వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao/పాత చర్చ 2

తాజా వ్యాఖ్య: నియోజకవర్గాలు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao
Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.

మీ సూచనమేరకు 'రాకేశ్ శర్మ' నందు మార్పులు చేశాను. దయచేసి రాకేష్ శర్మ పేజీ ని తీసివెయ్యండి. రాకేశ్ శర్మ ఫోటో వేస్తేనూ బాగుంటుంది. మిత్రుడుnisar 22:37, 2 మార్చి 2008 (UTC)Reply

"మీకు తెలుసా!" సమాచారం

చంద్రకాంత్! మొదటి పేజీలో "మీకు తెలుసా" మూసను మనం మెయింటెయిన్ చేయలేకపోతున్నామనీ, దానిని తొలగించాలనీ నేను ఇదివరకు రెండు సార్లు విజ్ఞప్తి చేశాను. ప్రస్తుతం ఆ పని నీవు చేబట్టడం వలన మొదటిపేజీలో పెద్ద వెలితి పూడింది. నీ శ్రమకు అభినందనలు- --కాసుబాబు 06:52, 3 మార్చి 2008 (UTC)Reply

ఎలాగూ నేను ప్రతి కొత్త రచనలను గమనిస్తూ ఉంటాను. ముఖ్యమైన పాయింట్లు నోట్ చేసుకుంటే చాలా రోజుల నుంచి అచేతనంగా ఉన్న శీర్షికను తాజాకరించవచ్చు ననే ఆలోచన రావడంతో ఆ పని కూడా ప్రారంభించాను.-- C.Chandra Kanth Rao(చర్చ) 18:38, 3 మార్చి 2008 (UTC)Reply
అవునండీ చంద్రకాంత్ రావు గారు! మీ కృషి అమోఘం! నేను మీరడినట్లు మూస:2003 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు సభ్యులులో మార్పులు చేయలేకపోయాను. దానికి ప్రత్యామ్నాయంగా navbar లేకుండా చేసాను. δευ దేవా 09:08, 5 మార్చి 2008 (UTC)Reply

Archive

అలా చేస్తే ఇప్పుడు జరుగుతున్న చర్చలు ఉండవు కదా. అందికే చర్చ పేజిలో సంతకం చేయమని చెప్పేది. సాయీ(చర్చ) 13:43, 8 మార్చి 2008 (UTC)Reply

సంతకం ప్రధానం కాదు. మన సంతకం ఎవరయిననూ సులభంగా కాపీ చేయవచ్చు (అలా చేయడం తప్పే, అయిననూ చేయడానికి అవకాశం మాత్రం ఉంది). ఎవరూ మార్పుచేయడానికి వీలులేనిది కాబట్టి నా దృష్టిలో చరితమే ప్రధానం. దాని ద్వారా సంతకం చేయని కొత్త సభ్యుల సభ్యనామం/ఐపి అడ్రస్ కాకుండా దిద్దుబాటు తేడాలు కూడా ఖచ్చితంగా తెల్సుకోవచ్చు. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:35, 8 మార్చి 2008 (UTC)Reply

ఒక వేళ క్రితం చర్చ పేజికి వెళ్ళి సంతకం కాపి చేస్తే, ఆ పేజి చరితం లో పట్టుకోవచ్చు కదా. సాయీ(చర్చ) 14:44, 8 మార్చి 2008 (UTC)Reply

క్రికెట్

CKR గారు, మీరు వ్రాస్తున్న క్రికెట్ వ్యాసాలను చూస్తుంటాను. మీ కృషి మాటల్లో చెప్పలేనిది. క్రికెట్ ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే, కాబట్టి మొదటి పేజీలో మార్గదర్శిని లో భారత దేశము దగ్గర క్రికెట్ వర్గాన్ని కూడా చేర్చితే బాగుంటుంది. మీ అభిప్రాయాలు తెలుపగలరు. - --Svrangarao 15:44, 16 మార్చి 2008 (UTC)Reply

