ - విధానమును చేయునది.
  5. వేద జననీ - వేదములకు తల్లి.
  6. విష్ణుమాయా - విష్ణుమూర్తి యొక్క మాయా స్వరూపిణి.
  7. విలాసినీ - వినోదాత్మక, క్రీడాత్మక లక్షణము గలది.

శ్లోకం 76

మార్చు
  1. క్షేత్రస్వరూపా - క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వరూపంగా నుండునది.
  2. క్షేత్రేశీ - క్షేత్రమునకు అధికారిణి.
  3. క్షేత్ర క్షేత్రజ్ఞపాలినీ - స్థూలభాగమైన దేహమును, సూక్ష్మభాగమైన దేహిని పాలించునది లేదా రక్షించునది.
  4. క్షయవృద్ధి వినిర్ముక్తా - తరుగుదల, పెరుగుదల లేనిది.
  5. క్షేత్రపాల సమర్చితా - క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడునది.

శ్లోకం 77

మార్చు
  1. విజయా - విశేషమైన జయమును కలిగినది.
  2. విమలా - మలినములు స్పృశింపనిది.
  3. వంద్యా - నమస్కరింపతగినది.
  4. వందారు జనవత్సలా - నమస్కరించు శీలము గల జనుల యందు వాత్సల్యము గలది.
  5. వాగ్వాదినీ - వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణ నిచ్చు పరావాగ్దేవత.
  6. వామకేశీ - వామకేశ్వరుని భార్య.
  7. వహ్నిమండల వాసినీ - అగ్ని ప్రాకారమునందు వసించునది.

శ్లోకం 78

మార్చు
  1. భక్తిమత్కల్ప లతికా - భక్తికలవారిపట్ల కల్పవృక్షపు తీగవంటిది.
  2. పశుపాశ విమోచనీ - వివిధ పాశములచే బంధింపబడువారిని బంధ విముక్తులను చేయునది.
  3. సంహృతాశేష పాషండా - సంహరింపబడిన సకలమైన పాషండులని సంహరించునది.
  4. సదాచారప్రవర్తికా - సంప్రదాయబద్దమైన, శ్రోత్రీయ మార్గముననుసరించి యుండునట్లు ప్రవర్తింప చేయునది.

శ్లోకం 79

మార్చు
  1. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా - ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపములనెడి అగ్నిచేత తపింప చేయబడిన వారలకు మిక్కిలి సంతోషమును కలుగజేయునట్టి వెన్నెల వంటిది.
  2. తరుణీ - ఎప్పుడు తరుణ వయస్సు, అనగా ఒకేరీతి యౌవనము గలది.
  3. తాపసారాధ్యా - తపస్సు చేయువారిచే ఆరాధింపబడునది.
  4. తనుమధ్యా - కృశించిన అనగా సన్నని కటి ప్రదేశము అనగా నడుము గలది.
  5. తమో పహా - చీకటిని లేదా అజ్ఞానమును పోగొట్టునది.

శ్లోకం 80

మార్చు
  1. చితిః - కూర్పు, జ్ఞానబిందు సమీకరణ.
  2. తత్పదలక్ష్యార్థా - తత్ పదముచే నిర్దేశింపబడు లక్ష్యము యొక్క ప్రయోజనముగా నున్నది.
  3. చిదేకరస రూపిణీ - జ్ఞానచైతన్యమే ఒకే ఒక రసముగా లేదా సర్వసారముగా స్వరూపముగా గలది.
  4. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః - తనకు సంబంధించిన ఆనందముతో లేశమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము - మొదలైన ఆనందముల సమూహము గలది.

శ్లోకం 81

మార్చు
  1. పరా - పరాస్థితిలోని వాగ్రూపము.
  2. ప్రత్యక్చితీరూపా - స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది.
  3. పశ్యంతీ - రెండవస్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు
  4. పరదేవతా - పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మరూపము.
  5. మధ్యమా - పశ్యంతీ, వైఖరీ వాక్కులకు మధ్య వుండు స్థితికి సంబంధించిన వాక్కు.
  6. వైఖరీరూపా - స్పష్టముగా వ్యక్తమైన వాక్కు.
  7. భక్తమానస హంసికా - భక్తుల యొక్క, మనస్సులందు విహరించు ఆడు హంస.

