వికీపీడియా:సమావేశం/బెంగుళూరు/13 జూలై 2013
బెంగుళూరులో రెండవ (సాధారణ) తెలుగు వికీపీడియన్ల సమావేశం
కార్యక్రమ వివరాలు
మార్చు- తేదీ: 13-జూలై-2013 (రెండవ శనివారం)
- సమయం: మధ్యాహ్నం గం: 2.00 నుండి సాయంత్రం గం: 5.00 వరకు
- వేదిక: సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ, నెం. 194, రెండవ సి క్రాస్, దొమ్మలూరు, రెండవ స్టేజీ, బెంగుళూరు - 560071 (ఫోన్: +91 80 4092 6283),గూగుల్ మేప్ తో సహా వివరాలు
- చర్చాంశాలు
- అరవిందుల రచన సావిత్రి
- సా2:00:
- స్వాగతం .. శశి
- పరిచయాలు.. అందరు
- తెవికీ పరిచయం..శశి
- సా 3:00
- సా4:00
- తెవికీ ప్రాజెక్టు తెలుగు ప్రముఖులు పురోగతి,సమస్యలు .. ప్రాజెక్టు సభ్యులు
- బెంగుళూరు లో తెవికీ కార్యక్రమాలు, సభ్యుల వృద్ధి.. అందరు
- తెవికీలో సమస్యలు పరిష్కారాలు.. అందరు
- తెలుగువారి కుటుంబాలలో సంబంధబాంధవ్యాలు.. అందరు
- <విషయం చేర్చండి>
వక్తల పరిచయం:
డా.టి.రామకృష్ణ జీవసాంకేతిక రంగంలో ఆచార్యుడిగా, శాస్త్రవేత్తగా అపార అనుభవం గడించారు. ప్రస్తుతం శ్రీఅరవిందో మానవీయ విలువల విద్యా కేంద్రం (Sri Aurobindo Centre for Education in Human Values) లో పరిశోధన మరియు అభివృద్ధి సంచాలకునిగా పనిచేస్తున్నారు. అరవిందులు రచించిన సావిత్రి కావ్యం చదివి ప్రభావితమై ఆ కావ్యమును తెలుగులోకి అనువదించారు. ఇది ఎమెస్కో ముద్రాపకులద్వారా 2009 ప్రచురితమైంది.
సూచనలు: బెంగుళూరులో వున్న వారు తప్పక నోట్ బుక్ లేక టాబ్లెట్ కంప్యూటర్లు తెచ్చుకుంటే ప్రత్యక్షంగా సమస్యల పరిష్కారానికి వీలవుతుంది.
ప్రత్యక్షంగా పాల్గొనలేనివారికోసం గూగుల్ హేంగౌటు ప్రయత్నించబడుతుంది. వివరాలకు సమావేశసమయానికి వెబ్ ఛాట్ లో #wikimedia-in చానల్ లేక ఇదే పేజీలో చూడండి.
సమావేశ నిర్వహణ నేపధ్యం భారతదేశంలో వికీమీడియా చాప్టర్ జనవరి 3, 2011 న బెంగుళూరులో నమోదైంది. ముంబయి సముదాయంతో కలసి వికీ కాన్ఫరెన్స్ ఇండియా అనబడే జాతీయ స్థాయి సమావేశాన్ని నవంబరు 18-20 , 2011 లలో నిర్వహించింది. గత రెండేళ్లలో అనేకచోట్ల వికీ ప్రచార కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నది. కార్యక్రమాలను మరింత చురుకుగా చేయటానికి మరియు విస్తరించటానికి, మరియు కార్యనిర్వహక జట్టులోని సభ్యుల నేతృత్వంలో నగర మరియు భాషా ప్రత్యేక ఆసక్తి జట్టులు పనిచేస్తున్నాయి. బెంగుళూరులోని తెలుగు ప్రత్యేక ఆసక్తి జట్టు సభ్యులు మరియు సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ, బెంగుళూరు వారి జ్ఞానాన్ని చేరువచేర్చు జట్టు (Access to Knowledge)తో కలసి నెలవారీ సమావేశాలు ప్రతి నెల రెండవ శనివారం నాడు నిర్వహిస్తున్నది. దీనిలో ప్రముఖ తెలుగు వక్తల ఉపన్యాసాలతో బాటు తెలుగువికీ పరిచయం మరియువికీ పనిని సులభంచేసే ప్రాజెక్టులుమరియు సాంకేతికాంశాలపై ప్రసంగాలు మరియు వికీసమస్యలకు పరిష్కారాలుంటాయి. మరిన్ని వివరాలకు శశిధర్ లేక రవిచంద్రను సంప్రందించండి.
