వికీపీడియా:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ప్రాథమిక పేజీ ఇది. ప్రస్తుతం యూజర్ గ్రూప్ లక్ష్యాలు, విధానాలు, ఇతరేతర అంశాలు నిర్ణయించుకోవడానికి ఉపయోగించే చర్చలకు కేంద్రంగా ఉపయోగపడుతుంది. పోనుపోను దీని రూపం మారుతుంది.
చర్చావేదిక |
---|
లక్ష్యాలు, ఆశయాలు
మార్చు- తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల (బహుళ భాషల ప్రాజెక్టులు సహా) అభివృద్ధి, ప్రాచుర్యం కోసం కృషి చేయడం.
- మరింతమంది తెలుగువారికి వికీమీడియా ప్రాజెక్టుల గురించి తెలియజెప్పడం, వాటిలో శిక్షణనివ్వడం.
- తెలుగు వికీమీడియన్లు, ఇతర భారతీయ భాషల వికీమీడియన్లు - ఒకరి అభివృద్ధి, కృషి గురించి మరొకరు తెలుసుకుని, ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవడానికి వీలు కల్పించడం.
- తెలుగు వికీమీడియన్లు వికీమీడియా ప్రాజెక్టులకు మరింతగా మెరుగ్గా కంట్రిబ్యూట్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు మెరుగుపరచడానికి కృషిచేయడం.
- తెలుగు వికీమీడియా సముదాయం చేపట్టే కార్యకలాపాలకు అవసరమైన మేరకు మద్దతు
యూజర్ గ్రూప్ లక్ష్యాలు, ఆశయాల గురించిన ప్రతిపాదనలు, భవిష్యత్ చర్చల కోసం తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/లక్ష్యాలు, ఆశయాల ప్రతిపాదన చూడండి.
విధి విధానాలు
మార్చుయూజర్ గ్రూప్ లక్ష్యాలు, ఆశయాల గురించిన చర్చ కోసం తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/విధి విధానాల ప్రతిపాదన చూడండి. ఆ ప్రతిపాదనలపై అక్కడే చర్చించండి.
కాంటాక్ట్ పర్సన్స్
మార్చువికీమీడియా ఫౌండేషన్‌తోనూ, ఇతరులతోనూ సంస్థ తరఫున ప్రాథమికంగా వ్యవహరించేందుకు కనీసం ఇద్దరు కాంటాక్ట్ పర్సన్స్ అవసరం. వికీమీడియా ఫౌండేషన్ గుర్తింపు కోసం తప్పనిసరి అయిన అంశాల్లో ఇది ఒకటి. ఈ కాంటాక్ట్ పర్సన్ల ఎంపిక వేరు, సంస్థ అధ్యక్ష, ఉపాధ్యక్షులు మొదలుకొని ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక వేరు. ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక తర్వాత విధివిధానాలు ఏర్పటయ్యాకా జరుగుతుంది. కాంటాక్ట్ పర్సన్స్ ఎంపికపై చర్చ ఇక్కడ
కార్యకలాపాలు
మార్చుతెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ 2023లో నిర్వహించబోయే కార్యక్రమ ప్రణాళిక చిత్తుప్రతి, పరిశీలించి దాని చర్చాపేజీలో చర్చించగలరు.
- సమావేశాలు
- యూజర్ గ్రూప్ సమావేశం - సెప్టెంబరు 2023: అజెండాలో భాగమైన వికీమీడియా ఫౌండేషన్ గ్రాంట్ల గురించిన శిక్షణా కార్యక్రమంపై, తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించి, వికీవైబ్రెన్స్ - తెవికీలో యువత అంశంపై చర్చ జరిగింది. అది కాక, తెలుగు వికీపీడియన్లకు వ్యాస రచన విషయంలో నైపుణ్యాల పెంపు, శిక్షణ గురించి, మొదటి పేజీలో తెవికీలో ఎలా రాయచ్చన్న అంశం ఉంటే బావుంటుందన్న ఆలోచనపై, తెవికీలోకి వయోవృద్ధులు, రిటైర్డ్ టీచర్లను తీసుకువచ్చే కార్యకలాపాలు చేపడితే బావుంటుందనీ కూడా చర్చలు జరిగాయి. పవన్ సంతోష్ ప్రస్తుతం తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్‌కు వికీమీడియా ఫౌండేషన్ అఫ్లియేట్‌గా గుర్తింపు రావడంపై అప్డేట్స్ అందించారు.
- తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్ తరపున "మూవ్ మెంట్ చార్టర్ రాటిఫికేషన్" అఫ్లియేట్ ఓటు వేయడం గురించిన అవగాహన కొరకు పవన్ సంతోష్ 9 జులై 2024న 7.30-9pmకి తెలుగు వికీమీడియాన్స్ తో ఒక సమావేశాన్ని నిర్వహించారు.
కార్యక్రమాలు
- తెవికీ బడి నిర్వహణ: తెలుగు వికీపీడియాలో రాస్తూ, తెవికీ రచనలోని వివిధ అంశాల గురించి నేర్చుకోవాలనుకుంటున్న వాడుకరులకు ఆన్లైన్ ద్వారా ప్రతి ఆదివారం వికీపాఠాల శిక్షణ (కొత్త వాడుకరులకు కూడా అందుబాటులో ఉంది.)
- హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన 2024: డిసెంబర్ 2024లో హైదరాబాద్ లో జరగబోయే జాతీయ పుస్తక ప్రదర్శనలో పాల్గొని తెలుగు వికీపీడియా కార్యక్రమాల విస్తరణ ముమ్మురం చేయడానికి రాపిడ్ గ్రాంట్ కు దరకాస్తు చేయడం
- మూవ్ మెంట్ చార్టర్ రాటిఫికేషన్ తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్ "మూవ్ మెంట్ చార్టర్ రాటిఫికేషన్" కు అనుకూలంగా వోటు వేయడం (Affiliate vote on the Movement Charter Ratification)
ప్రాజెక్టులు
- సురవరం ప్రతాపరెడ్డి గ్రంథాలు వికీసోర్స్ ప్రాజెక్టు (తెవికిబడి ద్వారా శిక్షణ)
- గ్రంథాలయ సర్వస్వము "పత్రిక" (కామన్స్, వికీసోర్స్,వికీడేటా) ప్రాజెక్ట్:
- సహకార సంస్థలు: అంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం,విజయవాడ; మనసు ఫౌండేషన్, బెంగళూరు
వికీకామన్స్ వర్క్ షాప్స్
- వికీకామన్స్ లో భద్రాచలం Commons:Wiki Explores Bhadrachalam
- ఛాయాచిత్రాలు లింక్
- భువనగిరి కోట, హైదరాబాద్ ఫోటోవాక్
- మెటా పేజ్ లో 24HourProject Hyderabad
ఇవి చదవండి
మార్చుప్రస్తుతానికి ఈ సమాచారం ఆంగ్లంలోనే అందుబాటులో ఉంది, అందుకు మన్నించాలి.