వావిలాల వాసుదేవశాస్త్రి
వావిలాల వాసుదేవశాస్త్రి (1851 - 1897) తెలుగు భాషలో మొదటి సాంఘిక నాటక రచయిత. వీరు రచించిన నాటకం నందకరాజ్యం.[1]
వావిలాల వాసుదేవశాస్త్రి | |
---|---|
జననం | 1851 |
మరణం | 1897 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత |
తల్లిదండ్రులు |
|
జననం
మార్చువాసుదేవశాస్త్రి 1851లో అప్పయ్యశాస్త్రి, మహాలక్ష్మమ్మ దంపతులకు తెనాలి తాలూకాలోని కారుమూరు గ్రామంలో జన్మించారు. వీరు తెలగాణ్య శాఖీయ బ్రాహ్మణులు, ఆపస్తంబసూత్రులు, హరితసగోత్రులు.వీరు రాజమండ్రి కళాశాలలో ఇంగ్లీషు ఉపన్యాసకునిగా పనిచేశారు.
రంగస్థల ప్రస్థానం
మార్చువీరి నందక రాజ్యం నాటకాన్ని తేటగీతి పద్యాల్లో వ్రాసారు. ఇది పూర్తిగా స్వతంత్ర నాటకం. దీనిని 1880లో ముద్రించారు. సంఘంలోని స్వార్థచింతన, రాజోద్యోగులలో అవినీతి, నియోగుల వైదికుల మధ్య అంతఃకలహాలు, అధికారుల దౌర్జన్యాలు ఈ నాటకంలో చిత్రీకరించారు. వీరు షేక్స్ పియర్ రచించిన జూలియస్ సీజర్ నాటకాన్ని తెలుగులోకి అనువదించారు. ఇది ఇంగ్లీషు భాష నుండి తెలుగులోకి వచ్చిన మొదటి నాటకం. వీరు తనవద్ద నున్న రెండు వందల గ్రంథాలను రాజమండ్రిలోని గౌతమీ గ్రంథాలయం కోసం దానమిచ్చారు.
రచనలు
మార్చు- ఆరోగ్యసర్వస్వము
- గరుడాచలము
- నందకరాజ్యం
- మృచ్ఛకటికము
- ఉత్తరరామచరితము
- మాతృస్వరూపస్మృతి
- ఆంధ్ర రఘువంశము
- జూలియస్ సీజరు
- ముకుక్షు తారకము మున్నగునవి.
మరణం
మార్చువాసుదేవశాస్త్రి 1897లో మరణించారు.
మూలాలు
మార్చు- ↑ తెలుగు వెలుగు, వ్యాసాలు. "నాటకానికి అడుగుజాడ కందుకూరి". www.teluguvelugu.in. డా. కందిమళ్ళ సాంబశివరావు. Archived from the original on 23 ఏప్రిల్ 2020. Retrieved 23 April 2020.
- వావిలాల వాసుదేవశాస్త్రి, ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950, పేజీలు: 115-120.