వికీపీడియా:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/కార్యక్రమాలు/2023/యూజర్ గ్రూప్ సమావేశం - సెప్టెంబరు 2023
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ నెలవారీ సమావేశాలు నిర్వహించుకుంటే బావుంటుందన్న ఆలోచనతో ఇది ప్రారంభిస్తున్నాం. ఇది మొట్టమొదటి యూజర్ గ్రూప్ సమావేశం. ఆన్లైన్లో జరుగుతుంది.
వివరాలు
మార్చు- తేదీ: 2023 సెప్టెంబరు 17, ఆదివారం
- సమయం: ఉదయం 10.30 నుంచి 11.30 వరకూ
- నిర్వహించే చోటు: గూగుల్ మీట్
- నిర్వాహకులు: పవన్ సంతోష్
అజెండా
మార్చుఏదైనా అంశం మీద మాట్లాడదలుచుకుంటే ఈ కింది అజెండా పాయింట్లలో చేర్చగలరు:
- వికీమీడియా ఫౌండేషన్ గ్రాంట్ల గురించిన శిక్షణా కార్యక్రమంపై చర్చ
- తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించి చర్చ
- వికీ లవ్స్ మాన్యుమెంట్స్, తెలంగాణ గురించి చర్చ
- వికీవైబ్రెన్స్ - తెవికీలో యువత
చేరడానికి ఆసక్తిగల సభ్యులు
మార్చు- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:14, 6 సెప్టెంబరు 2023 (UTC)
- NskJnv 13:52, 6 సెప్టెంబరు 2023 (UTC)
- Tmamatha (చర్చ) 14:03, 6 సెప్టెంబరు 2023 (UTC)
- Divya4232 (చర్చ) 14:36, 6 సెప్టెంబరు 2023 (UTC)
- Thirumalgoud (చర్చ) 14:25, 6 సెప్టెంబరు 2023 (UTC)
- V.J.Suseela
- V Bhavya (చర్చ) 07:59, 7 సెప్టెంబరు 2023 (UTC)
- చదువరి (చర్చ • రచనలు)
- ప్రభాకర్ గౌడ్చర్చ 03:59, 7 సెప్టెంబరు 2023 (UTC)
- Vadanagiri bhaskar (చర్చ) 16:00, 7 సెప్టెంబరు 2023 (UTC)]]
- SREEKANTH DABBUGOTTU (చర్చ) 16:42, 7 సెప్టెంబరు 2023 (UTC)
- --Rajasekhar1961 (చర్చ) 19:49, 8 సెప్టెంబరు 2023 (UTC)
- ఆదిత్య పకిడే Adbh266 (చర్చ) 11:31, 9 సెప్టెంబరు 2023 (UTC)
- Kasyap (చర్చ) 04:52, 11 సెప్టెంబరు 2023 (UTC)
- KINNERA ARAVIND (చర్చ) 09:50, 14 సెప్టెంబరు 2023 (UTC)
- యర్రా రామారావు (చర్చ) 10:53, 14 సెప్టెంబరు 2023 (UTC)
- Muralikrishna m (చర్చ) 05:01, 17 సెప్టెంబరు 2023 (UTC)
స్పందన
మార్చుదాదాపుగా 100% ముందుగా ఆసక్తికనబరిచిన వారందరూ హాజరు కావడం విశేషం. ఈ సమావేశం నిర్వహించిన పవన్ సంతోష్ గారితో పాటు ఎంతో విలువైన సమాచారం అందించిన ప్రతిఒక్కరికీ అభినందనలు. Muralikrishna m (చర్చ) 10:45, 17 సెప్టెంబరు 2023 (UTC)
- @Muralikrishna m గారూ, చాలా ధన్యవాదాలండీ. అందరం హాజరుకావడం, ఉత్సాహంగా పాల్గొనడం శుభసూచకం. పవన్ సంతోష్ (చర్చ) 21:02, 23 సెప్టెంబరు 2023 (UTC)
నివేదిక
మార్చుఈ కింది నివేదికలోని అంశాలు ప్రస్తుతానికి పవన్ సంతోష్‌కి గుర్తున్నంతమేరకు రాసిన వివరాలు. వీటిని తామేం మాట్లాడామో ఆయా సభ్యులు మార్చే అవకాశం ఉంది, పాఠకులు గమనించగలరు.
