స్వాగతం

మార్చు
Nareshkv77 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!  

Nareshkv77 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Nrgullapalli (చర్చ) 12:41, 14 జూన్ 2023 (UTC)Reply

మీ తరలింపులు

మార్చు

పేజీ పేరు ఎలా మార్చాలి, వేరే పేరుకు ఎలా తరలించాలి అనే విషయమై మీరు ప్రయోగాలు చేస్తున్నట్లు ఉన్నారు. ప్రయోగాలు చెయ్యడం మంచిదే గానీ, అది ప్రధానబరి లోని పేజీల్లో చెయ్యకూడదు. మీ ప్రయోగశాల పేజీలో ఆ ప్రయోగాలు చెయ్యవచ్చు. ఆ పేజీ వాడుకరి:Nareshkv77/ప్రయోగశాల వద్ద ఉంటుంది. ఆ పేరులో "వాడుకరి:" ని పేరుబరి అంటారు. వాడుకరుల పేజీలు ఈ పేరుబరిలో ఉంటాయి. వికీపీడియాలో పేజీలన్నీ ఏదో ఒక పేరుబరిలో ఉంటాయి - "మూస:" "వర్గం:" "వాడుకరి:" ఇలా ఉంటాయి వివిధ పేరుబరులు. ప్రతీ పేరుబరికీ సంబంధిత "చర్చ" పేరుబరి ఉంటుంది - "మూస చర్చ:" "వర్గం చర్చ:" "వాడుకరి చర్చ:" - ఇలాగ. కోలన్ తరువాత పేజీ పేరు ఉంటుంది.

విజ్ఞానసర్వస్వ పేజీలకు మాత్రం కోలన్ ఉండదు. ఉదాహరణకు వెల్లలచెరువు రజినీకాంత్ పేజీకి ముందు కోలన్ లేదు చూడండి. ఆ పేజీ ఉన్న పేరుబరిని ప్రధానబరి అని ప్రధాన పేరుబరి అనీ అంటారు. ఈ పేజీల్లోనే విజ్ఞాన సర్వస్వ విషయాలుండేది. ఇవే పాఠకులు చూసేది కూడా. ఈ పేజీలలో మనం ప్రయోగాలు చెయ్యరాదు. ప్రయోగాలన్నీ వాడుకరి:Nareshkv77/ప్రయోగశాల లోనే చెయ్యాలి. ఆ పేజీలో మీ ఇష్టం వచ్చిన ప్రయోగాలు చెయ్యవచ్చు. వాడుకరి:Nareshkv77/ప్రయోగశాల-1, వాడుకరి:Nareshkv77/ప్రయోగశాల-2, వాడుకరి:Nareshkv77/ప్రయోగశాల-3 ఇలా ఎన్ని ప్రయోగపేజీలనైనా సృష్టించుకోవచ్చు. ప్రధాన బరి లోని పేజీల్లో ఇలాంటి ప్రయోగాలు చేస్తే దుశ్చర్య చేస్తున్నారని ఇతరులు భావించే ప్రమాదం ఉంది, గమనించగలరు.

పేరుబరి గురించి మరింత తెలుసుకోవాలంటే వికీపీడియా:పేరుబరి చూడండి.

ఒకవేళ "వెల్లలచెరువు రజినీకాంత్" అనే పేరు సరైనది కాదు అని మీరు భావిస్తే, దాని చర్చ పేజీలో మీ అభిప్రాయం రాయండి. అది సరైన పేరు కాదనే నేనూ భావిస్తున్నాను. ఆ సంగతి దాని చర్చ పేజీలో రాయబోతున్నాను. మీరూ ఆ చర్చలో మీ అభిప్రాయం రాయండి. __ చదువరి (చర్చరచనలు) 14:14, 6 అక్టోబరు 2023 (UTC)Reply