వికారాబాద్ మండలం
వికారాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాకు చెందిన ఒక మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది చేవెళ్ళ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 39 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. వికారాబాద్, ఈ మండలానికి కేంద్రం
వికారాబాద్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, వికారాబాద్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°20′N 77°54′E / 17.33°N 77.90°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు జిల్లా |
మండల కేంద్రం | వికారాబాద్ |
గ్రామాలు | 25 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 85,410 |
- పురుషులు | 42,769 |
- స్త్రీలు | 42,641 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 63.60% |
- పురుషులు | 74.59% |
- స్త్రీలు | 52.47% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
మండల గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 85,410 - పురుషులు 42,769 - స్త్రీలు 42,641[3] అక్షరాస్యత - మొత్తం 63.60% - పురుషులు 74.59% - స్త్రీలు 52.47%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 274 చ.కి.మీ. కాగా, జనాభా 89,496. జనాభాలో పురుషులు 44,806 కాగా, స్త్రీల సంఖ్య 44,690. మండలంలో 19,075 గృహాలున్నాయి.[4]
భౌగోళిక సరిహద్దులు
మార్చుఈ మండలానికి వికారాబాద్ మండలం పశ్చిమ వికారాబాదు జిల్లా మధ్యభాగంలో 7 మండలాలను సరిహద్దులుగా కలిగి ఉంది. తూర్పున చేవెళ్ళ మండలం, ఈశాన్యాన నవాబ్‌పేట మండలం, ఆగ్నేయాన పూడూర్ మండలం, దక్షిణాన పరిగి మండలం, పశ్చిమాన ధరూర్ మండలం, వాయువ్యాన బంట్వారం మండలం, ఉత్తరాన మోమిన్‌పేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
మండలంలోని పట్టణాలు
మార్చుమండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుఈ మండలంలో మొత్తం 39 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
- పీలారం
- మదన్‌పల్లి
- ఫూల్మద్ది
- ఎర్రవల్లి
- అత్త్వెల్లి
- కొంపల్లి
- గిర్గెట్‌పల్లి
- నారాయణపూర్
- పెండ్లిమడుగు
- కామారెడ్డిగూడ
- పాతూరు
- పులుసుమామిడి
- సిడ్లూర్ ముంగల్
- సిడ్లూర్ (చెంచెలం)
- సిడ్లూర్ పైగా
- పీరంపల్లి
- బుర్హన్‌పల్లి
- ధన్నారం
- బూర్గుపల్లి
- దాచారం
- ఐనాపూర్
- గొట్టిముక్కల
- మద్గుల్ చిట్టెంపల్లి
- గుడ్పల్లి
- మైలార్‌దేవరంపల్లి
- వికారాబాద్
- జైదుపల్లి
- గోదంగూడ
- సర్పన్‌పల్లి
- అలంపల్లి
- కొత్తగడి
- గంగారం
- రాళ్ళ చిట్టంపల్లి
- ఎన్నెపల్లి
- శివారెడ్డిపేట్
- కొత్రేపల్లి
- అనంతగిరిపల్లి
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు.
గమనిక: వికారాబాద్ పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పరిసర రెవెన్యూ గ్రామాలైన ఎన్నెపల్లి, శివారెడ్డిపేట్, కొత్రెపల్లి, అనంతగిరిపల్లి గ్రామాలు పురపాలకసంఘం పరిధిలో విలీనం చేసారు.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03[permanent dead link]
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.