వికీపీడియా:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/చర్చావేదిక
సూచన: ఈ వేదిక కేవలం తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్ తరపున ప్రతిపాదిస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన చర్చలకు, తీసుకోవలసిన నిర్ణయాలకు పరిమితం.
వికీసోర్స్ కు గ్రంథాలయ సర్వస్వం పత్రిక
మార్చుఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం (APLA) ఒక శతాబ్దం పైగా పౌర గ్రంధాలయ ఉన్నతికి పనిచేస్తున్న సంస్థ. ఆ సంస్థ 1916 వ సంవత్సరం నుండి గ్రంథాలయ సర్వస్వం అను పత్రికను ప్రచురిస్తోంది. ఇది గ్రంథాలయ సమాచార విజ్ఞానంలో మొదటి పత్రిక, ఇప్పుడు 84 సంపుటాలు పూర్తి చేసికొని 85లోకి అడుగు పెట్టింది. గ్రంథాలయ సమాచార విజ్ఞానంలోనే కాకుండా, ఈ పత్రిక సాహిత్యం, సంస్కృతి, చరిత్ర, స్వాతంత్రోద్యమ విషయాలు, గ్రంథాలయోద్యమ విషయాలు, ఇతర సామాజిక అంశాల మీద ఆనాటి నుండి వ్యాసాలు ప్రచురిస్తున్నది.
ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఏ.రాజశేఖర్ గారి నుంచి ఈ పత్రిక గురించిన ప్రతిపాదన రావడంతో తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్ తరపునుండి ఆ సంస్థ అధికారులను (మౌఖికంగానే) సంప్రదించి గూగులు మీట్ లో 30 ఏప్రిల్ 2024న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం లో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం తరపున ఆ సంస్థ కార్యదర్శి డా. రావి శారద గారు, వికీ సోర్స్ నుండి డా. రాజశేఖర్ గారు, పవన్ సంతోష్ గారు, నేను (వి.జె.సుశీల) పాల్గొనడం జరిగింది. ఆ సమావేశంలో మన వికీ సోర్స్ విధానాన్ని వివరించి ఆ పత్రికలను వికీసోర్స్ కు అందచేయమని అభ్యర్ధించడమైనది. ఆ ప్రతిపాదనకు శారదగారు అంగీకరించి, ఆ పత్రికలను మొదట విడతగా 11 సంపుటాలను 'మనసు ఫౌండేషన్' వారి సహకారంతో స్కాన్ చేయించగలిగారు. అయితే మన తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్, వికిసోర్స్ తరపునుంచి సంయుక్తంగా APLA సంస్థకు ముందుగా ఒక అభ్యర్ధన పత్రం అధికారికంగా (లెటర్ హెడ్) సమర్పిస్తే వారు ఆయా ఫైల్స్ ఇచ్చిన తరువాత ఒక తీసుకున్న గుర్తింపు పత్రం ఇవ్వవచ్చు.
ఈ ప్రక్రియ వేరే ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో లావా దేవీల విషయంలో భవిష్యత్తులో కూడా అవసరం పడుతుంది అనుకుంటున్నాను. ఈ ప్రక్రియ మన వేదికలలో అమలులో లేదని భావిస్తూ మొదలు పెట్టేటందుకు సభ్యుల అభిప్రాయం, ఆమోదం కోరడమైనది.
ధన్యవాదాలు - --V.J.Suseela (చర్చ) 09:43, 18 జూన్ 2024 (UTC)
- మంచి ప్రయత్నం. ఈ ప్రక్రియకు నా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను.
- స్వరలాసిక (చర్చ) 06:17, 19 జూన్ 2024 (UTC)
- వికీసోర్స్ ప్రాజెక్టు కొద్దిమందితో సుమారు 19000 పైచిలుకు వ్యాసాలతో పురోగమిస్తున్నది. ఈ గ్రంథాలయ సర్వస్వం ప్రాజెక్టు ద్వారా తెవికీ సభ్యులందరినీ తెలుగు వికీసోర్సుకు ఆహ్వానిస్తున్నాను. మీ అందరి సహకారంతో మనం చేయాలనుకొంటున్న 2025 ఉత్సవాల సమయానికి 20 వేల వ్యాసాల మైలురాయి చేరుకోగలదని భావిస్తున్నాను. ఈ ప్రాజెక్టు ముందుకు నడిపిస్తున్న సుశీల గారికి, మీరందరికీ నా ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:57, 20 జూన్ 2024 (UTC)
- Vjsuseela గారూ, బావుందండి. అయితే ఇప్పుడు మన యూజర్‌గ్రూపుకు ఒక లెటర్‌హెడ్ తయారు చేసుకోవాలన్న మాట. మరి "వికీసోర్సుతో సంయుక్తంగా" అన్నారు గదా.. అంటే వికీసోర్సుకు కూడా ప్రత్యేకంగా లెటర్‌హెడ్ కావాలా? లేఖ, వికీసోర్సులో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం లింకును ఇస్తే సరిపోతుందా? __ చదువరి (చర్చ • రచనలు) 11:49, 25 జూన్ 2024 (UTC)
- యూజర్ గ్రూప్ తెలుగులోని అన్ని వికీ ప్రాజెక్టులకు సంబంధించినది అనుకుంటున్నాను. ఒకసారి మన సభ్యుల స్పందన చూసి అందరు కలిసి ఏవిధంగా అనుకూలంగా ఉంటుందో నిర్ణయము తీసుకోవచ్చు. ధన్యవాదాలు. V.J.Suseela (చర్చ) 12:09, 25 జూన్ 2024 (UTC)
- తెలుగు వికీపీడియా, వికీసోర్సులు రెండు యూజర్ గ్రూప్ క్రిందనే వస్తాయి. కాబట్టి వేరుగా తెలియజేయాల్సిన అవసరం లేదనుకుంటాను.--Rajasekhar1961 (చర్చ) 14:33, 25 జూన్ 2024 (UTC)
- మనది వికీమీడియన్ల యూజర్‌గ్రూపు. కాబట్టి వికీసోర్సుతో సహా అన్ని తెలుగు వికీమీడియా ప్రాజెక్టులన్నీ ఇందులో భాగమే. అందులో నాకు సందేహమేమీ లేదు.
