వాగ్భటుడు

ఆయుర్వేద వైద్యుడు

వాగ్భటుడు ఒక సుప్రసిద్ద భారతీయ ఆయుర్వేద వైద్యుడు.

చరక సుశ్రుత కాశ్యప సంహితల్లోని ముఖ్యాంశాలను సంక్షిప్తం చేసి, మరికొన్ని శాస్త్రాలను మిళితం చేసి సరళీకృతమైన సంస్కృతంలో అందించిన గ్రంథాలే... ‘అష్టాంగ సంగ్రహం’, ‘అష్టాంగ హృదయం’ . వీటిలో మొదటిదాన్ని రాసింది వృద్ధ వాగ్భటుడు. రెండోది రాసినవాడు లఘువాగ్భటుడు. వీటినే ‘వాగ్భట సంహిత’లని అంటారు. ఈ సంహితల్లో జ్వరాలను తగ్గించే ఎన్నో కష్టాలను పేర్కొన్నారు. త్రిదోషాల్లో ఒకటైన శ్లేషాన్ని (కఫం) అవలంబక, క్లేదక, బోధక, శ్లేషక, శ్లేష్మాలు అంటూ ఐదు రకాలుగా విభజించిన ప్రత్యేకత వీరిది.[1]

చరక, సుశ్రుత, వాగ్భటులను వృద్ధత్రయం అంటారు.

రచించిన గ్రంధాలు సవరించు

వీరి రచనలు ప్రపంచ వ్యాప్తంగా పలు భాషలలోకి తర్జుమా అయ్యాయి.[1]: 656  కొన్ని ఎంపిక చేయబడిన రచనలు పెంగ్విన్ సిరీస్ వారు ప్రచురించారు.[2]

మూలాలు సవరించు

  1. 1.0 1.1 Meulenbeld, G. Jan (1999–2002). History of Indian Medical Literature. Vol. IA. Groningen: Egbert Forsten.
  2. Wujastyk, Dominik (2003). The Roots of Ayurveda. London etc.: Penguin. ISBN 0-14-044824-1.

బయటి లంకెలు సవరించు