లలితా సహస్ర నామములు- 701-800

లలితా సహస్ర నామ స్తోత్రం
లలితా సహస్ర నామములు : 01-100  • 101-200  • 201-300  • 301-400  • 401-500  • 501-600  • 601-700  • 701-800  • 801-900  • 901-1000


లలితా సహస్ర నామ స్తోత్రములోని ఎనిమిదవ నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.[1][2]

శ్లోకం 136

మార్చు
  1. దీక్షితా : భక్తులను రకించుట యెందు దీక్ష వహించినది
  2. దైత్యశమనీ : రాక్షసులను సం హరించునది
  3. సర్వలోక వశంకరీ :సమస్తలోకములను వశము చేసుకొనునది
  4. సర్వార్ధదాత్రీ : కోరిన కోర్కెలన్నిటినీ తీర్చునది
  5. సావిత్రీ : గాయత్రీ మాత
  6. సచ్చిదానంద రూపిణీ : సత్,చిత్, ఆనందములే రూపముగా కలిగినది.

శ్లోకం 137

మార్చు
  1. దేశకాలపరిచ్ఛిన్నా : దేశకాలములచే మార్పు చెందినది
  2. సర్వగా : సర్వవ్యాపిని
  3. సర్వమోహినీ : అందరిని మోహింప చేయునది
  4. సరస్వతీ : విద్యాస్వరూపిణి
  5. శాస్త్రమయీ : శాస్త్రస్వరూపిణి
  6. గుహాంబా : కుమారస్వామి తల్లి
  7. గుహ్యరూపిణి : రహస్యమైన రూపము కలిగినది

శ్లోకం 138

మార్చు
  1. సర్వోపాధి వినిర్ముక్తా :ఏరకమైన శరీరము లేనిది
  2. సదాశివపతివ్రతా : శివుని భార్య
  3. సంప్రదాయేశ్వరీ : అన్ని సంప్రదాయములకు అధీశ్వరి
  4. సాధ్వీ : సాధుస్వభావము కలిగినది
  5. గురుమండల రూపిణీ : గురుపరంపరా స్వరూపిణి

శ్లోకం 139

మార్చు
  1. కులోత్తీర్ణా : సుషుమ్నా మార్గమున పైకిపోవునది
  2. భగారాధ్యా : త్రికోణ యంత్రమును ఆరాధింపబడునది
  3. మాయా : మాయాస్వరూపిణీ
  4. మధుమతీ : మధురమైన మనస్సు కలది (ఆనందస్వరూపిణీ)
  5. గణాంబా : గణములకు తల్లి
  6. కుహ్యకారాధ్యా : గుహ్యాదులచే ఆరాధింపబడునది
  7. కోమలాంగీ : మృదువైన శరీరము కలిగినది
  8. గురుప్రియా : గురువునకు ప్రియమైనది

శ్లోకం 140

మార్చు
  1. స్వతంత్రా : తన ఇష్టప్రకారము ఉండునది
  2. సర్వతంత్రేశీ : తాను ఉపదేసించిన తంత్రమునకు తానె దేవతైయున్నది
  3. దక్షిణామూర్తి రూపిణీ :దక్షిణామూర్తి రూపము ధరించినది
  4. సనకాది సమారాధ్యా : సనక, సనంద, సనత్కుమార, సనత్ సుజాత సనాతనులు అను దేవఋషులచే ఆరాధింపబడునది
  5. శివఙ్ఞాన ప్రదాయినీ :ఆత్మఙ్ఞానమును ఇచ్చునది

శ్లోకం 141

మార్చు
  1. చిత్కళానందకలికా : ఙ్ఞానము, ఆనందము అను జ్యోతిస్వరూపిణీ
  2. ప్రేమరూపా : ప్రేమమూర్తి
  3. ప్రియంకరీ : కోరికలు సిద్ధింపచేయునది
  4. నామపారాయణ ప్రీతా : తన నామములను పారాయణచేయు వారియందు ప్రీతి కలిగినది
  5. నందివిద్యా : అమ్మవారికి సంబందించిన ఓక మంత్ర విశేషము
  6. నటేశ్వరీ : నటరాజు యొక్క శక్తి