- Vjsuseela గారూ. నేను నా మొదటి వ్యాఖ్య సరిగ్గా రాసినట్టు లేను. నేను చెప్పదలచినదేంటంటే.. " అయితే మన తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్, వికిసోర్స్ తరపునుంచి సంయుక్తంగా APLA సంస్థకు ముందుగా ఒక అభ్యర్ధన పత్రం అధికారికంగా (లెటర్ హెడ్) సమర్పిస్తే" అని రాసారు గదా.. వికీసోర్సుకు కూడా లెటర్‌హెడ్ అవసరమా అనే సందేహం వచ్చింది, అంతే. ఆ సందేహం ఎలా ఉన్నప్పటికీ, వికీసోర్సులో ఈ విషయమై ఒక చర్చ, ఒక నిర్ణయం ఉండాలని నా ఉద్దేశం (ఈసరికే జరిగి ఉండకపోతే). __ చదువరి (చర్చ • రచనలు) 23:34, 25 జూన్ 2024 (UTC)
- యూజర్ గ్రూప్ తెలుగులోని అన్ని వికీ ప్రాజెక్టులకు సంబంధించినది అనుకుంటున్నాను. ఒకసారి మన సభ్యుల స్పందన చూసి అందరు కలిసి ఏవిధంగా అనుకూలంగా ఉంటుందో నిర్ణయము తీసుకోవచ్చు. ధన్యవాదాలు. V.J.Suseela (చర్చ) 12:09, 25 జూన్ 2024 (UTC)
అవునండీ. నేను రాసినదానిబట్టి ఆ సందేహం ఉత్పన్నమవుతుంది. అలా రాయకుండా ఇంకొంచెం వివరణ ఉండాల్సింది. కానీ రాయడం లో ఉద్దేశ్యం వరకు వికీసోర్స్ బాధ్యత చూసుకునేవారు, యూజర్ గ్రూప్ కు సంబంధించిన వారు దీంట్లో సంతకం వగైరా చేసి కాంటాక్ట్ లో ఉండాలని. నాకు అర్థమవుతున్న వరకు లెటర్ హెడ్ లాంటి ప్రక్రియ ఇక్కడ లేదు, యూజర్ గ్రూప్ కొత్తగా ఏర్పడినది, ఇక్కడ వుండే అవకాశం ఉండవచ్చు, కాబట్టి దానికి సంబంధించిన విషయాలకు చర్చ ఉండాలని వేరే వేదిక (పవన్ గారి సూచనతో) ఏర్పరచడం జరిగింది. చర్చ నిర్ణయం దిశగా వెళ్తున్నందుకు ధన్యవాదాలు. Vjsuseela.
గ్రంథాలయ సంచికలు ఎన్నో వివరాలతో కూడుకుని ఉంటాయి వీటిని వికీ లోకి తీసుకొస్తున్నందుకు కృతజ్ఞతలు. Kasyap (చర్చ) 11:19, 25 జూన్ 2024 (UTC)
గ్రంథాలయ సర్వస్వం పత్రిక
మార్చుఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం (APLA) వారు సంపుటి 1 (1916) నుండి 11 (1937) వరకు, 71 PDF ప్రతులను స్కాన్ చేయించి మనకు అందచేశారు. మన తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్, వికిసోర్స్ తరపునుంచి తరువాతవి కూడా ఇవ్వమని అధికారికంగా కోరడమైనది. ఈ ప్రక్రియ కొనసాగడానికి సహకరించిన రాజశేఖర్ గారికి, పవన్ సంతోష్ గారికి, సానుకూల చర్చ జరిపిన సభ్యులకు కృతజ్ఞతలు. --V.J.Suseela (చర్చ) 08:00, 20 జూలై 2024 (UTC)
మూవ్‌మెంట్ చార్టర్ అనుమోద (రాటిఫికేషన్) ప్రక్రియలో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఓటు - అభిప్రాయాలు
మార్చువికీమీడియా మూవ్‌మెంట్ చార్టర్ అన్నది వికీమీడియా ఉద్యమాన్ని నడిపించే వ్యవస్థలు, వాటి గతిని నిర్ణయించే విలువలు, సూత్రాలు, విధానాలతో కూడిన మౌలికమైన డాక్యుమెంట్. ఇది వికీమీడియా ఉద్యమంలోని గ్రూపులూ, నిర్ణయాధికారం కలిగిన వ్యవస్థల బాధ్యతలు, అధికారాలను నిర్వచిస్తుంది, ఇందులో ఇప్పుడున్నవీ ఉన్నాయి, రాబోతున్నవీ ఉన్నాయి. ప్రపంచం అంతటికీ స్వేచ్ఛా విజ్ఞానాన్ని అందించాలన్న దృక్పథంతో అంతా ఒకతాటి మీదికి వచ్చేందుకు ఇది పనికివస్తుందని చాప్టర్ చెప్తుంది.
ఈ చాప్టర్‌ని వికీమీడియా సముదాయ సభ్యుల నుంచి ఎన్నికైనవారు సంవత్సరాల తరబడి చేసిన కృషి ద్వారా రూపకల్పన చేశారు. ఇంకా మూవ్‌మెంట్ చాప్టర్ అమల్లోకి రాలేదు. అమల్లోకి రావాలన్నా, రాకూడదన్నా అనుమోద (రాటిఫికేషన్) విధానం ద్వారా నిర్ణయం అవుతుంది. అనుమోదం పూర్తై, చాప్టర్‌ని అధికారికంగా ఉద్యమం స్వీకరిస్తే ఇది వికీమీడియా ఉద్యమంలో పాలుపంచుకునే వ్యక్తులకూ, సంస్థలకూ, ఉద్యమంలోని గ్రూపులకు, ప్రాజెక్టులకు, ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ అంతటా అమల్లోకి వస్తుంది.
ఇలా అనుమోదం అవ్వాలంటే వికీమీడియా ఉద్యమంలోని మూడు విభాగాలు ఆమోదించాలి, ఒకటి - వ్యక్తిగత వికీమీడియన్లు వేసే ఓట్లలో 55 శాతం ఆమోదం రావాలి, రెండు - అఫ్లియేట్లు (యూజర్ గ్రూపులు, చాప్టర్లు) ఓటింగ్‌లో 55 శాతం ఆమోదం రావాలి, మూడు - వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఆమోదించాలి. ఇందులో ఏది జరగకపోయినా అనుమోదం జరగదు. ఇందులో, తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపుకు వికీమీడియా ఫౌండేషన్ అఫ్లియేట్‌గా ఒక ఓటు ఉంది. ఈ ఓటును మనం 9వ తారీఖు గడచి పదోతారీఖు వచ్చేలోపు వేయాలి. (2024 జూలై 9, 23:59 యూటీసీ) కాబట్టి, సభ్యులు మూవ్‌మెంట్ చార్టర్, అనుబంధ పేజీలు చదివి, అవసరం అనుకుంటే ఈ రెండు మూడు రోజుల్లో ఒక కాల్ పెట్టుకుని, చర్చించుకుని - మనం ఇక్కడే మన అభిప్రాయాలను "ఆమోదిస్తున్నాను", "తిరస్కరిస్తున్నాను" అన్న విధంగా ఓట్ల రూపంలో వేస్తే, ఓటింగ్ ఫలితాన్ని బట్టి మన గ్రూపు చార్టర్ ఆమోదించడమో, తిరస్కరించడమో చేయొచ్చు.
