వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao/పాత చర్చ 1

తాజా వ్యాఖ్య: విన్నపము టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Ahmadnisar
Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.

C.Chandra Kanth Rao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. మాకినేని ప్రదీపు (+/-మా) 20:19, 21 అక్టోబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


నారాయణపేట

నారాయణపేటపై ఇప్పటికే ఒక వ్యాసం ఉంది. ఒకసారి దానిని పరిశీలించండి. మీరు చేయాలనుకున్న మార్పులు అక్కడ చేయండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 20:19, 21 అక్టోబర్ 2007 (UTC)

సహాయ అభ్యర్ధన

{{సహాయం కావాలి}}

  • నేను నూతనంగా సభ్యుడిగా చేరాను. విధి విధానాలు చాలా వరకు తెల్సుకున్నాను. మరింతగా తెల్సుకొని తెలుగులో కొత్త కొత్త వ్యాసాలు వ్రాయాలనుకుంటున్నాను. దానికి మీ మార్గదర్శం కావాలి.

వికీపీడియా:సముదాయ పందిరి మరియు వికీపీడియా:WikiProject ఇక్కడ చూడండి--బ్లాగేశ్వరుడు 21:43, 21 అక్టోబర్ 2007 (UTC)

సహాయ అభ్యర్ధన

{{సహాయం కావాలి}}

  • నాకు వికీమీడియా నుంచి వచ్చిన మెయిల్ లో తెలుగు కన్పించడం లేదు. చదవడాన్కి వీలుకాని గుర్తులు మాత్రమే కన్పిస్తున్నాయి. వాటిని చదవడం ఎలాగో చెబితే ధన్యవాదాలు.

వికీపీడియా:Setting up your browser for Indic scripts పేజిని ఒకసారి చూడండి.--బ్లాగేశ్వరుడు 21:43, 21 అక్టోబర్ 2007 (UTC)

మీరు యాహూ మెయిల్ ను ఉపయోగిస్తున్నారా? అయితే బ్రౌజర్లో view->character-encoding->utf-8 అని సెలెక్టు చేసుకొని చూడండి --వైజాసత్య 01:11, 22 అక్టోబర్ 2007 (UTC)
  • వ్యాసం పేజిలొ సంతకం చెయ్యవద్దని మనవి. చర్చా పేజిలొ మాత్రమే సంతకం చేయాలి--బ్లాగేశ్వరుడు 21:43, 21 అక్టోబర్ 2007 (UTC)

వర్గంలో పేజీని చేర్చటం

జూరాలా ప్రాజెక్టు పేజీని వర్గం:ఆంధ్ర ప్రదేశ్‌లో కృష్ణా నదిపై ప్రాజెక్టులు లో చేర్చాలంటే జూరాలా ప్రాజెక్టు పేజీలో చివరన [[వర్గం:ఆంధ్ర ప్రదేశ్‌లో కృష్ణా నదిపై ప్రాజెక్టులు]] అని వ్రాసి భద్రపరచండి. ఆటోమేటిగ్గ అది ఆ వర్గంలో చేరుతుంది. --వైజాసత్య 17:06, 22 అక్టోబర్ 2007 (UTC)

వర్గం:భారతదేశ రాజకీయ పార్టీలు అనే వర్గం ఇప్పటికే ఉంది. అందులో భారతీయ జనతా పార్టీ ఉంది చూడండి --వైజాసత్య 19:38, 22 అక్టోబర్ 2007 (UTC)

చిన్న చిట్కా

వ్రాసే వాక్యం కొత్త లైనులో రావటానికి మీడియా వికీ సింటాక్స్ లో ప్రతిసారి <br> ఇవ్వవలసిన అవసరం లేదు. ఒక అదనపు లైను వదిలేస్తే చాలు అదే కొత్త లైనుకు వెళ్తుంది. మీరు వ్రాస్తున్న అద్వానీ ఇంకా శ్రీరాంసాగర్ వ్యాసాలు బాగున్నాయి :-) --వైజాసత్య 20:18, 23 అక్టోబర్ 2007 (UTC)

ఆర్ధిక శాస్త్రము

చంద్రకాంతరావు గారూ, రచ్చబండలో మీరు చేసిన ప్రతిపాదన చూశాను. చాలా బాగుంది. ఆర్ధ శాస్త్రము గురించి తెలిసిన/ఆసక్తి ఉన్న సభ్యులు తెవికీలో ఇంతవరకు లేకపోవటంతో ఆ రంగానికి చెందిన వ్యాసాలు ఇప్పటిదాకా లేవు. వాటిని అభివృద్ధి చేసి వికీకి తోడ్పడతారని ఆశిస్తున్నాను. ఏదైనా సహాయము కావాలంటే నా చర్చాపేజీలో తప్పకుండా వ్రాయండి --వైజాసత్య 04:29, 25 అక్టోబర్ 2007 (UTC)