రంగారావు గారు, క్రికెట్ ప్రాముఖ్యత గురించి మీరు చెప్పిన మాట నిజమే. అత్యధిక జనాదరణ కలిగిన అంశం కాబట్టి దీని కొరకు నాకు ఎంతో ప్రీతికరమైన ఆర్థికశాస్త్రం వ్యాసాలను కూడా ప్రక్కకు పెట్టాను. ఇక మొదటి పేజీలో క్రికెట్ వర్గాన్ని చేర్చాలనే విషయం మంచిదే. కాని మొదటి పేజీలో కేవలం క్రికెట్‌కు మాత్రమే లింకు ఇస్తే సరిపోదు అన్ని క్రీడలకు లింకులివ్వాల్సి వస్తుంది. మిగితా క్రీడల వ్యాసాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వ్యాసాల సంఖ్య పెరిగితే క్రికెట్‌పై వేదిక (పోర్టల్) కూడా ప్రారంభించవచ్చు. క్రికెట్ అభిమానులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:03, 16 మార్చి 2008 (UTC)Reply

CKR గారు, మిగతా క్రీడలను పరిగణనలోకి తీసుకోవడం మంచిదే కానీ దురదృష్టవశాత్తు ఆ వ్యాసాలు లేవు, ఎక్కువమంది రాస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు. ఇకపోతే, చాలా పోర్టల్స్ లో క్రికెట్‌ను మొదటిపేజీలోనే చూపుతున్నారు ఎందుకంటే దానికి అయస్కాంతత్వ గుణం ఉన్నది కాబట్టి!! ఇప్పటికే మీరు ఎన్నో వ్యాసాలు రాసారు. మిగిలిందల్లా వాటిని మొదటిపేజీ కోసం అమర్చడమే! ఇప్పటికిప్పుడు కాకపోయినా, తొందరలో చేయగలరని ఆశిస్తున్నాను.- --Svrangarao 16:25, 16 మార్చి 2008 (UTC)Reply

మీ సూచనను తప్పకుండా పరిశీలిస్తాను-- C.Chandra Kanth Rao(చర్చ) 16:32, 16 మార్చి 2008 (UTC)Reply
చంద్ర కాంత రావు గారు, భారత క్రికెట్ జట్టును 28వ వారపు వ్యాసంగా ప్రతిపాదించాను. ఈ వ్యాసము చాలా పెద్దదిగా ఉండడంవల్ల కొన్ని మార్పులు చేసి మరి కొన్ని చిన్న వ్యాసాలను సృష్టించి ఈ వ్యాసంలో లింకులు ఇస్తే బాగుంటుందేమో. మీ అభిప్రాయాలు తెలియచేయగలరు. --Svrangarao 17:08, 19 మార్చి 2008 (UTC)Reply
రంగారావు గారు, మీ సూచనను పరిశీలిస్తాను.-- C.Chandra Kanth Rao(చర్చ) 19:32, 19 మార్చి 2008 (UTC)Reply

ఒక చిన్న మాట

చంద్రకాంత రావుగారూ! నా దురదృష్టవశాత్తూ కొన్ని వ్యక్తిగత కారణాల వలన సరిగ్గా నేను నిర్వాహక ప్రతిపాదన చేసిన తరువాతే ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లభించుట లేదు. కాబట్టి నేను ఒక రెండు నెలల సమయం పాటు ఎక్కువ మార్పులు చేయలేకపోవచ్చు.అన్యదా భావించకండి. తరువాత నా సొంత ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొంటే యధావిధిగా మార్పులు చేయగలను. రవిచంద్ర ఉత్సాహంగా పనిచేస్తున్నాడు, అని మిగతా నిర్వాహకులు కూడా నాకు మద్దతు తెలిపారు. ఎక్కువ దిద్దుబాట్లు చెయ్యలేకపోతున్నందుకు బాధగా ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. రవిచంద్ర(చర్చ) 13:14, 17 మార్చి 2008 (UTC)Reply