- మూవ్‌మెంట్ చార్టర్: లింకు
- కొందరు భారతీయ వికీమీడియా యూజర్ గ్రూపుల ప్రతినిధులు మూవ్‌మెంట్ చార్టర్ గురించి చేసిన చర్చ తాలూకు సారాంశం: లింకు
--పవన్ సంతోష్ (చర్చ) 17:44, 5 జూలై 2024 (UTC) మూవ్ మెంట్ చాప్టర్ డాక్యుమెంట్ సరళంగా నా పరిధి మేరకు అర్థమైనందుకు నేను దీనికి అనుకూలంగా ఓటు వేయమని Yes ఓటింగ్ లో పాల్గొనే వారికి తెలుపుతున్నాను Vadanagiri bhaskar (చర్చ) 15:55, 9 జూలై 2024 (UTC) === అభిప్రాయాలు ===
- మన యూజర్‌గ్రూపు తరపున ఈ వోటింగులో "yes" అని వోటు వెయ్యమని, వోటింగులో పాల్గొనేవారిని నేను కోరుతున్నాను.__ చదువరి (చర్చ • రచనలు) 09:16, 8 జూలై 2024 (UTC)
- మూవ్‌మెంట్ చార్టర్ డాక్యుమెంట్ గొప్పది కాకపోయినా, ఇందులో చాలా అంశాలు ఇంకా స్పష్టం కాకున్నా దీనివల్ల వికీమీడియా ఉద్యమంలోని అనేక అంశాల్లో నిర్ణయాధికారం వాడుకరులు నిర్ణయించి, వాడుకరులు ఉండే బాడీ చేతికి లభిస్తుంది. ఇది వికీమీడియా ఉద్యమం ఒక అడుగు ముందుకువేయడం కిందికి వస్తుంది. మన యూజర్ గ్రూప్ ఈ ఓటింగులో "Yes" అని ఓటు వేసి ఆనుమోదానికి తోడ్పడుతుందని ఆశిస్తూ, అందుకు అనుగుణంగా ఈ చర్చలో ఓటేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 11:13, 8 జూలై 2024 (UTC)
- సరేనండి--V.J.Suseela (చర్చ) 11:57, 8 జూలై 2024 (UTC)
- మన యూజర్‌గ్రూపు తరపున ఈ వోటింగులో "yes" అని వోటు వెయ్యమని, వోటింగులో పాల్గొనేవారిని నేను కోరుతున్నాను. యర్రా రామారావు (చర్చ) 13:40, 8 జూలై 2024 (UTC)
- మూవ్‌మెంట్ చార్టర్ అనుమోద (రాటిఫికేషన్) ప్రక్రియలో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తరపున "yes" అని ఓటు వెయ్యమని, ఓటింగ్ లో పాల్గొనేవారిని కోరుతున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:42, 8 జూలై 2024 (UTC)
- మన యూజర్ గ్రూప్ తరపున నేను "yes" అని ఓటు వేశాను మీరు కూడా ఓటు వేయమని కోరుచున్నాను. ప్రభాకర్ గౌడ్చర్చ 15:36, 9 జూలై 2024 (UTC)
- తెలుగు వికీమీడియన్స్ యూజర్ గుంపు దీనికి అనుకూలంగా సమ్మతించాలి అని నా అభిప్రాయం --Kasyap (చర్చ) 16:13, 9 జూలై 2024 (UTC)
- మన యూజర్ గ్రూప్ తరపున నేను "yes" అని ఓటు వేశాను. మీరు కూడా ఓటు వేయమని కోరుచున్నాను. V Bhavya (చర్చ) 16:13, 9 జూలై 2024 (UTC)
- నేను కూడా 'Yes' అని అనుకూలంగా ఓటు వేసాను. V.J.Suseela
చర్చ కోసం వీడియో కాల్
మార్చుఈ అంశంపై మనం ఓటింగు ముగించుకుని ఓటు వేయడానికి తగినంత సమయం లేదు. 9వ తేదీ యూటీసీ ప్రకారం రాత్రి 11.59 నిమిషాల తర్వాత ఓటు వేసే వీల్లేదు. అంటే దాదాపు భారతీయ కాలమానం ప్రకారం 10వ తేదీ తెల్లవారుజాము 5.49 నిమిషాలు. దురదృష్టవశాత్తూ, ఈ ఓటింగ్ విషయాన్ని సముదాయం దృష్టికి ఆలస్యంగా తీసుకురాగలిగాము. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దీనిపై ఒక వీడియో కాల్‌లో చర్చించుకుంటే ఒకరి సందేహాలు ఒకరం తీర్చుకోవచ్చనీ, ఆపైన మన మన నిర్ణయాలు అనుకూలం అయినా, ప్రతికూలం అయినా ఇక్కడ ఓట్ల రూపంలో వేసేందుకు వీలుంటుందని, తుదిగా నిర్ణయం తీసుకుని వేయడానికి బావుంటుందని భావిస్తున్నాను. ఇందుకోసం రేపు రాత్రి 7.30 నుంచి 8.30 వరకూ ఎవరికి వీలైతే వాళ్ళు చేరేలా ఒక వీడియో కాల్ నిర్వహించదలిచాను. ఒక వేళ మీకు వీడియో కాల్‌లో చేరే వీల్లేకపోయినా, మీ వరకూ దీనిపై ఒక కాల్ అవసరం లేదని భావించినా మీరు వీలైనంతవరకూ పైన చెప్పిన డాక్యుమెంట్లు చదివి ఇక్కడే ఓటు వేయచ్చు.
కాల్ వివరాలు ఇవిగో:
- మంగళవారం, జులై 9 · రాత్రి 7:30 – 8:30
- టైం జోన్: ఆసియా/కోల్‌కతా
- వీడియో కాల్ లింకు: https://meet.google.com/pco-yrjb-naj
మూవ్‌మెంట్ చార్టర్ అనుమోద (రాటిఫికేషన్) ప్రక్రియలో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఓటుకు విజ్ఞప్తి
మార్చుమూవ్మెంట్ చార్టర్ అనుమోద (రాటిఫికేషన్) ప్రక్రియలో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఓటుకు సంబంధించి పైన చెప్పిన రెండు అంశాలు (సముదాయ ఓటులో అభిప్రాయాలు, వీడియోకాల్ చర్చ అభిప్రాయం) పరిశీలించి సభ్యులు తమ అభిప్రాయాన్ని పైన రాయమని విజ్ఞప్తి చేస్తున్నాను. సముదాయ ఓటు వేయడానికి 9 జులై 2024 రాత్రివరకు మాత్రమే సమయం ఉండడము వలన ఈ అంశాన్ని త్వరగా పరిగణనలోకి తీసుకొమ్మని కోరుతున్నాము.
సందేహాలుంటే పైన పేర్కొన్న వీడియో కాల్ లో పాల్గొని చర్చించి తమ అభిప్రాయాన్ని తెలుపవచ్చు.
