వికీపీడియా:శుద్ధి దళం

వికీ శైలికి అనుగుణంగా లేని వ్యాసాలను వికీకరించి వ్యాస నాణ్యతను మెరుగుపరచడం ఈ దళ ముఖ్యోద్దేశం. ఈ విషయమై 2007 తెలుగు వికీపీడియా సమీక్షలో వచ్చిన సూచనకు అనుగుణంగా ఈ దళం ఏర్పడింది.

దళం విశేషాలు

మార్చు
  • ఆశయాలు:
    • వ్యాసాల్లో వికీశైలికి అనుగుణంగా మార్పు చేర్పులు చేసి, వాటి నాణ్యతను పెంచడం.
    • వికీ శైలి పట్ల సభ్యులకు అవగాహన కలిగించడం
  • నినాదం: దోషాలు కనిపిస్తే క్షమించకండి, తుదముట్టించండి.
  • దళ సభ్యుల పెట్టె: {{మూస:శుద్ధి దళ సభ్యులు}}

దళంలో చేరే విధానం

మార్చు

చాలా సులభం. {{మూస:శుద్ధి దళ సభ్యులు}} అనే మూసను మీ సభ్యుని పేజీలో పెట్టుకోండి. దాంతో మీరు ఈ దళంలో చేరినట్లే. అలాగే మీ పేరును దళ సభ్యులు విభాగంలో చేర్చండి.

దళ కార్యక్రమాలు

మార్చు
  • శుద్ధి చెయ్యవలసిన వ్యాసాల జాబితా వర్గం:శుద్ధి చేయవలసిన వ్యాసాలు వర్గంలో ఉంటుంది. ఇదే ఈ దళానికి కార్యక్షేత్రం.
  • ప్రధాన (మొదటి) నేమ్ స్పేసు లోని వ్యాసాలను గమనిస్తూ ఉండాలి. రోజుకు మూడు లేదా నాలుగు వ్యాసాలను లక్ష్యంగా పెట్టుకుని పనిచెయ్యాలి.
  • వ్యాసాలు వికీ శైలికి అనుగుణంగా లేవని గమనించినపుడు, వెంటనే సరిదిద్దాలి.
  • వ్యాసాన్ని పూర్తిగా సరిదిద్దలేని పక్షంలో ఆ పేజీలో అన్నిటికంటే పైన {{మూస:శుద్ధి}} అనే మూసను ఉంచాలి. దాంతో సదరు పేజీ వర్గం:శుద్ధి చేయవలసిన వ్యాసాలు అనే వర్గానికి చేరుతుంది.

దళ సభ్యులు

మార్చు