అమల అక్కినేని
అమల అక్కినేని, తెలుగు సినిమా నటి, జంతు సంక్షేమ కార్యకర్త. అమల తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు. తండ్రి బెంగాళీ.[1] ప్రముఖ నాట్యకారిణి రుక్మిణీదేవి అరండేల్ వద్ద శాస్త్రీయ నృత్య శిక్షణ పొందుతున్న అమల తమిళ దర్శకుడు భారతీరాజా దృష్టిలో పడి ఆయన దర్శకత్వం వహించిన వైశాలి అనే తమిళ చిత్రం ద్వారా కథానాయికగా సినీరంగంలోనికి ప్రవేశించింది. తెలుగులో ఈమె మొదటి చిత్రం డి.రామానాయుడు నిర్మించిన చినబాబు. ఆ చిత్రంలో కథానాయకుడు నాగార్జున. నాగార్జునతో ఆ చిత్ర నిర్మాణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వారిరువురూ 1993లో వివాహబంధం ద్వారా ఒక్కటయ్యేలా చేసింది. వీరిరువురికీ 1994లో అఖిల్ అనే కుమారుడు కలిగాడు.
అక్కినేని అమల | |
---|---|
![]() | |
జననం | అమల ముఖర్జీ సెప్టెంబర్ 24, 1968 పశ్చిమ బెంగాల్ భారత దేశము |
వృత్తి | జంతు సంక్షేమ కార్యకర్త, బ్లూక్రాస్ హైదరాబాద్ కన్వీనర్. |
ప్రసిద్ధి | తెలుగు సినిమా నటి |
భార్య / భర్త | అక్కినేని నాగార్జున |
పిల్లలు | అఖిల్ అక్కినేని |
అమల నటించిన తెలుగు చిత్రాలుసవరించు
- చినబాబు
- పుష్పక విమానం
- శివ
- ప్రేమ యుద్ధం
- ఘర్షణ
- నిర్ణయం
- రాజా విక్రమార్క
- మనం (అతిథి పాత్ర)
- లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
అక్కినేని వంశ వృక్షంసవరించు
మూలాలుసవరించు
- ↑ Animal-loving Amala - Times of India సెప్టెంబర్ 1, 2001