@Pranayraj Vangari (talk) 17:28, 15 August 2023 (UTC) Pranayraj Vangari (talk) 17:28, 15 August 2023 (UTC) @ Chaduvari (talk) 04:35, 16 August 2023 (UTC) @Kasyap (talk) 07:27, 16 August 2023 (UTC) @Svpnikhil (talk) 15:38, 16 August 2023 (UTC) @Nskjnv (talk) 02:28, 18 August 2023 (UTC) @Adbh266 (talk) 02:33, 18 August 2023 (UTC) @యర్రా రామారావు (talk) 03:20, 18 August 2023 (UTC) @ప్రభాకర్ గౌడ్ నోముల (talk) 03:51, 18 August 2023 (UTC) @Muralikrishna m (talk) 04:06, 18 August 2023 (UTC) @Divya4232 (talk) 12:42, 18 August 2023 (UTC) @Thirumalgoud (talk) 04:37, 18 August 2023 (UTC) @Vjsuseela (talk) 05:18, 18 August 2023 (UTC) @V Bhavya (talk) 11:56, 18 August 2023 (UTC) @KINNERA ARAVIND (talk) 07:33, 18 August 2023 (UTC) @Ramesam54 (talk)-- 12:04, 18 August 2023 (UTC) @GGK1960 (talk) 12:34, 18 August 2023 (UTC) @Rajasekhar1961 (talk) 14:26, 18 August 2023 (UTC @Vadanagiri bhaskar (talk) 05:19, 20 August 2023 (UTC) @--SREEKANTH DABBUGOTTU (talk) 06:37, 20 August 2023 (UTC) @Tmamatha (talk) 04:45, 21 August 2023 (UTC) @Gopavasanth (talk) 03:25, 22 August 2023 (UTC) @Nivas10798 (talk) 05:18, 22 August 2023 (UTC) @శ్రీరామమూర్తి (talk) 13:36, 24 August 2023 (UTC) @Inquisitive creature (talk) 04:48, 28 August 2023 (UTC) @Pravallika16 (talk) 13:46, 29 November 2023 (UTC) @M.Abhilash 05:51, 5 April 2024 (UTC) @Muktheshwri 27 (talk) 06:00, 5 April 2024 (UTC) @A.Murali (talk) 15:09, 5 April 2024 (UTC) @Saiphani02 (talk) 16:16, 29 June 2024 (UTC)
ధన్యవాదాలు --V.J.Suseela (చర్చ) 13:36, 8 జూలై 2024 (UTC)
- రాశానండీ @Vjsuseela గారు, ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:43, 8 జూలై 2024 (UTC)
- నేను ఓటు వేశాను Muralikrishna m (చర్చ) 04:37, 9 జూలై 2024 (UTC)
- @Muralikrishna m గారూ, పైన కూడా ఓటేయండి. దానివల్ల తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ కూడా నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుంది. పవన్ సంతోష్ (చర్చ) 05:52, 9 జూలై 2024 (UTC)
- ధన్యవాదాలు.. మూవ్‌మెంట్ చార్టర్: లింకు ద్వారా ఓట్ చేసానండి. Muralikrishna m (చర్చ) 06:05, 9 జూలై 2024 (UTC)
- నేనూ ఓటువేసాను యర్రా రామారావు (చర్చ) 11:35, 9 జూలై 2024 (UTC)
- ధన్యవాదాలు.. మూవ్‌మెంట్ చార్టర్: లింకు ద్వారా ఓట్ చేసానండి. Muralikrishna m (చర్చ) 06:05, 9 జూలై 2024 (UTC)
- @Muralikrishna m గారూ, పైన కూడా ఓటేయండి. దానివల్ల తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ కూడా నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుంది. పవన్ సంతోష్ (చర్చ) 05:52, 9 జూలై 2024 (UTC)
ఓటు నమోదు
మార్చుమూవ్మెంట్ చార్టర్ అనుమోద (రాటిఫికేషన్) ప్రక్రియలో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఓటు పైన వీడియో కాల్ చర్చలో పాల్గొని, పైన తమ అభిప్రాయలు తెలియచేసిన సభ్యులకు ధన్యవాదాలు. అభిప్రాయాలు పూర్తిగా అనుకూలము గానే వచ్చినందున ఆవిధముగానే ఓటు నమోదు నిన్న రాత్రి సుమారు 11.30 కి సముదాయ (Affiliate) ఓటు నమోదు అయినది. దాని స్క్రీన్ షాట్ ఇక్కడ పరిశీలించవచ్చు.
వికీమీడియా కామన్స్ లో తెలుగు ఫోటొగ్రాఫర్ల పతిభ
మార్చుసభ్యులకు నమస్కారం, ఈ రోజు వెలువడిన వికీ లవ్స్ ఫోక్లోర్, కామన్స్ మే నెల ఫోటో ఛాలెంజ్ ఫలితాలలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఫోటోగ్రాఫర్లు వారి ప్రతిభను చాటారు. వారిలో ఒకరు మనం భద్రాచలంలో నిర్వహించిన Wiki Explores Bhadrachalamకు వచ్చిన Zahed.zk కాగా, ఇంకొకరు వికీపీడియా తెలుగు Instagram పేజీ ద్వారా సంప్రదింపబడిన సురేష్ కుమార్ గారు. ఈ చిత్రాలను, సందేశాన్ని మనం తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ద్వారా ప్రెస్సునోటు కింద విడుదల చేస్తే రాబోయే Wiki Loves Monuments 2024కు ఆధరాణ పెరగడమే కాక కామన్స్ గురించి తెలుగు రాష్ట్రాలలో కొత్త వారికి తెలియజేయడానికి కూడా బాగుంటుందని నా ఆలోచన.
-
వికీ లవ్స్ ఫోక్లోర్ 2024లోని 41,000 చిత్రాలలో 9వ స్థానం వచ్చిన చిత్రం, తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి సారి ఒక చిత్రం వికీమీడియా నిర్వహించే అంతర్జాతీయ పోటీలలో ఒక తెలుగు ఫోటొగ్రాఫర్ గెలిచారు.
-
వికీమీడియా నెలవారి ఫోటో ఛాలెంజ్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి 11 సంవత్సరాలలో మొదటి సారి గెలుపొందిన కాకినాడకు చెందిన చిత్రం
- సంతోషం! IM3847 గారూ, మీరు చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ప్రెస్ నోట్ వలన మీ కృషికి మరింత ఊపు వస్తుంది. అభినందనలు. __చదువరి (చర్చ • రచనలు) 01:44, 17 జూలై 2024 (UTC)
- ధన్యవాదములు @Chaduvari గారూ. IM3847 (చర్చ) 08:44, 18 జూలై 2024 (UTC)
- IM3847 గారూ, వికీ లవ్స్ ఫోక్లోర్, కామన్స్ మే నెల ఫోటో ఛాలెంజ్ ఫలితాలలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఫోటోగ్రాఫర్లు వారి ప్రతిభ గురించి ఇతరులకు తెలిసేలా ప్రెస్ నోట్ ఇవ్వాలన్న మీ అలోచన బాగుంది. ఈ విషయంలో మా నుండి ఎలాంటి సహకారం కావాలో తెలుపగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:31, 17 జూలై 2024 (UTC)
- @ప్రణయ్‌రాజ్ వంగరి గారూ, హైదరాబాదులో మనకు తెలుసిన ప్రెస్ వాళ్ళ సహకారంతో ఈ చిత్రాలను, వాటి కింద కథనాన్ని ప్రచూరించడమే కాక, రాబోయే వికీ లవ్స్ మాన్యుమెంట్స్ గురించి కూడా చెబితే బాగుంటుంది. IM3847 (చర్చ) 08:49, 18 జూలై 2024 (UTC)
- IM3847 గారూ మీకు మీ బృందానికి అభినందనలు. బయటి వారికి మీ కృషి గురించి తెలుగు వికీపీడియా కార్యక్రమాల గురించి మంచి ప్రచారం ఉంటుంది. మన విలేకరులు స్పందించాలి. అయితే వికీమీడియా లో ఇతర భాషల వారికీ తెలిసే విధంగా (చాలా మంది చూస్తూంటారు) మీరు మీ వికీ కామన్స్/తెలుగు వికీపీడియా ప్రయాణం గురించి 'డిఫ్ బ్లాగ్' లో ఆంగ్లంలో రాయమని సూచన. CIS వాళ్ళవి, Let's Connect కార్యక్రమాలు లో ప్రెజెంట్ చేయవచ్చు. కొన్ని టెలిగ్రామ్ సముదాయాలలో కూడా ఈ వివరాలు తెలియచేయవచ్చు. ఇది నేను చేయగలను. నేను ఎక్కువగా రాసాననుకుంటే మన్నించాలి. --V.J.Suseela (చర్చ) 06:23, 18 జూలై 2024 (UTC)
- V.J.Suseela గారూ, మంచి సలహా ఇచ్చారు అండి అలాగే చేద్దాం. IM3847 (చర్చ) 08:49, 18 జూలై 2024 (UTC)
వికీ లవ్స్ మాన్యుమెంట్స్
మార్చుఅందరికీ నమస్కారం, వికీ లవ్స్ మాన్యుమెంట్స్ ప్రపంచంలోనే అతి పెద్ద Photo Contest అని గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్న పోటీ. మన భారతదేశం తరపున ప్రతి సంవత్సరం West Bengal User Group (WBG) వారు దీనిని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం మన వద్ద ఫోటోగ్రాఫర్ల సంఖ్య పెరగడంతో, మనం కూడా ఈ పోటీ నిర్వాక బాధ్యతలలో WBGతో పాలుపంచుకుంటే బాగుంటుందని పవన్ సంతోష్ గారూ, నేనూ భావిస్తున్నాం. దీనిలో భాగంగా మనం హైదరాబాదులో, వైజాగులో కొన్ని Workshops నిర్వహిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎన్నో నెలలుగా అనుకుంటున్న Vizag Commons Workshopను ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించవచ్చు. హైదరాబాదులో జరిగే Workshopకు వీలైనంత వరకు తెలుగు వికీపీడియన్లు కూడా వచ్చి, కొత్తగా చేరిన ఫోటోగ్రాఫర్లతో మాట్లాడితే, మన యూజర్ గ్రూపులోని భవిష్యత్తు కార్యచరణకు చాలా తోడ్పడుతుందని మేము బావిస్తున్నాం. మీ సలహాలు, సూచనలు ఉంటే తెలియజేయగలరు.
