వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 19
- 1736: శాస్త్రవేత్త, ఆవిరి యంత్రంతో ప్రాముఖ్యత పొందిన జేమ్స్ వాట్ జననం (మ.1819). (చిత్రంలో)
- 1905: భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం (జ.1817).
- 1918: తెలుగు పండితుడు, రచయిత, వక్త, విమర్శకుడు వావిలాల సోమయాజులు జననం (మ.1992).
- 1920: ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్ జననం (మ.2020).
- 1946: అమెరికా గాయని, పాటల రచయిత, రచయిత, బహుళ పరికరాల వాద్యకారిణి, నటి, దాత డాలీ పార్టన్ జననం.
- 1972: భారత క్రీడాకారుడు వినోద్ కంబ్లీ జననం.
- 1990: భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో మరణం (జ.1931).