వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 31
- 2014 : జాతీయ ఐక్యతా దినోత్సవం
- 1875 : భారత దేశపు ఉక్కు మనిషి గా పేరుగాంచిన సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ జననం (మ.1950). (చిత్రంలో)
- 1895 : భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ సి.కె.నాయుడు జననం (మ.1967).
- 1925 : తెలుగు సినిమా దర్శకుడు కొల్లి ప్రత్యగాత్మ జననం (మ.2001).
- 1937 : ప్రముఖ రచయిత నరిశెట్టి ఇన్నయ్య జననం.
- 1975 : భారతీయ సంగీత కారుడు, ఖ్యాతిగడించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ మరణం (జ.1906).
- 1984 : భారత ప్రధాని ఇందిరా గాంధీ మరణం (జ.1917).
- 1990 : కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని ఎం. ఎల్. వసంతకుమారి మరణం (జ.1928).
- 2004 : ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు మరణం (జ.1935).
- 2008 : అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళములతో బాటు తెలుగు భాషను భారత ప్రభుత్వము చేర్చింది.
- 2005 : మళయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని పి.లీల మరణం (జ.1934).