ఫరవాలేదు. మీకు వీలున్నప్పుడే చేయండి.-- C.Chandra Kanth Rao(చర్చ) 13:19, 17 మార్చి 2008 (UTC)Reply
  • చంద్రకాంతరావుగారూ నమస్తే, మీ సూచనకు ధన్యవాదాలు, అలాగే చేపడతాను. మిత్రుడు nisar 16:08, 18 మార్చి 2008 (UTC)Reply
  • చంద్రకాంతరావుగారూ నమస్తే, మీరు సూచించిన పని పూర్తి చేశాను, ధన్యవాదాలు, సోదరుడు nisar 12:18, 26 మార్చి 2008 (UTC)Reply
మంచి పనిచేశారు. ఇక నుంచి ఆంగ్ల వ్యాసాలు తెవికీలో ఉంచకుండా పూర్తిగా తెలుగులో అనువాదం చేయండి. ఆంగ్ల వికీలో ఉన్నది ఉన్నట్లుగా మొత్తం వ్యాసం అనువాదం చేయాల్సిన అవసరం లేదు.సంక్షిప్తంగానూ చేయవచ్చు. తెవికీలో ఇప్పటికే చాలా ఆంగ్ల వ్యాసాలున్నాయి. వాటిని తొందరలోనే తొలిగించే పని చేపడతాను.-- C.Chandra Kanth Rao(చర్చ) 18:27, 26 మార్చి 2008 (UTC)Reply

అసెంబ్లీ నియోజకవర్గాలు

చంద్రకాంతరావు గారికి ధన్యవాదాలు. అసెంబ్లీ నియోజక వర్గాల వివరాలు చేరుస్తున్నందుకు. వాటి యొక్క మూలాన్ని కూడా చేరిస్తే ఇంకాబాగుంటుంది.Rajasekhar1961 15:03, 20 మార్చి 2008 (UTC)Reply

రాజశేఖర్ గారు నేను వార్తా పత్రికల జిల్లా ఎడిషన్లలో వచ్చిన సమాచారం ఆధారంగా ఆ పేజీలు తయారుచేశాను. ఇంకనూ ఆ సమాచారం ఎన్నికల కమీషన్ వెబ్‌సైట్‌లో పెట్టలేదు. వార్తాపత్రికలకు రెఫరెన్సు ఇవ్వడం బాగుండదు. ఒకే సారి వెబ్‌సైట్ రెఫరెన్సే పెడదాం. వాటన్నింటినీ బాటు ద్వారా ఒకే సారి పెట్టవచ్చు. నేను మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి (అసంపూర్తి) జిల్లాల నియోజకవర్గాలు చేర్చాను. మీకు అందుబాటులో ఉంటే మిగితా జిల్లాల సమాచారం కూడా చేర్చండి. నేను కూడా ప్రయత్నిస్తాను.---- C.Chandra Kanth Rao(చర్చ) 19:40, 20 మార్చి 2008 (UTC)Reply

ధన్యవాదాలు

అధికారి హోదాకై నేను చేసిన విజ్ఞప్తికి మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:23, 20 మార్చి 2008 (UTC)Reply

ముందు అడుగు తప్పని సరి

రావు గారు! నేను కొత్త సభ్యడ ను మీ సూచన కు ధన్యవాదములు!! మొదటి అడుగు లేకుండా ప్రయాణము పూర్తి కాదు!!! సాంతికశాస్త్రము లు చదివిన చదువుచున్న మిత్రుల సహయసలహలతో పూర్తి చేయవలసిన సుదూర ప్రయాణము. గమనించగలరు---తిరుమల శ్రీనివాస్ 00:14, 29 మార్చి 2008 (UTC)Reply

