వికీపీడియా:ఉగాది మహోత్సవం-2013 తర్వాత తెవికీ ప్రగతి

ఇది విజయ ఉగాది మహోత్సవం తర్వాత తెలుగు వికీపీడియా లో జరిగిన అభివృద్ధిని సమీక్ష చేయాలని మొదలుపెట్టాను. ఏప్రిల్ 2013 లో సమావేశం జరిగింది. కనుక మే నుండి ఆగష్టు వరకు నాలుగు నెలలలో ప్రగతికి సంబంధించిన విశేషాలను ఇందులో చేర్చండి.

ప్రాజెక్టులు

మార్చు
  1. వికీపీడియా:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం లో పాల్గొని సుమారు 100 మంది ప్రముఖ భారతీయ మహిళల గురించి వ్యాసాలను అభివృద్ధి చేశాము.
  2. వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు ప్రముఖులు ప్రాజెక్టును ప్రారంభించి సుమారు 1000 మందికి పైగా ప్రముఖ తెలుగువారి జీవితచిత్రాలను కొంతవరకు అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో భాగంగానే వికీపీడియా:తెలుగు ప్రముఖుల జాబితా తయారుచేయడం జరిగింది.
  3. ఆంధ్రప్రదేశ్ లోని చాలా గ్రామల వ్యాసాలను సుజాత మరియు శ్రీరామమూర్తి గార్లు అభివృద్ధిచేస్తున్నారు.
  4. వికీపీడియా:వికీప్రాజెక్టు/విద్య, ఉపాధి లో భాగంగా మొట్టమొదటిసారిగా వ్యాసరచన పోటీని నిర్వహించాము. అందులో పాల్గొన్న 15 మందిలో ముగ్గురికి మొదటి, రెండు, మూడు ర్యాంకులు మరియు తర్వాత ఐదుగురికి ప్రోత్సాహక బహుమతులు అందజేశాము. బండి శ్రీనివాస శర్మ గారు డబ్బును అందజేయగా, ప్రోత్సాహక బహుమతిగా వికీపీడియా టిషర్టుల్ని అందజేశాము.
  5. వికీపీడియా:వికీప్రాజెక్టు/లీలావతి కూతుళ్ళు 24 భారతీయ మహిళా శాస్త్రవేత్తలపై మంచి వ్యాసాలు ఇప్పటికే వచ్చాయి, ఇంకా కొన్ని వ్యాసాల అభివృద్ధి జరుగుతుంది.
  6. ఒక తెలుగు-ఆంగ్ల నిఘంటువులోని పదాలను అన్నింటిని విక్షనరీలో చేర్చి భాస్కర నాయుడు గారు బలమైన పునాదిని తయారుచేశారు.
  7. s:తెలుగువారి జానపద కళారూపాలు పుస్తకాన్ని వికీసోర్సులొ లిప్యంతరికరణ పూర్తిచేశాము. అందులోని సమాచారాన్ని ఉపయోగించి వికీపీడియాలో సుమారు 100కి పైగా వ్యాసాల్ని తయారుచేశాము. వాటిని వికీకరణ చేయవలసి ఉన్నది.
  8. s:పోతన తెలుగు భాగవతము ఊలవల్లి సాంబశివరావు వికీసోర్సుకు అందజేయగా దానిని వికీసోర్సు ద్వారా తెలుగువారందరికీ అందుబాటులోకి తెస్తున్నాము.
  9. వేదిక:ఫోటోగ్రఫి : శశి గారు ఫొటోగ్రఫీ కి సంబంధించిన పరికరాలు మరియు సాంకేతిక విషయాలను లీడింగ్ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నాను.

సమావేశాలు

మార్చు

ప్రతినెల తెలుగు వికీపీడియా సమావేశాలను తప్పకుండా నిర్వహించాలని భావించి అందుకు వేదికగా అబిడ్స్ లోని థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) వారి అనుమతి తీసుకున్నాము.