వర్గాలు

వర్గాలు, వ్యాసాలు రెండూ వేరువేరు. వ్యాసాలు వర్గాలలో చేరతాయి కానీ వర్గాలు వ్యాసాలలో చేరవు. ఉదాహరణకి సూక్ష్మ ఆర్ధిక శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం వర్గానికి చెందుతుంది. అలా చేర్చడానికి సూక్ష్మ ఆర్ధిక శాస్త్రం వ్యాసం చివరలో [[వర్గం:ఆర్ధిక శాస్త్రం]] అని రాయాలి. వ్యాసాలకు ముందు వర్గం అని అతికించకూడదు. ఈ వర్గం:ఆర్ధిక శాస్త్రం అనేది ఆర్ధిక శాస్త్రం వ్యాసం రెండూ వేర్వేరు. వర్గాలను ప్రత్యేకంగా రాయనక్కరలేదు మనం రాస్తున్న వ్యాసాల్ని ఒక్కొక్కటిగా పైన చెప్పిన విధంగా వర్గాలలో చేర్చుకుంటే పోవటమే. బాగా తికమక పెట్టినట్టున్నానా ఇతర వ్యాసాలలోని వర్గాలు చూడండి మీకు మరింత అర్ధం కావచ్చు. --వైజాసత్య 19:24, 26 అక్టోబర్ 2007 (UTC)

మరింత సమాచారం కొరకు వికీపీడియా:వర్గీకరణ చదవండి --వైజాసత్య 19:28, 26 అక్టోబర్ 2007 (UTC)

ఇందిరా గాంధీ వ్యాసం

చంద్రకాంత్ రావ్‌గారు ఇందిరా గాంధీ వ్యాసాన్ని తీర్చిదిద్దారు.మీ కృషి ఇలానే కొనసాగించండి. దేవా 03:54, 30 అక్టోబర్ 2007 (UTC)

ఇందిరా గాంధీ వ్యాసం బాగుంది. అయితే చిన్న సలహా, ఒక పదము వ్యాసంలో తగిలినచోటల్లా లింకు ఇవ్వాల్సిన అవసరం. వ్యాసంలో ఆ పదము మొదట తారసపడినప్పుడు లింకిస్తే సరిపోతుంది. ఇది కఠిన నియమేమీ కాదు. అవసరమనుకున్నప్పుడు అతిక్రమించవచ్చు కానీ ఒక పదానికి అనేకసార్లు లింకిస్తే వ్యాసము చదవటానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. (మరిన్ని వివరాలకు వికీపీడియా:పాఠం (వికీపీడియా లింకులు) చూడండి) --వైజాసత్య 19:09, 30 అక్టోబర్ 2007 (UTC)
ఇందిరా గాంధీ వ్యాసాన్ని ఇంకా మెరుగు పరచటానికి కొన్ని సూచనలు ఆ వ్యాసం చర్చా పేజీలో చేసాను. ఒకసారి పరిశీలించండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:39, 31 అక్టోబర్ 2007 (UTC)

బొమ్మలను ఎక్కించటానికి ఒక సూచన

C.Chandra Kanth Rao గారు, ఆంగ్ల వికీ నుండి బొమ్మలను తెలుగు వికీపీడియాలో చేర్చాలనుకుంటే ఈ క్రింది విధానాన్ని పాటించండి.

  1. ఆంగ్ల వికీపీడియా పేజీలో కనిపిస్తున్న బొమ్మపై క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఆ బొమ్మ పేజీకి వెలతారు.
  2. అక్కడ మీకు బొమ్మకు కింద "Full resolution" అనే పేరుతో ఒక్క లింకు కనపడుతుంది, ఆ లింకును అనుసరిస్తే బొమ్మ అసలు సైజుతో తెలుగు వికీపీడియాలోకి తీసుకుని రాగలుగుతారు.
  3. ఇతర భాషల నుండి బొమ్మలను తీసుకుని వస్తున్నప్పుడు వాటి పేర్లను యధాతదంగా ఉంచండి. ముందు ముందు ఆ ఇతర భాషల వికీపీడియాలలో మేరుగైన బొమ్మలను చేర్చినప్పుడు వాటిని కొంచెం సులువుగా గుర్తించవచ్చు.
  4. అలాగే ఆంగ్ల వికీపీడియాలో ఉన్న అన్ని బొమ్మలకూ ఉచిత లైసెన్సులు ఉండవు, అలాంటి బొమ్మలలో కొన్నిటిని Fair Useగా వాడతారు. ఇలా ఫెయిర్ యూస్ కింద అప్లోడు చేసిన బొమ్మలకు వాటిని ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఆ బొమ్మనే ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందో పేర్కొనాలి. అలాగే ఏదయినా వ్యాసంలో ఉపయోగిస్తుంటేనే ఆ బొమ్మ వికీపీడియాలో ఉండగలుగుతుంది. అంతే కాదు, ఇలాంటి బొమ్మలకు, వాటి మూలాన్ని పేర్కొనడం తప్పనిసరి.

మీరు ఎక్కించిన బొమ్మ:Rakesh Sharma 01.JPG అనే బొమ్మను తొలగిస్తున్నాను. మీరు రాస్తున్న వ్యాసానికి ఈ బొమ్మ నిజంగా అవసరం అయితే పైన ఇచ్చిన సూచనలను పాటిస్తూ మళ్ళీ చేర్చండి. మీ సౌలభ్యం కోసం ఆంగ్ల వికీపీడియాలో ఆ బొమ్మ లింకు: en:Image:Sharma_rakesh.jpg __మాకినేని ప్రదీపు (+/-మా) 20:15, 5 నవంబర్ 2007 (UTC)

సూచన

చంద్రకాంత్ గారు మీరు కొత్త సభ్యులను ఆహ్వానించడానికి ఈ మూసను వాడవచ్చు. {{subst:స్వాగతం|సభ్యుడు=C.Chandra Kanth Rao |చిన్నది=అవును}} దేవా 06:27, 7 నవంబర్ 2007 (UTC)

అభినందనలు

చంద్రకాంతరావు గారూ!

