వంగవీటి రంగా

(వంగవీటి మోహన రంగా నుండి దారిమార్పు చెందింది)

వంగవీటి మోహన రంగా (1947 జూలై 4 - 1988 డిసెంబరు 26) కాంగ్రెస్ నాయకుడు. తూర్పు విజయవాడ మాజీ శాసనసభ సభ్యులు.

వంగవీటి మోహన్ రంగా
జననం
వంగవీటి మొహన్ రంగారావు

జులై 4, 1947
మరణం1988 డిసెంబరు 26(1988-12-26) (వయసు 41)
జాతీయతభారతీయుడు
వృత్తిరాజకీయ నాయకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత జాతీయ కాంగ్రెస్ (party)
పిల్లలువంగవీటి రాధాకృష్ణ

వ్యక్తిగత జీవితం

మార్చు

వంగవీటి మోహనరంగా 1947, జూలై 4 న కృష్ణ జిల్లా, ఉయ్యూరు మండలం లోని కాటూరులో జన్మించాడు. ఇతనికి వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి వెంకట నారాయణరావు, వంగవీటి శోభన చలపతిరావు, వంగవీటి రాధాకృష్ణరావు (sr.) అనే నలుగురు అన్నలు ఉన్నారు. వంగవీటి రంగా అన్న రాధాకృష్ణరావుకు కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి అయిన చలసాని వెంకటరత్నంతో సంబంధాలు ఉండేవి. అప్పట్లో చలసాని అనుచరుడైన దత్తి కనకారావు విజయవాడ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం మీద ఆధిపత్యం చలాయించేవాడు. ఈ వ్యాపారం మీద పట్టుకోసం వెంకటరత్నానికి, రాధాకృష్ణ మధ్య కలతలు వచ్చాయి. 1972లో వెంకటరత్నం, అతని అనుచరుడైన కనకారావులు ఇద్దరూ హత్య చేయబడ్డారు. రాధాకృష్ణ అనుచరులే ఈ హత్యకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన వల్ల 1974 లో ప్రత్యర్థులు వంగవీటి రాధాకృష్ణను హత్య చేశారు. రాధాకృష్ణ మరణంతో అతని తమ్ముడు మోహనరంగా విద్యార్థి నాయకులైన దేవినేని చంద్రశేఖర్ (గాంధీ), దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర ఐక్యవేదికను ఏర్పాటు చేసి దానికి నాయకుడైనాడు.[1]

రాజకీయంగా పలుకుబడి కలిగిన వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఆధిపత్య పోరాటం వల్ల ఈ ఐక్యవేదిక విడిపోయింది. 1979 లో దేవినేని చంద్రశేఖర్, 1988లో మరో సోదరుడు దేవినేని మురళి హత్యకు గురయ్యారు.[2]

విజయవాడలోని గిరిపురంలోని పేదల ఇళ్ల పట్టాల కోసం దీక్షలో వున్న వంగవీటి రంగ 1988 డిసెంబరు 26 తెల్లవారు ఝామున ప్రత్యర్థుల చేతిలో హత్య చేయబడ్డాడు. ఆ సమయంలో ఆయనకు కాపలాగా ఉన్న ఇద్దరు అంగరక్షులు ఈ హత్యను అడ్డుకోలేదు.[3][4] దేవినేని రాజశేఖర్, అతని అనుచరులే హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి. అతని హత్యతో కోస్తాలోని చాల జిల్లాల్లో దాడులు, ప్రతి దాడులు మొదలయ్యాయి. ఒక్కసారిగా విజయవాడ రంగా హత్యతో అతలా కుతలం అయిపోయింది. రంగ అనుచరులు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిని, వారి ఆస్తులను నాశనం చేశారు, అనేక పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు.

రంగ, చెన్నుపాటి రత్నకుమారిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు సంతానం. రాధాకృష్ణ, ఆషా.[5]

రాజకీయ జీవితం

మార్చు

తన అన్న రాధాకృష్ణ మరణంతో రంగా 1981 లో రాజకీయాల్లోకి ప్రవేశించి మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ అతనిమీద పోటీకి నిలబెట్టలేదు. తెలుగుదేశం పార్టీ మాత్రం అతని ప్రత్యర్థి అయిన దేవినేని నెహ్రూని సమర్ధించింది.[3] 1983 నుంచే రెండు పార్టీ కార్యకర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పట్లో ఎన్. టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు.[3] 1985 లో రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యాడు. 1979 లో దేవినేని నెహ్రూ సోదరుడు దేవినేని రాజశేఖర్ (గాంధీ) హత్య కేసులోనే రంగా జైలుశిక్ష అనుభవించి విడదలయ్యాడు.[2] 1988 మార్చి 10న దేవినేని సోదరుల్లో మరొకడైన మురళి హత్యకు గురయ్యాడు. మరలా రంగా అనుచరులే దీనికి కారణమని ఆరోపణలు వచ్చాయి. రంగా పోలీసుల ఆధిపత్యాన్ని నిరసించాడు. 1988 జులై 10 న జరిగిన కాపునాడు సభలో రంగాను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అప్పటికి రంగా జైల్లోనే ఉన్నాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత జనచైతన్య యాత్ర చేసి ఎన్. టి. రామారావు నియంతృత్వ పాలన చేస్తున్నాడని ప్రజలకు చెప్పాడు. అప్పుడే రామారావు వ్యాను మీద రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసి అధికారంలోకి వచ్చాడు.[3]

ఇతర విశేషాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Bid on ex-MLA's son: 4 held". The Hindu. 11 February 2004. Archived from the original on 26 December 2016.
  2. 2.0 2.1 "It all began at the auto stand". The New Indian Express. 22 June 2010. Archived from the original on 7 October 2016.
  3. 3.0 3.1 3.2 3.3 Menon, Amarnath K. (31 January 1989). "A caste war erupts". India Today.
  4. Jafri, Syed Amin (5 March 2002). "All 33 accused in V M Ranga Rao murder acquitted". Rediff.com.
  5. http://telugu.oneindia.in/grapevine/2010/vangaveeti-ranga-story-as-movie-020710.html[permanent dead link]
  6. "సినిమా రివ్యూ: వంగవీటి". ఆంధ్రజ్యోతి. 2016-12-23. Archived from the original on 2016-12-26. Retrieved 2016-12-27.