స్వాగతం మార్చు

పద్మాకర్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!  

పద్మాకర్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:రవిచంద్ర గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు రవిచంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 12:34, 10 జూన్ 2021 (UTC)Reply

వికీపీడియాలో రాసేటపుడు.. మార్చు

పద్మాకర్ గారూ, అనువాదం చేస్తూండగా మీకు కరెంటు పోయిన సమస్య గురించి మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో మీకొక సంగతి చెప్పదలచాను.. వికీపీడియాలో పెద్దయెత్తున కంటెంటును ఒక్కసారే చేర్చాలని లేదు సార్. కొద్దికొద్దిగా చేర్చుతూ పోవచ్చు. 100 వాక్యాలను ఒకేసారి చేర్చే బదులు రెండేసి వాక్యాలను 50 సార్లు చేర్చవచ్చు. దాని వలన రెండు ఉపయోగాలున్నై - కరెంటు పోవడం వంటి ఆటంకాల వలన మనం చేసిన పని పెద్దయెత్తున నాశనం కాదు. రెండోది.. కొత్తవాళ్లకు వికీ బాగా అలవాటౌతుంది. అనుభవం వచ్చే కొద్దీ చాలా కంటెంటును ఒక్కసారే చెయ్యవచ్చు.

మరొక సంగతి.. వికీపీడియాలో ఒక అనువాద పరికరం ఉంది. అది యంత్రికంగా వ్యాసాన్ని అనువదిస్తుంది. అయితే అది చేసే అనువాదంలో బోలెడన్ని తప్పులుంటాయి. అ తప్పులను సరిచేసుకుని ప్రచురిస్తే బాగుంటుంది. పని కూడా వేగంగా అవుతుంది. ఆ పెఝికి వెళ్ళాలంటే, ప్రతి పేజీలోనూ అన్నిటికంటే పైన లింకులుంటై చూడండి.. వాటిలో "నా మార్పులు" అనే మెనూ కింద మూడు ఉప మెనూలుంటై. వాటిలో "అనువాదం" ను నొక్కితే మీరు ఆ అనువాద పరికరంపేజీకి వెళ్లవచ్చ్చు. లేదా ఈ లింకు నొక్కండి. చదువరి (చర్చరచనలు) 04:35, 16 జూన్ 2021 (UTC)Reply