ముఖ్యమైన లింకులు
IM3847 (చర్చ) 14:52, 19 జూలై 2024 (UTC)
- ఇప్పటికే విశాఖపట్టణంలో వికీ లవ్స్ వైజాగ్ పోటీ ద్వారా ఆంధ్ర ప్రాంతంలోనూ, హైదరాబాద్‌లో అవుట్ రీచ్ ద్వారా తెలంగాణలోనూ @IM3847 గారు పలువురు మంచి అద్భుతమైన ఫోటోగ్రాఫర్లను వికీ కామన్స్‌లోకి తీసుకువచ్చారు. వాళ్ళకు వికీలో మరింత అవగాహన పెంచేలా భద్రాచలం, భువనగిరి వంటిచోట్లకు ఎక్స్‌ప్లొరేషన్ వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ క్రమంలో వికీలోకి వచ్చినవాళ్ళలో @IM3847 గారికి ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిసిన నాణ్యమైన ఫోటోగ్రాఫర్లతో పాటు, వాళ్ళ ద్వారా వచ్చినవారూ, పోటీ ద్వారా వచ్చినవారూ కూడా ఉన్నారు. వీళ్ళలో చాలామంది అద్భుతమైన ఫోటో కలెక్షన్ ఉన్నవాళ్ళు, భవిష్యత్తులోనూ మంచి ఫోటోలు తీసేవాళ్ళు. ఉత్సాహవంతులు.
- ఈ నేపథ్యంలో భారతదేశంలో క్రమంతప్పకుండా జరుగుతున్న వికీ లవ్స్ మాన్యుమెంట్స్ కార్యక్రమంలో భాగంగా మన భాగస్వామ్యం పెంచుకోవడం బావుంటుందని భావిస్తున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉన్న అనేక చారిత్రక కట్టడాలు, ప్రదేశాలకు తగిన నాణ్యమైన ఫోటోలు లేవు. ఆ లోటును పూరించుకోవచ్చు, అంతకన్నా విలువైన ఇంకా చాలామంది కొత్త కామన్స్ వికీమీడియన్లను సముదాయంలోకి తీసుకురావచ్చు. గత ఏడాది నేను సీఐఎస్ తరఫున @IM3847, @Adithya pakide, అరవింద్ పకిడె, @Pranayraj1985 వంటివారితో కలసి వికీ లవ్స్ మాన్యుమెంట్స్ ఇండియా 2023కు తెలంగాణ నుంచి ఫోటోలు మంచివి, ఎక్కువ ఎక్కించేందుకు, చరిత్రకారులతో ఒక ప్రయత్నం చేశాం. ఈసారి మహేష్ గారు మంచి సముదాయాన్ని తయారుచేస్తున్నారు కనుక ఆ కొత్త ఫోటోగ్రాఫర్లను ఇందులో భాగం చేసుకుని బాగా చేసే అవకాశం ఉంది. కాబట్టి, ఈ కార్యక్రమం చేపట్టాలని మా ఆలోచన.
- ఇక మీమీ అభిప్రాయాలు తెలియజేయగలరని ఆశిస్తున్నాము. పవన్ సంతోష్ (చర్చ) 07:26, 20 జూలై 2024 (UTC)
- తెలుగు రాష్ట్రాలకు చెందిన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం గురించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న చిత్రాలలో చాలా వరకు పరిమితంగా ఉన్నాయి, కొత్త ఫోటోగ్రాఫర్లను ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేయడం ద్వారా ఈ లోటును పూరించవచ్చని,కొత్త ఫోటోగ్రాఫర్లకు వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి,గుర్తింపు పొందడానికి ఒక వేదికను అందిస్తుందని దానికి వికీ లవ్స్ మాన్యుమెంట్స్ గొప్ప అవకాశం అని నేను నమ్ముతున్నాను. అయితే నాకు ఉన్న అనుభవాన్ని బట్టి ఏదైనా స్థానికంగా ఒక మంచి బహుమతులు, ఒక అందరికీ ఒక సర్టిఫికెట్ లాంటిది ఉంటేనే చాలా మంది పాల్గొంటారు, కాబట్టి దానికి అనుగుణంగా రూపకల్పన చేయగలరు. నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. Kasyap (చర్చ) 09:38, 23 జూలై 2024 (UTC)
- ఇది చాలా మంచి విషయం. మీ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. V.J.Suseela (చర్చ) 11:17, 25 జూలై 2024 (UTC)
- WLM2024కు ఈ లింకులో W.B. లాగా, మన రాష్ట్రాల నుంచి జాతీయ, అంతర్జాతీయ పోటీలలో గెలుపొందిన చిత్రాలకు "Special prizes" లాగా ఏదైనా బహుమతిని ప్రకటిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. I.Mahesh (చర్చ) 12:12, 15 ఆగస్టు 2024 (UTC)
యూజర్‌గ్రూపు లోగో
మార్చుయూజర్గ్రూపు లోగో గురించి ఒక వాట్సాప్ గ్రూపులో చర్చ జరిగింది. అక్కడ అది అర్ధంతరంగా ఆగిపోయింది. దాన్ని కొనసాగించి ఒక తీరానికి చేర్చే ఉద్దేశంతో ఇక్కడ మొదలుపెడుతున్నాను. అందరూ అభిప్రాయాలు చెప్పవలసినది. అక్కడ ప్రతిపాదనకు వచ్చిన లోగోలు ఇవి. అయితే ఇవి పూర్తి లోగోలు కావు, కేవలం ఒక భావనను మాత్రమే చూపెడుతూ ఈ బొమ్మలను పంపించారు. నచ్చిన దానికి తగు మార్పులు చేసి ఒక మాంఛి లోగోను ఎంచుకుందాం. మీమీ అభిప్రాయాలు చెప్పండి. __చదువరి (చర్చ • రచనలు) 12:44, 1 అక్టోబరు 2024 (UTC)
1. | 2. | 3. |
4. | 5. | 6. |
7. | 8. |
అభిప్రాయాలు, సూచనలు
మార్చు- చదువరి: 4 వది నచ్చింది. కొన్ని మార్పులు చెయ్యాలి: 1. "అ" స్థానంలో 7 వ బొమ్మలోని ఫాంటుతో "తె" అని రాయాలి. 2. ఇంగ్లీషు పేరును అక్కడి నుండి తీసేసి కింద 1 వ బొమ్మలో చూపినట్టు రాయాలి, తెలుగు పేరును అలాగే ఉంచెయ్యవచ్చు. 3. రంగులు బానే ఉన్నై. ఇంకా బాగుండేలా మారిస్తే అభ్యంతరం లేదు. __చదువరి (చర్చ • రచనలు) 13:05, 1 అక్టోబరు 2024 (UTC)
