వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao/పాత చర్చ 4
క్రితం చర్చలు |
పాత చర్చ 1 పాతచర్చ 2 పాతచర్చ 3 పాతచర్చ 4 |
పదివేల దిద్దుబాట్లు పూర్తి చేసిన సందర్భంగా
మార్చుచంద్రకాంత్ గారూ!
మీరు పదివేల దిద్దుబాట్లు పూర్తి చేసిన సందర్భంగా అభినందనలు. నేను సంతోషంతో బహూకరిస్తున్న గండపెండేరాన్ని మీ సభ్యుని పేజీలో తగువిధంగా ఉంచుకొన గలరు. కేలెండర్, చరిత్రలో ఈరోజు, మీకు తెలుసా వంటి శీర్షికలు, ఎన్నో మూసలు, క్రికెట్ వ్యాసాలు, ఆర్ధిక రంగం వ్యాసాలు, నియోజక వర్గాల వ్యాసాలు - ఇవన్నీ మీ కృషి కారణంగా తెలుగు వికీలో చక్కగా వర్ధిల్లుతున్నాయి. 2007 అక్టోబర్‌లో తొలి దిద్దుబాటు చేసిన మీరు మళ్ళీ 2008 అక్టోబర్ రాకుండానే 10 వేల దిద్దుబాట్ల మైలురాయిని అధిగమించారు! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:44, 1 అక్టోబర్ 2008 (UTC)
- నాకు గండపెండేరాన్ని ప్రధానం చేసిన కాసుబాబు గారికి మరియు తెవికీ సభ్యులందరికీ కృతజ్ఞతలు. నేను తెవికీలో పదివేల దిద్దుబాట్లు చేసినా కొండంత లక్ష్యం ముందు ఇది గోరంత కూడా కాదు. ఇంకనూ చేయాల్సింది ఎంతో ఎంతో ఉంది. అయిననూ నన్ను ఈ దశ వరకు తీసుకువచ్చిన ఘనత, ప్రారంభం నుంచి నన్ను ప్రోత్సహిస్తూ, అడుగడుగునా ఉత్సాహపరుస్తూ ముందుకు పయనించేలా చేసిన ఘనత నిస్సందేహంగా వైజాసత్య, కాసుబాబు, దేవా గార్లకే దక్కుతుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:14, 1 అక్టోబర్ 2008 (UTC)
- వచ్చినప్పటినుంచీ సగటున నెలకు దాదాపు 1000 మార్పులుచేసిన సభ్యులు మీరొక్కరే అయి ఉంటారు. మీ ఎడిట్ రేట్‌ను అందుకోవడం చాలా మందికి సాధ్యపడకపోవచ్చు. ఇది గోరంత కూడా కాదని పైన మీరన్న విషయానికి వస్తే, తెవికీ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన ప్రతీ వంద మార్పులలో రెండు మీవే అంటే మీ రేటింగ్ ఏంటో ఊహించుకోవచ్చు. మీరు మామూలు తెవీకీ సభ్యుడు కాదండోయ్! ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు స్వీకరించండి. δευ దేవా 18:44, 1 అక్టోబర్ 2008 (UTC)
- దేవా గారికి మరోసారి నా కృతజ్ఞతలు. మీలాంటి ప్రోత్సాహకుల వల్లనే తెవికీ ముందుకు పయనించగలుగుతుంది. చేసేది ఎవరైనా చేయించేవారిదే గొప్పతనం అనిపించుకుంటుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:54, 1 అక్టోబర్ 2008 (UTC)
- వచ్చినప్పటినుంచీ సగటున నెలకు దాదాపు 1000 మార్పులుచేసిన సభ్యులు మీరొక్కరే అయి ఉంటారు. మీ ఎడిట్ రేట్‌ను అందుకోవడం చాలా మందికి సాధ్యపడకపోవచ్చు. ఇది గోరంత కూడా కాదని పైన మీరన్న విషయానికి వస్తే, తెవికీ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన ప్రతీ వంద మార్పులలో రెండు మీవే అంటే మీ రేటింగ్ ఏంటో ఊహించుకోవచ్చు. మీరు మామూలు తెవీకీ సభ్యుడు కాదండోయ్! ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు స్వీకరించండి. δευ దేవా 18:44, 1 అక్టోబర్ 2008 (UTC)
