వింత ఇల్లు సంత గోల

వింతఇల్లు సంతగోల 1976, మార్చి 5, శుక్రవారం విడుదలైన హాస్య చలనచిత్రం. కరుణ చిత్ర బ్యానర్‌పై కె.కమలాకరరావు, ఆనంద్‌లు నిర్మించిన ఈ సినిమాకి పి. లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించాడు.

వింత ఇల్లు సొంతగోల
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం లక్ష్మీదీపక్
తారాగణం శరత్ బాబు,
ప్రభ,
చంద్రమోహన్,
గిరిబాబు,
రాజబాబు ,
రమాప్రభ
నిర్మాణ సంస్థ కరుణచిత్ర
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: పి. లక్ష్మీదీపక్
  • మాటలు: అప్పలాచార్య
  • ఛాయాగ్రహణం: దేవరాజ్
  • కళ: తోట
  • కూర్పు: వెంకటరత్నం
  • సంగీతం: శంకర్
  • నిర్మాతలు: కె.కమలాకరరావు, ఆనంద్

సినిమాకథ

మార్చు

లక్షాధికారి మధుసూదనరావు ఏకైక కుమారుడు రవి. అతని స్నేహితులు రాజా, మోహన్, బేబీ అని పిలువబడే బాబూరావు నలుగురూ బ్రహ్మచారులు. అందరూ రవి ఇంట్లోనే ఉంటారు. అందరూ శెలవుల్లో ఊటీ వెళ్లే ప్రయత్నంలో ఉండగా అపాయంలో చిక్కుకున్నానంటూ వచ్చిన జానకి అనే యువతికి ఆశ్రయమిస్తారు. జానకి బావ ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేసిన ఫలితంగా కలిగిన బిడ్డను బేబీ బిడ్డగా లేఖ వ్రాసి ఎవరో ఇంటి ముందు వదిలి వెళతారు. నాకేం తెలియదని బేబీ మొత్తుకున్నా బిడ్డను పెంచుకోక తప్పింది కాదు. ఇంతలో మరో యువతి "నాథా! నేను నీ రాణిని మరిచిపోతిరా" అంటూ తల్లితో సహా వచ్చి ఆ ఇంట్లో తిష్టవేసింది. ఆమెకు మతి పోలేదని, ప్రమాద వశాత్తు ప్రస్తుత స్మృతి పోయి పూర్వజన్మ స్మృతి వచ్చిందని, ఆమెను బాగు చేయించమని తల్లి బతిమాలగా "మనశ్శాంతి" అనే గొప్ప మానసిక వైద్యుడిని పిలిపించి వైద్యం చేయించడానికి ప్రయత్నిస్తారు. ఆ డాక్టరు సెక్రెటరీ జయ ప్రేమలో మోహన్ పడిపోతాడు. డాక్టర్ మనశ్శాంతి మూలంగా ఆయింట్లో కొన్ని సమస్యలు, అశాంతి ఏర్పడుతుంది. మొదట ఆ నలుగురు స్నేహితులు జానకి ప్రేమ పొందడానికి ప్రయత్నిస్తే రాజా విజయం సాధిస్తాడు. ఇంతవరకూ నలుగురు స్నేహితులమధ్య ఆకతాయిగా హాస్యంగా సాగిన కథ ఒంటరిదైన జానకిని పెళ్ళి చేసుకుని ఆమె ఆస్తిని కాజేయాలనుకున్న జానకి బావ (ఇతని పేరు కూడా బాబూరావే), ఆమె చూస్తుండగా హత్య చేసిన ఓ హంతకుడు రంగప్రవేశం చేయడంతో మలుపు తిరుగుతుంది. చివరకు కథ సుఖాంతమవుతుంది[1].


పాటల జాబితా

మార్చు

1.చీకట్లో గుసగుసలు పాతరకం పగలే, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.నీపై మోజు ఉన్నదిరా అదరక బెదరక, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జి.ఆనంద్

3.రాక రాక రాక వచ్చినోడా, రచన: సి నారాయణ రెడ్డి, గానం పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.రై రై రై రై అల్లరి బుల్లోడా నువ్వెవరో, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, బి వసంత

5.సోగసులో కొత్తదనం వలపులో, రచన: మైలవరపు గోపి, గానం.జి.ఆనంద్, పి సుశీల.

మూలాలు

మార్చు
  1. కుమార్ (7 March 1976). "చిత్ర సమీక్ష". విశాలాంధ్ర దినపత్రిక. Retrieved 5 July 2017.[permanent dead link]

. 2. ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .

బయటి లింకులు

మార్చు