వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/భారతదేశపు వర్గాల పేర్ల క్రమబద్ధీకరణ

భారతదేశానికి చెందిన పేజీల వర్గాల పేర్లు అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి. భారత దేశం, భారతదేశం, భారత దేశము, భారతదేశము - ఇలా వివిధమైన పేర్లు కనిపిస్తున్నాయి. ఆయా పేర్ల రూపాలతో ఉన్న అనేక వర్గాల జాబితాను ఇక్కడ చూదవచ్చు. ఈ జాబితా లోకి రాని పేర్లు ఇంకా కూడా ఉండవచ్చు. ఈ పేర్లను పరిశీలించి సరైన పేర్లను ఎంచుకోవడం కోసం ఈ చర్చాపేజీని తయారు చేయడమైనది.

  • చర్చకు గడువు తేదీ: 2020 నవంబరు 1 న ఉదయం 6:00 (భారత కాలమానం)

ప్రాథమిక వర్గం పేరు మార్చు

ప్రాథమికంగా ఈ వర్గాల పేర్లు కింది పేర్లతో మొదలౌతాయి. ఆ వర్గాల్లో ఉన్న ఉపవర్గాల/పేజీల సంఖ్యను పక్కనే ఉన్న బ్రాకెట్లో చూడవచు

  1. వర్గం:భారత దేశం (లేదు)
  2. వర్గం:భారతదేశం (39 ఉపవర్గాలున్నాయి. కానీ..) --> దారిమార్పు --> వర్గం:భారత దేశము
  3. వర్గం:భారత దేశము (129 ఉపవర్గాలు, 98 పేజీలు)
  4. వర్గం:భారతదేశము (లేదు)

పై పేర్లకు గూగుల్ ఫలితాలు ఇలా ఉన్నాయి

  • భారత దేశము: 56,600
  • భారతదేశము: 13,700
  • భారత దేశం: 8,96,000
  • భారతదేశం: 28,00,000


భారత దేశం, భారతదేశం- ఈ రెంటి ఫలితాల వివరాలివి:

భారతదేశం "భారత దేశం" నిష్పత్తి
ఈనాడు     11,200        1,380 8.12
ఆంధ్రజ్యోతి        6,200        1,350 4.59
సాక్షి        3,860           535 7.21
నమస్తే తెలంగాణ        1,880           152 12.37
ప్రజాశక్తి           101              12 8.42
ఆంధ్రప్రభ           882           271 3.25
ఆంధ్రభూమి        2,300           770 2.99
పై పత్రికలన్నీ కలిపి     26,423        4,470 5.91
ట్విట్టర్        8,500        1,860 4.57
ఫేస్‌బుక్   2,89,000     67,900 4.26
బ్లాగ్‌స్పాట్     17,000        8,370 2.03
వర్డ్‌ప్రెస్        5,110        2,510 2.04
బ్లాగులు రెండూ కలిసి     22,110     10,880 2.03
మొత్తం గూగుల్ ఫలితాలు 28,00,000   8,96,000 3.13


  1. భారత దేశం, భారతదేశం, భారత దేశము, భారతదేశము: వీటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి
  2. భారత, భారతీయ అనే రెండు పదాలను వాడుతున్నాం. (ఉదా: వర్గం:భారత సినిమా నటులు, వర్గం:భారతీయ సినిమా నటులు) కొన్ని సందర్భాల్లో ఈ రెండూ వేర్వేరు అర్థాలనిచ్చినా, చాలా సందర్భాల్లో సమానార్థకాలే అనిపిస్తాయి. కాబట్టి ఈ రెంటిలో దేనికి ప్రాథమ్యత ఇవ్వాలో పరిశీలించాలి.

మరింత సమాచారం కోసం, భారత తో మొదలయ్యే ఇతర వర్గాల పేజీల పేర్లను ఈ అనుబంధ పేజీలో చూడవచ్చు.

అభిప్రాయం మార్చు

మీ అభిప్రాయంలో ఏ పేరు సరైనదో కారణంతో సహా రాయండి.