అజెండాలోని అంశాలు
మార్చు- వికీమీడియా ఫౌండేషన్ గ్రాంట్ల గురించిన శిక్షణా కార్యక్రమంపై చర్చ
- తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టవచ్చు, ఆ చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమయ్యే వనరులు, ప్రణాళికలు ఎలా వేసుకోవచ్చు, కొన్ని మంచి ప్రాజెక్టుల వివరాలు తెలుసుకుని, ఆర్థిక వనరుల కోసం వికీమీడియా ఫౌండేషన్ వారిని గ్రాంట్ల కోసం ఎలా సంప్రదించాలి, ఎలా అందుకోవాలి, నివేదకలు ఎలా సమర్పించాలి వంటి అంశాల చుట్టూ ఒక సెషన్ నిర్వహించాలని పవన్ సంతోష్ ప్రతిపాదించారు.
- ఈ అంశాలను తెలుగులోనే చెప్పడానికి గత ఆరేడు సంవత్సరాలుగా భారతీయ వికీమీడియా ప్రాజెక్టుల స్థాయిలో పలు ప్రాజెక్టులను చేపట్టి, గ్రాంట్లను సద్వినియోగం చేసి చక్కని కార్యకలాపాలు నిర్వహించిన అనుభవం కలవాడు, భాష పరంగా తెలుగువాడు అయిన కృష్ణ చైతన్య వెలగాను ఆహ్వానించదలిచినట్టు, ఈ కార్యక్రమం పవన్ స్వయంగా నిర్వహించకుండా కొత్తగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉత్సాహవంతుడైన వేరే వికీపీడియన్‌కు నిర్వహణ బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తే వారు బిజీగా ఉన్నట్టు తెలియజేశారని చెప్పారు. ఎవరైనా ఇది నిర్వహించడానికి ఆసక్తి చూపుతున్నట్టైతే వారిని కృష్ణచైతన్యకు పరిచయం చేసి ఈ కార్యక్రమం నిర్వహణలో సాయం చేయగలనని అన్నారు. ఎవరూ ముందుకు రాకుంటేనే తాను నిర్వహిస్తానని చెప్పారు.
- దీనిపై మురళీకృష్ణ.ఎం. గారు సూచిస్తూ - చాలామంది తెలుగు వికీమీడియన్స్‌కి ఇంగ్లీష్, కొంతవరకూ హిందీ అర్థం అవుతుంది కాబట్టి కార్యక్రమం విషయంలో ఆ పరిమితులు పెట్టుకోకుండా ఈ అంశంపై పట్టు ఉన్న ఇతర స్పీకర్లను కూడా ఆహ్వానించమని సూచించారు. ఇది ఒక్కరోజులోనో, ఒక్క పూటలోనో చేసే కార్యక్రమం కాదని, కనీసం రెండు మూడు రోజులైనా ఉండాలని సూచించారు. వరుసగా ఒక మూడు నాలుగు ఆదివారాలు నిర్వహించుకుంటే బావుంటుందా అని పవన్ ప్రశ్నించగా అలా చెయ్యొచ్చని చాలామంది సమాధానమిచ్చారు. నిఖిల్ వరుసగా మూడు నాలుగు ఆదివారాల కార్యక్రమమైతే ఆసక్తి కోల్పోయి కొందరు సభ్యులు కొనసాగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆసక్తి నిలబడి కొనసాగగలిగినవారే ఇలాంటి కార్యక్రమాలకు ముఖ్యమని, అందువల్ల 25 మందితో ప్రారంభమై, ఓ 7-10 మంది మిగిలినా వారు కార్యక్రమాలు నిర్వహించగలిగితే కార్యక్రమం విజయవంతం అయినట్టేనని పవన్ తన అభిప్రాయం చెప్పారు.
- తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించి చర్చ
- పవన్ సంతోష్ ప్రవేశపెట్టిన ఈ రెండవ అజెండా అంశాన్ని గురించి వివరిస్తూ గతంలో తెవికీ వార్షికోత్సవాలను రెండు పద్ధతుల్లో చేసుకున్నామని చెప్పారు. మొదటి పద్ధతిలో 2014, 2015ల్లో పదో వార్షికోత్సవం, పదకొండో వార్షికోత్సవం చేసుకున్నామని, దీని ప్రకారం తెలుగు వికీపీడియన్లు అత్యధికులు ఒకచోటకు వచ్చి కలిసి, రెండు మూడు రోజులు వైభవోపేతంగా జరుపుకున్నామని, 2014లో విజయవాడలోని కేబీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో, 2015లో తిరుపతిలోని ఉదయీ ఇంటర్నేషనల్ హోటల్‌లో నిర్వహించుకున్నామని తెలియజేశారు. ఈ రెంటికన్నా ముందే 2013లో హైదరాబాద్‌లో తెవికీ ఉగాది మహోత్సవం నిర్వహించుకున్న సంగతి కూడా గుర్తుచేసుకున్నారు. రెండో పద్ధతిలో 2018, 2019ల్లో హైదరాబాద్‌లో సరళంగా ఆ ప్రాంతానికి చెందినవారు వచ్చి కలిసి ఒక ఐదు పదివేల ఖర్చుతో మనం మనం కలిసి చేసుకున్నామని చెప్పారు.
- మొదటి పద్ధతి నుంచి రెండవ పద్ధతికి రావడానికి కారణం మూడు పెద్ద స్థాయి తెలుగు వికీమీడియా సమావేశాలు నిర్వహించాకా ఉన్న సముదాయం అంతే ఉండడమూ, అది విస్తరణ కాకుండా ఈ భారీ పనులు ప్రతీ ఏడాది చెయ్యాలంటే సముదాయానికి ఓపిక లేకపోవడమూ కారణాలని పవన్ వివరించారు. అలానే, ఈ కార్యక్రమాల వల్ల ఏమిటి లాభం అన్న ప్రశ్న కూడా తలెత్తిందని చెప్పారు. ఉన్న సముదాయ సభ్యులు అప్పటికే ప్రతీ ఏడాది కలవగలిగి ఒకరికొకరు బాగా తెలియడం వల్ల "సముదాయ సభ్యులు ఒకరినొకరు కలుసుకుని పరిచయం చేసుకుని, ఆలోచనలు పంచుకోవడం" అన్న లక్ష్యం ఒక్కటీ సరిపోలేదని, చేసే పనికి, వచ్చే ఫలితానికి లంగరందట్లేదని భావించి మానేశామని చెప్పారు.
- అయితే, ఆఖరి పెద్ద తెవికీ సమావేశానికి (2015) నేటికీ మధ్య ఎనిమిదేళ్ళ వ్యవధి ఉండడంతో ఈ మధ్యకాలంలో కొత్తగా చేరి యాక్టివ్ అయిన చాలామంది వికీపీడియన్లు ఒకరినొకరు కలుసుకోలేదనీ, ఇప్పుడు చేయడానికి ఉత్సాహం ఉంటుందని భావిస్తున్నామని కనుక పెద్ద ఎత్తున 20వ వార్షికోత్సవాన్ని తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తరఫున నిర్వహించుకుందామని ప్రతిపాదించారు. 2013, 14, 15ల్లో నిర్వహించిన వారు సలహాదారులుగా ఉండి, అప్పుడు నిర్వహణలో పాలుపంచుకున్న అనుభవం లేనివారు నిర్వహణ తలకెత్తుకుంటే బావుంటుందని సూచించారు.