మీరు వ్రాస్తున్న వ్యాసాలు మంచి ప్రమాణాలతో ఉన్నాయి. అభినందనలు.ఆర్ధిక శాస్త్రం వ్యాసాలతో తెవికీ మరింత సంపన్నమవుతున్నది. వ్యాసాలు వ్రాసినపుడు వాటి అంతర్వికీ (ఇతర భాషల వికీలకు) లింకులు ఇస్తూ ఉండండి. నేను మహలనోబిస్, రోనాల్డ్ కోస్ వ్యాసాలకు ఆ లింకులు చేర్చాను చూడండి. (అదే సమయంలో నేను ఆంగ్ల వికీలో ఆ వ్యాసం తెరచి అక్కడ తెలుగు వికీ లింకు కూడా పెట్టేస్తుంటాను) - --కాసుబాబు 19:27, 16 నవంబర్ 2007 (UTC)

  ఆర్ధికశాస్త్ర పతాకం
తెలుగు వికీపీడియాలో ఆర్ధిక శాస్త్ర వ్యాసాలను ప్రారంభించి, అనేక సంబంధిత వ్యాసాలను అభివృద్ధి పరచి తెవికీ విస్తృతికి తోడ్పడుతున్న చంద్రకాంతరావు గారికి తెలుగు వికీపీడియన్ల తరఫున కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో ఈ చిరుకానుకను సమర్పిస్తున్నాను --వైజాసత్య 17:35, 21 నవంబర్ 2007 (UTC)
చంద్రకాంత్! GDP, GNP, GDP (PPP) - వీటికి సరైన తెలుగు పేర్లతో వ్యాసాలు మొదలు పెట్ట గలవా! వివిధ దేశాలకు సంబంధించిన వ్యాసాలలో ఈ పదాలకు సంబంధించిన లింకులు తరచు వస్తున్నాయి. --కాసుబాబు 05:59, 4 డిసెంబర్ 2007 (UTC)

తెలుగు వికీపీడియాకు మీరందిస్తున్న కృషి ప్రశంసనీయము, నెలన్నరలొ 1500 పైగా మార్పులు చేశారు. తెలుగు వికీపీడీయా మీసేవలతో గర్వపడుతున్నది--బ్లాగేశ్వరుడు 01:48, 11 డిసెంబర్ 2007 (UTC)

  తెలుగు మెడల్
అలుపెరగకుండా తెలుగు వికీపీడియా ఎదుగుదలలో కృషిచేస్తున్న చంద్రకాంత్ గారికి దేవా బహూకరించే చిన్న మెడల్ అందుకోండి. వచ్చిన చాలా తక్కువకాలంలోనే ఇన్ని ఎక్కువ వ్యాసాలు రచించడం ఒక్క చంద్రకాంత్ గారికే సాధ్యం ___దేవా/DeVచర్చ 06:46, 18 డిసెంబర్ 2007 (UTC)

మూసలు

చంద్రకాంత్ గారు మీరు Navbox ఉపయోగించి మూస తయారు చేస్తున్నప్పుడు మూస పేజీపేరు మరియు '|name = 'దగ్గర రాసే పేరు ఒకేలాగ ఉండే విధంగా చూసుకోండి. లేకపోతే చూపు ('చూ' ఎడమవైపున వచ్చే మొదటి లింకు, దానితో పాటు ఉండే ఇతర రెండూ కూడా వేరే పేజీకి దారితీస్తాయి) ఎరుపు రంగులోకి మారి ఇంకో కొత్తపేజీకి దారితీస్తుంది. మీరు ఒకవేళ మూస పేజీపేరు మరియు '|name = 'వద్ద అచ్చంగా ఒకే పేరు ఇస్తే 'చూ' లింకు నలుపురంగులోకి మారుతుంది. మీకు ఇంకా అర్థం కావాలంటే నేను మీరు తయారుచేసిన మూసలో చేసిన మార్పులను గమనించండి. దేవా/DeVచర్చ 14:06, 12 డిసెంబర్ 2007 (UTC)

మీరిచ్చిన సలహాకు Thanks. అయితే ఒక చిన్న సందేహం. ప్రతి మండలంలో ఉన్న గ్రామాలకు ఒకదానితో ఒకటి లింకులు ఏర్పాటు చేయాలని నా ఉద్దేశ్యం. ప్రస్తుతం ఒక గ్రామం పేజీ నుంచి అదే మండలంలోని గ్రామానికి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మూసల ద్వారా నేను చేస్తున్నది సరైనదేనా లేదా దీని మరో దగ్గరి పరిష్కారం ఉందా.C.Chandra Kanth Rao 14:25, 12 డిసెంబర్ 2007 (UTC)

