వాడవల్లి
వాడవల్లి, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 521 329., ఎస్.టి.డి.కోడ్ = 08674.
వాడవల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°23′42″N 81°11′16″E / 16.395010°N 81.187792°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | ముదినేపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,966 |
- పురుషుల సంఖ్య | 952 |
- స్త్రీల సంఖ్య | 1,014 |
- గృహాల సంఖ్య | 554 |
పిన్ కోడ్ | 521329 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
జనాభా గణాంకాలుసవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1966 జనాభాతో 696 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 952, స్త్రీల సంఖ్య 1,014 - గృహాల సంఖ్య 554
గ్రామ భౌగోళికంసవరించు
సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు
సమీప గ్రామాలుసవరించు
సమీప మండలాలుసవరించు
రవాణా సౌకర్యాలుసవరించు
సింగరాయపాలెం, అల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 68 కి.మీ
విద్యా సౌకర్యాలుసవరించు
మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాలసవరించు
గాలి రాజేంద్రప్రసాదు, మండలంలోని మారుమూల గ్రామమైన వాడపల్లిలోని ఈ పాఠశాలలో, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వృత్తిజీవితంలో నిత్యం అవసరమయ్యే ఎన్నో విలువైన అంశాలను సంక్షిప్తీకరించి, సాధారణ పదాలలోనికి మార్చి, వారి చరవాణు (సెల్ ఫోన్) లకు సందేశాన్ని పంపుచున్నారు.ఈ విలువైన సమాచారం అందించడానికి www.krishnateachers.tk అను ఒక వెబ్ సైటును గూడా రూపొందించారు. ఈ వెబ్ సైటును ఇంతవరకు, రెండు లక్షలమంది వీక్షించారు.నెట్ కనెక్షను లేకపోయినా, చరవాణి ద్వారా అందిన ఈ సమాచారం చాలామందికి ఉపయుక్తంగా ఉంటుంది.[2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు
శ్రీ విఘ్నేశ్వర, శ్రీ వల్లీ దేవసేన సమేత శివ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివార్ల ఆలయంసవరించు
వాడవల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయ, విగ్రహ ప్రతిష్ఠ, 2014, జూన్-2 సోమవారం నాడు ఉదయం 8-11 గంటలకు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాడవల్లి, ఉరిమి తదితర గ్రామాలనుండి భక్తులు పెద్ద యెత్తున తరలివచ్చారు. అనంతరం నిర్వహించిన అన్నసమారాధనలో, ఐదువేలమందికి పైగా భక్తులు పాల్గొని స్వామివారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.[1]
మూలాలుసవరించు
వెలుపలి లంకెలుసవరించు
[1] ఈనాడు కృష్ణా; 2014, జూన్-3; 16వ పేజీ.
[2] ఈనాడు కృష్ణా; 2015, మార్చి-20; 9వ పేజీ.