  • యర్రా రామారావు అభిప్రాయం
    • భారతదేశం అనే పదం సరియైనది.ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు.పాటించవలసిన విధానం.ఎలా అంటే ఏదైనా ఒకపదం తెలుగుభాషలో కలిపిరాయలా, విడగొట్టిరాయాలా అనేదానిపై కొందరి రచయితల అభిప్రాయం తెలుసుకొనగా, వారిలో ఒకరైన పాలకోడేటి సత్యనారాయణరావు గారు తెలిపినఅభిప్రాయం ఇలా ఉంది. "మనం ఉచ్చారణకు అనుగుణంగా పదరచన జరగాలి.అంటే మనం మాట్లాడేటప్పుడు వాటి మద్య విరామం ఉన్నట్లయితే అప్పడు దానిని రెండు పదాలుగా రాయాలి.విరామం లేకపోతే కలిపి రాయాలి. అంటే వ్యవహారిక భాషలో రాయాలి.రచనలు అన్నీ ఇలానే రాస్తారు అనే అభిప్రాయం వెలిబుచ్చారు". భారతదేశం అని కలిపి పలుకుతాం కానీ భారత దేశం అని అనం.దీనిని బట్టి "భారతదేశం" సరియైన పదం.అలాగే భారతదేశములో రెండవ పదం దేశము అనే విషయానికి వస్తే, 'ము' బదులు 'అనుస్వారం' (సున్న) వాడాలని గతంలోనే సముదాయంలో చర్చించి నిర్ణయం చేయబడింది.వీటి ప్రకారం భారతదేశం సరియైన పదం.ఇదే పద్దతి వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణప్రాజెక్టులో ఆంధ్ర ప్రదేశ్.. ను ఆంధ్రప్రదేశ్..గా ప్రకారం మార్చుట జరిగింది.ఇది ఈ ఒక్క పదానికి కాదు.అలా కలిపిపలికే అన్ని పదాలకు వర్తిస్తుంది.అలాగే వ్యాసాలలో ఉన్న ఇలాంటి పదాలుకూడా గుర్తించి AWB ద్వారా తగిన మార్పులు చేయవలసిన ఆవశ్యకత ఉంది. దీనిమీద సరియైన అవగాహన, తగిన నియమాలు, లేదా మార్గదర్శకాలు లేనందున, ఒకరు చేసిన మార్పులును ఇంకొకరు తిరిగి మరలా మార్పులు చేయుట జరుగుతుంది.ఈ మధ్యలో కాత్త వాడుకరులు కేవలం ఇలాంటి పదాలను విడగొట్టుట జరుగుతుంది.అందరికి ఇష్టమైన అభిప్రాయం వికీపీడియా శైలి, మార్గదర్శకాలలో చేర్చవలసిఉంటుంది. చదువరి గారు వివిధ తేడాలుతో ఉన్న వర్గాలు గుర్తించి, చర్చకు తీసుకొచ్చినందుకు వార్కి నా అభినందనలు. --యర్రా రామారావు (చర్చ) 13:57, 23 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
    • ఇక భారత, భారతీయ అనే పదాలలో రెండవ పదమైన 'భారతీయ' బాగుంటుందని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 15:11, 23 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • భారతదేశం సరియైనది. అలాగే భారతీయ భాషాపరంగా బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 17:03, 23 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • భారతదేశం పదమును నా వ్యాసాలలో ఎక్కువగా రాస్తున్నాను సార్.ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)05:34, 25 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • భారతదేశం అని రాయాలని నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 10:39, 25 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • భారతదేశం అనే పదం వాడటం సరైనదని నా అభిప్రాయం. – K.Venkataramana  – 10:53, 25 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • భారత / భారతీయ: భారత, భారతీయ అనే రెండిట్లో ఒక్కటి మాత్రమే సరిపోయి రెండోది అసలు అతకని సందర్భాలుంటాయి. అక్కడ రెండో మాట పొసగదు. ఉదాహరణకు వర్గం:భారత రాష్ట్రపతులు, వర్గం:భారత ప్రధానమంత్రులు అంటాం గానీ వర్గం:భారతీయ రాష్ట్రపతులు, వర్గం:భారతీయ ప్రధానమంత్రులు అని అనం. కొన్నిచోట్ల రెండూ సబబుగానే అనిపిస్తాయి. ఉదాహరణకు: వర్గం:భారత పరిశోధనా సంస్థలు, వర్గం:భారతీయ పరిశోధనా సంస్థలు ఈ రెండు బాగానే అనిపిస్తున్నాయి నాకు. ఈ విషయంలో నా అభిప్రాయం ఏంటంటే.. ఖచ్చితంగా భారత మాత్రమే రాయాల్సిన సందర్భం ఉంటే అక్కడ భారత అనే రాయాలి. మిగతా అన్ని చోట్లా భారతీయ రాయాలి. __చదువరి (చర్చరచనలు) 10:54, 25 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఆంగ్ల వ్యాసాల వర్గాలలో కూడా ఎక్కువగా category:indian scientists, category: indian people... ఇలా అనేక వర్గాలున్నాయి. వాటి ఆధారంగా చూసినా "భారతీయ" సరైన పదంగా అనిపిస్తుంది. కనుక "భారతీయ" సంబంధిత వర్గాలు ఉండటం సబబనిపిస్తుంది.  – K.Venkataramana  – 11:04, 25 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • భారతదేశం అన్న పదమే బాగుంటుంది. నేను వ్యాసాలలో ఈ పదాన్నే వాడుతున్నాను. ఇక, భారత, భారతీయ పదాల విషయంలో చదువరి గారు చెప్పినది బాగుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:29, 29 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పైవేమీ కాదు మార్చు

ఏ పేరైనా ఒకటే అనుకున్నా, అసలు అభిప్రాయమే లేనట్లైనా, లేదా పై విభాగానికి చెందని వేరే ఏ అభిప్రాయమైనా ఇక్కడ రాయండి.

నిర్ణయం మార్చు

చర్చలో పాల్గొన్న సభ్యులందరూ భారతదేశం అనే పదాన్ని వాడమని సూచిస్తున్నారు కాబట్టి. వర్గానికి ఆ పేరు పెట్టుకుందాం. భారత, భారతీయ విషయంలో యర్రా రామారావు గారు, రాజశేఖర్ గారు, వెంకటరమణ గారు భారతీయ అనే పదాన్ని సమర్థించారు. ఇక సందర్భానికి తగిన పదాన్ని ముందు చేర్చుకోవాలని చదువరి గారు ప్రతిపాదించగా, ప్రణయ్ రాజ్ గారు దాన్ని సమర్థించారు. ఇక్కడ మెజారిటీ సభ్యులు భారతీయ అనే పదాన్ని సమర్థించినా చదువరి గారి ఉదాహరణల వల్ల సందర్భానికి తగిన పదాన్ని వాడితేనే బాగుంటుందని నా నిర్ణయం. - రవిచంద్ర (చర్చ) 06:15, 4 నవంబర్ 2020 (UTC)