లలితా సహస్ర నామములు- 801-900
లలితా సహస్ర నామ స్తోత్రములోని తొమ్మిదవ నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.[1][2]
శ్లోకం 152
మార్చు- కళానిధి: కళలకు నిధి వంటిది
- కావ్యకళా : కవితారూపిణి
- రసఙ్ఞా : సృష్టి యందలి సారము తెలిసినది
- రసశేవధి: రసమునకు పరాకాష్ట
- పుష్టా : పుష్ఠి కలిగించునది
- పురాతనా : అనాదిగా ఉన్నది
- పూజ్యా : పూజింపదగినది
- పుష్కరా : పుష్కరరూపిణి
- పుష్కరేక్షణా : విశాలమైన కన్నులు కలది.
శ్లోకం 153
మార్చు- పరంజ్యోతి: దివ్యమైన వెలుగు
- పరంధామ :శాశ్వతమైన స్థానము కలిగినది
- పరమాణు: :అత్యంత సూక్ష్మమైనది
- పరాత్పరా :సమస్తలోకములకు పైన ఉండునది
- పాశహస్తా :పాశమును హస్తమున ధరించినది
- పాశహంత్రీ :జీవులను సంసార బంధము నుంది విడిపించునది
- పరమంత్ర విభేదినీ :శత్రువుల మంత్ర ప్రయోగములను పటాపంచలు చేయునది.
శ్లోకం 154
మార్చు- మూర్తామూర్తా :రూపం కలది, రూపం లేనిది రెందూ తానే ఐనది
- నిత్యతృప్తా :ఎల్లప్పుదు తృప్తితో ఉండునది
- మునిమానస హంసికా :మునుల మనస్సులనెడి సరస్సులందు విహరించెడి హంసరూపిణి
- సత్యవ్రతా :సత్యమే వ్రతముగా కలిగినది
- సత్యరూపా :సత్యమే రూపముగా కలిగినది
- సర్వాంతర్యామినీ :సృష్టీ అంతటా వ్యాపించినది
- సతీ :దక్షప్రజాపతి కూతురు, శివుని అర్ధాంగి ఐన సతీదేవి.
శ్లోకం 155
మార్చు- బ్రహ్మాణీ :సరస్వతీ దేవి (బ్రహ్మదేవుని భార్య)
- బ్రహ్మజననీ :బ్రహ్మడేవుడిని సృస్టించినది
- బహురూపా :సమస్త రూపములు తానై ఉన్నది
- బుధార్చితా :ఙ్ఞానులచే పూజింపబదునది
- ప్రసవిత్రీ :జగజ్జనని
- ప్రచండాఙ్ఞా :తీవ్రమైన ఆఙ్ఞ కలది
- ప్రతిష్టా :కీర్తియే రూపముగా కలిగినది
- ప్రకటాకృతి: :బహిరంగమైన ఆకారము కలిగినది
శ్లోకం 156
మార్చు- ప్రాణేశ్వరీ :ప్రాణములకు అధీశ్వరి
- ప్రాణదాత్రీ :ప్రాణములు ఇచ్చునది
- పంచాశత్పీఠ రూపిణీ :శక్తిపీఠముల రూపమున వెలసినది
- విశృంఖలా :యధేచ్ఛగా ఉండునది
- వివిక్తస్థా :ఏకాంతముగా ఉండునది
- వీరమాతా :వీరులకు తల్లి
- వియత్ప్రసూ: :ఆకాశమును సృష్టించినది
శ్లోకం 157
మార్చు- ముకుందా :విష్ణు రూపిణీ
- ముక్తినిలయా :ముక్తికి స్థానమైనది
- మూలవిగ్రహ రూపిణీ :అన్నింటికీ మూలమైనది
- భావఙ్ఞా :సర్వజీవుల మానసిక భావములను తెల్సినది
- భవరోగఘ్నీ :జన్మపరంపర అను రోగమును పోగొట్టునది
- భవచక్ర ప్రవర్తినీ :లోకచక్రమును నడిపించునది.
శ్లోకం 158
మార్చు- ఛందః సారా :వేదముల సారము
- శాస్త్రసారా :వేదాంతాది సమస్త శాస్త్రముల సారము
- మంత్రసారా :మంత్రముల యొక్క సారము
- తలోదరీ :పలుచని ఉదరము కలిగినది
- ఉదారకీర్తి :గొప్ప కీర్తి కలిగినది
- రుద్దామవైభవా :అధికమైన వైభవము కలిగినది
- వర్ణరూపిణీ :అక్షరరూపిణి
శ్లోకం 159
మార్చు- జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయినీ :చావు, పుట్టుకలు, ముసలితనము మొదలైన వాటితో బాధపడు జనులకు విశ్రాంతిని ఇచ్చునది.
