స్వాగతం మార్చు

డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!  

డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:Kasyap గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు Kasyap గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     ➠ కె.వెంకటరమణచర్చ 15:57, 12 జూన్ 2021 (UTC)Reply

ధన్యవాదాలు డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి (చర్చ) 16:01, 12 జూన్ 2021 (UTC)Reply


కరోనా మిగిల్చిన వరం

కలియుగంలో కల్లోలం సృష్టించిన కరోనా

నాకో వరాన్ని మిగిల్చింది

కొండలంటే భయం కొందరికి

నీళ్ళంటే భయం మరికొందరికి

నాకు మాత్రం కళ్లంటే మహామహా భయం

కన్నుల అందాలు కవుల కావ్యాల్లో దర్శించాను

కాని కరోనా పుణ్యాన

ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాను

అందరూ కళ్లతోనే పలకరిస్తున్నారు

పరిచయమవుతున్నారు

ఇంత దగ్గరగా అమ్మ కళ్ళలోకి అస్సలు చూడలేదెప్పుడు 

అమ్మతోడు అమ్మాయి కళ్లలోకి కూడా

భయంతోనే బతకాల్సిన సమయం

క్రమక్రమంగా ఇప్పుడాభయం పోయింది

భావావేశం మొదలైంది

ఆ కళ్లలో సప్త వర్ణాలు వెదజళ్ళే 

శతకోటి భావతరంగాలు చూస్తున్నాను

కడుపులో విషయం దిగమింగిన కొన్నికళ్లు 

కర్కోటక చూపులతో కాటేస్తున్నాయి

కడుపునిండా ప్రేమ నిండిన మరికొన్ని

ఏమీ ఎరగనట్టు వెర్రి చూపులు చూస్తున్నాయి

చేసిన తప్పులు దాచుకుంటూ కొన్నికళ్లు

అబద్ధాలు నిజం చేయడానికి

అడుగడుగునా తడబడుతున్నాయి

మరికొన్ని సత్యవాక్కులు కురిపిస్తూన్నట్టు

సూటిగా చూపులు కళ్లలోకి గుచ్చుతున్నాయి

దుఃఖసాగరాల్ని దిగమింగిన కళ్లు

వెచ్చని కన్నీటి చుక్కలు

ఒక్కొక్కటిగా రాలుస్తూన్నాయి

స్వర్గధామం విహరించే మరికొన్ని

ఆనంద భాష్పాలు విదల్చుతున్నాయి

యోగనిద్రలో మౌనంగా చూస్తూ కొన్ని

గమ్యం తెలియని దేశదిమ్మరిలా ఇంకొన్ని

మకరందం సేవిస్తూ మత్తులో తూగుతున్న

మధుపంలా మరికొన్ని

కన్నుల కొలకుల్లో కొంటెతనం దాగిన

ప్రేయసిలా ఎక్కడో ఒకటి

ఆనందం ఆక్రోశం బాధ భయం ప్రేమ కోపం

వలపు వాత్సల్యం విరహం విషాదం

ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు అనుభూతులు

మధురానుభూతులు నన్ను నాకు

పరిచయం చేస్తున్నాయి

కళ్లే జీవితానికి సర్వస్వం

అవి లేని వారికి అంతా శూన్యం

మనమే అవుదాం వారికి శరణ్యం 

- డా.కొత్తిరెడ్డి మల్లారెడ్డి 

అసిస్టెంట్ ప్రొఫెసర్ 103.96.18.134 16:54, 23 జూలై 2022 (UTC)Reply