నాగిశెట్టి
స్వాగతం
మార్చునాగిశెట్టి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని ప్రతీ ఊరికీ, ప్రతీ మండలానికీ, జిల్లాకీ, ప్రతీ పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, సూపర్‌స్టార్ కృష్ణ, జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,.. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ప్రభాకర్ గౌడ్ నోముల 05:01, 28 జూన్ 2020 (UTC)
స్వాగతం పేజీ చదవండి
మార్చునాగిశెట్టి తాతయ్య నాయుడు గారు,
మీరు వ్యాసాలలో బహువచనం వాడుతున్నారు. ఉదా: సేవలు అందిస్తున్నారు. దయచేసి ఏకవచనం వాడండి. ఉదా: ఇతడు సేవలు అందిస్తున్నాడు, తెలుగులో వ్యాసాలు ఎలా ఉండాలో, ఒకసారి ఇదివరకే ఉన్న వ్యాసాలు చూడండి. మీరు వికీలో రచనలు చేయాలనుకుంటున్నారు, కాబట్టి ఎలా రాయాలో తెలుసుకోవడానికి సూచనలు పాటించండి, స్వాగతం పేజీ కూడా చదవండి, తర్వాత రాయవచ్చు. ప్రయోగశాలలో మీ మనసు లో మెదిలే భావాలను రాయవచ్చు. ప్రభాకర్ గౌడ్ నోముల 13:23, 28 జూన్ 2020 (UTC)
అలాగే సార్ ధన్యవాదములు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న. మీ సూచనలు పాటిస్తాను నాగిశెట్టి (చర్చ) 02:57, 3 జూలై 2020 (UTC)
ప్రభాకర్ గౌడ్ గారూ నమస్కారం. నేను రచయితను.నాలుగు పుస్తకాలు ప్రచురించాను.పదుల సంఖ్యలో కథలు రాశాను. వివిధ పత్రికల్లో ప్రచురించబడినవి.వికీపీడియాలో నా సమాచారం నమోదు కావాలంటే ఏమి చెయ్యాలి? నా గురించి నేను రొసుకోవచ్చా.. తెలుప గలరు నాగిశెట్టి (చర్చ) 02:52, 12 జూలై 2020 (UTC)
కొన్ని అంశాల్లో ప్రాముఖ్యత
మార్చు- నాయుడు గారు,
వికీపీడియా "నీలం రంగు" పదాలు కాస్తా తాకినాచో ఆ పేరు గల వ్యాసంలోకి వెల్లడం గమనించే ఉంటారు, నాయుడు మీ పేరు ఉంది కదా, దాన్ని నొక్కి మీ గురించి రాసుకోండి. అది మీ వాడుకరి: పేజీ ... మీ ఊరు గురించి రాసిన ఒక వ్యాసం, మీ మండలం గురించి ఉంటుంది, పరిచయం ఒకసారి చూడండి,
- చర్చ ఏ విషయం గురించైనా చర్చ ఉంటే అవి చర్చలో ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు నేను రాస్తున్నది వాడుకరి చర్చ పేరుబరికి చెందిన వాడుకరి పేరుబరి-ఇది మీరు అడిగిన విషయం. వాడుకరుల పేజీ ఇది. మర్యాదకరమైన ఏ విషయమైనా రాసేసుకోవచ్చు, మన ఇష్టం. మన గురించి ఏమైనా రాసుకోవచ్చు, ఏ ఫోటోలైనా పెట్టుకోవచ్చు. రకరకాల మూసలు చేర్చుకోవచ్చు. మనం రాసిన వ్యాసాల వివరాలు చేర్చుకోవచ్చు. వికీలో మనం పొందిన పతకాలూ చేర్చుకోవచ్చు. ఉదాహరణకు వాడుకరి:Veera.sj, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Chavakiran, వాడుకరి:స్వరలాసిక ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. వికీపీడియాలో వ్యాసం ఉన్న వికిపీడియనులు ఈ లింకు నొక్కి చూడండి. వీరికి వాడుకరి పేజీ, వ్యాసం రెండు ఉన్నవి. ఇలా మీ పేరు ఉండాలనేది మీ అభిలాష, అయితే లింకులో చరిత్రను చూడండి ఒక వాడుకరి మరో వాడుకరి గురించి రాశారు. వారి గురించి వారే రాసుకోలేదు, గమనించండి. యేదో కొన్ని అంశాల్లో ప్రాముఖ్యతతో పేపర్ ల్లో, టీవీ వార్తల్లో నిలిచిన వ్యక్తులు అవి వారి మూలాల్లో ఉన్నవి గమనించండి. ఒక వాడుకరి మూలాలతో ఎవరి గురించి అయిన ఏ అంశం గురించి అయిన తెలుగు వికీపీడియాలో రాయవచ్చు. ఇంతకు ముందే ఉన్న వ్యాసంలో మరింత సమాచారం మీరైనా చేర్చవచ్చు... అర్ధం కాకాపోతే "ఇటీవలి మార్పులు" ఎడమ పక్కన ఉంది నొక్కండి. కాబట్టి ఎలా రాయాలో తెలుసుకోవడానికి ఇదివరకే ఉన్న వ్యాసాలు చూడండి. ఇంకా అనుమానం వస్తే అడుగండి. ప్రభాకర్ గౌడ్ నోముల 18:58, 13 జూలై 2020 (UTC)
మట్టి బంగారం
మార్చునాగిశెట్టి తాతయ్య నాయుడు రచించిన వచన కవితా సంపుటి. ఇది 2010 సంవత్సరం లో ప్రచురింప బడింది.దీనిలో మొత్తం 34 కవితలు ఉన్నాయి. ఈ కవిత లన్నీ విశాలాంధ్ర, ప్రస్థానం, వార్త అనంతం, ఆంధ్రప్రభ, నేటినిజం, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక,పత్రిక వంటి వార మాస పత్రికలలో ప్రచురించబడినవే.గడ్డి చేమంతులు, మనిషి కోసం, నాగిశెట్టి నానీలు ఇతని ఇతర రచనలు. ఈయన రాసిన ఎడారిలో మంచు కొండ ,పై పంచె జారింది, ఎండమావి, వెలుగు నీడలు, డెడ్ లైన్ వంటి కథలు వివిధ పత్రికలలో ప్రచురించబడి గుర్తింపు ను తెచ్చి పెట్టాయి. నాగిశెట్టి (చర్చ) 04:17, 16 జూలై 2020 (UTC)