శ్లోకం 82

మార్చు
  1. కామేశ్వర ప్రాణనాడీ - శివుని ప్రాణనాడీ స్వరూపిణి.
  2. కృతజ్ఞా - చేయబడే పనులన్నీ తెలిసింది.
  3. కామపూజితా - కామునిచే పూజింపబడునది.
  4. శృంగార రససంపూర్ణా - శీర్షములతోను, కోణములచేతను, నవరసాదినావముల చేతను కూడి నిండుగా ఉంది.
  5. జయా - జయస్వరూపిణి.
  6. జాలంధరస్థితా - జాలంధరసూచిత స్థానము నందున్నది.

శ్లోకం 83

మార్చు
  1. ఓడ్యాణ పీఠనిలయా - ఓడ్యాణ పీఠమునందు ఉంది.
  2. బిందుమండల వాసినీ - బిందువును పరివేష్టించి యుండు స్థానమున వసించునది.
  3. రహోయాగ క్రమారాధ్యా - ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమముగా ఆరాధింపబడునది.
  4. రహస్తర్పణ తర్పితా - రహస్యముగా చేయు తర్పణములచే తృప్తి చెందునది.

శ్లోకం 84

మార్చు
  1. సద్యఃప్రసాదినీ - తక్షణములోనే అనుగ్రహించునది.
  2. విశ్వ సాక్షిణీ - విశ్వములోని కృత్యములకు ఒకే ఒక సాక్షి.
  3. సాక్షి వర్జితా - సాక్షి లేనిది.
  4. షడంగదేవతా యుక్తా - ఆరు అంగదేవతలతో కూడి ఉంది.
  5. షాడ్గుణ్య పరిపూరితా - ఆరు విధములైన గుణములచే పుష్కలముగా నిండి యుండునది.

శ్లోకం 85

మార్చు
  1. నిత్యక్లిన్నా - ఎల్లప్పుడూ దయార్ద్రతతో తడుపబడి యుండునది.
  2. నిరుపమా - పోల్చిచెప్పుటకు ఉపమానము ఏమియు లేనిది.
  3. నిర్వాణ సుఖదాయినీ - సర్వనివృత్తి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి లేక మోక్ష సంబంధమైన ఆనందమును ఇచ్చునది.
  4. నిత్యాషోడాశికారూపా - నిత్యాదేవతలగానున్న పదహారు కళల రూపము.
  5. శ్రీకంఠార్థశరీరిణీ - శివుని సగము శరీరముగా నున్నది.

శ్లోకం 86

మార్చు
  1. ప్రభావతీ - వెలుగులు విరజిమ్ము రూపము గలది.
  2. ప్రభారూపా - వెలుగుల యొక్క రూపము.
  3. ప్రసిద్ధా - ప్రకృష్టముగా సిద్ధముగా నున్నది.
  4. పరమేశ్వరీ - పరమునకు అధికారిణి.
  5. మూలప్రకృతిః - అన్ని ప్రకృతులకు మూలమైనది.
  6. అవ్యక్తా - వ్యక్తము కానిది.
  7. వ్యక్తావ్యక్త స్వరూపిణీ - వ్యక్తమైన, అవ్యక్తమైన అన్నిటి యొక్క స్వరూపముగా నున్నది.

శ్లోకం 87

మార్చు
  1. వ్యాపినీ - వ్యాపనత్వ లక్షణము కలది.
  2. వివిధాకారా - వివిధములైన ఆకారములతో నుండునది.
  3. విద్యావిద్యా స్వరూపిణీ - విద్యకు సంబంధించిన భాగమును, అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా గలది.
  4. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముదీ - మహాకామేశ్వరుని కన్నులనెడు కలువపువ్వులకు ఆనంద వికాసమును కలిగించు వెన్నెలవెల్లువ.

మూలాలు

మార్చు
  1. "Untitled | PDF". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2023-07-08.
  2. Incarnation 14 (2020-08-31). "శ్రీ లలితా సహస్ర నామములు – 79 / Sri Lalita Sahasranamavali – Meaning – 79". Prasad Bharadwaj Incarnation 14 Blog (in ఇంగ్లీష్). Retrieved 2023-07-08.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)