వాడుకరి చర్చ:Sai2020/క్రితం చర్చ 3

తాజా వ్యాఖ్య: Re: టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Dev

ఏమని పేరు పెట్టాలో తెలియని సందేశం

మార్చు

సాయి గారూ! నేను చేసినది తప్పే. దానికి మీరు కొన్ని సంవత్సరాలు తెవికీవైపు చూడనని చెప్పడం భాధ కలిగించింది. మీరు మళ్ళీ తిరిగి మార్పులు చేపట్టాలని మనసారా కోరుకుంటున్నాను. వేరే సభ్యుని పేరుతో వోటింగ్ చేయడం తప్పన్న సంగతి నాకు ముమ్మాటికీ తెలియదు.ఎందుకంటే తెవికీలో ఆ నియమాలు లేవు. ఆంగ్ల వికీలో అంత పరిశోధన చేయలేదు.పాజిటివ్ గా తీసుకుంటారనుకున్నాను. ఇంత విషమిస్తుందనుకోలేదు. భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితికి కారణం కానని నీకు మాట ఇస్తున్నాను. మీరు మాత్రం దయ చేసి మార్పులు మొదలు పెట్ట్డండి. రవిచంద్ర(చర్చ) 09:05, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

నేను కూడా మీరు నిర్వాహకుడిగా కొనసాగాలనే కోరుకుంటున్నాను. కానీ రూల్స్ రూల్సే కదా. కాబట్టి అలా చెప్పాను. ఆంగ్ల వికీ నియమాలు ఏలాగూ తెవికీలో వాడకూడంటున్నారు. ఇక ఈ విషయం ఇంతటితో వదిలేస్తే బావుంటుంది. చర్చసాయీరచనలు 14:40, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply
"రూల్స్", "నియమాల" కంటే ముందుగా వికీసమాజం(కమ్యూనిటీ) ముఖ్యమని నా అభిప్రాయం. అందుకు ఉదాహరణగా ఆంగ్ల వికీపీడియాలో ఉన్న పాలసీలలో ఒక పాలసీ... __మాకినేని ప్రదీపు (+/-మా) 15:07, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

ఆశీర్వచనము

మార్చు

సాయీ, తెవికీలో మీరు చేసిన కృషి అభినందనీయం. నిర్వాహకహోదా ఓటింగు ఇతర సభ్యుల వ్యాఖ్యలను నిర్మాణాత్మకముగా తీసుకోని భవిష్యత్తులో మంచి నిర్వాహకుడివై తెవికీని ముందుకు నడిపించగలవని ఆశిస్తాను. వికీపీడియాలో ఐదు మూలస్థంబాలు తప్ప మరే స్థిర నియమాలు లేవని గుర్తుంచుకోవాలి. :-) --వైజాసత్య 04:54, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

ఓ, ఇంకో విషయం చెప్పటం మరచిపోయాను..శాశ్వత బహిష్కరణ దాకా వెళ్ళిన సభ్యుడు కూడా నిర్వాహకుడైన వైనం మన తెలుగు వికీపీడియాలో ఉండనే ఉంది --వైజాసత్య 04:58, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply
  1. ఇక్కడ ఇంకొక పొరపాటు జరిగింది సాయీ గారూ.నేను లాగిన్ కాకుండా మద్దతు తెలిపాను.ఇలాంటి పొరపాట్లు నేను తరచుగా చేస్తుంటాను.అలాగే నిన్నటివరకు జరిగినవన్నీ మరచిపోదాం మరలా అందరం కలసి పని చేద్దాం ఏమంటారు ఆసక్తితో పనిచేసే మీలాటి వారి కృషితో తేవీకీ వర్ద్ధిల్లాలని నాఆకాంక్ష.

--t.sujatha 08:05, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

తెవికీ పాలసీలపై ఒక చర్చ

మార్చు

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:33, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

ఎందుకని?

మార్చు

నేను మీకు నా మనసులో ఉన్నది చెప్పేస్తున్నాను. మీకు నేను చేసే మార్పులు గానీ చర్చలు గానీ తప్పనిపిస్తే నాకు వెంటెనే ఎందుకు చెప్పలేదు? నేను వచ్చి 3 నెలలు అయ్యింది. ఒక్కరు కూడా నేను చేసినది తప్పు అని ఒక్క సారి కూడా చెప్పలేదు. ఎందుకని? చర్చసాయీరచనలు 15:01, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply


నువ్వడిగావు గనుక ఈ జవాబు తప్పక ఇస్తున్నాను.

