Sarathbiochem గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

కాసుబాబు 05:48, 26 ఫిబ్రవరి 2007 (UTC)Reply

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు


సూచనలు

మార్చు

శరత్! తెలుగు వికీలో విజ్ఞాన శాస్త్రానికి చెందిన రచనల లోటు స్పష్టంగా ఉన్నది. మీవంటివారి కృషి వల్ల ఈ విషయంలో మనం ప్రగతి సాధించవచ్చును. చక్కని తెలుగులో భౌతిక శాస్త్రానికి సంబంధించిన రచనలు మొదలు పెట్టినందుకు అభినందనలు. అయితే కొన్ని సూచనలు:

  • వ్యాసాలు మరీ నిర్వచనాలతో సరిపెట్టకుండా ఒక పేజీ అన్నా నిడివి ఉండేలాగా పొడిగించమని కోరుతున్నాను. ఆ విషయాలపై ఆంగ్ల వికీలో ఉన్న వ్యాసాలను మీరు ఒకసారి పరిశిలిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
  • మీరు మొదలు పెట్టిన వ్యాసాలలో ఇతరులు చేస్తున్న మార్పులను కూడా గమనిస్తూ ఉండండి.
  • తెలుగు సాంకేతిక పదాలకు ప్రక్కన బ్రాకెట్లలో ఆంగ్లపదాలు వ్రాస్తే మంచిదని నా అభిప్రాయం.

ఏమైనా సందేహాలుంటే నా చర్చాపేజీలో తప్పక వ్రాయండి. --కాసుబాబు 18:54, 21 మే 2007 (UTC)Reply

అభినందనలు

మార్చు

శరత్ గారు, మీరు చక్కటి విషయపరిజ్ఞానంతోనూ మంచి భాషతోనూ, మీ వికీయాత్రను మొదలు పెట్టారు, అభినందనలు. మీకృషిని ఇలాగే కొనసాగించండి. నిసార్ అహ్మద్ 12:26, 18 మే 2008 (UTC)Reply