ఆంగ్ల భాగం తొలగింపు

చంద్ర కాంత రావు గారు, మొదటి తెవికీ చూసినపుడు నాకు కూడా అలాంటి అభిప్రాయమే కలిగింది. కొన్నాళ్ళు చూసి ఆగలేక తుడిచివేత మొదలు పెట్టాను. మీరు చెబుతున్నట్లు నేను వీలయినంతవరకు ఆ వ్యాస చరిత్ర చూసిన తరువాతే డిలీట్ చేయడం మొదలు పెట్టాను. మరింత క్షుణ్ణంగా పరిశీలించడానికి ప్రయత్నిస్తాను. ఒకట్రెండు వ్యాసాలలో ఒక్క తెలుగు అక్షరం కూడా లేకపోవడంతో, ఆ పేజీ ఎలా తొలగించాలో తెలియక అందులోని విషయం మొత్తం తీసివేసాను. ఉదా: తొమ్మిది. మీరొకసారి పరిశీలించగలరు. --Svrangarao 23:27, 29 మార్చి 2008 (UTC)Reply

కృతజ్ఞతలు

నా స్వీయ నిర్వాహక హోదాకు మద్దతు తెలిపినందుకు ధన్యుడను - రవిచంద్ర(చర్చ) 04:39, 30 మార్చి 2008 (UTC)Reply

మెదటి పేజి

ఈ పేజి చూసి, మీ అభిప్రాయం తెలుపగలరు. సాయీ(చర్చ) 07:56, 30 మార్చి 2008 (UTC)Reply

నోబెల్ బహుమతి

మూస:నోబెల్ బహుమతి విజేతలైన భారతీయులు బదులు నోబెల్ బహుమతి గెలుచుకొన్న భారతీయులు అంటే బాగుంటుంది కాదా. సాయీ(చర్చ) 10:51, 30 మార్చి 2008 (UTC)Reply

నోబెల్ బహుమతి పొందిన భారతీయులుగా మార్చాను.-- C.Chandra Kanth Rao(చర్చ) 14:08, 30 మార్చి 2008 (UTC)Reply

ఈ వారం సమైక్య కృషి

చంద్రకాంత్ గారూ! ఈ వారం సమైక్య కృషిని నడిపించే మార్గంలో వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి తయారు చేసాను, మూస:ఈ వారము సమైక్య కృషిలో కూడా మార్పులు చేసాను. ఇకనుండి తెలుగు వికీపీడియాలో ఉన్న మొలకలను అరికట్టడానికి కృషి చేద్దాం. ఇది సఫలీకృతం కావాలంటే దీనికి మీ కృషి చాలా అవసరం. δευ దేవా 20:10, 17 ఏప్రిల్ 2008 (UTC)Reply

దేవా గారు! నా వంతు కృషి తప్పకుండా చేస్తాను. మరి కొన్ని వారాల వరకు నేను తెవికీ సెలవులోనే ఉండగలనేమో! పునరాగమనం తరువాత నా వంతు ప్రయత్నం చేయగలను.-- C.Chandra Kanth Rao(చర్చ) 18:43, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply

తెవికీ పాలసీలపై ఒక చర్చ

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:41, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

మీ అభిమానానికి ధన్యవాదాలు

నాకూ మీరంటే చాలా అభిమానం (ఏదో మీరు అన్నారు కదా అని దానికి రెప్లై ఇవ్వడం కాదు, నిజంగా మీరంటే నాకు ఇష్టం). మీరు కూడా నేను సభ్యత్వం తీసుకున్న టైంలోనే సభ్యత్వం తీసుకున్నారు. మీరు చేసిన అన్ని మార్పులను నేను గమనించే వాడిని, మీరు సెలవులో ఉన్నపుడు వేదిక:వర్తమాన ఘటనలు నడుపుదాంలే అనుకునే వాడిని, కానీ అది మీ ఒక్కరికే సాధ్యం అని తరవాత గమనించాను. నేను వచ్చిన 6-7 నెలల్లో చేసిన మార్పులు కేవలం 2000 చిల్లరే. నేను ఉన్నా లేకున్నా ఏమీ నష్టం లేదండి. మీరు, సుజాత గారు, రాజశేఖర్ గారు మరియు ఇతర సీనియర్ సభ్యులు, నిర్వాహకులు, అధికారులు ఎడతెరపి లేకుండా శ్రమిస్తున్నారు. మీ లాంటి వారి ముందు నేనెంత. మీ కృషి వల్ల అది దిన దినం వృద్ది చెందుతూ వస్తుంది. మీ అభిమానానికి ధన్యవాదాలు. δευ దేవా 09:09, 2 మే 2008 (UTC)Reply