- చంద్రకాంత్ గారూ పదివేల దిద్దుబాట్లు పూర్తి చేయడమే కాక మంచి వ్యాసాలను అందిస్తూ తెవికీని పరుగులెత్తిస్తున్న మీకివే నా అభినందనలు. --విశ్వనాధ్. 09:05, 3 అక్టోబర్ 2008 (UTC)
- అనతి కాలంలోనే ఇన్ని దిద్దుబాట్లు చెయ్యడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. అందుకు చాలా సహనం అవసరం. నా అభినందనలు కూడా అందుకోండి. రవిచంద్ర(చర్చ) 09:15, 3 అక్టోబర్ 2008 (UTC)
- విశ్వనాథ్ మరియి రవిచంద్ర గార్ల అభినందనలకు కృతజ్ఞతలు. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:27, 3 అక్టోబర్ 2008 (UTC)
- అనతి కాలంలోనే ఇన్ని దిద్దుబాట్లు చెయ్యడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. అందుకు చాలా సహనం అవసరం. నా అభినందనలు కూడా అందుకోండి. రవిచంద్ర(చర్చ) 09:15, 3 అక్టోబర్ 2008 (UTC)
మీకు తెలుసా
మార్చుచంద్రకాంతరావు గారూ ! మీకు తెలుసా మూసలో కొత్త వ్యాసాలలో మీకు ఆసక్తిగా అనిపించిన కొన్ని వాక్యాలను కామెంట్లలో చేరుస్తూ ఉండండి( అప్పుడప్పుడు ఒక్కొక్కటి అయితే సులభంగా ఉంటుంది). ఒక ఐదారు వాక్యాలు పోగుచేశాక పాతవాటిని భద్రపరచి కొత్తవాటితో నింపుదాం. ఈ ఆలోచన ఎలా ఉంది. నేను ఇప్పటికే ఒక వాక్యాన్ని చేర్చాను చూడండి. రవిచంద్ర(చర్చ) 17:27, 11 అక్టోబర్ 2008 (UTC)
- ఈ శీర్షికను నిర్వహించడం నాకు చాలా సులభం. ఎందుకంటే ప్రతి కొత్త వ్యాసాలను పరిశీలించి నేనెలాగూ పాయింట్లను నోట్ చేసుకుంటూ ఉంటాను. గతంలో ప్రతి వారం క్రమం తప్పకుండా కొత్త వాక్యాలతో మారుస్తూ ఉండేవాడిని. కాని ఇటీవల కొత్త వ్యాసాలు తగ్గిపోవడం, సృష్టి జరిగిన కొద్ది వ్యాసాలు కూడా ఎలాంటి ముఖ్యమైన సమాచారం లేకుండా ఉండటం తదితర కారణాల వల్ల ప్రతివారం మార్చడానికి వీలు జర్గడం లేదు. నేను కూడా ఇప్పటికే ఉన్న వ్యాసాలను మెరుగుపరుస్తూ, వర్గీకరణ, కేలండర్ తదితర పనులలో ఉన్నాను కాబట్టి కొత్త వ్యాసాలను అంతగా సృష్టించడం లేదు. ఇంతకు క్రితం మీరు ఒకటి, రెండు సార్లు ఈ శీర్షికలో పాత వ్యాసాల సమాచారంతో మార్చినారు. అలా కాకుండా కొత్త వ్యాసాలు లేదా పాత వ్యాసాలలో కొత్త సమాచారంతోనే మారిస్తే బాగుంటుంది. నేను ఈ శీర్షికను నిర్వహించడం మానుకోలేను. మీరు నిర్వహిస్తారంటే నేను ఈ పని వదిలివేస్తాను. ఎందుకంటే ఈ శీర్షిక ఒక వ్యక్తి అభిప్రాయాలకు అనుగుణంగా నడిస్తేనే బాగుంటుంది. అంతేకాకుండా అందరూ తలో కొన్ని వాక్యాలు చేరిస్తే ఆశ్చర్యకరమైన వాక్యాలుగా ఉండకపోవచ్చు, ఎవరికి వారు తాము రాసిన వాక్యాలే గొప్పవని అనుకుంటారు, పైగా నేను చేర్చిన వాక్యం మొదటి పేజీలో తీసుకోవడం లేదు అనుకొనే పరిస్థితి కూడా రావచ్చు. ఐదారు వాక్యాలు జమ కాగానే మార్చే పద్దతి కూడా బాగుండదు. మొదటి పేజీలో వ్యాసం మరియు బొమ్మ వలె వారానికోసారి మారిస్తే చాలు. మీరు చేర్చిన 2 వాక్యాలు చూశాను ఆ వాక్యాలకు అంతగా ప్రత్యేకత లేదు, వాక్యాలు దొరకనప్పుడు 1,2 అలాంటివి ఉంటే ఫర్వాలేదు కాని అన్నీ అలాంటి వాక్యాలే ఉంటే బాగుండదు. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:22, 12 అక్టోబర్ 2008 (UTC)
- మీకు ఇబ్బంది లేకుంటే ఈ శీర్షికను మీరే నిర్వహించండి. మీరు క్రియా శీలకంగా లేనప్పుడు నేను కొన్ని సార్లు వాక్యాలు చేర్చాను ఏ ఒక్కరి వాక్యాలో చేరిస్తే మాత్రం ఈ శీర్షిక ఆసక్తికరంగా ఉండకపోవచ్చునని నా అభిప్రాయం. బహుశా నేను రాసిన రెండు వాక్యాలు మీకు తెలిసే ఉంటాయి కాబోలు, కానీ చదివే వారికి తెలిసిఉంటాయని నియమమేదీ లేదు. అందుకనే నలుగురు కలిసి కూర్చే పద్దతిని ప్రతిపాదించాను. రవిచంద్ర(చర్చ) 14:34, 12 అక్టోబర్ 2008 (UTC)
- ఏ ఒకరి వాక్యాలో చేర్చాలనేది నా ఉద్దేశ్యం కాదు. అందరి వాక్యాలు ఒక్కరు చేర్చాలనే నేనన్నాను. కావాలంటే ఇంతకు క్రితం నేను ఈ శీర్షికలో చేర్చిన వాక్యాలు పరిశీలించండి. నా వాక్యాలను మాత్రమే చేర్చలేదు కొన్ని వారాలలో అసలు నా వాక్యాలు అసలే లేవు. నా వాక్యాలు మాత్రమే మొదటి పేజీలో రావాలని నేనెప్పుడూ అనుకోలేదు పైగా కొత్త సభ్యులు రాసిన వాక్యాలను తీసుకొని వారికి ఉత్సాహం కలిగించాలని ప్రయత్నించాను. సాధ్యమైనంత వరకు అన్ని విషయాలకు చోటు కల్పించాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:45, 12 అక్టోబర్ 2008 (UTC)
- ఒక్కరి వాక్యాలు అన్నది మీరు ఒక్కరి వ్యాసాలలోని వాక్యాలు అని తప్పుగా అర్థం చేసుకున్నట్లున్నారు. నేను చెప్పింది అందరు కూర్చిన వ్యాసాల నుంచి అందరూ గుర్తించిన ఆసక్తికరమైన వాక్యాలు చేర్చాలి అని. నేను మీరే వాక్యాలు చేరుస్తున్నారు అనలేదు. మరోలా భావించవద్దు. మీకు ఆసక్తిగా అనిపించినవి నాకు ఆసక్తిగా అనిపించకపోవచ్చు. నాకు ఆసక్తిగా అనిపించినవి మీకు ఆసక్తిగా అనిపించ్చకపోవచ్చు. నా అభిప్రాయం మీకు అర్థం అయిందనుకుంటున్నాను. రవిచంద్ర(చర్చ) 14:57, 12 అక్టోబర్ 2008 (UTC)
- నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. మీరు రాసిన దానిబట్టే అర్థం చేసుకున్నాను. మీకు ఈ శీర్షికపై అంతగా ఆసక్తి ఉంటే నిర్వహించండి. నాకేమీ ఇబ్బంది లేదు. చాలా కాలం పాటు ఎలాంటి మార్పులు లేకుండా నిశ్చేతంగా ఉందని నేను ఈ శీర్షిక నిర్వహణ చేపట్టి కొన్ని వారాలు నిర్వహించాను. ఇక ఆసక్తుల విషయానికి వస్తే అందరి అభిప్రాయాలకనుగుణంగా వాక్యాలు చేరిస్తే సరిపోతుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:15, 12 అక్టోబర్ 2008 (UTC)