- ఎక్కువమంది హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్‌లో చేసుకుంటే బావుంటుందని నిఖిల్ ప్రతిపాదించారు. ఎక్కడ నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి వంటి వివరాలన్నీ తెలుగు వికీపీడియా రచ్చబండలోని చర్చల్లో నిర్ధారించుకుందామని, ప్రస్తుతానికి తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తెవికీ 20వ వార్షికోత్సవం నిర్వహించడానికి ఆసక్తితో ఉందా లేదా అన్నది నిర్ణయించుకుందామని ప్రణయ్ రాజ్, మరికొందరు సభ్యులు ప్రతిపాదించారు. అందుకు అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
- వికీవైబ్రెన్స్ - తెవికీలో యువత
- నేతి సాయికిరణ్ తాను అజెండాలో చేర్చిన ఈ అంశాన్ని గురించి మాట్లాడుతూ వికీమీడియా ప్రాజెక్టుల్లో యువత భాగస్వామ్యాన్ని, వారి ఆసక్తులకు సంబంధించిన కంటెంట్ పెంచడాన్ని గురించి పనిచేస్తున్న వికీవైబ్రెన్స్ ప్రాజెక్టు గురించి చెప్పారు. ఈ స్ఫూర్తితో తెవికీలో యువత అన్న ఆలోచనను పంచుకున్నారు. తెవికీలో యువత భాగస్వామ్యం ప్రాధాన్యత వివరించి, యువత పెరగడానికి, వారికి సంబంధించిన కంటెంట్ పెరగడానికి పనిచేయడం దీని లక్ష్యం అన్నారు. ఈ క్రమంలో తెవికీలో యువత ఒక ఇన్‌ఫార్మల్ గ్రూప్‌గా ఏర్పాటుచేయడానికి అభ్యంతరాలు ఏమైనా ఉంటాయా అని అడిగారు.
- దీని విషయంలో పవన్ సంతోష్ మాట్లాడుతూ ఇది మంచి ఆలోచన అనీ, ఇందుకు అభ్యంతరాలు ఉంటాయని తాను అనుకోననీ అన్నారు. ఇన్‌ఫార్మల్ గ్రూప్ రూపంలో కాకుండా ఒక వికీ ప్రాజెక్టుగా తెవికీలో ప్రారంభిస్తే బావుంటుందని సూచన చేశారు. వికీ ప్రాజెక్టులు అన్నవి కేవలం కంటెంట్ పెంపుకే నడిపే పనిలేదనీ, తెవికీ అభివృద్ధి విషయంలో ఎలాంటి లక్ష్యాలతోనైనా వికీ ప్రాజెక్టులు ఉండొచ్చని సూచించారు. తెలుగులో విజయవంతంగా నిర్వహించాకా, మిగిలిన భాషలకు సైతం దీన్ని విస్తరించే ప్రయత్నాలు చేపట్టవచ్చనీ చెప్పారు. సాయి కిరణ్ ఈ సూచనపై మాట్లాడుతూ ఇది మంచి సూచన అనీ, ద వికీవైబ్రెన్స్ కూడా ఒక వికీ ప్రాజెక్టేనని ప్రతిస్పందించారు.
- వికీ లవ్స్ మాన్యుమెంట్స్, తెలంగాణ గురించి చర్చ
- సమయం లేనందువల్ల, అప్పటికే వికీ లవ్స్ మాన్యుమెంట్స్ తెలంగాణ కార్యకలాపాలు జరుగుతున్నందువల్ల ఈ అజెండా అంశాన్ని పవన్ సంతోష్ ఉపసంహరించుకున్నారు.
