Satyakrishna గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. కాసుబాబు 05:32, 14 జనవరి 2007 (UTC)Reply


అబ్బిరాజుపాలెం గురించి మార్చు

సత్యకృష్ణ గారూ, నమస్కారం. అబ్బిరాజుపాలెం గురించి మీరు వ్రాయడం మొదలు పెట్టినందుకు సంతోషం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిగ్రామం గురించి ఒక్కో పేజీ వ్రాయాలనేది వికీ లక్ష్యం. అయితే కొన్ని విషయాలు గమనించగోరుతున్నాను.

  • ముందుగా ఏ జిల్లా, ఏ మండలము అన్నవి వ్రాయండి. ఇప్పటికే ఆ వూరిపేరుమీద ఒక పేజీ కొద్ది సమాచారంతో ఉండి ఉండవచ్చును. అప్పుడు దానినే విస్తరించండి. క్రొత్తపేజీ మొదలుపెట్టకుండా
  • అలాగే వాయుపురాణం తెలుగు ప్రతి కావాలని మీరు వ్రాసినది ఆ వ్యాసం చర్చాపేజీలో వ్రాయండి. ప్రధాన వ్యాసంలో వాయుపురాణం గురించి మాత్రమే వ్రాయాలి.

ఇటువంటి సమస్యలు క్రొత్త సభ్యులకు సహజం. మీరు ఉత్సాహంగా తెలుగు వికీలో మరిన్ని వ్యాసాలు వ్రాయగోరుతున్నాను, లేదా ఉన్నవాటిని దిద్దవచ్చును. చొరవగా ముందుకు రండి. ఏవైనా సందేహాలుంటే తప్పకుండా నా చర్చాపేజీలో వ్రాయండి. జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తాను. కాసుబాబు 05:44, 14 జనవరి 2007 (UTC)Reply