- 3, 4 బాగున్నాయి. Saiphani02 (చర్చ) 14:31, 3 అక్టోబరు 2024 (UTC)
- 3,4 లోగోలు open book నమూనా. "అ" తె (7వ నమూనా ఫాంట్) లో బావుంటుంది.ఇది నా అభిప్రాయం. V.J.Suseela (చర్చ) 12:47, 5 నవంబరు 2024 (UTC)
- 3, 4 బాగున్నాయి. ఆ స్థానంలో 7 వ బొమ్మలోని ఫాంటుతో "తె" అని రాయాలి.వాటిలో ఇంకా అవసరమైన మార్పులుచేసి దేనిని ఫైనల్ చేసినా నాకు అభ్యంతరం లేదు. యర్రా రామారావు (చర్చ) 01:25, 10 నవంబరు 2024 (UTC)
- 4వ దానికే నా ఓటు. చదువరి గారు చెప్పిన అభిప్రాయాలే నావికూడా.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:18, 10 నవంబరు 2024 (UTC)
- 7వ బొమ్మ బాగుంది. 4వ బొమ్మలోని అక్షరాలు లా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.--A.Murali (చర్చ) 06:49, 10 నవంబరు 2024 (UTC)
- చదువరి గారు, V.J.Suseela గారు, యర్రా రామారావు గారు, మీ సూచనల ప్రకారం 4వ బొమ్మలో మార్పులు చేసి, జాబితాలో 8వ బొమ్మగా చేర్చాను. పరిశీలించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:20, 10 నవంబరు 2024 (UTC)
- 8వ లోగో నాకు నచ్చింది. అయితే 'తె' కాస్త పెద్దది చేస్తే బాగుంటుదనుకుంటే మిగతా వారి అభిప్రాయాలు తెలిపిన తరువాత వాటినిబట్టి మార్పులు చేయవచ్చు. యర్రా రామారావు (చర్చ) 07:43, 10 నవంబరు 2024 (UTC)
- ఈ 8 వ బొమ్మ నాకు నచ్చింది. __ చదువరి (చర్చ • రచనలు) 08:26, 10 నవంబరు 2024 (UTC)
- బావుంది. 'తె' ఫాంట్ ఇంకొంచెం పెద్దది చేస్తే బావుంటుంది అనిపిస్తుంది, లోగో కి తగ్గట్టుగా. V.J.Suseela (చర్చ) 02:52, 11 నవంబరు 2024 (UTC)
- చదువరి గారు, V.J.Suseela గారు, యర్రా రామారావు గారు, మీ సూచనల ప్రకారం 4వ బొమ్మలో మార్పులు చేసి, జాబితాలో 8వ బొమ్మగా చేర్చాను. పరిశీలించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:20, 10 నవంబరు 2024 (UTC)
- 7వ బొమ్మ బాగుంది. 4వ బొమ్మలోని అక్షరాలు లా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.--A.Murali (చర్చ) 06:49, 10 నవంబరు 2024 (UTC)
- 4వ దానికే నా ఓటు. చదువరి గారు చెప్పిన అభిప్రాయాలే నావికూడా.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:18, 10 నవంబరు 2024 (UTC)
- 3, 4 బాగున్నాయి. ఆ స్థానంలో 7 వ బొమ్మలోని ఫాంటుతో "తె" అని రాయాలి.వాటిలో ఇంకా అవసరమైన మార్పులుచేసి దేనిని ఫైనల్ చేసినా నాకు అభ్యంతరం లేదు. యర్రా రామారావు (చర్చ) 01:25, 10 నవంబరు 2024 (UTC)
7 వ బొమ్మ బావుంది , 8 వ బొమ్మ కూడా బాగుంది అయితే లోగో లో ఎంత తక్కువ Text వుంటే అంత మంచిది . Kasyap (చర్చ) 05:36, 13 నవంబరు 2024 (UTC)
కామన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు - అదిలాబాదు
మార్చుఅందరికీ నమస్కారం, మొన్న హైదరాబాదులో జరిగిన WTS కార్యక్రమంలో గోండి కొలామీ వికీమీడీయన్ మోతీరాం గారు మట్లాడుతూ అదిలాబాదులో జరిగే గుస్సాడీ పండగ గురించి చెప్పారు. నేను ఎన్నో రోజులుగా హైదరాబాదులో ఉన్న ఫోటోగ్రాఫర్లతో కార్యక్రమాలు చేయించడమేగాక, అక్కడి విధ్యార్ధులను కూడా వికీమీడియా కార్యక్రమాలలో పాలుపంచుకునేలాగా చేద్దాం అనుకున్నా. దానికి ఈ గుస్సాడీ పండగ బాగా ఉపయోగపడుతుందని, ఆ సమయంలో WTS లో ఉన్న తెలుగు వికీమీడియన్లతో కామన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి చర్చించాను. ఈ ప్రాజెక్టులో మనం కొన్ని విధ్యార్ధులకు హైదరాబాదులోని ప్రముఖ ఫోటోగ్రాఫర్తోనే కాకుండా వికీ కామన్స్ లో అత్యుత్తమైన డియాగో డెల్సోతో (User: Poco A Poco) కూడా శిక్షణ ఇప్పించాలని అనుకున్నాం. కాకపోతే ఆన్లైన్ శిక్షణలో ఎక్కువమంది ఉంటే బాగుంటుందని డియాగో అన్నారు. హైదరాబాదులోని Untitled Storiez అనే ఒక సమూహంతో కలిసి ఈ ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాన్ని ఆదివారానికి (20/10/2024) ప్రతిపాదించాం. తరువాత ఈ నెల 27 నుంచి 30 వరకు అదిలాబాదు, ఉట్నూరు పరిసర ప్రాంతాలలో ఎక్స్పెడిషన్ గురించి, ఈ నెల 12వ తారీకున ఉట్నూరు ITDA అదికారి కుస్భూ (IAS) గారితో చర్చించాను. వారు కూడా ఈ కార్యక్రమానికి సుముఖతో పాటు, పూర్తిగా సహకరిస్తాం అని చెప్పారు. దీనికి కావాలసిన Travel and Accommodation తదితర వాటిని సీ.ఐ.ఎస్. వారు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి వివరాలను ఇక్కడ చూడవచ్చు. నేను కొన్ని పర్సనల్ వ్యవహారలో నిమిప్తం అయ్యి ఉండడంతో ఈ సమాచారాన్ని అందరికీ ముందుగా ఇవ్వడం మర్చిపోయాను, క్షమించండి. I.Mahesh (చర్చ) 11:37, 18 అక్టోబరు 2024 (UTC)