శ్లోకం 142

మార్చు
  1. మిధ్యాజగదధిష్టానా :మాయాజగత్తునందు చైతన్యరూపిణియై యుండునది
  2. ముక్తిదా : విముక్తి నిచ్చునది
  3. ముక్తిరూపిణీ : మోక్షరూపిణీ
  4. లాస్యప్రియా : లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినది
  5. లయకరీ : జగత్తును లయము చేయునది
  6. లజ్జా : లజ్జాస్వరూపిణీ
  7. రంభాది వందితా :రంభ మొదలగు అప్సరసలచే నమస్కారములు అందుకొనునది

శ్లోకం 143

మార్చు
  1. భవదావ సుధావృష్టి: : జన్మపరంపరలు అను దావాగ్నిని చల్లార్చుటకు అమృతవర్షము వంటిది
  2. పాపారణ్యదవానలా : పాపములు అనెడి అరణ్యమునకు కార్చిచ్చు వంటిది
  3. దౌర్భాగ్యతూలవాతూలా : దారిద్ర్యము, దురదృష్టము అనెడి పక్షి ఈకలకు హోరుగాలి వంటిది
  4. జరాధ్వాంతరవిప్రభా : ముసలితనమనే చీకటికి సూర్యకాంతి వంటిది

శ్లోకం 144

మార్చు
  1. భాగ్యాబ్ధి చంద్రికా : సంపద అనెడి సముద్రమునకు వెన్నెల వంటిది
  2. భక్తచిత్త కేకిఘనాఘనా : భక్తుల మనస్సులు అనే నెమళ్ళకు వర్షాకాలపు మేఘము వంటిది
  3. రోగపర్వతదంభోళిః : పర్వతములవంతి రోగములకు వజ్రాయుధము వంటిది
  4. మృత్యుదారు కుఠారికా : మృత్యువనెడి వృక్షమునకు గొడ్డలి వంటిది

శ్లోకం 145

మార్చు
  1. మహేశ్వరీ : మహేశ్వరుని ప్రియురాలు
  2. మహాకాళీ : కాళికా దేవి రూపము దాల్చినది
  3. మహాగ్రాసా : అధికమైన ఆహారమును కోరునది
  4. మహాశనా : లయకారిణి
  5. అపర్ణా : పార్వతీ దేవి
  6. చండికా : అసురుడైన చండుడిని సంహరించిన చండీ దేవి స్వరూపిణి
  7. చండముండాసుర నిషూదిని :చండుడు, ముండుడు అను రాక్షసులను సమ్హరించినది

శ్లోకం 146

మార్చు
  1. క్షరాక్షరాత్మికా : నశించునట్టి జగత్తు, శాశ్వతమైన చిన్మయ తత్వము రెండూను తానె రూపంగా ఐనది
  2. సర్వలోకేశీ : అన్ని లొకములకు అధీశ్వరి
  3. విశ్వధారిణీ : విశ్వమును ధరించినది
  4. త్రివర్గదాత్రీ : దర్మ, అర్ధ, కామములను ఇచ్చునది
  5. సుభగా : సౌభాగ్యవతి
  6. త్ర్యంబకా : మూడు కన్నులు కలది
  7. త్రిగుణాత్మికా : సత్వ, రజో, తమో గుణములను ఇచ్చునది.

శ్లోకం 147

మార్చు
  1. స్వర్గాపవర్గదా : స్వర్గమును అపవర్గమును (అనగా మోక్షమును) ప్రసాదించునది.
  2. శుద్ధా : మలినము లేనిది మరియు పవిత్రమైనది.
  3. జపాపుష్ప నిభాకృతిః : మందార పువ్వు వంటి ఛాయ కలిగినది.
  4. ఓజోవతీ : ఓజస్సు కలిగినటువంటిది.
  5. ద్యుతిధరా : శోభించునది.
  6. యజ్ఞరూపా : యజ్ఞమును తన రూపముగా కలిగినది.
  7. ప్రియవ్రతా : సంకల్ప నిష్ఠలతో కూడిన వ్రతముల యందు ప్రీతి కలిగినది.

