632 : ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త మదీనాలో పరమపదించాడు (జ.570). ఆయన తరువాత కాలిఫ్ అబూబక్‍ర్ ఆయన బాధ్యతలు స్వీకరించాడు.
1936 : భారతదేశపు సివిల్ రేడియో నెట్‌వర్కుకు ఆలిండియా రేడియో గా నామకరణం చేశారు.
1940 : నెప్ట్యూనియం (Np)ని ఎడ్విన్ మెక్‌మిలన్ మరియు ఫిలిప్ హెచ్. అబెల్సన్ సంశ్లేషణ చేసారు, వీరు న్యూట్రాన్‌లతో యురేనియం (U)ను అణు విచ్ఛిత్తికి కారణమయ్యారు
1948 : భారత, ఇంగ్లాండు మధ్య విమాన రాకపోకలు ప్రారంభమైనవి. భారతదేశము నుండి విదేశాలకు విమాన ప్రయాణాలకు ఇదే నాంది.