వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 17
- 1817 : భారతీయ విద్యావేత్త, ఇస్లామీయ సామాజిక సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ జననం (మ.1898).(చిత్రంలో)
- 1920 : భారతీయ కమ్యూనిస్టు పార్టీ తాష్కెంట్ లో ఏర్పడింది.
- 1901 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యుడు జి.ఎస్.మేల్కోటే జననం (మ.1982).
- 1929 : కవి, పరిశోధకుడు, విమర్శకుడు కొర్లపాటి శ్రీరామమూర్తి జననం (మ.2011).
- 1940 : గాంధీజీ పిలుపుతో వినోబా భావే 'వ్యక్తి సత్యాగ్రహా'న్ని ఆచరించిన రోజు.
- 1970 : భారత క్రికెట్ క్రీడాకారుడు అనిల్ కుంబ్లే జననం.
- 1981 : తమిళ కవి, భావకవి కన్నదాసన్ మరణం (జ.1927).
- 1979 : మదర్ థెరీసా కు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.