- జరిగిందేదో జరిగిపోయింది. ఈ శీర్షికను మీరు నిర్వహించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే మీకు ఎప్పుడు సమయం చిక్కకపోతే చెప్పండి అప్పుడు నేను చేరుస్తాను. దయచేసి మీ సభ్యపేజీలో మీకు తెలుసా ! నిర్వహణ అన్నదానికి కామెంట్ తీసేయండి. రవిచంద్ర(చర్చ) 15:41, 12 అక్టోబర్ 2008 (UTC)
- దయ చేసి ఈ శీర్షికను మీరే నిర్వహించండి. నేను తర్వాత ఆలోచించాను. ఇది అందరూ వాక్యాలు చేరిస్తే బాగుండదని నాకూ అనిపించింది. నిస్తేజంగా ఉన్న ఈ శీర్షికను ఉత్తేజితంగా చేసింది మీరే కాబట్టి, దీన్ని మీరే నిర్వహించడం సబబు. మీకు మనస్థాపాన్ని కలిగించిఉంటే క్షమించండి. రవిచంద్ర(చర్చ) 06:53, 14 అక్టోబర్ 2008 (UTC)
- నేను ఏ నిర్ణయమైనా ఆలోచించే ప్రకటిస్తా (ఇక్కడే కాదు నిజ జీవితంలోనూ అంతే), కాబట్టి ఏదో ఒక బలమైన కారణం ఉంటే తప్ప నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనే అవకాశం చాలా తక్కువ. ఈ శీర్షికపై మీకు ఆసక్తి ఉంది కాబట్టి నిర్వహించండి. కొన్ని వారాలలోనే మంచి అవగాహన, అనుభవం వస్తుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:44, 21 అక్టోబర్ 2008 (UTC)
- మీకు ఇబ్బంది లేకుంటే ఈ శీర్షికను మీరే నిర్వహించండి. మీరు క్రియా శీలకంగా లేనప్పుడు నేను కొన్ని సార్లు వాక్యాలు చేర్చాను ఏ ఒక్కరి వాక్యాలో చేరిస్తే మాత్రం ఈ శీర్షిక ఆసక్తికరంగా ఉండకపోవచ్చునని నా అభిప్రాయం. బహుశా నేను రాసిన రెండు వాక్యాలు మీకు తెలిసే ఉంటాయి కాబోలు, కానీ చదివే వారికి తెలిసిఉంటాయని నియమమేదీ లేదు. అందుకనే నలుగురు కలిసి కూర్చే పద్దతిని ప్రతిపాదించాను. రవిచంద్ర(చర్చ) 14:34, 12 అక్టోబర్ 2008 (UTC)
ధన్యవాదాలు
మార్చుచంద్రకాంత రావు గారు, ధన్యవాదాలు. సమయానుకూలము కాకపోవడం వల్ల ఎక్కువ వ్రాయలేకపోతున్నాను. మీరు అప్పటిలాగే ఎంతో కాలాన్ని వెచ్చిస్తూ మీ రచనలను కొనసాగిస్తుండడం ఆనందదాయకం. --Svrangarao 00:52, 15 అక్టోబర్ 2008 (UTC)
వన్నెలతార
మార్చుతెలుగువికీ పరిధిని పట్టిలాగి విస్తరించిన తెవికీఋషి చంద్రకాంతుల వారికి సమస్త వికీజనులు అభివందనాలతో సమర్పించుకుంటున్న ఒక వన్నెలతార - వైజాసత్య |
చూడముచ్చటైన వన్నెలతారను బహుకరించిన వైజాసత్యా గారికి కృతజ్ఞతలు. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:52, 2 నవంబర్ 2008 (UTC)
అభినందనలు
మార్చుచంద్రకాంతరావుగారూ నమస్తే, కుశలమా! కాసుబాబు గారు బహూకరించిన గండపెండేరం, పైజాసత్య గారుబహూకరించిన వన్నెలతార, మీకు 'ముబారక్ హో'. మిత్రుడు నిసార్ అహ్మద్ 16:31, 5 నవంబర్ 2008 (UTC)
- కుశలమే నిసార్ గారు. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:16, 6 నవంబర్ 2008 (UTC)
పునరాగమనానికి పిలుపు (స్వాగతం)
