వికీపీడియా:అక్షరదోష నిర్మూలన దళం
వ్యాసాల్లో అక్షర/గుణింత, వ్యాకరణ దోషాలు ఎక్కువగా ఉండి, నాణ్యతాపరంగా ఉన్నతంగా ఉండడం లేదు. ఉత్సాహం గల సభ్యులు కలిసి, ఒక దళంగా ఏర్పడి, ఈ దోషాలను తొలగించడాన్ని ఒక ఉద్యమం లాగా చేపట్టాలనే సూచన 2007 తెలుగు వికీపీడియా సమీక్షలో వచ్చింది. దానికి అనుగుణంగా ఈ దళం ఏర్పడింది.
దళం విశేషాలు
మార్చు- ఆశయాలు:
- వ్యాసాల్లోని అక్షర దోషాలను నిర్మూలించి, వాటి నాణ్యతను పెంచడం.
- దోషాలను తొలగించడం పట్లే కాకుండా, వాటిని నివారించడం పట్ల సభ్యులకు సూచనలివ్వడం
- రణన్నినాదం: దోషాలు కనిపిస్తే క్షమించకండి, తుదముట్టించండి.
- దళ సభ్యుల పెట్టె: {{అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు}}
దళంలో చేరే విధానం
మార్చుచాలా సులభం. {{అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు}} అనే మూసను మీ సభ్యుని పేజీలో పెట్టుకోండి. దాంతో మీరు ఈ దళంలో చేరినట్లే. అలాగే మీ పేరును దళ సభ్యులు విభాగంలో చేర్చండి.
దళ కార్యక్రమాలు
మార్చు- దోషాలు నిర్మూలించవలసిన వ్యాసాల జాబితా వర్గం:అచ్చుతప్పులు దిద్దవలసిన వ్యాసాలు వర్గంలో ఉంటుంది. ఇదే ఈ దళానికి కార్యక్షేత్రం.
- ప్రధాన (మొదటి) నేమ్ స్పేసు లోని వ్యాసాలను గమనిస్తూ ఉండాలి. రోజుకు మూడు లేదా నాలుగు వ్యాసాలను లక్ష్యంగా పెట్టుకుని పనిచెయ్యాలి.
- తక్షణ చర్య: ఈ వారపు వ్యాసాల్లో దోషాల నిర్మూలన.
- వ్యాసాల్లో అక్షర/గుణింత, వ్యాకరణ దోషాలను గమనించినపుడు, వెంటనే సరిదిద్దాలి.
- వ్యాసాన్ని పూర్తిగా సరిదిద్దలేని పక్షంలో ఆ పేజీలో అన్నిటికంటే పైన {{అచ్చుతప్పులు}} అనే మూసను ఉంచాలి. దాంతో సదరు పేజీ వర్గం:అచ్చుతప్పులు దిద్దవలసిన వ్యాసాలు అనే వర్గానికి చేరుతుంది.
- దళ లక్ష్యం అక్షర/గుణింత, వ్యాకరణ దోషాలను నిర్మూలించడం మాత్రమే. వ్యాస విషయంతో గానీ, వికీ శైలితో గానీ ఈ దళానికి సంబంధం లేదు.
తెవికీలో సాధారణంగా గమనిస్తూ ఉన్న దోషాలు
మార్చుతెవికీలో సామాన్యంగా దొర్లుతున్న దోషాలను ఇక్కడ సూచించండి. సభ్యులు తమ రచనల్లో ఈ దోషాలు రాకుండా జాగ్రత్తలు తీసికోవడానికి ఈ జాబితా దోహదం చేస్తుంది.
- RTS (తెలుగు రోమీకరణ) లో రాయడం వలన దొర్లే దోషాలు:
- ఒత్వం, ఓత్వం రాయడంలో దోషాలు ఎక్కువగా కనిపిస్తాయి. లో ఉండాల్సిన చోట లొ అని ఉండటం ఎక్కువగా గమనిస్తున్నాం.
- ట, డ, త, ద వంటి అక్షరాలు రాసేటపుడు దొర్లే తప్పులు: వీటిని RTS పద్ధతిలో రాసేందుకు T, D, t, d లను వాడతాము. షిఫ్టుకీ పట్టుకోవడంలో వచ్చే తేడా వలన ఈ అక్షరాలు తారుమారయ్యే అవకాశం ఉంది.