శ్లోకం 148

మార్చు
  1. దురారాధ్యా : (ఇంద్రియ నిగ్రహం లేని యెడల) దుర్గమమైన ఆరాధన కలది.
  2. దురాధర్షా : (శుద్ధమైన భక్తిచే తప్ప) నియంత్రించ లేనిది
  3. పాటలీ కుసుమప్రియా : పాటలీ పుష్పం (పాదిరి పువ్వు) ప్రీతి కలది.
  4. మహతీ : అందరికన్నా, అన్నిటికన్నా గొప్పనైనది.
  5. మేరునిలయా : మేరు పర్వత నివాసిని
  6. మందార కుసుమప్రియా : పారిజాత పుష్పముల యందు ప్రీతి కలిగినది.

శ్లోకం 149

మార్చు
  1. వీరారాధ్యా : వీరులచే ఆరాధింపబదునది
  2. విరాడ్రూపా : అన్నింటికీ మూలమైనది
  3. విరజా : రజోగుణము లేనిది
  4. విశ్వతోముఖీ : విశ్వం అంతటినీ ఒకేసారి చూడగల్గిన ముఖము కలిగినది
  5. ప్రత్యగ్రూపా : నిరుపమానమైన రూపము కలిగినది
  6. పరాకాశా : భావనామాత్రమైన ఆకాశ స్వరూపిణి
  7. ప్రాణదా : సర్వజగత్తుకూ ప్రాణము ను ఇచ్చునది
  8. ప్రాణరూపిణీ : జీవులలో గల ప్రాణమే రూపముగా కలిగినది

శ్లోకం 150

మార్చు
  1. మార్తాండభైరవారాధ్యా :మార్తాండభైరవునిచే ఆరాధింపబడునది (శివుని యొక్క ఒకరూపం మార్తాండభైరవుడు)
  2. మంత్రిణీ : శ్యామలాదేవి
  3. న్యస్తరాజ్యధూ : రాజ్యాధికారము ఇచ్చునది
  4. త్రిపురేశీ : త్రిపురములకు అధికారిణి
  5. జయత్సేనా : అందరినీ జయించగల సైన్యము కలది
  6. నిస్త్రైగుణ్యా :త్రిగుణాతీతురాలు
  7. పరాపరా : ఇహము, పరము రెండునూ తానై యున్నది

శ్లోకం 151

మార్చు
  1. సత్య ఙ్ఞానానంద రూపా :సచ్చిదానందరూపిణీ
  2. సామరస్య పరాయణా : జీవుల యెడల సమరస భావముతో ఉండునది
  3. కపర్ధినీ : జటాజూటము కలిగినది (జటాజూటధారీఇన శివునకు కపర్ధి అను పేరు కలదు)
  4. కళామాలా : కళల యొక్క సమూహము
  5. కామధుక్ : కోరికలను ఇచ్చు కామధేనువు వంటిది
  6. కామరూపిణీ : కోరిన రూపము ధరించునది

శ్లోకం 152

మార్చు
  1. కళానిధి: కళలకు నిధి వంటిది
  2. కావ్యకళా : కవితారూపిణి
  3. రసఙ్ఞా : సృష్టి యందలి సారము తెలిసినది
  4. రసశేవధి: రసమునకు పరాకాష్ట
  5. పుష్టా : పుష్ఠి కలిగించునది
  6. పురాతనా : అనాదిగా ఉన్నది
  7. పూజ్యా : పూజింపదగినది
  8. పుష్కరా : పుష్కర (కమల) రూపిణి
  9. పుష్కరేక్షణా : కమలము వంటి (విశాలమైన) కన్నులు కలది.

మూలాలు

మార్చు
  1. "Untitled | PDF". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2023-07-08.
  2. Incarnation 14 (2020-08-31). "శ్రీ లలితా సహస్ర నామములు – 79 / Sri Lalita Sahasranamavali – Meaning – 79". Prasad Bharadwaj Incarnation 14 Blog (in ఇంగ్లీష్). Retrieved 2023-07-08.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)