లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ (ఆంగ్లం: Life is Beautiful) 2012లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ సినిమాకు కథ, దర్శకత్వాన్ని శేఖర్ కమ్ముల అందించాడు. ఈ సినిమాలో కొత్తవారైన అభిజిత్, సుధాకర్, కౌషిక్ నటించారు. ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో అమల అక్కినేని, శ్రియ, అంజులా ఝావేరి ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఎమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ సి. కుమార్ ఛాయాగ్రాహకుడు.[2]
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ | |
---|---|
దర్శకత్వం | శేఖర్ కమ్ముల |
రచన | శేఖర్ కమ్ముల |
నిర్మాత | శేఖర్ కమ్ముల చంద్రశేఖర్ కమ్ముల |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | విజయ్ సి. కుమార్ |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
నిర్మాణ సంస్థ | ఎమిగోస్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 14 సెప్టెంబరు 2012 |
సినిమా నిడివి | 167 minutes |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | ₹17.5 crore (US$2.2 million)(17 days)[1] |
కథ
మార్చువిశాఖపట్నంలో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి తాతయ్య, అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) హైదరాబాద్ లోని సన్ షైన్ వ్యాలీ కాలనీకి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు. నాగరాజు ( సుధాకర్)తో చివరికి అనేక తగాదాల నడుమ తన ప్రేమను అంగీకరిస్తుంది. అదేవిధంగా శ్రీనివాస్ (అభిజిత్) తన అత్తమ్మ కూతురు పద్దు (షాగన్) ప్రేమలో పడుతాడు. దీనిని వాళ్ళ అమ్మ తిరస్కరిస్తుంది. ఇది ఇలా ఉండగా శ్రియ, అభి (కౌషిక్) ల మధ్య సన్నిహితం పెరుగుతుంది. ఇది గోల్స్ ఫేజ్ వారికీ నచ్చకపోగా తనపై కోపాన్ని పెంచుకుంటారు. ఈ క్రమంలో శ్రియ అందాల పోటీల్లోలో పాల్గొని గెలుపొందుంతుంది. ముఖ్యంగా ఈ కథ అంతా గోల్డ్ ఫేజ్ కి, సన్ షైన్ వాలీకి నడుమ జరుగుతుంది. ఈ కథలో ప్రేమలో ఎవరెవరు పడ్డారు? శ్రీనివాస్ (అభిజిత్) అమ్మ ఎందుకు వారిని హైదరాబాద్ కి పంపించింది? అసలు కాలనిల నడుమ తగువులు ఎందుకు? తెలుపడమే మిగితా కథ సారాంశం.
నటవర్గం
మార్చు- అమ్మగా అమల
- శ్రీనుగా అభిజిత్
- నాగరాజుగా - సుధాకర్ కోమాకుల
- కౌషిక్
- పార్వతిగా శ్రియ
- మాయగా అంజులా ఝావేరి
- షాగన్
- అజయ్ గా విజయ్ దేవరకొండ
- జారా
- సత్యగా రష్మి
- కావ్య
- నవీన్
- సంజీవ్
- శ్రీరామ్
నిర్మాణం
మార్చులీడర్ సినిమా విడుదల ఏడు నెలల తర్వాత 2010, ఆగస్టు నెలలో శేఖర్ కమ్ముల ఈ సినిమా యొక్క ప్రకటనను విడుదల చేసారు. ఈ సినిమాని మొదట హీరో వరుణ్ సందేశ్‌తో తీయాలని యోచించారు కానీ తర్వాత ఈ సినిమాని కొత్తవారితో తీయాలని యోచించి ఎనిమిది నెలల పాటు ఆడిషన్ నిర్వహించి నూతన నటీనటులను ఎంపిక చేసారు. ఆ తర్వాత ఈ సినిమా నిర్మాణం జూన్ 2011లో మొదలు పెట్టి ఫిబ్రవరి 2012 వరకు పూర్తీ చేసి జులై 6, 2012న తొలి బుల్లి ప్రచార చిత్రాన్ని సినిమా బృందం విడుదల చేసింది. అదే విధంగా ఈ సినిమాని శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా అమిగోస్ బ్యానర్ పై నిర్మించారు.
సంగీతం
మార్చుUntitled | |
---|---|
ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని స్వరపరిచారు.
సం. | పాట | పాట రచయిత | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" | అనంత శ్రీరామ్ | కె.కె. | 05:21 |
2. | "బ్యూటీఫుల్ గర్ల్" | వనమాలి | కార్తిక్ | 04:40 |
3. | "అటు ఇటు ఉగుతు" | అనంత శ్రీరామ్ | శ్రీ రామచంద్ర | 05:28 |
4. | "ఇట్స్ యువర్ లవ్" | అనంత శ్రీరామ్ | నరేష్ అయ్యర్ | 05:08 |
5. | "అమ్మ అనీ కొత్తగా" | వనమాలి | శశికిరణ్, శ్రావణ భార్గవి | 05:34 |
6. | "లైఫ్ ఈజ్ బ్యూటీ పాప్" | అనంత శ్రీరామ్ | ||
మొత్తం నిడివి: | 31:57 |
విడుదల
మార్చుఈ సినిమా సెప్టెంబర్ 14 2012 న విడుదలయింది.
పురస్కారాలు
మార్చుఈ సినిమాకి అమల అక్కినేనికి 63 వ ఫీల్ంఫేర్ ఉత్సవంలో ఉత్తమ నటీగా సపోర్టీంగ రోల్ విభాగంలో అవార్డు వరించింది. ఇదే సినిమాలోని పాత్రకు గాను ఉత్తమ సహాయ నటిగా అమల అక్కినేనికి సినీమా అవార్డు లభించింది.
వసూళ్లు
మార్చుఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 17.5 కోట్లను ( 17 రోజులకు) వసూలు చేసింది
మూలాలు
మార్చు- ↑ "infoonlinepages.com".
- ↑ "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ". www.apherald.com. Retrieved 30 March 2018.