వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 14వ వారం
ఆలిండియా రేడియో (అధికారికముగా ఆకాశవాణి) (హిందీ: आकाशवाणी) భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసరణ మంత్రాంగ అధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి (బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) యొక్క విభాగము. ఇది జాతీయ టెలివిజన్ ప్రసార సంస్థైన దూరదర్శన్ యొక్క సోదర విభాగం.
ఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయము పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లో ఉన్నది. ఆకాశవాణి భవన్ లో నాటక విభాగం, ఎఫ్.ఎం రేడియో విభాగం మరియు జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి. దూరదర్శన్ ఢిల్లీ కేంద్రం కూడా ఆకాశవాణి భవన్లో 6వ అంతస్థులో ఉన్నది.
భారతదేశం లో మెదటి రేడియో ప్రసారాలు 1923 జూన్ లో "రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయీ" ద్వారా ప్రసారం చెయబడినవి. దీని తరువాత "బ్రాడ్ కాష్టింగ్ కంపెనీ" ఏర్పాటు చెయ్యబడింది. ప్రయౌగాత్మకంగా జూలై 1927 లొ కలకత్తా, బొంబాయి నగరాలలొ "ఇండియన్ బ్రాడ్ కాష్టింగ్ కంపెనీ" ప్రసారాలు చెసింది. ఇండియన్ బ్రాడ్ కాష్టింగు కంపెనీ భారత ప్రభుత్వం ఆధ్వర్యం లొ ఈ ప్రసారాలు చేసింది. 1936 సంవత్సరములొ ఆకాశవాణి ప్రభుత్వ సంస్ధగా అవతరించింది. అంతకి పూర్వము ప్రైవేటు రేడియో క్లబ్బులు ఉండేవి.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చెసరికి 6 ఆకాశవాణి కేంద్రాలు (కలకత్తా, ఢిల్లీ, బొంబాయి, మద్రాసు, లక్నో, తిరుచిరాపల్లి) మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 215 అకాశవాణి కేంద్రాలు 337 ప్రసార కెంద్రాల (144 MW కేంద్రాలు, 54 SW కేంద్రాలు, 139 ఎఫ్‌ఎం కేంద్రాలు)తొ 77 ఆకాశవాణి కేంద్రాలు 99.13% ప్రజలకు ప్రస్తుతం ప్రజలకు సమాచారాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో టీవీ ఛానెళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎఫ్ ఎమ్ రేడియో చానెళ్లు అన్ని వర్గాల వారికీ శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కల ఆకాశవాణి ప్రసార కేంద్రాలు అదిలాబాదు, కడప, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, అనంతపురం, కర్నూలు, కొత్తగూడెం, నిజామాబాదు, తిరుపతి, వరంగల్లు.
ఇటీవలి కాలం లో ఎఫ్‌ఎం పైఆకాశవాణి రెయిన్ బో (హైదరాబాదు , విజయవాడ) కేంద్రాలతో పాటు కొన్ని ప్రెవేటు ఎఫ్‌ఎం కేంద్రాలు (రేడియో మిర్ఛి , రేడియో సిటీ , బిగ్ ఎఫ్‌ఎం , రెడ్ ఎఫ్‌ఎం) ప్రజాదరణ పొందుతున్నాయి. విద్యా ప్రసారాలకై జ్ఞానవాణి కేంద్రం (హైదరాబాదు , విశాఖపట్నం , ఇతర ముఖ్య నగరాలలో) పని చేస్తున్నది.
ఇంకా....పూర్తివ్యాసం పాతవి