వాసిలి వసంతకుమార్
డా. వాసిలి వసంతకుమార్ (జననం 1956 జులై 10) భారతీయ రచయత, పాత్రికేయుడు, అనువాదకుడు. ఐదు దశాబ్దాలుగా యోగా సాధకుడు కూడా. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తొలి స్నాతకోత్తర విద్యార్థి అయిన ఆయనను అక్టోబరు 2022లో అక్షరయోగి పురస్కారంతో తెలుగు శాఖ సత్కరించింది.[1]
వాసిలి వసంతకుమార్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | విశ్వర్షి వాసిలి వసంతకుమార్ |
విద్యాసంస్థ | మద్రాసు విశ్వవిద్యాలయం (ఎం.ఏ. తెలుగు) ఉస్మానియా విశ్వవిద్యాలయం (పిహెచ్.డి.) |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగులో తొలి యోగిక కావ్యంగా విమర్శకుల మన్ననలు పొందిన "నేను" |
తల్లిదండ్రులు |
|
బంధువులు | శ్యాంసుందర్ (సోదరుడు), రమణ (సోదరుడు), పద్మప్రియ (సోదరి) |
2024 నవంబరు 27, 28 తేదీల్లో నన్నయ విశ్వవిద్యాలయం, మద్రాస్ విశ్వవిద్యాలయం, పెనుగొండలోని ఎస్పీకేపీ అండ్ డా.కె.ఎస్.రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సంయుక్తంగా నిర్వహించనున్న అంతర్జాతీయ తెలుగు సదస్సు ‘విశ్వర్షి వాసిలి వాజ్ఞయ వరివస్య’ అనే అంశంపై జరగనుంది.[2]
ప్రారంభ జీవితం
మార్చువాసిలి వసంతకుమార్ ప్రముఖ పాత్రికేయుడు, శతాధిక గ్రంథకర్త, ఆధ్యాత్మిక యోగి శార్వరి కుమారుడు. 1956 జులై 10న హైదరాబాదులో జన్మించిన ఆయన మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మొదటి విద్యార్థిగా తెలుగులో ఎం.ఏ. పట్టా, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అందుకున్నాడు.
పత్రికలు - సాహిత్యం
మార్చుతన ఇరవైవ ఏట పాత్రికేయ రంగంలో కాలమిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి యాభైకి పైగా పుస్తకాల రచన చేసాడు. వందకుపైగా గ్రంథాలపై ఆయన సమీక్షలు చేసాడు. అవలితీరం వంటి పత్రికలకు సంపాదకునిగా కూడా వ్యవహరించిన ఆయన చిన్నప్పటి నుండి యోగ సాధకుడు. ఆయన రచించిన 'తెలుగు నవల : అస్తిత్వ సంఘర్షణ', 'తెలుగు పరిశోధన' వంటివి తెలుగు సాహిత్య పరిశోధక విద్యార్థులకు ప్రామాణికంగా మారాయి.
రచనలు
మార్చు(పాక్షిక జాబితా)
- నేను
- 77 సాధనారహస్యాలు
- 56 ఆత్మదర్శనాలు
- కొత్తకోణంలో గీతారహస్యాలు
- ప్రజ్ఞానరహస్యాలు
- అతీంద్రియరహస్యాలు
- విన్నర్ : గెలవాలి గెలిపించాలి
- సిగ్గుపడితే సక్సెస్ రాదు
- టైం ఫర్ సక్సెస్
- ఒత్తిడి ఇక లేనట్లే
- లైఫ్ ఈజ్ ఎమోషనల్ : అయినా గెలవాల్సిందే
- పెళ్లి : ఒక బ్రతుకు పుస్తకం
- మనసును గెలవాలి
- మనకే తెలియని మన రహస్యాలు
మూలాలు
మార్చు- ↑ "వాసిలిని వరించిన అక్షరయోగి పురస్కారం". EENADU. Retrieved 2024-11-13.
- ↑ "పెనుగొండలో అంతర్జాతీయ తెలుగు సదస్సు | - | Sakshi". web.archive.org. 2024-11-13. Retrieved 2024-11-13.