ఇతర చర్చ
మార్చు- తెలుగు వికీపీడియన్లకు వ్యాస రచన విషయంలో నైపుణ్యాల పెంపు, శిక్షణ
- తెలుగు వికీపీడియన్లకు వ్యాస రచన విషయంలో నైపుణ్యాలను పెంచేలా శిక్షణ అవసరమనీ, ఇది నేర్చుకునేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తే బావుంటుందని శ్రీకాంత్ పేర్కొన్నారు. మొదట తాము పూర్తిస్థాయిలో ఒక వ్యాసం ఎలా రాయాలి, ఎలాంటివి మూలాలుగా ఉపయోగించుకోవాలి, నియమ నిబంధనలు ఏమిటి, ఇంకెలా వికీమీడియా ప్రాజెక్టుల్లో కృషిచేయవచ్చు వంటి విషయాలు నేర్చుకుంటేనే కొత్తవారికి నేర్పగలమని సూచించారు.
- పవన్ సంతోష్ మాట్లాడుతూ ఇది చాలా సరైన సూచన అనీ, అడ్వాన్స్డ్ వికీ ట్రైనింగ్ విషయంలో కార్యక్రమాలు ఏర్పాటుచేయడానికి కృషిచేస్తాననీ చెప్పారు. మరికొందరు వికీపీడియన్లు (వి.జె.సుశీల) మాట్లాడుతూ ఇటీవల చదువరి, యర్రా రామారావు, కశ్యప్ తదితరులు పాల్గొన్న శిక్షణా కార్యక్రమాల వీడియోలు తమ వద్ద ఉన్నాయనీ, వాటిని తెవికీ వాట్స్ అప్ సమూహం లో పంచుకుంటామనీ తెలియజేశారు.
- మొదటి పేజీలో తెవికీ కృషి గురించి
- విజే సుశీల మాట్లాడుతూ తెలుగు వికీపీడియాలో జరిగే ప్రాజెక్టులు, కార్యకలాపాలు, కృషి వంటివేమీ మొదటి పేజీలో ఉండవనీ, దీనివల్ల వికీపీడియా పాఠకులు వాడుకరులుగా మారడాన్ని ఆమేరకు తగ్గిస్తోందనీ అభిప్రాయపడ్డారు. అలా కాకుండా, జరుగుతున్న ప్రాజెక్టుల గురించి, చేయదగ్గ పనుల గురించి మొదటి పేజీలో కూడా ఉంటే బావుటుందని అన్నారు.
- ఈ అంశంపై తనకు భిన్నాభిప్రాయం ఉందని చదువరి పేర్కొన్నారు. మొదటిపేజీ పాఠకులది అనీ, అందులో పాఠకులకు ఉపయోగపడే సమాచారం ఉండాలనీ తన అభిప్రాయంగా చెప్పారు. తెలుగు వికీపీడియాలో నమోదయ్యే పాఠకుల్లో అత్యధికులు ఎందుకు నమోదు చేసుకుంటున్నామో తెలీకుండానే నమోదవుతారని, తాము నమోదుచేసుకున్న సంగతి కూడా వారు పట్టించుకోరనీ, ఒక ఎఫ్బీలో రిజిస్టర్ అయినట్టే అవుతారన్నారు. వారందరికీ వికీపీడియాలో వ్యాసాలు చదవడమే ఆసక్తి తప్ప వెనుక పనిచేసే ఉద్దేశం అత్యధికులకు ఉండదనీ, ఉండనక్కరలేదనీ అన్నారు. ఒకవేళ రాయడం ప్రారంభించినవారు కూడా ఇది మిగిలిన సోషల్ మీడియాల్లాగా తోచింది రాయొచ్చు అనుకునేవారు ఉంటారనీ, వారికి అలా కుదరదు, చాలా పనిచేయాలని తెలియగానే వెళ్ళిపోతారనీ తాను గమనించింది చెప్పారు. కొద్దిమంది మాత్రమే నిలుస్తారనీ, ఇది సహజం అనీ అన్నారు. అందువల్ల మొదటి పేజీ ప్రధానంగా పాఠకుల కోసమే ఉండాలన్నారు.
