వనస్థలిపురం

(వనస్థలిపురము నుండి దారిమార్పు చెందింది)
  ?వనస్థలిపురం
ఆంధ్రప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°12′05″N 78°20′28″E / 17.2014°N 78.3410°E / 17.2014; 78.3410
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) రంగారెడ్డి జిల్లా
జనాభా 290,591 (2001 నాటికి)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్

• 500 070
• +2402,2412,2424


వనస్థలిపురము హైదరాబాదు నగరంలోని ప్రముఖ నివాస ప్రాంతము. హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి 9 పై హైదరాబాదు నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.

నిజాం కాలంలో దీనిని శికార్ ఘర్ (వేటాడే స్థలం) గా పిలిచేవారు. అప్పుడు ఈ ప్రాంతమంతా అరణ్యాలతో, అటవీ మృగాలతో నిండి ఉండేది. దాని వల్లనే ప్రస్తుత నామం వన (అరణ్యాలు) స్థలి (ప్రదేశము) పురం (చోటు) గా స్థిరపడింది.

వనస్థలిపురం అనగానే అవస్థలిపురం అని అనేవాళ్ళు ఒకప్పుడు. ౧౯౮౪ లో అక్కడ నాలుగు కాలనీలు ఉండేవి - ఓల్డ్ (పాత) కాలనీ, సచివాలయ నగర్, ఎన్.జీ.వోస్ కాలని, సెల్ఫ్ ఫైనాన్చ్ కాలని. ఉద్యోగులకు ఆదాయం, ఉద్యోగ హోదా (గ్రేడ్) ప్రకారం రాష్ట్రప్రభుత్వం వారు ఏ, బీ, సీ ఇళ్ళు (క్వార్టర్లు) కేటాయించారు.

గణేశ్ టెంపుల్, రైతు బజార్, ఎన్ జీ ఓస్ కొలోనైలా లోని బస్సు ప్రాంగణములు ఈ ప్రాంతములో ప్రముఖమైనవి. ఇక్కడ 3 చలన చిత్ర ప్రదర్శనశాలలు ఉన్నాయి, అవి సుష్మా, సంపూర్ణ, విష్ణు థియేటర్లు. ఈ ప్రాంతము నందున్న రైతు బజారు చుట్టుపక్కల గ్రామాల నుంచి తెచ్చి అమ్మ బడే తాజా కూరగాయలకు ప్రసిద్ధి.

వనస్థలి పురంలో వున్న ప్రధాన ఆలయాలు:

1.గణెష్ టెంపుల్ - ఈ ఆలయ ప్రాంగణంలో ఇతర అనేక దేవాలయములు ఉన్నాయి. 2.పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరాలయం. 3.సాయి బాబా ఆలయములు మూడు. 4.కన్యకా పరమేశ్వరి ఆలయం. 5.యల్లమ్మ దేవాలయము. 6.మార్కొండాలయము. 7.శ్రీ రామాలయము. 8.రాఘవేంద్ర స్వామి వారి ఆలయము. 9.పంచ ముఖ ఆంజనేయ స్వామి ఆలయం (ఇది చాల పురాతనమైనది)

వనస్థలిపురములో ఎన్నో పేరుగాంచిన విద్యా సంస్థలు ఉన్నాయి. ఇచ్చట లాయోల స్కూల్స్, సిద్దార్థ పబ్లిక్ స్కూల్, దిల్ సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్, లాయోల మోంటెస్సోరి స్కూల్, నాగార్జున హై స్కూల్, భాష్యం స్కూల్, వనస్థలి స్కూల్, ప్రశాంతి విద్య నికేతన్ స్కూల్, నారాయణ, రాజధాని, చైతన్య వంటి కళాశాలలు ఉన్నాయి.