నాకు తెలిసినంతవరకు మూసల పద్దతే మంచి పద్దతి. మీరు కొనసాగించండి. దేవా/DeVచర్చ 14:32, 12 డిసెంబర్ 2007 (UTC)
మూసల పేర్లలో "జడ్చర్ల మండలం లోని గ్రామాలు", మండలం మరియు లోని, మధ్యన ఖాళీ అనవసరం అనుకుంటా, లోని అనేది అసలు పదమే కాదు కదా! __మాకినేని ప్రదీపు (+/-మా) 14:40, 12 డిసెంబర్ 2007 (UTC)
అవును అవసరం లేదండి చంద్రకాంత్ గారు! అందుకే కొన్ని మూసల్లో నేను '|title =' వద్ద మార్చాను. నేమ్ మరియు టైటిల్ వేరు వేరుగా ఉండవచ్చండి. మీరు ఇకముందు తయారుచేసే మూసల్లో అలా స్పేస్ వదలకుండా పేర్లు ప్రారంభించండి. ఇంతకుముందే ఉన్న మూసల్లో '|title =' వద్ద పేరు సవరిస్తే సరిపోతుంది. దేవా/DeVచర్చ 14:50, 12 డిసెంబర్ 2007 (UTC)

సహాయ అభ్యర్థన

"మద్దూరు (మహబూబ్ నగర్) మండలంలోని గ్రామాలు" మూసను సృష్టిద్దామని గ్రామాలన్ని టైపు చేసి పొరపాటున టైటిల్ "బాలానగర్ (మహబూబ్ నగర్) మండలంలోని గ్రామాలు" అని పెట్టాను. కాని ఇది వరకే బాలానగర్ కు సంబంధించిన మూస ఉంది. దీన్ని అప్పుడే గమనించలేను. మద్దూరు మండలపు కొన్ని గ్రామాలలో ఈ మూస వాడిన తర్వాత దీని తరలింపు లాగ్ చేశాను. కాని బాలానగర్ మండలపు గ్రామాలకు కూడా మద్దూరు మండలపు గ్రామాల మూస వచ్చింది. దీనికి ఏదైనా పరిష్కారముందా? లేదా మళ్ళీ కొత్త మూస తయారుచేసి ప్రతి గ్రామానికి చేర్చవలసిందేనా? C.Chandra Kanth Rao 17:01, 12 డిసెంబర్ 2007 (UTC)

చాలా అయోమయంగా ఉంది. ఇది వరకే మూస ఉన్నప్పుడు తరలింపు హెచ్చిరక చేసి ఉండాలే..ఉన్నదానిపైకే ఇలా తరలింపు చేసినప్పుడు ఇంక వాటిని తిరిగి మార్చలేమనుకుంటాను. మళ్ళీ కొత్తగా తయారుచెయ్యటం ఉత్తమం అని నా అభిప్రాయం --వైజాసత్య 17:49, 12 డిసెంబర్ 2007 (UTC)
చంద్రకాంత్ గారు మీరు 'మూస:బాలానగర్ (మహబూబ్ నగర్) మండలంలోని గ్రామాలు' అనే పేజీ ఓపెన్ చేసి ఉన్నారా? దిద్దుబాటు ఘర్షణ అని వస్తుంది. ఒకవేళ మీరు ఈ పేజీ ఓపెన్ చేసి ఉంటే ఆ పేజీ చరితంలోకి వెళ్ళి దిద్దుబాటును రద్దు చేయండి. మీ ప్రాబ్లెమ్ సాల్వ్ అయిపోతుంది. దేవా/DeVచర్చ 18:21, 12 డిసెంబర్ 2007 (UTC)
ఎలా చేసిననూ సమస్య పరిష్కారం కావడం లేదు. కాబట్టి సమస్య దీంతో వదిలేద్దాం. కొత్త మూస తయారుచేయడం తేలికే కాని భవిష్యత్తులో అవసరం రీత్యా, అనుభవం కోసం అభ్యర్థించా.C.Chandra Kanth Rao 18:40, 12 డిసెంబర్ 2007 (UTC)

ఈవారం వ్యాసం పరిగణన

చంద్రకాంత్! నువ్వు అనేక పెద్ద వ్యాసాలు కూర్చావు. వాటిలో కాస్త సమగ్రంగా ఉన్నవాటిని, ముఖ్యంగా ఒకటైనా బొమ్మ ఉన్నవాటిని "ఈ వారం వ్యాసం" ప్రతిపాదన చేస్తూ ఉండు. (చర్చాపేజీలో "{{ఈ వారం వ్యాసం పరిగణన}}" అన్న నూస ఉంచితే చాలును)--కాసుబాబు 19:24, 17 డిసెంబర్ 2007 (UTC)

కాసుబాబు గారూ! బొమ్మలు దొర్కడం కష్టమే. వీలయితే ఆంగ్ల వికీ బొమ్మలను తీసుకుందాం. బొమ్మల కొరత వల్లే నేను పెద్ద వ్యాసాలు రచిస్తున్ననూ ఈ వారం వ్యాసం ప్రతిపాదన చేయడం లేదు. ఇంత వరకు ఒక్క ఇందిరా గాంధీ వ్యాసం మాత్రమే ఈ వారం వ్యాసం గా ప్రతిపాదన చేశాను. వీలయితే దాన్ని మరియు పంచవర్ష ప్రణాళికలు వ్యాసాలను ఈ వారం వ్యాసాలుగా మునుముందు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి.C.Chandra Kanth Rao 19:31, 17 డిసెంబర్ 2007 (UTC)

Końskowola - Poland

Could you please write a stub http://te.wikipedia.org/wiki/Ko%C5%84skowola - just a few sentences based on http://en.wikipedia.org/wiki/Ko%C5%84skowola ? Only 3-5 sentences enough. Please.