- సర్వోపనిషదుద్ఘుష్టా :అన్ని ఉపనిషత్తులచే చాటిచెప్పబడినది
- శాంత్యతీత కళాత్మికా :శాంతికంటే అతీతమైన చిదానందస్వరూపిణి (సంకల్ప, వికల్ప, రాగద్వేషములు లేని మానసిక స్థితి “శాంతి”, ఆనందము దానిని మించినది)
శ్లోకం 160
మార్చు- గంభీరా :లోతైనది (అమ్మణ్ణి తత్వము తెల్సుకొనుట కష్టము)
- గగనాంతస్తా :ఆకాశమునందు ఉండునది
- గర్వితా :గర్వము కలిగినది
- గానలోలుపా :సంగీతమునందు ప్రీతి కలిగినది
- కల్పనారహితా :ఎట్టి కల్పన లేనిది
- కాష్ఠా :కాలపరిగణన లో అత్యంత స్వల్పభాగము (రెప్పపాటుకన్న తక్కువ సమయం)
- కాంతా :కాంతి కలిగినది
- కాంతార్ధ విగ్రహ :కాంతుడైన ఈశ్వరునిలో అర్ధభాగము
శ్లోకం 161
మార్చు- కార్యకారణ నిర్ముక్తా :కార్యాకరణములు లేని శ్రీ మాత
- కామకేళీ తరంగితా :కోరికల తరంగముల యందు విహరించునది.
- కనత్కనక తాటంకా :మనోహరమగు ధ్వని చేయు బంగారు చెవి కమ్మలు కలది.
- లీలావిగ్రహ ధారిణి :లీలకై అనాయాసముగా అద్భుత రూపములను ధరించునది.
శ్లోకం 162
మార్చు- అజా :పుట్టుక లేనిది
- క్షయ వినిర్ముక్తా :మాయాతేతమైనది
- ముగ్ధా :12 – 16 సంవత్సరముల బాలికా రూపము కలిగినది
- క్షిప్రప్రసాదినీ :వెంటనే అనుగరించునది
- అంతర్ముఖ సమారాధ్యా :అంతర్ దృష్టి గల యోగులచే ఆరాధింపబడునది
- బహిర్ముఖ సుదుర్లభా :ప్రాపంచిక దృష్టి కలవారికి లభింపనిది.
శ్లోకం 163
మార్చు- త్రయీ :వేదస్వరూపిణి
- త్రివర్గ నిలయా :ధర్మార్ధ కామములకు నిలయం ఐయ్నది
- త్రిస్థా :మూడు విధములుగా ఉండునది
- త్రిపురమాలినీ :త్రిపురములను మాలికగా ధరించినది
- నిరామయా :ఏ బాధలూ లేనిది
- నిరాలంబా :ఆలంబనము అవసరము లేనిది
- స్వాత్మారామా :తన ఆత్మయందే ఆనందించునది
- సుధాసృతి: అమృతమును కురిపించునది
శ్లోకం 164
మార్చు- సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా :సంసారము అను ఊబిలో కూరుకొనిపొయిన జనులను ఉద్ధరించుటకు సామర్ధ్యము కలిగినది.
- యఙ్ఞప్రియా :యఙ్ఞములయందు ప్రీతి కలిగినది
- యఙ్ఞకర్త్రీ :యఙ్ఞము చేయునది
- యజమాన స్వరూపిణి :యఙ్ఞము చేయువారి స్వరూపం తానై ఉన్నది.
శ్లోకం 165
మార్చు- ధర్మాధారా : ధర్మమునకు ఆధారభూతమైనది
- ధనాధ్యక్షా : సర్వసంపదలకు అధికారిణి
- ధనధాన్యవివర్ధినీ : ధనము, ధాన్యము వర్ధిల్లచేయునది
- విప్రప్రియా : వేదాధ్యయన సంపన్నులైన వారియందు ప్రీతి కలిగినది
- విప్రరూప : వేదవిదులైనవారి యెందు ఉండునది
- విశ్వభ్రమణకారిణీ : విశ్వమును నడిపించునది
శ్లోకం 166
మార్చు- విశ్వగ్రాసా : విశ్వమే ఆహారముగా కలిగినది
- విద్రుమాభా : పగడము వలె ఎర్రనైన కంతి కలిగినది
- వైష్ణవీ : వైష్ణవీ దేవి రూపమున అవతరించినది
- విష్ణురూపిణీ : విష్ణురూపమున జగత్తును రక్షించునది
- అయోని: పుట్టుక లేనిది
- యోనినిలయా : సమస్త సృష్టి కి జన్మస్థానము
- కూటస్థా : మూలకారణ శక్తి
- కులరూపిణీ : కుండలినీ రూపిణి
శ్లోకం 167
మార్చు- వీరగోష్టేప్రియా : వీరభక్తులు చేయు తీవ్రసాధన యెందు ప్రీతి కలిగినది
- వీరా : వీరత్వము కలిగినది
- నైష్కర్మ్యా : కర్మబంధము లేనిది
- నాదరూపిణీ : ఓంకారస్వరూపిణి
- విఙ్ఞాన కలానా : విఙ్ఞాన స్వరూపిణి
- కల్యా : మూలకారణము
- విదగ్ధా : గొప్ప సామర్ధ్యము కలిగినది
- బైందవాసనా : బిందువు ఆసనముగా కలిగినది
మూలాలు
మార్చు- ↑ "Untitled | PDF". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2023-07-08.
- ↑ Incarnation 14 (2020-08-31). "శ్రీ లలితా సహస్ర నామములు – 79 / Sri Lalita Sahasranamavali – Meaning – 79". Prasad Bharadwaj Incarnation 14 Blog (in ఇంగ్లీష్). Retrieved 2023-07-08.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)