  • నువ్వు "తప్పేమిటి?" అని అడగడంలేదు. "ఎందుకు చెప్పలేదు?" అని అడుగుతున్నావు. మూడు నెలలూ ఇతరుల తప్పుల గురించి ఆలోచిస్తే నాకు వికీలో వేరేవి వ్రాయడం కుదరదు.
  • తెలుగు వికీలో తప్పులు కోకొల్లలుగా ఉన్నాయి. తెలుగు వికీ బాల్యదశలో ఉంది. తప్పటడుగులు లేకుండా ఎవరూ నడక నేర్చుకోలేరు. పసి పిల్లవాడిని "మార్చ్‌పాస్ట్" సరిగ్గా చేయలేదని దండించదగునా? తప్పులెన్నడం చాలా తేలిక. అధికంగా వాటిని పట్టించుకోము. కాని ఒక నిర్ణయానికి అవుసరమైనపుడు అవి పరిగణలోకి వస్తాయి.
  • నాకు వ్యాసాలు వ్రాయడం అంటే ఇష్టం. నిర్వాహక బాధ్యతలు నిర్వహించడంపై అంత ఉత్సాహం లేదు. కనుక సభ్యులకు సహాయం, ప్రోత్సాహం గురించి మాత్రమే అధికంగా ప్రయత్నిస్తాను.
  • అయినా నువ్వు అడిగావు గనుక వీలయినన్ని (నిజంగా తప్పులు కాదు - నాకు అలా అనిపించినవి) ఎత్తి చూపుతాను. ఇది నీకు ఉపయోగపడుతుందని. "రోజుకో తప్పు" (ఈరోజు చిట్కా లాగా) పరవాలేదా?

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:40, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

మీరు చేస్తున్నది "తప్పు" అని నాకు అనిపించలేదు. తెలిసి చేస్తేనే కదా తప్పు. 3 నెలలు అన్నీ తెలుసుకోగలిగేటంత ఎక్కువ కాలం కాదు అని నా ఉద్దేశం. నువ్వు కేవలం నిర్వహణ మాత్రమే చేయాలని అనుకుంటున్నావు, ఇతర సభ్యులకు నియమాలను తెలుపటం అనే పాటాన్ని ఇప్పటి వరకూ నేర్చుకున్నావు. రెండవ పాఠం వాటిని వారంతట వారే పాటించేటట్లు చేయాగలగాలి. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:13, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

పాలసీ

మార్చు

సాయిగారు, మీకు వ్యతిరేకత తెలిపినందుకు నన్ను పాలసీ చూడమన్నారు. ఎలాంటి పాలసీ పాటించాలి? బొమ్మ:PSLV-CA 1.jpg అప్లోడ్ చేసిన తర్వాత don't put stupid license tags. అన్నారు మీరు. దానికి ప్రత్యుత్తరముగా 'ధన్యవాదాలు, ఇప్పుడేమి చేయాలి నేను ' అన్నాను. దానికి సభ్యులపై చర్చ:Svrangarao/పాత చర్చ 1లో మీ జవాబు: ఆ బొమ్మ ఎవరో క్రొత్తా సభ్యులు అప్లోడ్ చేశారనుకున్నాను.. . నేను ఫెయిర్ యూస్ ట్యాగ్ తగిలించాను. ఆ బొమ్మ నేనే అప్లోడ్ చేసానని మీకు ముందే తెలుసు. ఆ పోస్ట్ పైన మీ పోస్టులు చూస్తే అర్థమవుతుంది. అంటే మీ పాలసీ ప్రకారం:

1) 'ఎవరో తెలిసి కూడా మరుసటిరోజు నాకు తెలియదు ' అని చెప్పాలి 2) మనస్పూర్తిగా చెప్తున్నాను వినండి. మీరు తెలిసి మరీ 'don't put stupid license tags. ' అన్నపుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అదేమాట మరొకరు అని ఉంటే ఇంకో జవాబు ఇచ్చేవాడినేమో కానీ మీ ప్రవర్తన నాకు అప్పటికే కాస్త తెలుసు కనుక నా సమయాన్ని వృధా చేసుకోలేదు అపుడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే: 'క్రొత్తవారు అనుకున్నాను ' అన్నారు. అంటే మీ పాలసీ ప్రకారం క్రొత్తవారిని studpid tags అనవచ్చా? పాతవారయితే అనకూడదా? కొత్తవారు తెలియక చేసినదానికి మీరు స్పందించిన విధంగా స్పందించాలా? --Svrangarao 03:01, 30 ఏప్రిల్ 2008 (UTC)Reply

Re:

మార్చు

Its desysopying. You can ask the local administrators to remove your account. δευ దేవా 16:22, 1 మే 2008 (UTC)Reply

Leave your account as such. Otherwise someone else may misuse it. Don't ask for removal. δευ దేవా 16:23, 1 మే 2008 (UTC)Reply

Don't say that they may remove your account without your concern. δευ దేవా 16:29, 1 మే 2008 (UTC)Reply

Return to the user page of "Sai2020/క్రితం చర్చ 3".