అదుర్స్ (సినిమా)

2010 సినిమా దర్శకుడు వి .వి .వినాయక్

అదుర్స్ 2010 లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో జూనియర్ ఎన్. టి. ఆర్, నయనతార, షీలా ప్రధాన పాత్రల్లో నటించారు. జూనియర్ ఎన్.టి.ఆర్ మొదటి సారిగా ద్విపాత్రాభిమానం చేసిన చిత్రం ఇది. వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్ర నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. జనవరి 13, 2010 న ప్రపంచ వ్యాప్తంగా 1300 తెరలమీద విడుదలైన ఈ సినిమా వాణిజ్య పరంగా మంచి లాభాలు రాబట్టింది. 155 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఈ సినిమాను మలయాళంలో కవచం అనే పేరుతో అనువాదం చేశారు.

అదుర్స్
TeluguFilm Adurs.jpg
దర్శకత్వము వి. వి. వినాయక్
నిర్మాత వల్లభనేని వంశీ
రచన కోన వెంకట్
తారాగణం జూనియర్ ఎన్.టి.ఆర్
నయనతార
షీలా
మహేష్ మంజ్రేకర్
ఫిష్ వెంకట్
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
సినిమెటోగ్రఫీ ఛోటా. కె. నాయుడు
కూర్పు గౌతం రాజు
విడుదలైన తేదీలు 13 జనవరి 2010
దేశము  భారతదేశం
భాష తెలుగు
బడ్జెట్ 27 కోట్లు
IMDb profile

కథసవరించు

కథ ప్రారంభంలో ఒక ముసలామె కోడలు మూడోసారి కానుపులో మృత శిశువుకు జన్మనిచ్చేసరికి పక్కనే ఉన్న కవల పిల్లల్లో ఒకడిని తమ బిడ్డగా తీసేసుకుంటుంది. కవలపిల్లల్లో ఒకడైన నరసింహ మాత్రమే ఒంటరియైన తల్లి దగ్గర పెరుగుతాడు. పోలీసు కావాలనే లక్ష్యంతో పోలీసు అధికారియైన నాయక్ దగ్గర అండర్ కవర్ ఏజెంటుగా పనిచేస్తుంటాడు. మరో వైపు చారి బ్రాహ్మణ కుటుంబంలో పెరుగుతుంటాడు. అతనికి గురువైన భట్టు చంద్రకళ అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆమె మాత్రం చారిని ప్రేమిస్తుంటుంది. దానికి కారణం అదే పోలికలతో ఉన్న నరసింగ ఆమెను పోకిరీల నుండి ఆమెను రక్షిస్తూ ఉంటాడు. నరసింహ నాయక్ కూతురైన నందును ప్రేమిస్తూ ఉంటాడు. ధనరాజ్, బాబా అనే ఇద్దరు వ్యక్తులు ఒక పేరొందిన ఆర్మీ సైంటిస్ట్ కుటుంబంకోసం వెతుకుతుంటారు. ఆయనే నరసింహ తండ్రి. నరసింహను వారిద్దరూ కనిపెట్టి, నాయక్ తన కూతురు మీదున్న ప్రేమను ఆసరాగా తీసుకుని నరసింహను తమ దగ్గరికి రప్పించుకుంటారు. నరసింహ వారినుంచి తప్పించుకుంటాడు. కానీ అదే సమయానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళి చారిని నరసింహగా నటించేందుకు ఒప్పిస్తారు.

నటీ నటులుసవరించు

ఫలితంసవరించు

రెడిఫ్ ఈ చిత్రానికి 4/5 రేటింగ్ ఇచ్చింది.[1]

మూలాలుసవరించు

  1. "Adurs is NTR's show all the way". Rediff. Archived from the original on 16 January 2010. Retrieved 13 January 2010.

బయటి లింకులుసవరించు