P.S. If You do that, please put interwiki link into english version. 123owca321 21:02, 23 డిసెంబర్ 2007 (UTC)

మండలంలోని గ్రామాల మూసలు

చంద్రకాంత్ గారూ, మండలంలోని గ్రామాలకు మూసలను సృష్టించి వాటిని గ్రామాల పేజీలలో పెట్టాలనే ఆలోచన బాగుంది. దాని వలన ఒకే మండలంలోని వివిద గ్రామాల పేజీల మధ్యన ఇంకొంచెం సులువుగా మారవచ్చు. అయితే మీరు కేవలం మూసలను మాత్రమే తయారు చేస్తే సరిపోతుంది. ఆ మూసలను ఏఏ పేజీలలో పెట్టాలో చెబితే బాటుద్వారా వాటిని చేర్పించగలను. దాని వలన మీ శ్రమతగ్గుతుంది, అదే సమయంలో మరిన్ని పేజీలను త్వరత్వరగా చేసేయవచ్చు. ప్రోగ్రామును తయారు చేయమంటారా మరి. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:58, 8 జనవరి 2008 (UTC)Reply

ప్రదీప్ గారూ అలాగే చేయండి, శ్రమ తగ్గిస్తున్నందుకు ధన్యవాదాలు. అన్ని మండలాలకు చెందిన మూసలు తయారుచేస్తాను. అయితే ప్రస్తుతం నేను గ్రామాలకు మూసలు తగిలించే క్రమంలో అయోమయ నివృత్తిలో వచ్చిన పేజీలకు సరాసరిగా గ్రామాలకు లింకు ఇస్తున్నాను. ఇంకా కొన్ని గ్రామాలలో ఉన్న చెత్త సమాచారం (పేర్లు, అడ్రస్‌లు, ఇంకా పనికి రాని సమాచారం) కూడా తొలిగిస్తున్నాను. మరికొన్ని గ్రామాల లింకులకు ఆ మండలపు గ్రామం కాకుండా ఇతర మండలాల గ్రామాలు వస్తున్నాయి. వాటినీ సరిచేస్తున్నాను. మీరు ప్రోగ్రాం తయారుచేస్తారంటే నేను మండాలాల మూసలు తయారు చేస్తాను. ఆ మూసలను ఏయే పేజీలలో పెట్టమంటారా, ఆ మూసలో ఉన్న గ్రామాల పేజీలలోనే. ప్రస్తుతం అసంపూర్ణంగా ఉన్న మాగనూరు మండలం పూర్తి చేస్తాను. మీ పని కానిచ్చేయండి--C.Chandra Kanth Rao 18:11, 8 జనవరి 2008 (UTC)Reply
30 మండలాలకు చెందిన మూసలు బాట్ల ద్వారా గ్రామాల పేజీలకు చేర్చడానికి సిద్ధంగా ఉన్నాయి--C.Chandra Kanth Rao 21:54, 12 జనవరి 2008 (UTC)Reply

ఆ ముప్పై మండలాల గ్రామాలపై బాటును నడుపుతున్నాణు. ఇక ముందు తయారు చేస్తున్న మూసలకు "చివరన"

 <noinclude>[[వర్గం:కలపండి]]</noinclude>

అనే కోడును కలపండి. అప్పుడు ఈ మూసలను ఇంకా గ్రామాల పేజీలకు కలపలేదో సులువుగా తెలుస్తుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 00:33, 13 జనవరి 2008 (UTC)Reply

  • చంద్రకాత రావుగారు మీసూచనకు థాంక్స్.మీఅభినందనలు నన్ను ముందుకు నడిపించడంలో తోడ్పడతాయని అనుకుంటున్నాను.

--t.sujatha 16:47, 16 జనవరి 2008 (UTC)

ఒక చిన్న సహాయం

దక్షిణ భారతదేశం వ్యాసంలో ఆర్థికాంశాలపై ఉన్న ఒక విభాగం సరిగా అనువదించలేక పోయాను. ఒకసారి దాన్ని చూడగలరా? రవిచంద్ర 12:46, 17 జనవరి 2008 (UTC)Reply

మీరు కోరినది ఆదాయ వనరులు పేరా విభాగమే కదా, సరిచేశా--C.Chandra Kanth Rao 13:16, 17 జనవరి 2008 (UTC)Reply

ధన్యవాదాలు

మీరు నా స్వీయ ప్రతిపాదనను అంగీకరించిందుకు కృతజ్ఞతలు. --δευ దేవా 10:24, 20 జనవరి 2008 (UTC)Reply

చంద్రకాంత రావు గారు మీ ఉపయోగ కరమైన సూచనలబాగిన్నాయి.అభినంనలకు నెనర్లు.నా తరవాత కార్యక్రమం సగం వదిలి వేసిన లాస్ఏంజలెస్ పూర్తిచేయడమే.అనువాదంలో పొరపాట్లు దొర్లుతాయని సందేహంగా ఉంది.అలా ఉంటే సరిచేయండి.అలాగే లింకులు విషయం మనవాళ్ళందరూ ఉన్నారుగా లింకుల విషయం చూసుకుంటారని ఆ విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదు అంతే.ఇక భారతీయ నగరాల విషయంలో నాకు సమగ్రమైన సమాచారం అంతగా అందే వసతిలేదు ఇంగ్లీషు వీకీ నుండి అనువాదం మాత్రమే చేయాలి.

