Lab125 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:58, 27 జూన్ 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

గూగుల్ లో ఆ పదం టైపు చేసి meaning in Telugu చేర్చి వెతకండి. ఆంధ్రభారతి వెబ్సైట్లో నిఘంటు శోధన ద్వారా వివిధ నిఘంటువులలో వెతకండి. అయినా తెలుగు పదం తెలియకపోతే ఆ పదాన్ని అలా తెలుగు లిప్యంతరీకరణ చేసి వ్రాయండి. తరువాత ఇతరులు మెరుగైన పదంతో మారుస్తారు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

పెద్దాపురం బొమ్మలు మార్చు

ఘాలిబ్ మొహమ్మద్ గారూ! నమస్కారం. (ఆంగ్ల వికీలో మీ సభ్యుని పేజీ ద్వారా మీ పేరు కనుక్కొన్నాను!). మీరు చక్కటి రచనలు చేస్తున్నందుకు అభినందనలు. ఏవయినా సందేహాలుంటే తప్పక నా చర్చా పేజీలో వ్రాయగలరు. పెద్దాపురం ఆంగ్లవ్యాసంలో మీరు చక్కని బొమ్మలు జత చేశారు. అయితే వాటికి లైసెన్సు ట్యాగులు జత చేయలేదు. అవి మీరు తీసిన బొమ్మలేనా? లేకపోతే తీసినవారు అనుమతి ఇచ్చారా? ఈ సంగతి తెలియజేస్తే సరైన లైసెన్సు ట్యాగు పెట్టి, తరువాత అవే బొమ్మలను తెలుగు వికీ వ్యాసంలో కూడా ఉంచవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:58, 27 జూన్ 2008 (UTC)Reply

శ్రీ కాసుబాబు గారికి శుభోదయం. పెద్దాపురం ఆంగ్ల వ్యాసములోని చిత్రాలు http://eastgodavari.nic.in/Peddapuram.html వెబ్ సైటు నుంచి గ్రహించబడినవి.ఈ చిత్రాల కాపీ రైట్ వివరాలు తెలియవు.మీరు దయచేసి వాటికి తగిన సవరణలు చేయగలరు- Lab125 07:03, 28 జూన్ 2008 (UTC)Reply
మొహమ్మద్ గారూ! అ సైటులోని చిత్రాలు ఉచిత కాపీరైటుకు లోబడి లేవనిపిస్తున్నది (స్పష్టంగా రాయలేదు). మనం తొందరపడి వాటిని అప్‌లోడ్ చేసినా తరువాత తొలగించివేయవలసి ఉంటుంది. నా మనవి ఏమంటే మీలాంటివారు ఎవరైనా సమయం చిక్కినప్పుడు ఫొటోలు స్వయంగా తీసి అప్‌లోడ్ చేస్తే క్వాలిటీ కూడా బాగుంటుంది. కాపీ హక్కుల సమస్యలు ఉండవు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:38, 28 జూన్ 2008 (UTC)Reply

రౌతులపూడి గ్రామాలు మార్చు

గాలిబ్ మొహమ్మద్ గారూ! రౌతులపూడి, శంఖవరం, కోటనందూరు మండలాల్లోని గ్రామాల పేజీలు మీరు వ్రాసిన విషయం ఆధారంగా పునర్విభజంచాను. మూసలు కూడా మార్చాను. ఒకమారు మీరు పరిశీలించి, ఏవైనా సవరణలు అవుసరమైతే చేయమని కోరుతున్నాను. అలాగే ఈ గ్రామాల గురించి మీకు తెలిసిన సమాచారం వ్రాస్తే బాగుంటుంది. ఉదాహరణకు పెదవేగి, పోడూరు వంటి వ్యాసాలు చూడగలరు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:45, 3 జూలై 2008 (UTC)Reply