ఇవీ చూడండి
మార్చుసమావేశానికి ముందస్తు నమోదు
మార్చు(నమోదు తప్పనిసరికాదు కాని నిర్వాహకులకు సహాయంగా మరియు ఇతరులకు ప్రోత్సాహంగా వుంటుంది. పైన మార్చు నొక్కి మీ పేరు చేర్చవచ్చు)
- తప్పక
- -- శశి (చర్చ) 06:01, 29 జూన్ 2013 (UTC)
- --అర్జున (చర్చ) 06:27, 29 జూన్ 2013 (UTC)
- --రవిచంద్ర (చర్చ) 11:57, 29 జూన్ 2013 (UTC)
- --రహ్మానుద్దీన్ (చర్చ) 04:59, 4 జూలై 2013 (UTC)
- <పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- బహుశా
- <--Vasantnm (చర్చ) 06:59, 12 జూలై 2013 (UTC) vasantnm>
- పాల్గొనటానికి కుదరని
- ఇదే రోజు CIS-A2K, IISc మరియు ఇతర ఉన్నత విద్యాసంస్థలు భాగస్వామ్యం వహిస్తున్న ఇంకొక కార్యక్రమంలో పాల్గొనడంవలన మన ఈ సమావేశానికి రాలేకపోతున్నాను. సమావేశం విజయవంతం కావాడానికి CIS-A2K నుండి అన్ని విధాలా సహాయసహకారాలు అందింపచేయడానికి నా వంతు కృషి చేస్తాను. -- విష్ణు (చర్చ)06:13, 11 జూలై 2013 (UTC)
- <పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- స్పందనలు
- <పై వరసలో స్పందించండి>
నివేదిక
మార్చుతెవికీ సంపాదకులైన అర్జున, రవిచంద్ర, శశి మరియు రహ్మానుద్దీన్ లతో బాటు వై.ఎస్.ఆర్ జిల్లావిద్యాశిక్షణ సంస్థ తెలుగుఅధ్యాపకులు గుడిపాటి నారాయణ గారు, బెంగుళూరు తెలుగు తేజం తరపున హరిబాబు హాజరవగా, ప్రముఖ జీవసాంకేతిక పరిశోధకులు, ఆచార్యులు మరియు అరవిందుల రచన సావిత్రి,ని తెలుగు అనువాదం చేసిన డాక్టర్ టి రామకృష్ణ గారు ప్రత్యేక అతిథి గా విచ్చేసారు.
- తెవికీ పరిచయం
- ప్రణాళిక ప్రకారం స్వాగత, పరిచయాల తర్వాత, అతిధులకి వ్యాసాలని సృష్టించటం, వాటిని సవరించటం బెంగుళూరు తెలుగు తేజం వ్యాస సృష్టితో ప్రదర్శనాపూర్వకంగా ఒక అవగాహనని ఇవ్వటం జరిగినది.
- అతిధుల సందేహాలని అర్జున, రవిచంద్ర, శశి, రహ్మానుద్దీన్లు సోదాహరణంగా నివృత్తి చేశారు.
- సావిత్రి కావ్య పరిచయం.
- రామకృష్ణ గారు వారు అనువదించిన అరవిందుల సావిత్రి గురించిన ప్రసంగం చేశారు. ఇందులో
- అరవిందుల వారి జీవిత చరిత్ర, వారి వ్యక్తిత్వం. , దాని ఉపయోగాలు తెలియ జేశారు
- టూకీగా సావిత్రి కథ
- భారతదేశంలో మతం, సంస్కృతి ఒకదాని నుండి మరొకటి విడదీయలేనంతగా పెనవేసుకొని ఉన్నాయన్న విషయం అరవిందుల వారు గుర్తించారన్నారు.
- ఈ కావ్యం లో వాడిన ప్రతీకల ద్వారా మానవుడు తన ఆధ్యాత్మిక శక్తిని పెంచుకొనే ప్రయత్నాన్ని వర్ణించారు.
- తెలుగు వికీ సమస్యలు, ప్రాజెక్టులపై చర్చ
- మూడు నెలలక్రిందట ప్రారంభమైన తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు ను నాణ్యత బేరీజు వేసి ప్రస్తుతానికి ముగించితే ఇతర ప్రాజెక్టులపై ధ్యాసపెట్టడానికి వీలవుతుందని అభిప్రాయం వ్యక్తమైంది.
- నారాయణ గారు ఉపాధ్యాయులకి తెలుగు వికీ పై అవగాహనా సదస్సులు, శిక్షణా శిబిరాలని నిర్వహించే కార్యక్రమం యొక్క ప్రణాళిక రూపొందించి త్వరలోనే తెలుగు వికీపీడియాకి విడుదల చేస్తానని హామీ ఇచ్చారు.
- ప్రపంచ తెలుగు రచయతల సమావేశాలు, తెలుగు ఇంటర్నెట్ సమావేశాలలో పాల్గొని తెలుగు వికీపీడియా ప్రచారాన్ని మరింతగా చేయాల్సినఅవసరం గురించి రహ్మనుద్దీన్ వివరించారు.
- తెలుగు వికీపీడియా మహోత్సవం లో లేవనెత్తిన అంశాలపై వికీపీడియా లో జరిగిన చర్చలను సమీక్షించి జరగవలసిన చర్యలను గుర్తించాలని అర్జున కోరారు.
- తెలుగు వాడుక ని విస్తృతం చేయటానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని రామకృష్ణ గారు అభిప్రాయపడ్డారు.
- బెంగుళూరుకి సంబంధించిన చేపట్టవలసిన ప్రాజెక్టులను గురించి చర్చించి, వీటిని ప్రస్తుత ప్రాధాన్యతలు పూర్తయినతరువాత చేపట్టాలని కోరారు.
చిత్రమాలిక
మార్చు-
తమ అనువాదం అరవిందుల వారి సావిత్రి గురించి ప్రసంగిస్తున్న డా టి రామకృష్ణ
-
సమావేశంలో పాల్గొన్న వారు
-
అర్జునరావు మరియు రామకృష్ణ గారు
-
సమావేశంలో పాల్గొన్న వారి సమూహ చిత్రం