స్వాగత సందేశం గురించి

చంద్రకాంత రావు గారూ! మీరు కొత్త సభ్యులకు స్వాగతం పలికేటపుడు {{subst:స్వాగతం|సభ్యుడు:C.Chandra Kanth Rao}} అనే వాడండి. ఎందుకంటే చిన్న స్వాగత సందేశం వలన వారికి కొన్ని లింకులు అందకుండా పోతున్నాయి. గమనించగలరు. రవిచంద్ర(చర్చ) 03:56, 6 మే 2008 (UTC)Reply

"మీకు తెలుసా శీర్షిక"లో బొమ్ గురించి

చంద్రకాంత్!

మొదటి పేజీలో ఉన్న పూర్ణ కుంభం బొమ్మ లైసెన్సు గురించి నాకు ఇలా మెసేజి వచ్చింది.

Wrong license - బొమ్మ:Poorna kumbbam.png is most likely to be made by the Government of Andhra Pradesh and hence is copyrighted. The license is wrong and the image must not be displayed on the main page. 117.193.33.154 11:44, 7 మే 2008 (UTC)Reply
ఈ వ్యాఖ్య సరైనదనే అనుకొంటున్నాను. నేను విశ్వనాధ్‌కు దీన్ని గురించి సూచన చేశాను. ప్రస్తుతానికి మొదటి పేజీ "మీకు తెలుసా"లో ఈ బొమ్మ బదులు వేరే బొమ్మ ఉంచ గలరా? నాకు ఈ శీర్షిక మెయింటెయిన్ చేయడం అలవాటు కాలేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:31, 7 మే 2008 (UTC)Reply
  బొమ్మ మార్చాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:03, 7 మే 2008 (UTC)Reply


ప్రాధమిక హక్కులు వ్యాసం

చంద్రకాంతరావు గారు, నమస్తే, తెలుగు పదాలు తెలిపినందుకూ ధన్యవాదాలు. మీ సూచనకు ధన్యవాదాలు, అలాగే చూస్తాను. మిత్రుడు నిసార్ అహ్మద్ 21:13, 12 మే 2008 (UTC)Reply

Small doubt

చాలా థ్యాంక్స్ అండీ చంద్రకాంత్ రావు గారు. అయితే ఒక చిన్న విషయం... శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రంను మన తెవికీలో పొందుపర్చవచ్చా? కుదురుతుందంటే టైప్ చేయడానికి నేను సిద్ధం . ఏమంటారు?--తమ్ముడు-తాండు 18:39, 23 మే 2008 (UTC)Reply

THAMMUDU-THANDU గారు, ఇక్కడ కేవలం వ్యాసాలు మాత్రమే వ్రాయాలండీ. స్తోత్రాలు, శ్లోకాలు, పద్యాలు వికీసోర్స్‌లో వ్రాయడం మంచిది అదీ కాపీఉల్లంఘన కిందికి రానట్లయితే.

