వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం/2013/ప్రక్రియపై ప్రతిస్పందన

రచ్చబండలో స్పందనలు మార్చు

వికీపీడియా:రచ్చబండ#కృతజ్ఞతలు, అభినందనలు చూడండి

ఈ పేజీలో స్పందనలు మార్చు

  • పురస్కార ప్రతిపాదనల నుంచి పురస్కార ఎంపిక వరకు, ప్రారంభంలో అనేక సందేహాలకు లోనైన సభ్యులకు, రాను రాను ఈ ప్రక్రియావిధానం, దాదాపు అన్ని సందేహాలను దూరం చేసింది. దూరదృష్టితో వ్యవహరించిన ఎంపిక మండలి అభినందనీయమే. ముఖ్యంగా పురస్కార విజేతలను, ప్రశంసాపత్రాల విజేతలను ఎంపిక చేయడంలో ప్రదర్శించిన పారదర్శకత, వికీ విధానాల మరియు ఎంపిక విధానాల చక్కటి అవలంబన, తీసుకున్న జాగ్రత్తలు ఆహ్వానింపదగ్గవి. మరీ ముఖ్యంగా మూల్యాంకనా విధానం మరియు దాని ఆధారంగా విజేతలను ఎంపిక చేసే పద్దతి బాగుంది. పురస్కారాలకు దోహదపడే అంశాలు మరియు దోహదపడని అంశాల పట్ల క్రియాశీలక సభ్యులకు మంచి అవగాహన కలిగినది. మూల్యాంకన విధానం వల్ల ఎంపిక ప్రక్రియ సులభతరమైనది. ఎంపిక-పోటీ ల మధ్య గల తేడాను గుర్తించడానికి వీలైనది. ప్రక్రియను విజయవంతంగా నడిపిన వారందరూ అభినందనీయులు. వెయ్యి గంటలు శ్రమగోర్చిన మండళ్ళు ఓ యజ్ఞాన్ని శుభీకరించారు. అహ్మద్ నిసార్ (చర్చ) 04:48, 29 డిసెంబర్ 2013 (UTC)
  • పురస్కారాలకొరకు చేసిన ఎంపిక ప్రక్రియ అత్యంత శాస్త్రీయంగా జరిగిందని పిస్తున్నది. ఎంతో శ్రమ కోర్చితేనే గాని అది సాద్య పడదు. ఎంపిక మండలికి, పురస్కార విజేతలకు నెనరులు. Bhaskaranaidu (చర్చ) 04:03, 30 డిసెంబర్ 2013 (UTC)
  • పురస్కార నిర్ణయం ఎంపిక మండలిలేని పక్షంలో కూడా జరిగేలా, స్వయంచాలితంగా రూపొందించాలి. అందుకు వచ్చే సంవత్సరమయినా కృషిజరగాలి. జ్యూరీ అంటూ ఏర్పడ్డాక తెలిసీ తెలీక ఎందరో ఏవేవో అంటారు. వాటికతీతంగా ఈ పురస్కారం ఏర్పడాలి. ఇంకా కొలబద్ద విషయంలో నేను తెలిపిన విధంగా కొన్ని లోపాలు ఉన్నాయి. అవి సరిచేయాలి. ఈ పురస్కారానికి స్థూలంగా పరిమాణాధారిత అంశాలు తీసుకున్నారు, నాణ్యతాధారిత కొలమానాలు రూపొందించాల్సి ఉంది. ఎంపికకు కూడా అనవసరంగా ఎక్కువ సమయం వెచ్చించారని అనిపించింది. మెటా లాంటి ప్రపంచవ్యాప్త చదువరులు ఉన్న ప్రదేశాలలో ఈ పురస్కారం గురించి ప్రచురించలేదు. అది జరగాల్సి ఉంది. సభ్యులే ఆ పని చేయాలని విజ్ఞప్తి. ఈ ఎంపిక వలన ఏ ఏ కోణాల్లో వికీపీడియాలో పని చేయవచ్చో ఇతర సభ్యులకు తెలిసొచ్చింది, ఇది చాలా అవసరం. --రహ్మానుద్దీన్ (చర్చ) 05:47, 30 డిసెంబర్ 2013 (UTC)
  • రహ్మానుద్దీన్ గారి సూచనలతోకూడిన స్పందనకు ధన్యవాదాలు. మెటా లో ప్రచారం చేయలేదు, కాని మన తెలుగువికీకి సోదరవికీ సభ్యులు చురుకుగా వుండే వికీమీడియా భారత మెయిలింగు లిస్టులలో ప్రచారం చేయబడింది. ఇక మరింత విస్తృతంగా పంచుకోవటానికి బ్లాగ్ పోస్ట్ చేసే ఆలోచన వుంది. ఇక మీ ఇతర సూచనలు అర్థం చేసుకోవటానికి మరికొంత వివరణ ఇస్తే బాగుంటుంది. నాణ్యతను ఎంపికలో భాగంగా చేయడానికి గణాంకాల గరిష్ఠ స్థాయిని తక్కువగా వుంచి గుణాత్మక వివరణలు కొలబద్దలో ఇవ్వబడినవి. ఉదా: మొలకలు .. సమగ్ర వ్యాసాలు, సముచిత వినియోగ బొమ్మలు .. స్వేచ్ఛానకలుహక్కుల బొమ్మలు, కేవలం పాల్గొనటం.. సమన్వయం చేయటం.మూల్యాంకనంలో వాటిని పాటించడం జరిగింది. ఇక ట్రాన్స్లేట్ వికీ గురించి మీ సలహాని ఛట్రంలో వీలైనంత దగ్గరిఅంశానికి అనుబంధంగా చేయడం జరిగింది. ఎంపికమండలి లేకుండా స్వయంచాలితంగా ఎలా జరుగుతుందో అర్ధంకాలేదు. మరింత వివరణతో మీ సూచనలు తెలియచేస్తే ముందు సంవత్సరం ప్రక్రియకు ఉపయోగంగా వుంటుంది. --అర్జున (చర్చ) 03:26, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • పురస్కార నిర్ణయం నిష్పక్షపాతంగా జరిగిందనేది స్పష్టం. కంపశాస్త్రి 07:06, 1 జనవరి 2014 (UTC)