మార్చుచంద్రకాంతరావు గారూ, నమస్తే, మీరు సున్నిత మనస్కులు, ఎవరో అనామకులు కొన్ని అపసవ్య వ్యాసంగాలు సృష్టిస్తే, మనము విసిగిపోరాదు. మీ హృదయం నాకు తెలుసు. చింతించకండి. తులసీవనంలో గంజాయి మొక్కల్లా ఇలాంటి వ్యాసాలు, వ్యాసకర్తలూ వుంటారు. పునరాగమనం చేయండి. మీరు తెవికీకి ఎంతో అవసరం. మన తెవికీలో నిర్వాహకులూ మరియు వ్యాసకర్తలూ తక్కువ. నిజం చెప్పాలంటే, వ్యాసకర్తలలో మీ వేగం ఎక్కువ. ఆ వేగం తెవికీ అభివృద్ధికి ఎంతో అవసరం. చిన్న చిన్న అలల తాకిడికి పెద్ద నావలు లెక్క చేయవు. ఆ అలల జీవితం చాలా తక్కువ. ఒడ్డుకు చేరి అంతమైపోతాయి. మీరు నిబ్బరంగా, నిర్భయంగా వ్రాయండి. ఈ సోడాగ్యాస్‌లు ఎక్కువ సేపు నిలువవు. సభ్యుల నిర్ణయం కోసం వేచి చూడడం మంచిదే, సభ్యులు స్పందించక పోతే, మీరు ప్రవేశించరా? కొన్ని సందర్భాలలో సభ్యులు నిస్సహాయులు అయిపోవచ్చు, తటస్థ ధృక్కోణం పేరుతోనూ సైలెంట్ అయిపోవచ్చు. వారినీ మనం ఏమీ చెప్పలేని స్థితి రావచ్చు. రాబోయేతరానికి అందించవలసిన అంశాలు చాలా వున్నవి. రండి, కార్యోన్ముఖులు కండి, వ్రాయండి, వ్రాస్తూ పోండి. సోదరుడు, నిసార్ అహ్మద్ 13:19, 9 నవంబర్ 2008 (UTC)
- నిసార్ గారు మీరు నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. నేను తెవికీ నుంచి పూర్తిగా తప్పుకోలేను. అలా చేసే అవసరం కూడా లేదు. ఒవరో ఒకరిద్దరు అనామకులకు భయపడి పోయే మనస్తత్వం కాదు నాది. సభ్యుల నిర్ణయం కోసం వేచి చూశాను. కాని "ఆ" వ్యాసాల కంటే సభ్యుల ప్రవర్తనే నాకు బాధ కలిగింది. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:07, 28 నవంబర్ 2008 (UTC)
మీ రాక అందరికీ సంతోషమే
మార్చుచంద్రకాంతరావు గారూ..... సుస్వాగతం. మీరాకతో మా అందరికీ సంతోషమే మరి. మీ రాక ఎంత సంతోషం కలిగించిందంటే, ఆ సంతోషంలో నా కళ్ళు చెమర్చాయి..... మీరు మీ మేధస్సుకు మరియు "కీబోర్డు" కు పని కల్పించండి. సభ్యుల ప్రవర్తన మీకు బాధ కలిగించిందంటున్నారు, మధనపడకండి, సభ్యులంటే ఎవరండీ, కాసుబాబుగారు, వీరు తెవికీకి "భగీరథుడు"లాంటి వారు, వారు సల్పుతున్న కృషిని చూసి, నాకనిపించేది, వీరు కనీసం భోజనానికైనా సమయం కేటాయిస్తున్నారా లేదా? వీరి కమిట్‌మెంట్ మాటలలో చెప్పలేము. అల్లాహ్ వీరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. పైజాసత్య గారంటారా, వారు ఒక జీనియస్, ఎక్సలెంట్ ఆర్గనైజర్, రవిచంద్రగారు ఒక యువ సైంటిస్ట్, రాజశేఖర్ గారంటారా ఒక "బహుముఖ ప్రజ్ఞాశాలి". ఇంకా దేవాగారు, ప్రదీప్ గారు, నవీన్ గారు, రంగారావుగారు, శివగారు, మిగతావారు, వీరంతా తోటి సోదరులే గదా, రహమతుల్లా గారు ఒక గ్రేట్ లాజీషియన్ మరియు అనాలిటిక్. సుజాత గారు చక్కటి వ్యాసాలతో తెవికీకి శోభ తెస్తున్నారు. వీరితో మనం నిష్ఠూరపడవచ్చునా!