--t.sujatha 16:21, 20 జనవరి 2008 (UTC)

మండలంలోని గ్రామాలకు మూసలు

మీకు అన్ని మండలాలలోని గ్రామాలకు మూసలు తయారుచెయ్యాలని (మహబూబ్ నగర్ జిల్లా లాగ) యోచన ఉంటే అది బాటు ద్వారా సులువుగా అవుతుంది. నేను ప్రోగ్రాం వ్రాస్తాను. ఆ విధంగా మీకు చాలా సమయం ఆదా అవుతుంది. మూసలు తయారు చెయ్యటం, అతికించటం రెండూ బాటు ద్వారా చెయ్యచ్చు :-) --వైజాసత్య 19:52, 22 జనవరి 2008 (UTC)Reply

వైజాసత్యగారూ, అలాగే చేయండి. అన్ని జిల్లాలకు సంబంధించిన మండలాలలో గ్రామాల పేర్లతో మూసలు తయారు చేసి మండలంలోని గ్రామాలను ఒకదానితో మరికటి కలపాలనేది నా ఆశయం. మూసలు తయారు చేయడం కూడా బాటు ద్వారా వీలయితే నా ఆశయాన్ని విరమించుకుంటాను. సమయం ఆదా చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇదే సమయంలో ఇతర రచనలు కొనసాగించవచ్చు.C.Chandra Kanth Rao 20:04, 22 జనవరి 2008 (UTC)Reply
అన్ని జిల్లాల మండలాలకు మూసల తయారు చెయ్యటం అయ్యింది. ఇకవాటిని ఆయాగ్రామాల్లో అతికించే ప్రయత్నంచేస్తా --వైజాసత్య 14:42, 23 జనవరి 2008 (UTC)Reply
వైజాసత్యా గారూ మీరు యమా ఫాస్టుగా ఉన్నారు. ఏదేని విషయం చెప్పడమే తరువాయి, వెంటనే చేసి చూపిస్తారు.--C.Chandra Kanth Rao 16:26, 23 జనవరి 2008 (UTC)Reply

ధన్యవాదాలు

ఉప్పెనలా వస్తున్న సభ్యులందర్ని ఆహ్వానిస్తున్నందుకు నెనర్లు. నేను ఊళ్ళో లేకపోవటం వళ్ళ, ఇక్కడ సొంత కంప్యూటరు లేకపోవటం వళ్ళ చేద్దామనుకున్నంత చేయలేకపోతున్నాను. తిరిగి బుధవారానికి గూటికి చేరుకుంటాను :-) --వైజాసత్య 19:06, 4 ఫిబ్రవరి 2008 (UTC)Reply

అవునూ వైజాసత్య గారు, నిన్న ఆదివారమైతే ఉదయం నుంచి రాత్రి రెండు వరకు మద్యలో టిఫిన్, లంచ్, డిన్నర్ మినహా విరామం కూడా తీసుకోలేదు. సభ్యులను ఆహ్వానించడానికే సమయం సరిపోతోంది. వారి రచనలు పరిశీలించడానికి సమయమే దొరకడం లేదు. ఆదివారం దాదాపు 450 కొత్త సభ్యులు ప్రవేశించిన ఆనందమే కాని వారిలో చాలా మంది చేసిన అనవసర మార్పులు, చేర్పులు సరిదిద్దడానికి మనకు చాలా సమయం పడుతుంది. ప్రదీప్, విశ్వనాథ్ గార్లు మినహా మిగితా మన సీనియర్ సభ్యులు కనిపించడం లేదు. ఈ సమయంలో వారందరి అవసరం చాలా ఉండేది. నేను కొత్త సభ్యులు సృష్టించిన పేజీలనుంచి అనవసర సమాచారం ఖాళీ చేశాను. ఆ పేజీలన్నింటినీ తొలిగించండి. కొందరైతే సరాసరిగా వారి గ్రామాల పేర్లను వర్గాలలో చేరుస్తున్నారు. చాలా వరకు మండలాలలోని గ్రామాల పేర్ల లింకులు తెగిపోయాయి. కొందరు మూసలు కూడా చెడగొట్టినారు. కొందరు సొంతవిషయాలు వ్యాసాలలో వ్రాసుకున్నారు. ఇంకో విషయం కొత్త సభ్యులను ఆటోమేటిక్‌గా ఆహ్వానించడానికి ప్రోగ్రాం తయారు చేస్తే బాగుంటుంది. ఈ విషయంపై ఆలోచించండి. --C.Chandra Kanth Rao 19:18, 4 ఫిబ్రవరి 2008 (UTC)Reply
  • మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు C.Chandra Kanth Rao గారూ.మీపేరు తప్పుగా వ్రాసినందుకు సారీ.అనుమానిస్తూనే వ్యాసం మొదలు పెట్టాను మీ ప్రోత్సాహం వ్యాసాన్ని అభివృద్ధి చేయడంలో తోడ్పడుతుంది.లింకులు చాలా ఇవ్వాలి.ఎక్కడెక్కడ ఇవ్వాలో ఆలోచించి మీరంతా ఆపని చూసుకుంటారని అనుకుంటున్నాను.--t.sujatha 06:35, 5 ఫిబ్రవరి 2008 (UTC)

