వికీపీడియా:సమావేశం/బెంగుళూరు/2 జూన్ 2013
బెంగుళూరులో మొదటి (సాధారణ) తెలుగు వికీపీడియన్ల సమావేశం
కార్యక్రమ వివరాలు
మార్చు- తేదీ: 2-జూన్-2013 (ఆదివారం)
- సమయం: మధ్యాహ్నం గం: 3.00 నుండి సాయంత్రం గం: 5.00 వరకు
- వేదిక: సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ, నెం. 194, రెండవ సి క్రాస్, దొమ్మలూరు, రెండవ స్టేజీ, బెంగుళూరు - 560071 (ఫోన్: +91 80 4092 6283),గూగుల్ మేప్ తో సహా వివరాలు
- చర్చాంశాలు
- స్వాగతం .. శశి
- పరిచయాలు.. అందరు
- తెవికీ ప్రాజెక్టుల స్థితిగతులు.. అర్జున
- బెంగుళూరు లో తెవికీ కార్యక్రమాలు, సభ్యుల వృద్ధి.. అందరు
- తెవికీలో సమస్యలు పరిష్కారాలు.. అందరు
- తెలుగువారి కుటుంబాలలో సంబంధబాంధవ్యాలు.. అందరు
- <విషయం చేర్చండి>
సూచనలు: బెంగుళూరులో వున్న వారు తప్పక నోట్ బుక్ లేక టాబ్లెట్ కంప్యూటర్లు తెచ్చుకుంటే ప్రత్యక్షంగా సమస్యల పరిష్కారానికి వీలవుతుంది.
ప్రత్యక్షంగా పాల్గొనలేనివారికోసం గూగుల్ హేంగౌటు ప్రయత్నించబడుతుంది. వివరాలకు సమావేశసమయానికి వెబ్ ఛాట్ లో #wikimedia-in చానల్ లేక ఇదే పేజీలో చూడండి.
సమావేశానికి ముందస్తు నమోదు
మార్చు- తప్పక
- -- శశి (చర్చ) 17:18, 28 మే 2013 (UTC)
- --అర్జున (చర్చ) 03:34, 29 మే 2013 (UTC)
- -- రవిచంద్ర (చర్చ) 11:35, 30 మే 2013 (UTC)
- <పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- బహుశా
- రాధాక్రిష్ణ (చర్చ) 06:38, 29 మే 2013 (UTC)
- రహ్మానుద్దీన్ (చర్చ) 06:49, 29 మే 2013 (UTC)
- <పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- పాల్గొనటానికి కుదరని
- <పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
నివేదిక
మార్చుఅర్జున, రవిచంద్ర, శశి లతో బాటు, ప్రముఖ జీవసాంకేతిక పరిశోధకులు, ఆచార్యులు మరియు అరవిందుల రచన సావిత్రిని తెలుగు అనువాదం చేసిన డాక్టర్ టి రామకృష్ణ గారు మరియు వై.ఎస్.ఆర్ జిల్లావిద్యాశిక్షణ సంస్థ తెలుగుఅధ్యాపకులు గుడిపాటి నారాయణ గారు హాజరయ్యారు.
- ప్రణాళిక ప్రకారం స్వాగత, పరిచయాల తర్వాత, అతిధులకి తెవికీ ప్రాజెక్టు, దాని ఉపయోగాలు, వ్యాసాల శోధన, సవరణ, సహాయ సహకారాలు, పరస్పర క్రియలపై టూకీగా ప్రదర్శనాపూర్వకంగా ఒక అవగాహనని ఇవ్వటం జరిగినది.
- వికీ సోదర ప్రాజెక్టులైన కామన్స్, విక్షనరీ, వికీసోర్స్, వికీకోట్ల పై కూడా అవగాహనని ప్రదర్శనాపూర్వకంగా ఇవ్వటం జరిగినది.
- అతిధుల సందేహాలని అర్జున, రవిచంద్ర, శశి లు సోదాహరణలతో నివృత్తి చేశారు.
- రామకృష్ణ గారు తెలుగువికీ అభివృద్ధికి సమాంతరంగా పరిపాలన వ్యవహారాలలో తెలుగు వాడుకని పెంచాలని, దానికి పనిచేస్తున్న సంస్ధలు, అధికారులతో సంప్రదింపులు చేయాలని సూచించారు.
- నారాయణ గారు, తెలుగు బోధనా రంగంలో ప్రమాణాలు పెంచడానికి తెలుగు వికీపీడియా బాగా సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.
- రామకృష్ణ మరియు నారాయణ గార్లు తమ తమ అనుబంధ సంస్థలలో వికీ అవగాహన సదస్సులు నిర్వహించడానికి తోడ్పడతామని హామీ ఇచ్చారు.
- బెంగుళూరు లో ప్రతి రెండవ శనివారం (జులైనుండి) మధ్యాహ్నం తెలుగు వికీ అవగాహనను పెంచడానికి మరియు పలురంగాలలోనున్న తెలుగు ప్రముఖులను దీనిలో భాగస్వాములని చేయాలని సంకల్పించడమైనది.
చిత్రమాలిక
మార్చు-
సమావేశంలో చర్చిస్తున్న వారు (ఎడమ నుండి కుడికి) నారాయణ, రవిచంద్ర, అర్జున మరియు రామకృష్ణ
-
సమావేశంలో పాల్గొన్న వారి సమూహ చిత్రం
ఇవీ చూడండి
మార్చు2011 లో వికీ దశాబ్ది వుత్సవాలలో భాగంగా బెంగుళూరులో తెలుగు వికీపీడియన్లసమావేశం