చేరుకునేందుకు ఆర్ ట్ సీ బస్సులు

100V : నాంపల్లి / కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి
1V : సికంద్రాబాదు స్టేషను నుంచి
290 : జే బీ ఎస్ నుంచి
100I : ఎమ్ జీ బీ ఎస్ నుంచి
187D/V: కే పీ హెచ్ బీ కాలోనీ నుంచి
299 : హయాత్‌నగర్ నుంచి
72వV : చార్మినార్ నుంచి
156V : మెహీదీపట్నం నుంచి
158V : ఈ ఎస్ ఐ నుంచి
90వV : సికందరాబాద్ నుంచి ఉప్పల్, నాగోలు మీదుగా
ఇతర బస్సులు: 99V, 299S, 100, 225,90 మొదలగునవి

సోమనాధ క్షేత్రం, వనస్థలి పురం, హైదరాబాదు
యల్లమ్మ దేవి ఆలయం, వనస్థలిపురం

వనస్థలిపురంలో అనేక దేవాలయాలున్నాయి. అవి. 1. గణేష్ దేవాలయ సముదాయం. 2. పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవాలయం, 3, కన్యకా పరమేశ్వర ఆలయం 4.సాయిబాబ ఆలయాలు, 5.మార్కోండ దేవాలయం, 6.పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం.,7. శ్రీ రామఛంద్ర ఆలయం, 8.యల్లమ్మ గుడి, ప్రక్కనే వున్న పెద్ద గుట్ట పై సోమనాథ ఆశ్రమం అని ఒక ఆశ్రమం ఉంది. ఇందు శివ రాత్రిలో పెద్ద ఉత్సవం జరుగును. ప్రస్తుతం ఈ చుట్టు ప్రక్కల అనేక వందల కాలనీలు ఏర్పడ్డాయి.

ప్రజల వినోదార్థం ఇక్కడ "హరిణ వనస్థలి" పేరుతో జింకల పార్కు ఉంది. అందు అనేక జింకలు, ఇతర జంతువులు నెమళ్ళు అనేక పక్షులు ఉన్నాయి. మహావీరుని పేరున ఈ పార్కు ఏర్పాటు చేయ బడింది. అంతే గాక ఇక్కడ ఇతర పెద్ద పార్కులు ఉన్నాయి. అవి రాజీవ గాంధి పార్కు, 2. వివేకానంద పార్కు, హూడా పార్కు, మొదలగునవి ఉన్నాయి.

సీతా ఫల చెట్టులో కోయిల
వనస్థలిపురంలో శ్రీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరాలయం
వనస్థలిపురంలో నిర్మాణదశలోవున్న శ్రీ కన్యకాపరమేశ్వరాలయం.
వనస్థలిపుర శ్రీవేంకటేశ్వరాలయ ప్రాంగణంలో వేద పాఠశాల

హరిణ వనస్థలి జింకల పార్కు //// ప్రాముఖ్యత...... చరిత్ర.

హైదరాబాద్ నగర శివార్లలో విజయవాడ జాతీయ రహదారి పై ఆటో నగర్ ప్రక్కనే 3800 ఎకరాల విస్థీర్ణంలో వున్న ఈ జింకల పార్కు అటవీ శాఖ ఆధ్యర్యంలో ఉంది. హైదరాబాద్ పాలకులలో చివరి వాడైన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వేటాడడానికి వుపయోగించిన దట్టమైన ఈఅటవీ ప్రాంతమే ప్రస్తుతం వున్న ఈ జింకల పార్కు. దీనినే "మహా వీర హరిణ వనస్థలి" అంటారు. ఇది దేశంలోనే అతి పెద్ద జింకల పార్కుగా ప్రసిద్ధి పొందింది. 1994 వ సంవత్సరంలో జాతీయ వనంగా గుర్తించారు. ఈపార్కులో వందలాది కృష్ణ జింకలు, నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు, అనేక రకాల పాములు, అలాగే అనేక రకాల పక్షులు, సీతాకోక చిలుకలు ఉన్నాయి. సీతాకోక చిలుకలకు ప్రత్యేకమైన పార్కు ఉంది. ఇందులో వున్న అనేక రకాల ఔషధ మొక్కలు ఈ వనానికి వన్నె తెస్తున్నవి. ఇందున్న ప్రత్యేకమైన వృక్షాలు ఈ పార్కును కారడవులను తలపిస్తుంది. పర్యాటకుల వినోదార్థం ఇక్కడ వసతి గృహాలు, ఆహార శాలలు కూడా ఉన్నాయి. కార్తీక మాసంలో ఇందు వన భోజనాలు జరుగుతాయి. ఈ హరిణ వనస్థలి పేరుమీదనే "వనస్థలి పురం" ఏర్పాటు అయినది. నగరానికి తూర్పు దిశలో వున్న అతి పెద్ద విహార కేంద్రం ఈ హరిణ వనస్థలి.

ఇవి కూడా చూడండి

మార్చు

ప్రముఖులు

మార్చు