బొమ్మల కాపీహక్కులకు ఒక బాటు

నేను నిర్వహిస్తున్న బాటుద్వారా కాపీహక్కులు లేని బొమ్మలను కనుక్కుని వాటిని అప్లోడుచేసిన సభ్యులను హెచ్చరించటానికి మరియూ ఆ కాపీ హక్కులను ఎట్లా చేర్చాలో సలహాలు ఇవ్వటానికి ఒక బాటును తయారు చేసాను. ఆ బాటును నడపటానికి ఆమోదం కోసం ఇక్కడ చేర్చాను. అక్కడ మీ అభిప్రాయం తెలుపగలరు __మాకినేని ప్రదీపు (+/-మా) 09:00, 8 ఫిబ్రవరి 2008 (UTC)Reply

బొమ్మలను '"క్రాప్" చేయండి

చంద్రకాంత్ !

బొమ్మ:Mahabubnagar Bus Station.jpg చూస్తే నాకు అనిపించింది. ఇటువంటి బొమ్మలలో పైభాగం (ఆకాశం), క్రింది భాగం (నేల) "క్రాప్" చేస్తే బొమ్మ సైజు బాగా తగ్గుతుంది. అప్‌లోడ్ త్వరగా అవుతుంది. బొమ్మలో ఉన్న సమాచారానికి లోపం ఉండదు. Microsoft Office Picture Manager వంటి చాలా సాఫ్ట్‌వేర్‌లలో ఈ సదుపాయం ఉంటుంది. నేను చేసే బొమ్మలకు ఇదే విధానం అనుసరిస్తాను. మరో విషయం. ఒకసారి బొమ్మను ఓపెన్ చేసి "Autocorrect" నొక్కితే బొమ్మ క్వాలిటీ మెరుగుపడే అవకాశం ఉన్నది. --కాసుబాబు 07:55, 24 ఫిబ్రవరి 2008 (UTC)Reply

ఫోటో తీసేటప్పుడే నేల, ఆకాశం రాకూడదని ప్రయత్నించాను కాని కుడి, ఎడమ వైపులలో కూడా బొమ్మ పరిమాణం తగ్గిపోతుంది. తర్వాత క్రాష్ చేద్దామనుకుంటే బొమ్మ వెడల్పుగా తయారౌతుందని అలాగే లోడ్ చేశా. ఇక నుంచి బొమ్మలో రావాల్సిన వాటికే గురిపెట్టి ఫోటోతీస్తా.----C.Chandra Kanth Rao 14:12, 24 ఫిబ్రవరి 2008 (UTC)Reply

వర్తమాన ఘటనలు

చంద్రకాంత్ గారు! వర్తమాన ఘటనల్లో ఏమి జరిగిందో అర్థం అవడం లేదు. అందులోని వేదిక:వర్తమాన ఘటనలు/DateHeader2లో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అది కూడా డైరెక్ట్‌గా అందులో జరిగినట్లు లేదు. ఎవరైనా సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పర్ట్స్ వల్లనే అయ్యేట్టుగా ఉంది. δευ దేవా 17:33, 24 ఫిబ్రవరి 2008 (UTC)Reply

  చంద్రకాంత్‌గారు! కొంతవరకు హెడర్ సరిచేయగలిగాను. కానీ బ్రాకెట్లలో ఉన్న విషయం ఎడమవైపుకు రావడం లేదు. δευ దేవా 10:36, 26 ఫిబ్రవరి 2008 (UTC)Reply

చాలా కష్టపడాల్సి వచ్చింది. లైన్ బ్రేక్ అల్గారిథమ్‌లో ఏవైనా మార్పులు జరిగి ఉండవచ్చని అనిపించింది. ఇంకా అంతలోతుగా నేను వెళ్ళలేదండి. δευ దేవా 14:36, 26 ఫిబ్రవరి 2008 (UTC)Reply

విన్నపము

గౌరవనీయులైన సభ్యులకు,

నేను తెవికీ లో ఈమధ్యనే సభ్యత్వము తీసుకున్నాను. ఇక్కడ నేను ఎదుర్కొన్న ప్ర ధాన సమస్య ఏమిటనగా, తెలుగు టైపింగు కొత్తవారికి అంత త్వరగా అలవాటు కాదు. వారు కొత్తలో అనేక టైపింగు తప్పులు చేసే అవకాం ఉన్నది. ఒక వేళ పొరపాటున సభ్యుల టైపింగు లో అచ్చు తప్పు దొర్లితే, సంబంధిత పేజీ కనిపించడం లేదు. దీనితో కొత్త సభ్యులు చాలా నిరాశ చెందుతున్నారు.