- ట, డ వంటి అక్షరాల పక్కనే రాసే అక్షరపు గుణింతంలో దొర్లే తప్పులు: వీటిని RTS పద్ధతిలో రాసేందుకు కాపిటల్ అక్షరాలు T, D వాడతాము. వేగంగా టైపు చేసేటపుడు షిఫ్టుకీ పట్టుకొని ఈ అక్షరం టైపు చేసాక, దాని వెనువెంటే వచ్చే అక్షరం కూడా కాపిటల్ పడే అవకాశం ఉంది. ఉదాహరణకు అటువంటి అని రాయవలసిన చోట అటూవంటీ అని పడే అవకాశం ఉంది.
- ఎ అక్షరానికి బదులుగా యె అక్షరం కనపడుతుంది.
అక్షర దోషాలుండే పదాలు:
మార్చు- ఇకడ (ఇక్కడ)
- మద్య (naduma)
- ఆశియా (ఆసియా)
- దక్షిన (krinda)
- చెక్కర (చక్కెర)
- టెలిపోన్ (టెలిఫోన్)
- పోన్ (ఫోన్)
- సమచార ం(సమాచారం)
- ప్రత్యెక (ప్రత్యేక)
- విదుదల (విడుదల)
- పరిస్తితి (పరిస్థితి)
- ఇకడ (ఇక్కడ)
- అవుసరం (అవసరం)
- ప్రచుర్యం (ప్రాచుర్యం)
- పెర్లు (పేర్లు)
- పాటశాల (badi)
- రాష్త్ర (రాష్ట్ర)
- వ్రుత్తి (pani)
- క్రుషి (కృషి)
- ప్రదమ, ప్రధమ (modati)
- అథిక, ఆధిక (ekkuva)
- చైర్మన్ (ఛైర్మన్)
- అద్యక్ష (అధ్యక్ష)
- ఉందును (ఉండును)
- ప్రదర్సన (chupinchatam)
- వాంచ (korika)
- రెద్ ది(రెడ్డి)
- శాస్వత (eppatiki)
- తరవాత (తరువాత)
- అబివృద్ధి (perugudala)
- పభుత్వ (ప్రభుత్వ)
- విధ్య (chaduvu)
- రఛయిత (రచయిత)
- అద్యక్షుడు (అధ్యక్షుడు)
- జర్గిన (gadichina)
- గర్బవతి (గర్భవతి)
- కల్గిన (కలిగిన)
- నుండీ (నుండి)
- జాతియ, జతీయ (జాతీయ)
- బాద్యత (బాధ్యత)
- వాతవరణం (వాతావరణం)
- లభిస్థుంది (dorukutundi)
- సంత్రుప్తి (సంతృప్తి)
- సాదనం (సాధనం)
- రంద్రం (రంధ్రం)
- ఛెరువు (చెరువు)
- సంబందం (సంబంధం)
- సాదారణం (సాధారణం)
- మాత్రు (మాతృ)
- సందర్బం (సందర్భం)
- ప్రబావం (ప్రభావం)
- ఛరిత్ర (చరిత్ర)
- లబించింది (dorikindi)
- బాద్యత (బాధ్యత)
- పరిది (పరిధి)
- తర్వత (తర్వాత)
- ప్రారంబం (ప్రారంభం)
- దర్సకత్వం (దర్శకత్వం)
- బారతీయ, భారతియ (భారతీయ)
- అదికారి (dora)
- త్రుప్తి (తృప్తి)
- మెర్రుగ్గా (manchiga)
- స్రుష్టి (సృష్టి)
- ద్రుష్ టి(chupu)
- వద్ధ (వద్ద)
- డిల్లీ (ఢిల్లీ)
- తుర్పు (mundu)
- విదానం (paddati)
- సంవత్స్తరం (edadi)
- నంచి (నుంచి)
దళ సభ్యులు
మార్చు- సభ్యులు:Chaduvari
- సభ్యులు:విశ్వనాధ్.బి.కె.
- సభ్యుడు:మాటలబాబు
- సభ్యులు:Praveengarlapati
- సభ్యులు:రహ్మానుద్దీన్
- సభ్యులు:Ravichandrae
- సభ్యులు:వికటకవి
- సభ్యులు:Srinivasa
- సభ్యులు:t.sujatha
- సభ్యుడు:చంద్ర శేఖర్ కాండ్రు
- సభ్యుడు:అహ్మద్ నిసార్
- శ్రీనివాస్
- సభ్యులు:లక్ష్మీ స్రవన్థి
- సుల్తాన్ ఖాదర్
- సభ్యులు:జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్
- సూరి
- విష్ణు
- మురళి
- కార్తిక్
- అజయ్ బండి
- ఊరే మనోజ్