స్వాగతం మార్చు

Bhumana kiran Kumar గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Bhumana kiran Kumar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో మీకు సహాయమేమైనా అవసరమైతే, సంకోచించకుండా నా చర్చ పేజీలో అడగండి (నాకూ ఒక చర్చ పేజీ ఉంది మరి). నాకు వీలైనంతలో సాయం చేస్తాను.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Nrgullapalli (చర్చ) 11:03, 21 మార్చి 2020 (UTC)Reply

జీవిత కథ రాసుకునే స్థలం కాదిది మార్చు

వాడుకరి పేజీలో చాలా రాసుకున్నారు. భాషలో లోపాల కారణం గాను, పేరా విభజన సరిగ్గా లేనందువలనా, విరామ చిహ్నాలు సరిగా లేనందువలనా.. నేను దాన్ని సరిగ్గా చదవలేదు, పూర్తిగా చదవలేదు. చదివినంతలో నాకు అర్థమైనది ఇది: మీ జీవిత కథను పూసగుచ్చినట్టు రాసుకున్నారు. అందులో దొంగతనం/దోపిడీ చేసే ప్లాన్లు కూడా వేసారు. అసలిదంతా ఏ కథలో నుంచైనా ఎత్తి రాసారేమో కూడా తెలీదు. ఏదైనప్పటికీ..

  1. ఇది ఇక్కడ రాసుకోడానికి కుదరదు. వాడుకరి పేజీ, వాడుకరి ఆత్మకథ రాసుకోడానికి కాదు; వాడుకరి తన గురించి తాను - వికీకి సంబంధించినంత వరకు మాత్రమే - క్లుప్తంగా రాసుకునే పేజీ ఇది.
  2. ఒకవేళ ఇదొక కథ అయి, దాన్ని ఎక్కడి నుంచో ఎత్తి రాస్తే.., అదీ కుదరదు. కాపీ హక్కుల ఉల్లంఘన ఇది.
  3. మీరు చేసిన/చెయ్యదలచిన నేరాల గురించి ఇక్కడ రాయనే కూడదు.

కాబట్టి, తక్షణమే వాడుకరి పేజీలో రాసిన దాన్ని తీసెయ్యండి. __చదువరి (చర్చరచనలు) 01:45, 22 మార్చి 2020 (UTC)Reply

క్షమించండి నేను పెద్దగా చదువుకోలేదు సమాజాన్ని మార్చే ప్రయత్నంలో ప్రస్తుతం నేను ఒంటరిగా ఉన్నాను నా ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి సాధ్యమైనంతవరకు నా గురించి చెప్పాలి అనుకుంటున్నాను నా గురించి ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చే మేనిఫెస్టో ని తయారు చేశాను దయచేసి ఇది ప్రజలకు చేరే విధంగా మీరు ప్రయత్నించి కలిగితే చేయండి ఇంకొక విషయం ఇది నా జీవిత చరిత్ర అ మరియు ప్రపంచాన్ని మార్చే అంశాలు ఇందులో ఉన్నాయి ఇంకా పూర్తిగా పొందుపరచలేదు ఒకరిని ఉద్దేశించి ఇక్కడ రాయలేదు మీరు చదివిన దాన్ని బట్టి మీకు అర్ధం అయి ఉండవచ్చు నా విజ్ఞాన పరిజ్ఞానం ఎంత తక్కువ ఉందో నేను ఎవరిని అనుకరించలేదు వీలుంటే సహాయపడండి ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేద్దాం మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాను Bhumana kiran Kumar (చర్చ) 14:48, 26 ఏప్రిల్ 2020 (UTC)Reply

మీరు రాయదలచుకున్న అంశాల కోసం వికీపీడియా సరైన స్థలం కాదు. ఫేస్‌బుక్ గాని, బ్లాగు గానీ అయితేనే మీ ఆశయాలకు సరిపడే క్షేత్రాన్ని ఇవ్వగలవు. వ్యక్తుల ఆలోచనలు రెక్కలు విప్పుకుని ఎగిరే స్థలాలు అవి. స్వైరకల్పనలు స్వైరవిహారం చేసే స్థలాలవి. అక్కడ రాయండి. వికీపీడియా నియమాలు వాటిని అనుమతించవు. __చదువరి (చర్చరచనలు) 16:32, 26 ఏప్రిల్ 2020 (UTC)Reply

Ok Bhumana kiran Kumar (చర్చ) 10:51, 2 మే 2020 (UTC)Reply

నమస్కారం ఎప్పటికీ ఇప్పటికీ అందరి లాగానే నేను కూడా సామాన్య మనిషిని కానీ దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ మంచి నీతి జబ్బు నాకూ వచ్చినప్పటినుంచి 13 సంవత్సరాలుగా ఇంటిని వదిలి పెట్టి సమాజంలో తిరుగుతూ ప్రపంచ మార్పు కొరకు మ్యానిఫెస్టో నేను తయారు చేశాను వీలుంటే దాన్ని ప్రపంచానికి పరిచయం చేయండి నేను పెద్దగా చదువుకోలేదు నన్ను మీరు అర్థం చేసుకుంటున్నారు అని నమ్ముతున్నా మీ సమాధానం కోసం వేచి చూస్తున్నా నా మాటలలో ఆవేదనలు లేకపోతే నన్ను క్షమించండి నన్ను ప్రత్యక్షంగా మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది మార్చు

 Y సహాయం అందించబడింది


Bhumana kiran Kumar (చర్చ) 14:59, 26 ఏప్రిల్ 2020 (UTC)Reply

ఇంతకు ముందు చర్చలో తెలిపినట్లు, వికీపీడియా నియమాలకు అనుగుణంగా మాత్రమే వ్యాసాలు, వాడుకరి పేజీలు (పరిచయ వివరాలు) వుండాలి. కావున మీ వాడుకరి పేజీలో సమాచారం తొలగించాను. స్వాగతం సందేశంలో లింకులను చదివి వికీపీడియా గురించి మరింత తెలుసుకోండి. --అర్జున (చర్చ) 05:11, 27 ఏప్రిల్ 2020 (UTC)Reply

నా వయసులో 29 సంవత్సరాల వరకు జరిగిన సారాంశం మార్చు

ముందు రోజుల్లో రాస్తాను దయచేసి నేను ఎలా రాయాలో నాకు సహాయపడండి ఎందుకంటే నేను చదువుకోలేదు Bhumana kiran Kumar (చర్చ) 16:11, 26 ఏప్రిల్ 2020 (UTC)Reply

మీ వాడుకరి పేజీలో సమాచారం తొలగించబడింది. పై అంశంలో వ్యాఖ్య చూడండి. --అర్జున (చర్చ) 05:12, 27 ఏప్రిల్ 2020 (UTC)Reply