మీ వ్యాసాల నుండి కాపీ

చంద్రకాంతరావు గారూ, నాకు పట్టికలు, మూసలు తయారుచేయడం రాదు, కావున, మీవ్యాసాల నుండి కొన్ని పట్టికలు మూసలు కాపీచేసి వాడాను. నేనింతవరకు వ్యాసాలలో ఉపయోగించిన పట్టికలు, మీవ్యాసాల నుండి 'మాడల్' గా తీసుకున్నవే. అలాగే 'మూస:ఒలంపిక్ క్రీడలు' ఉపయోగించి, 'మూస:ఆసియా క్రీడలు' గా మార్చాను. అలాగే 'జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు' మూసను కూడా కాపీ చేసుకుంటున్నాను, అన్యదా భావించకండి ప్లీజ్, మిత్రుడు నిసార్ అహ్మద్ 20:36, 28 మే 2008 (UTC)Reply

నిసార్ గారు, ఇందులో అన్యధా భావించడానికేమీ లేదు పైగా నాకు సంతోషమే. మనం రచిస్తున్న వ్యాసాలు కూడా స్వేచ్చగా ఎవరైనా ఉపయోగించడానికే కదా. మీకు ఇంకనూ ఏదైనా అవసరమైతే అడగండి నా వంతు సహాయపడతాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:41, 28 మే 2008 (UTC)Reply

మండవల్లి మండలంలోని గ్రామాల గూర్చి

మండవల్లి మండలంలోని గ్రామాల పేర్లు మార్పు చేద్దామనుకుంటే పొరపాటున అవే గ్రామాల పేర్లతో కొత్త పేజీలు వచ్చి చేరాయి. కాని నేను మార్పు చేసిన గ్రామాల పేజీలు ఉంచి పాతవి తొలగించవచ్చు. ఎందుకంటే వాటికి కొత్త వాటికి పేర్లు మాత్రమే తేడా ఉంటాయి. వ్యాసాల కోసం నేను సమాచారం సేకరించాల్సి ఉంది.--తమ్ముడు-తాండు 17:19, 3 జూన్ 2008 (UTC)Reply

పాత గ్రామవ్యాసాలకు చరితం బాగానే ఉంది కాబట్టి పాతవి తొలిగించడానికి వీలుండదు. కొత్త పేజీలనే తొలిగించి పాతపేజీలకు సరైన పేర్లు ఇవ్వవలసి ఉంటుంది.-- C.Chandra Kanth Rao(చర్చ) 17:23, 3 జూన్ 2008 (UTC)Reply
సరే అలాగే చేయండి. అలా చేయడం నాకు కుదరడం లేదు.--తమ్ముడు-తాండు| తమ్ముడు-తాండు(చర్చ)


రంగుల సంతకంలో నాకు కావాల్సిన రంగులు

చాలా చాలా కృతజ్ఞతలండి. మీరు ఇచ్చిన సూచనలు పాటిస్తాను. అయితే నేను కోరుకొనే రంగులు ఏమిటంటే "తమ్ముడు-తాండు" పదం చిలకాకు పచ్చ (లైట్ గ్రీన్) రంగులో ఉండి, దాని వెనుక బ్యాక్ గ్రౌండ్ లో కాషాయం (ఆరెంజ్) రంగు ఉండాలి. అలాగే "చర్చ" పదం కాషాయం రంగులో ఉండి, దాని వెనుక బ్యాక్ గ్రౌండ్ లో ఇప్పుడు ఉంచిన చిలకాకు పచ్చ రంగునే ఉంచగలరు. మీకు మళ్ళీ మళ్ళీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.-- తమ్ముడు-తాండు(చర్చ) 06:10, 9 జూన్ 2008 (UTC)Reply


రంగుల సంతకం గురించి

చంద్రకాంత్ రావు గారు ! నా సంతకం రంగుల్లో మార్చింనందుకు చాలా చాలా కృతజ్ఞతలు.-- తమ్ముడు-తాండు(చర్చ) 16:39, 10 జూన్ 2008 (UTC)Reply