అలా వారిని నిరాశ పరచకుండా ఉండడానికి మాత్రమే నేను అనేక దారి మార్పులు చేయుచున్నాను. ఉదాహరణ కి 'కృష్ణ భగవాన్' మరియు 'క్రిష్నభగవాన్' రెండూ ఒకే పేరును సూచిస్తాయి. కానీ రెండవ పేరు టైపు చేస్తే ఏ పేజీ రాదు. కొత్తగా వచ్చే సభ్యులు వ్యాకరణం లో ఘనాపాఠీలు గా ఉండక పోవచ్చును. కావున వారి సౌలభ్యం కొరకే ఈ దారి మార్పులు చేసాను. నాకు తెలిసిన ఔత్సాహికులు కొందరు ఇదే సమస్య వలన తెవికీ పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు. దీనితో మొదటికే మోసం రావచ్చు. కావున ముందు మనం ర కొత్త సభ్యులను ఆకట్టుకొంటే , తరవాత మన తెవికీ దినదిన ప్రవర్థమానం గా ప్రకాశిస్తుందనేది నా ఆశ.

ఇంతటితో ఈ సమస్య ని గౌరవ సభ్యుల విగ్నత కే వదిలేస్తున్నాను.

ఇట్లు, సుల్తాన్ ఖాదర్.

సుల్తాన్ ఖాదర్ గారు, మీ సమస్య అర్థమైంది. కాని ఇలా ఒకే పేజీకి 15-20 దారి మార్పు పేజీలు ఇచ్చుకుంటూ పోతే అంతకు మించిన మరో సమస్య తలెత్తుతుంది. ఒక వ్యాసం అవసరమైతే మరో వ్యాసం రావచ్చు. ఉధా.కు వేలు/వేళ్ళు వ్యాసం అవసరైతే సుత్తివేలు వస్తుంది. అలాగే సుబ్బారావులు చాలా మంది ఉండవచ్చు. ఇప్పటికే నేను చెప్పేది మీకు అర్థమైందనుకుంటా. ఇక మీరు చెప్పినట్లు కొత్త సభ్యుల టైపింగ్ సమస్య గురించి చెప్పాలంటే దానికి పరిష్కారం వర్గాల ద్వారా సరైన దారి ఏర్పర్చడమే. ఎందరో కొత్త కొత్త సభ్యులు వర్గాల ఆధారంగానే తమతమ గ్రామాల వ్యాసాలకు చేరుకొని సమాచారం జోడించడంలేదా? మీరు కూడా కొత్త వ్యాసాలను చేరుకోడానికి మంచి దారి ఏర్పర్చండి చాలు. ఎన్ని దారిమార్పు పేజీలున్ననూ టైపింగ్ సమస్య ఉన్న వారు చేరాల్సిన వ్యాసం చేరడం కష్టమే. సినీ నటుల వ్యాసాలు కావాలంటే వర్గాల ద్వారా తెలుగు సినిమా-->నటులు--> వెళ్తే ఆ తరువాత వచ్చేది నటుల పేర్లే కదా.----C.Chandra Kanth Rao 14:23, 26 ఫిబ్రవరి 2008 (UTC)Reply


    • చంద్రకాంతరావుగారూ నమస్కారం, మీరు ఉద్యోగంలో వుంటూగూడా తెవికీ కొరకు సమయం వెచ్చించి చేస్తున్న సేవ చాలా చక్కనిది. తెలుగు భాష పట్ల మీకున్న అచంచల ప్రేమ, మరియు విషయాలపై పట్టు కొనియాడదగినవి, కృతజ్ఞతలు. దక్షిణగంగోత్రి అనునది అంటార్కిటికా ఖండంలో భారతదేశానికి చెందిన శాస్వత కేంద్రం. దీనికా పేరు ఎందుకొచ్చిందంటే, గంగోత్రి అనునది పెద్ద గ్లేషియర్ గల స్థలం (గంగానది జన్మస్థానం), అది హిమాలయాలలో వున్నది. దక్షిణ గంగోత్రి ప్రదేశముకూడా ఒక గ్లేషియర్ లేదా గ్లేషియర్ లాంటి స్థలం కావున, అంటార్కిటికా ఖండం భూగోళానికి (భారతదేశానికి కూడా) దక్షిణాన గలదు కావున, ఆ ప్రదేశానికి దక్షిణ గంగోత్రి అని పేరు పెట్టారు. గంగానది జన్మస్థలం గంగోత్రి (బ్రహ్మపుత్రానది జన్మస్థలం మానససరోవరం లాగా) అని ప్రస్తావించడం జరిగింది గాని, దక్షిణ గంగోత్రితో సంబంధమున్నట్టు గాదు. అదీ నాఉద్దేశ్యం, మీరు దీనికి సరైన మార్పులతో ఉంచగలరంటే స్వాగతం. ధన్యవాదాలు, మిత్రుడు. nisar 20:51, 29 ఫిబ్రవరి 2008 (UTC)Reply
చంద్రకాంతరావుగారూ, మీసూచనకు ధన్యవాదాలు, మిత్రుడు nisar 21:09, 29 ఫిబ్రవరి 2008 (UTC)Reply
Return to the user page of "C.Chandra Kanth Rao/పాత చర్చ 1".