తెలుగు వికీపీడియా అభివృద్ధి కార్యకలాపాలకు ఒక ప్రోగ్రామ్ అవకాశం
మార్చుఅందరికీ నమస్కారం,
గత ఏడాది హిందీ వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ వారు "హిందీ వికీపీడియా సముదాయాన్ని విస్తరించేందుకు, కంటెంట్ గ్యాప్స్ తగ్గించేందుకు" WMF సహకారంతో గూగుల్‌తో పనిచేసి స్పాన్సర్‌షిప్ పొంది వివిధ కార్యకలాపాలు చేపట్టారు. యూజర్ గ్రూప్ వారు ఈ లక్ష్యాలను సాధించడానికి తమకు సబబు అనిపించిన, ఉపయోగకరంగా తోచిన కార్యకలాపాలతో పనిచేశారు. హిందీ వికీపీడియా మీద ప్రయత్నించిన ఈ పైలట్ ఆ వికీపీడియాకు సత్ఫలితాలను ఇవ్వడంతో తెలుగుతో పనిచేయడానికి మన దగ్గరకు ప్రతిపాదనతో వస్తున్నారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రధానంగా సముదాయాన్ని వృద్ధి చేయడానికి, కంటెంట్ గ్యాప్స్ తగ్గించడానికి (bridging content gaps) ఉద్దేశించింది.
ప్రతిపాదిత చిత్తు ప్రాజెక్టు ప్రకారం, యూజర్ గ్రూపు ఈ అంశంపై పనిచేయడానికి ఇష్టపడితే మనకు లభించే మద్దతు ఇలా ఉంటుంది: 1) గూగుల్ ఈ ప్రోగ్రామ్‌కు USD 8,000 వరకూ (ఈనాటి లెక్కల ప్రకారం దాదాపుగా రూ.6.75 లక్షలు) స్పాన్సర్ చేస్తుంది. 2) కంటెంట్ గ్యాప్స్ విషయంలో తమ వద్దనున్న ఇన్‌సైట్స్ గూగుల్, వికీమీడియా ఫౌండేషన్ పంచుకుంటాయి, మనకు పనికొస్తే ఉపయోగించుకోవచ్చు. 3) తెలుగు భాషకు ప్రత్యేకంగా ఉపయోగపడేలాంటి సాంకేతిక ఉపకరణాల రూపకల్పనకు, యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుదలకు, సాంకేతిక సమస్యల పరిష్కరణకు వికీమీడియా ఫౌండేషన్, గూగుల్ మనతో కలసి పనిచేయగలవు.
ఏయే కార్యకలాపాలు చేస్తాము, ఎలా చేస్తాము, ఏయే అంశాలపై సమాచారం విస్తరిస్తాము, ఎందుకు విస్తరిస్తాము వంటివాటన్నిటిపై పూర్తి నిర్ణయాధికారం తెలుగు యూజర్ గ్రూపుకే ఉంటుంది. మనం ప్రోగ్రామును మనకు సబబు అనీ, తెవికీకి సత్ఫలితాలు వస్తాయనీ మన చర్చల్లో ఏకాభిప్రాయానికి వచ్చిన విధంగా నిర్వహించవచ్చు.
ఇది ఏడాది సాగగల ప్రోగ్రామ్. ఇరుపక్షాలకూ ఆమోదమై ప్రారంభమైనట్టైతే ఫిబ్రవరి 2025లో ప్రారంభం కాగలదు. ఇందులో భాగంగా ఒక అవుట్‌రీచ్ కోఆర్డినేటర్‌ని నియమించుకోవచ్చనీ, కొన్ని కార్యకలాపాలూ, పోటీలు పెట్టవచ్చనీ నాకు తోస్తోంది. అలానే, ముందుకువెళ్ళే పక్షంలో మన కార్యకలాపాలూ, లక్ష్యాలూ స్థూలంగా నిర్ధారించి వికీమీడియా ఫౌండేషన్ వారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఒక వారంలోగా వారికి వివరం తెలియజేస్తే ఉపయోగకరంగా ఉంటుందని వారు చెప్పారు. దీనిపై, మీమీ ఆలోచనలు పంచుకోగలరు.
ధన్యవాదాలతో, --పవన్ సంతోష్ (చర్చ) 09:02, 27 నవంబరు 2024 (UTC)
- మంచి ప్రాజెక్టు.మన తెలుగు వికీపీడియాలో చురుకైన వాడుకరులుగా నిలబడే వాళ్లను మనం తయారుచేయాలి.కేవలం లాగిన్ అయితే చాలదు.అయితే హిందీలో విజయవంతమైందని ఇక్కడ కావాలనికూడా లేదు.అలాగాని కాకూడదని లేదు.మనం గట్టికృషి, మంచి ప్రణాళిక మనం తయారుచేసుకోగలిగిితే , ఇంకా వారికన్నా బాగా విజయవంతం అయినా కావచ్చు.ఇందులో సందేహం లేదు.ఏది ఏమైనా ఈ ప్రాజెక్టును తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ద్వారాముందుకు తీసుకు వెళ్లటానికి నేను మద్దతు తెలియజేస్తున్నాను. మన కార్యకలాపాలూ, లక్ష్యాలూ స్థూలంగా నిర్ధారించి వికీమీడియా ఫౌండేషన్ వారికి తెలియజేయాల్సి ఉంటుందని తెలిపారు.దానికి ఒక ప్రాజెక్టు పేజీ పెడితే బాగుంటుందని నాఅభిప్రాయం.అలాగే హిందీ వికీపీడియా ప్రాజెక్టు పేజీ లింకు ఏమైనా చూపటానికి అవకాశమంటే తెలుపగలరు. యర్రా రామారావు (చర్చ) 10:26, 27 నవంబరు 2024 (UTC)
- @యర్రా రామారావు గారూ, మంచి సూచనలు చేశారు. నిస్సందేహంగా మనం మన తెలుగు వికీపీడియా ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని, ఇప్పటివరకూ మన కృషికి వచ్చిన ఫలితాలు సరిజూసుకుని మనదంటూ ఒక ప్రణాళిక చేసుకోవాలే తప్ప ఇతర భాషల ప్రణాళికలను అచ్చంగా స్వీకరించనక్కరలేదు. అయితే, మీరే సూచించినట్టు వారేం చేశారో తెలుసుకోవడానికి గాను కింద రెండు బ్లాగులు ఇచ్చాను, ఇవిగోండి: ఒకటి, రెండు. ఇక @Saiphani02 గారూ, మీరూ సూచించినట్టు మనదైన ప్రణాళిక, లక్ష్యాలు రూపొందించుకుని, అంతర్గతంగా చర్చించుకుని ఫౌండేషన్, గూగుల్ సంస్థలకు పంపించవచ్చు. పవన్ సంతోష్ (చర్చ) 10:50, 2 డిసెంబరు 2024 (UTC)
- కొన్ని ప్రశ్నలు:
- 1. కంటెంట్ గ్యాప్స్ అంటే ప్రధానంగా కొత్త వ్యాసాలు సృష్టించడం, విస్తరించడం అనుకుంటున్నాను. దయచేసి నిర్ధారించండి.