కేలండర్ నిర్వహణ

చంద్రకాంత్! కేలండర్ నిర్వహణలో మీరు పడుతున్న శ్రమకు నా అభినందనలు. ఇది నాకు చాలా క్లిష్టమైన విషయంగా అనిపిస్తున్నది. మీ కృషివల్ల తెవికీలో ఈ భాగం చాలా అభివృద్ధి చెందింది. 1950లో "సినిమాలు" అనే మరొక విభాగం చేర్చాను. ఇది ఓకే అయితే మిగిలినవాటికి కూడా చేర్చవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:42, 20 జూన్ 2008 (UTC)Reply

ధన్యవాదాలు

మీ అభిమానానికి ధన్యవాదాలు చంద్రకాంత్ గారు. δευ దేవా 16:07, 20 జూన్ 2008 (UTC)Reply

ఎన్నికల ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు పి.డి.ఎఫ్. ఫార్మాట్ లో ఎన్నికల సంఘం వెబ్ సైటులో ఉన్నాయి. నేను సాలూరు శాసనసభా నియోజకవర్గం లో లింకులిచ్చాను. ఇవి అందరికీ అందుబాటులో ఉంటే మన ఎన్నికల విషయంలో చేసే పని తొందరగా పూర్తి అవుతుందిRajasekhar1961 06:00, 28 జూన్ 2008 (UTC)Reply

శాసనసభ నియోజకవర్గాల మూసలు

చంద్రకాంత్ గారూ! ఉపయుక్తంగా ఉంటాయని, ప్రతీ మూసలో అన్ని జిల్లాల మూసలను అమర్చాను. ఒకసారి చూడండి. మీకు నచ్చితే మున్ముందు చేసే మూసల్లో కూడా ఆ లిస్ట్‌ను కాపీ చేసి అంటించవచ్చు. మరియు అందులోని ఎర్రలింకుల ద్వారా కొత్త మూసలు సులువుగా యూనిఫార్మిటీతో తయారుచేయవచ్చు. δευ దేవా 22:37, 1 జూలై 2008 (UTC)Reply

నియోజకవర్గాలు

చంద్రకాంత్ గారూ నమస్తే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు పేజీలు కొంచెం చూడండి. ఈ వ్యాసాలు సరైన దిశలో పోతున్నాయా లేదా కొంచెం చెప్పగలరు. లోక్‌సభ నియోజకవర్గాలలో కొంచెం అనుమానం కలిగింది. రామగుండం, భోంగిర్ (ఇది 'భువనగిరి'నా?) మరియు అరుకు గురించి. ఇవి విలీనాల తరువాత ప్రకటింపబడినవా? లేదా వేరే కారణాలపై కొంచెం నిఘా పెట్టి సూచించగలరు. మిత్రుడు నిసార్ అహ్మద్ 19:05, 7 జూలై 2008 (UTC)Reply

నిస్సార్ గారు, నియోజకవర్గాల వ్యాసాల గురించి మనం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్నచిన్న తప్పులున్నా సరిదిద్దుకోవచ్చు. లోకసభ నియోజకవర్గాల వ్యాసాలలో ఇచ్చిన శాసనసభ నియోజకవర్గాల పేర్లకు ప్రస్తుతం శాసనసభ నియోజకవర్గాల వ్యాసాల కోసం సృష్టిస్తున్న పేర్లకు కొద్ది తేడా ఉన్నమాట వాస్తవమే. లోకసభ నియోజకవర్గాల వ్యాసాలను సృష్టించేటప్పుడు నేను వార్తాపత్రికలో వచ్చిన సమాచారం ఆధారంగా పేర్లు ఇచ్చాను. ఆ తరువాత కొన్ని స్వల్ప మార్పులు, చేర్పులు జరిగాయి దీన్ని సరిదిద్దుకోవడం పెద్ద సమస్య ఏమీ కాదు. అలాగే మనం నియోజకవర్గాలలో చేర్చవలసిన సమాచారం ఇంకనూ చాలా ఉంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:38, 7 జూలై 2008 (UTC)Reply
Return to the user page of "C.Chandra Kanth Rao/పాత చర్చ 2".