- దీనిపై పవన్ సంతోష్ మాట్లాడుతూ - దీని విషయంలో తన ఆలోచన రెంటికీ మధ్యలో ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా సోషల్ మీడియా సైట్లు మొదట్లోనే రాయమని ప్రోత్సహిస్తాయని, కాబట్టి - మొదటి పేజీలో కొంత స్థలం వికీలో కృషిచేయవచ్చన్నది తెలియజేయడానికి, ప్రోత్సహించడానికి వాడొచ్చన్నారు. అయితే, నేరుగా వికీ ప్రాజెక్టుల వివరాలు ఇవ్వడం మాత్రం అన్నప్రాశన నాడు ఆవకాయముద్దలా వారు అయోమయానికి గురిచేయవచ్చనీ అన్నారు. అందుకు భిన్నంగా "ఫలానా ఫలానా పనులు చేయవచ్చు, ఫలానా నియమాలు పాటించాలి" అని నేరుగా, తేలికగా తెలిసేలా ఆ ఆహ్వానం ఉండాలనీ, కామన్స్ యాప్‌లో ప్రతీ నెలా ఒక ఛాలెంజ్ ఉంటుందనీ, అలాంటివి పెడితే బావుంటుందనీ అన్నారు.
- చదువరి, పవన్ సంతోష్‌లిద్దరూ రచ్చబండలో ఈ అంశంపై తప్పక రాయమనీ, ఇది యూజర్ గ్రూప్ నిర్ణయించే సంగతి కాదనీ, తెలుగు వికీపీడియా సముదాయంలో చర్చిద్దామని, అయితే తప్పక చర్చించదగ్గ సంగతేననీ సుశీల గారికి సూచించారు.
- తెవికీలోకి వయోవృద్ధులు, రిటైర్డ్ టీచర్లు
- తెలుగు వికీపీడియాలో రాయడానికి అందరికీ ఆసక్తి ఉండదనీ, కొంతమందికి మాత్రమే ఈ ఆసక్తి ఉంటుందని చదువరి అభిప్రాయపడ్డారు. మినహాయింపులు ఉన్నా స్థూలంగా చూస్తే - చదువుకునేవారు, ఉద్యోగార్థులు, కొత్తగా ఉద్యోగం వచ్చినవారు - వంటి వ్యక్తులకు జీవితంలో ఉండే రకరకాల పనుల ఒత్తిడి వల్లనూ, ఇప్పటి చదువుల ధోరణిలో తెలుగుపై ఉండే నిరాసక్తత వల్లనూ పెద్దగా తెవికీలో రాయడానికి ఆసక్తి ఉండకపోయే అవకాశం ఉందన్నారు. ఇందుకు బదులుగా, వయోవృద్ధులు, అంటే 50లు దాటి, 60లు, 70లలో ఉండేవారు మాత్రం తెవికీలో పనిచేయడానికి ఆసక్తి చూపే అవకాశం ఎక్కువని తన అనుభవం చెప్తోందన్నారు. వారికి సద్వినియోగం చేసుకోవడానికి ఉండే ఖాళీ సమయమూ, పదిమందికీ ఏదోకటి చెప్పాలన్న తృష్ణ ఇందుకు ప్రోత్సహిస్తాయని చెప్పారు. ఇందులో కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి పరిశోధన చేయడంలోనూ, రాయడంలోనూ కొంత మెరుగైన అనుభవం ఉండడం వల్ల, రిటైర్డ్ టీచర్లు తెవికీలో ఎక్కువ పాల్గొనేందుకు అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి, వారిని దృష్టిలో పెట్టుకుని అవుట్‌రీచ్ కార్యక్రమాలు చేపడితే ఫలితం బావుండవచ్చని ప్రతిపాదించారు.
- తెలుగు వికీమీడియన్స్ గుర్తింపు, వార్షిక ప్రణాళిక
- తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్‌ని వికీమీడియా ఫౌండేషన్ గుర్తించే పని ఎందాకా వచ్చిందని కశ్యప్ అడిగారు. పవన్ సంతోష్ మాట్లాడుతూ తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్‌ని కనీస నిబంధనలు పాటిస్తూ ఏర్పాటుచేసి, WMF గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నామని, వారు స్పందిస్తామన్నారనీ చెప్పారు.
