నమస్కారము! యు.వి.సత్యనారాయణ రాజు గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతము!

ఆ తరువాత కూడా మీకు ప్రశ్నలు ఉంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. --వైఙాసత్య 04:33, 20 అక్టోబర్ 2005 (UTC)

పశ్చిమ గోదావరి జిల్లా మార్చు

సత్యనారాయణ రాజు గారు, పశ్చిమ గోదావరి జిల్లా యొక్క మండలముల పేజీల గురించి మీ ఆసక్తి గమనించాను. మీరు ప్రతి మండలము గురించి అంతో కొంతో రాయగలిగితే నేను మండలాలన్నిటికి గ్రామాలతో సహా పేజీలు తయారు చేయగలను. కానీ పశ్చిమ గోదావరి జిల్లాతో నాకు పెద్ద పరిచయము లేదు కనుక కొన్ని అచ్చుతప్పులు దొర్లవచ్చును, వాటిని సరిదిద్దగలరు --వైఙాసత్య 05:50, 8 నవంబర్ 2005 (UTC)

వైఙాసత్య గారు మీ కృషి ఎంతో అభినందనీయం. తప్పకుండా ఎమైనా తప్పులుంటె సరిదిద్దుతా. అన్ని మండలాల గురించి నాకు పరిచయం లెదు గాని ఎంతో కొంత రాయడానికి ప్రయత్నిస్తాను. --యు.వి.సత్యనారాయణ రాజు 10:02, 11 నవంబర్ 2005 (PST)

రాజు గారు, మీరు తెలుగు వికిపీడియాలో కృషి చేస్తున్నందుకు చాలా సంతోషము. ప్రస్తుతము ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల స్థాయిలో వ్యాసములు ఉన్నవి. మన తర్వాత లక్ష్యము మండల స్థాయిలో వ్యాసములను సృష్టించడము. మీరు కొన్ని గ్రామాలకు పేరు మాత్రమే కల పేజిలు తయారు చేయడము గమనించాను. వీటి వల్ల పెద్ద ఉపయోగము ఉండక పోవచ్చు ఎందుకంటే వికిపీడియా నిర్ణీత స్థాయి కంటే చిన్నవయిన పేజీలను వ్యాసములుగా గుర్తించదు. ఓకే పదము కల ఇన్ని మొలక పేజీలు అందరిని అయోమయములో పడేయవచ్చును. ఉదాహారణకు అందులో ఏవి నిజమైన వ్యాసములో తెలుసుకొనుటకు అన్ని పేజిలు తెరిచి చూడటము కొంచెము కష్టతరమైన పనే.--వైఙాసత్య 02:09, 11 నవంబర్ 2005 (UTC)

వైఙాసత్య గారు మీతో నేను అంగీకరిస్తాను. నా దగ్గర జనభా గణాంకాలు వున్నాయి అవి ప్రచురిందామనె పేజీలు తయరుచేయ్యటం జరిగింది. మండల స్థాయిలో వ్యాసములను సృష్టించడము పై కృషి చేద్దాం. --యు.వి.సత్యనారాయణ రాజు 10:02, 11 నవంబర్ 2005 (PST)

ఓహో అలాగా, ఇప్పుడు విషయము అర్ధం అయ్యింది. తెలుగు వికిపీడియాలో మీ కృషికి ధన్యవాదములు --వైఙాసత్య 05:02, 13 నవంబర్ 2005 (UTC)


అభినందనలు మార్చు

తెలుగు వికిపీడియా 2000 వ్యాసముల గమ్యము చేరుకొనుటకు కృషి చేసినందుకు అభినందనలు --వైఙాసత్య 19:13, 23 నవంబర్ 2005 (UTC)