- ఇక్కడ చెప్పుకోవలసినదంతా, వికీ సిద్ధాంతాల గూర్చే, వికీ ఒక పెద్ద ప్లాట్‌ఫామ్, అన్ని విషయాలకూ ఒక అల్మారీ లాంటిది, వాటి వాటి గదుల్లో ఆయా విషయాలను ఉంచుకుంటూ పోదాం. ఓ చిన్న ఉదాహరణ చూడండి, ప్రవక్తలు అనే వర్గం సృష్టించి, వాటిలో ఇస్లామీయ ప్రవక్తలవ్యాసాలకు లింకులిచ్చుతూ వచ్చాను, ఓ సారి దాంట్లో ముసైలిమాహ్ పేరు కనబడింది, ఉలిక్కిపడ్డాను, నేను చేసిన పొరపాటు ఏమంటే "ఇస్లామీయ ప్రవక్తలు" అనే వర్గం ప్రారంభించకుండా కేవలం "ప్రవక్తలు" అనే వర్గం సృష్టించి యుంటిని, అది నాపొరపాటు, ఆ తప్పును సరిదిద్దడానికి "ఇస్లామీయ ప్రవక్తలు" అనే వర్గం సృష్టించి ఇస్లామీయ ప్రవక్తల వ్యాసాలకు లింకులిచ్చాను, అపుడు ఊపిరి పీల్చుకున్నాను. తమ తమ ఆలోచనలను పుస్తకాల రూపంలో ప్రకటించి, ప్రవక్తల జాబితాలో చేరిపోయే కాలమిది. స్వతంత్ర ఆలోచనలు, వాక్‌స్వాతంత్ర్యం, మానవహక్కులు మొదలైన వెసులుబాట్లు, హేదువాదం, నాస్తికత్వం, మొదలగు ఇలాంటి విషయాలకు ఊతమిస్తాయి, అది వారి ఆలోచన మరియు వారి ధర్మం. ఖురాన్ లో అల్లాహ్ చెబుతాడు, వారి వారి ధర్మాలు వారికి ప్రియం, అని.
మీతో ఇంతసేపు సంభాషించాక, నా మనసూ తేలికైనది. మీరు నిక్షేపంగా వ్రాయండి. మాకు మార్గదర్శకాలు ఇస్తూ వుండండి. విజయోస్తు.నిసార్ అహ్మద్ 19:36, 28 నవంబర్ 2008 (UTC)
- హార్థిక సుస్వాగతం. మీరు మల్లీ ఎప్పటిలాగా చురుకుగా పాల్గొంటారని మా అందరి అభిలాష. మీకు నొప్పించిన వారిలో నేను కూడ ఉంటే క్షమించండి. నిర్వహణ విషయంలో అనుభవం లేక కొన్ని తప్పులు చేసివుండవచ్చును. ఇప్పుడు జరుగుతున్న తెవికీ శుద్ధి కార్యక్రమంలో పాల్గొని మీరు ఎప్పుడూ చెప్తూ వచ్చే వ్యాసాల నాణ్యత అభివృద్ధికి అడ్డంగా ఉండే వ్యాసాలను, వ్రాసేవారిని సరిదిద్దండి.Rajasekhar1961 05:46, 29 నవంబర్ 2008 (UTC)
- రాజశేఖర్ గారూ, నాపై మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:55, 29 నవంబర్ 2008 (UTC)