ఇంకొంత యాదృచ్చిక సమాచారాన్ని చూపించు


యాదృచ్ఛిక ఈ వారం వ్యాసంసవరించు

సంవత్సరం: 2007    వారం: 29


టి.జి.కమలాదేవి (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు) అసలు పేరు తోట గోవిందమ్మ. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలం కార్వేటినగరం. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా చూడామణి. మాయలోకం అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు తో జోడీగా ముగ్గురు మరాఠీలు సినిమాలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. పాతాళభైరవి, మల్లీశ్వరి (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్ సినిమాల్లో నటించింది. ఈమె మల్లీశ్వరిలో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది. తెలుగుతో పాటు అనేక తమిళ సినిమాల్లో కూడా ఈమె నటించింది. పూర్తివ్యాసం : వ్యాసాన్ని వినండి : పాతవి

యాదృచ్ఛిక ఈ వారం బొమ్మసవరించు

సంవత్సరం: 2007    వారం: 37


చంద్రుడు భూమికి సూర్యుడు కి మధ్య కక్ష్యలొ వచ్చినప్పుడు అమావాస్య రోజు సూర్య గ్రహణం జరుగుతుంది. సంపూర్ణ సూర్య గ్రహణం పట్టినప్పుడు చంద్రుడు కక్ష్యలొకి అడ్డం రావడం వల్ల సూర్యగోళం చంద్రుడి ఛాయాతో కప్పబడి సూర్య గోళం అంచు కరోనా గా పై బొమ్మ లొ కనిపించినట్లు కనబడుతుంది. 2007 సెప్టంబర్ 11 వ తారీఖు సూర్య గ్రహణం

ఫోటో సౌజన్యం: ల్విటోర్

యాదృచ్ఛిక చిట్కాసవరించు

తేదీ: నవంబరు 25

వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 25

యాదృచ్ఛిక చరిత్రసవరించు

తేదీ: మార్చి 21