వల్లభనేని వంశీ మోహన్
వల్లభనేని వంశీ మోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, సినిమా నిర్మాత. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
వల్లభనేని వంశీ మోహన్ | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 - 2024 ఫిబ్రవరి 26 | |||
ముందు | దాసరి బాలవర్ధనరావు | ||
---|---|---|---|
తరువాత | యార్లగడ్డ వెంకటరావు | ||
నియోజకవర్గం | గన్నవరం నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1972 గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ | ||
సంతానం | 2 |
జననం, విద్యాభ్యాసం
మార్చువల్లభనేని వంశీ 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, గన్నవరంలో జన్మించాడు. ఆయన 1995లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంవీఎస్సీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. వంశీ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పబ్లిక్ పాలసీలో అడ్వాన్స్డ్ మెనేజే మెంట్ కోర్సు చేస్తున్నాడు.[2]
రాజకీయ జీవితం
మార్చువల్లభనేని వంశీ మోహన్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావుపై 9400 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై 838 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4]
వల్లభనేని వంశీ టీడిపిని విడి వైసీపీకి మద్దతుగా ఉండడంతో టీడీపీ వేసిన పిటిషన్‌తో ఆ పార్టీని వీడిన ఆయనపై అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 26న స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నాడు.[5][6]
వల్లభనేని వంశీమోహన్ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు చేతిలో 37,628 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[7]
నిర్మించిన సినిమాలు
మార్చు- పున్నమి నాగు (2009)
- అదుర్స్ (2010)
- టచ్ చేసి చూడు (2018)
మూలాలు
మార్చు- ↑ Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ News18 Telugu (11 July 2021). "పాలిటిక్స్ లోనే కాదు చదువులోనూ టాపర్.. స్టూడెంట్ నెం.1గా ఎమ్మెల్యే.. ప్రతిష్టాత్మక సంస్థలో సీటు". Retrieved 6 January 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
- ↑ NT News (27 February 2024). "ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
- ↑ Eenadu (27 February 2024). "8 మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.