- ప్రస్తుతానికి ఈ గ్రూపు అనధికారికమా అన్న ప్రశ్నకు పవన్ మాట్లాడుతూ - తెలుగు వికీమీడియా సముదాయంలో చర్చించి మనకంటూ ఒక యూజర్ గ్రూప్ ఉండవచ్చునని నిర్ణయించుకుని ఏర్పాటుచేసినందువల్ల ఇది తెలుగు వికీమీడియా సముదాయం ప్రకారం అధికారికమేనని, WMF గుర్తింపు వచ్చినప్పుడు వస్తుందనీ, అందాకా ఇది అనధికారికం అనుకోవాల్సిన పనిలేదని స్పష్టంచేశారు. WMF గుర్తింపు లోగో, ట్రేడ్‌మార్క్ వంటివి వాడుకోవడానికి, అఫ్లియేట్ కావడానికి, ఫండింగ్ - అంతర్జాతీయ స్థాయి అఫ్లియేట్ చర్చలు వంటివాటిలో ఒకమేరకు ఉపయోగపడతుందని, అది మినహాయిస్తే మిగిలిన కార్యకలాపాలు చేసుకోవడానికి మనకేమీ అడ్డులేదని చెప్పారు.
- యూజర్ గ్రూప్ కార్యక్రమాలను ఒక్కరో ఇద్దరో కాకుండా ఎక్కువమంది వేర్వేరు కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తూ చేసుకుందామనీ, ఈలోగా అందరమూ ఆలోచనలు-ఐడియాలు పంచుకుందామనీ, ఫండింగ్ అవకాశాలూ, మన బలాబలాలూ అర్థంచేసుకున్నాకా ఏడాది పాటు కనీసం ఏమేం చేయగలమో పరిశీలించి వార్షిక ప్రణాళిక ఏర్పాటుచేసుకుందామని పవన్ సూచించారు. బలాబలాలు, పనిచేయగల వ్యక్తులు తెలుసుకోవడానికి వార్షికోత్సవం మంచి సందర్భమనీ, అది జరిగితే ఎవరు ఏమేం చేయగలరో, చేస్తారో కొంతమేరకు అర్థమవుతుందనీ పేర్కొన్నారు.
యాక్షన్ పాయింట్లు
మార్చు- తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవాన్ని అందరూ కలిసేలా, పెద్ద ఎత్తున నిర్వహించుకోవడానికి తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తరఫున రచ్చబండలో ప్రతిపాదించాలి. ఆ చర్చలో ఎక్కడ, ఎలా, ఎంత, ఎవరు - వంటివి నిర్ణయించుకోవాలి. తదుపరి కార్యాచరణ నిర్ణయించుకోవాలి. ఈ ప్రతిపాదన పవన్ సంతోష్ చేస్తారు.
- అక్టోబరులో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ సభ్యులకు కృష్ణచైతన్య వెలగా, తన్వీర్ హాసన్ వంటి అనుభవజ్ఞులు, నిపుణులను ఆహ్వానించి ప్రాజెక్టుల నిర్వహణ - అందుకు అవసరమయ్యే గ్రాంట్ అవకాశాలు అన్న అంశంపై రెండు మూడు ఆన్‌లైన్ సెషన్లు నిర్వహించాలి. ప్రస్తుతానికి పవన్ సంతోష్ ఈ విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళినా ఎవరైనా నిర్వహణా బాధ్యతలు తీసుకుంటానంటే అప్పగిస్తారు.
- నేతి సాయికిరణ్ తెవికీలో యువత వికీ ప్రాజెక్టు ఏర్పాటు, నిర్వహణ వంటివి చేస్తారు.
- వీజే సుశీల వీలున్నప్పుడు తెలుగు వికీపీడియా రచ్చబండలో "మొదటి పేజీలో తెవికీలో పనిచేయడం గురించిన" సమాచారం అందుబాటులోకి తేవడంపై చర్చ లేవనెత్తుతారు.