  1. వికీపీడియా:సమావేశం/మే 23,2013 సమావేశం ను రహ్మనుద్దీన్ నిర్వహించారు.
  2. వికీపీడియా:సమావేశం/బెంగుళూరు/2 జూన్ 2013 ను శశి నిర్వహించారు.
  3. వికీపీడియా:సమావేశం/జూన్ 9,2013 సమావేశం ను రహ్మనుద్దీన్ నిర్వహించారు.
  4. వికీపీడియా:సమావేశం/బెంగుళూరు/13 జూలై 2013 ను శశి నిర్వహించారు.
  5. వికీపీడియా:సమావేశం/జూలై 21, 2013 సమావేశం ను రాజశేఖర్ నిర్వహించారు.
  6. వికీపీడియా:సమావేశం/హైదరాబాద్/ఆగష్టు 25, 2013 సమావేశం ను రాజశేఖర్ నిర్వహించారు.
  7. వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/సెప్టెంబర్ 15, 2013 సమావేశం ను రాజశేఖర్ నిర్వహించారు.

శిక్షణ శిబిరాలు

మార్చు
  1. హైదరాబాద్ 0, సిజిజిలో ఏప్రిల్ 9 2013 న జరిగింది. [1]
  2. వికీపీడియా:శిక్షణ శిబిరం/హైదరాబాద్/హైదరాబాద్1 (ఇది ఆశించినంతగా జరగలేదు)
  3. వికీపీడియా:శిక్షణ శిబిరం/హైదరాబాద్/హైదరాబాద్2 విష్ణు గారు BRAOU లో నిర్వహించారు.
  4. వికీపీడియా:శిక్షణ శిబిరం/హైదరాబాద్/హైదరాబాద్3 విష్ణు గారు EFLU లో నిర్వహించారు.

గణాంకాలు

మార్చు
 
తెవికీలో ఎడిటర్లు, మార్పులు, పేజీవీక్షణల గణాంకాలు(జనవరి-జులై2013)

గణాంకాల రేఖాపటాన్ని పరిశీలించినట్లయితే చాలా పరామితులలో చెప్పుకోదగ్గ మార్పులు కనబడలేదు. 100కంటే ఎక్కువ మార్పులు చేసేవారి సంఖ్య మూడింతలై తరువాత రెండింతలుకు తగ్గింది. క్రిందటి సంవత్సరాలలో కూడా ఇలాంటి మార్పులు కనబడతాయి. (వికమీడియా ఫౌండేషన్ గణాంకాల విశ్లేషణలో మార్పులు చేసినందున అసలు మార్పుల గణాంకాలు కొంచెం ఎక్కువ వుండవచ్చు. కాని సాపేక్షతగా పరిశీలించితే అవి పెద్దగా ప్రభావితంచేయవు)

అయితే మనదేశంలో వాడబడే అన్ని వికీ పీడియా భాషా ప్రాజెక్టులను పరిశీలించితే మార్పుల సంఖ్య బాగా పెరిగింది. దేశాలవారీగా మార్పుల గణాంకాల లింకు ప్రకారం తెలుగువికీమార్పులు (7.4%)తో గణనీయంగా పెరిగి మొట్టమొదటిసారిగా2013మూడవ త్రైమాసికంలో భారతీయభాషలలో అగ్రస్థానంలోకి వచ్చాయి. ఈ క్రింది పట్టికలో ఆగష్టు, సెప్టెంబరు గణాంకాలు లేకపోవడంవలన ఆ వివరము స్పష్టమవుటలేదు.

Month

New Editors

Editors(> 5)Edits

Editors(> 100) Edits

Database Edits(K)

Page requests(M)

01/01/13

11

31

4

5.5

2.4

02/01/13

6

39

7

6.2

2.9

03/01/13

7

36

12

16

2

04/01/13

9

42

13

7.9

1.9

05/01/13

2

32

12

8.7

2.5

06/01/13

6

36

9

11

2.4

07/01/13

7

35

9

6

2.4

ఇవీచూడండి

మార్చు

మూలాలు

మార్చు