- 2. "ఇన్‌సైట్స్" ఏంటో కూడా వివరిస్తే బాగుంటుంది. ఇప్పటికే గూగుల్ బహిరంగంగా ప్రచురించే "గూగుల్ ట్రెండ్స్"కు విభిన్నంగా ఉంటాయేమో చూడాలి.
- 3. హిందీ వికీపీడియా వారు ఎలాంటి కార్యక్రమాలు చేసారు? దీనికి లింకు ఏమైనా ఉంటే పెట్టగలరు. ఈ కార్యక్రమాలు గూగుల్ సహకారం లేకుండా, కేవలం ఫౌండేషన్ సహాయంతో లేక మనమే చేయలేమా? చేయగలిగితే గూగుల్ అనీ పేరు పెట్టి సమూహం పనిచేయడం అర్థరహితం.
- 4. CIS గురించి మీరు ప్రస్తావించలేదు, వారి భాగస్వామ్యం ఉందో లేదో కూడా నిర్ధారిస్తే బాగుంటుంది.
- లక్ష్య వ్యాసాల మైలురాయిని చేరుకున్నాక క్వాలిటీ, కంటెంట్ గ్యాప్స్ గురించి చర్చలు మొదలుపెట్టాము అవి మనం కొనిసాగించి,అనుకున్న వికీ ప్రాజెక్టులు ప్రారంభించాలి. రోజుకు ఒకటి రెండుసార్లైనా, "తెవికీలో ఉంటుందిలే" అనుకొని వెతికే వ్యాసాలు కనిపించవు! ఇలాంటి "ఉండాల్సిన వ్యాసాలు" జాబితా ఇప్పటికే ఉంటే చేప్పగలరు. Saiphani02 (చర్చ) 05:02, 29 నవంబరు 2024 (UTC)
- @Saiphani02 గారూ, ధన్యవాదాలండీ. మంచి ప్రశ్నలు అడిగారు.
- తెలుగు వికీపీడియాలో ఉండాల్సిన, పాఠకులకు ఉపయోగకరమైన అంశాలు లేనట్టైతే దాన్ని కంటెంట్ గ్యాప్స్ అనుకోవచ్చు ఈ నేపథ్యంలో. అవి ఏమిటనేవి మనం నిర్ణయించవచ్చు.
- గూగుల్, వికీమీడియా ఫౌండేషన్ వారు కలసి తమ తమ అంతర్గత అనాలిసిస్ ఉపయోగించి జనం వెతుకుతున్నవీ, దొరకనివీ జల్లెడపట్టి ఆ టాపిక్స్ మనకు అందజేయగలరు. మనం వాటినే ఉపయోగించి రాయాలని నియమం ఏమీ లేదు.
- హిందీ వికీపీడియా వారు ఏమేం కార్యక్రమాలు చేశారన్నదానిపై రెండు బ్లాగులు రాశారు. వాటిలో హిందీ వికీపీడియాలో సదరు కార్యక్రమాలకు నేరుగా లంకెలు ఉన్నాయి. మొదటి బ్లాగు కార్యక్రమం ప్రారంభమైన మూడు నెలల గురించి, రెండవది తర్వాతి మూడు నెలల గురించి వివరిస్తోంది. దయచేసి చూడగలరు.
- CIS కూడా ఇందులో భాగస్వామిగానే ఉంటుందండీ. ప్రధానంగా గూగుల్ భాగస్వామ్యాన్ని వికీమీడియా ఫౌండేషన్ పార్టనర్ షిప్స్ టీమ్ వారు అన్‌లాక్ చేశారు కనుక వారి పేరే ప్రముఖంగా ప్రస్తావించాను.
- మీరు అడగని మరి రెండు సంగతులు ప్రస్తావించదలిచాను.
- ఇందులో మనం ముందుకు వెళ్ళదలిస్తే ఈ స్పాన్సర్షిప్ ఉపయోగించుకుని మనం స్థూలంగా సృష్టించగల కొత్త వ్యాసాల సంఖ్య, తీసుకురాగల కొత్త వాడుకరుల సంఖ్య ఏమిటన్నది ఒక లక్ష్యంగా ఏర్పరుకోవాలి.
- కార్యకలాపాలు కూడా ఎలాంటివి చేయగలం అన్నది స్థూలంగా ఆలోచిస్తే మేలు.
- పవన్ సంతోష్ (చర్చ) 15:59, 29 నవంబరు 2024 (UTC)
- ధన్యవాదాలు. కార్యకలాపాలు, లక్ష్యాలను వివరిస్తూ ఒక పేజీని తయారుచేసి, సమూహం ముందు పెడదాం. Saiphani02 (చర్చ) 15:06, 1 డిసెంబరు 2024 (UTC)
- @Saiphani02 అలాగేనండీ. పవన్ సంతోష్ (చర్చ) 10:47, 2 డిసెంబరు 2024 (UTC)
- ధన్యవాదాలు. కార్యకలాపాలు, లక్ష్యాలను వివరిస్తూ ఒక పేజీని తయారుచేసి, సమూహం ముందు పెడదాం. Saiphani02 (చర్చ) 15:06, 1 డిసెంబరు 2024 (UTC)
- @Saiphani02 గారూ, ధన్యవాదాలండీ. మంచి ప్రశ్నలు అడిగారు.
- తెవికీకి అవసరమైనది, మనం కూడా చేయాలనుకుంటున్నది కూడా ఇదే కదా. నాణ్యత అంశం కూడా చేరిస్తే బావుంటుంది. దీనికి ఫౌండేషన్ గూగుల్ సహకారం ఉంటే ఇంకా ప్రశస్తం. చేద్దామండి. ధన్యవాదాలు. --V.J.Suseela (చర్చ) 11:46, 29 నవంబరు 2024 (UTC)
- వ్యాసాలు సృష్టింపుకు, సవరణలకు అనినాభావ సంబంధం ఉంది. ఈ మాట నేనెందుకు అంటున్నానంటే వ్యాసాల సృష్టింపే లేకపోతే సవరణలు లేదా నాణ్యత అనే ప్రసక్తే లేదు. వ్యాసాల నాణ్యత అనేది లేకపోతే ఎన్ని వ్యాసాలు సృష్టించినా అవి లెక్కకు ఇన్ని ఉన్నాయని చెప్పుకోవటానికి మాత్రమే. వ్యాసాల నాణ్యత అనేక రకాలకు చెందిన సవరణలుపై ఆధారపడి ఉంది. వాటిని గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతపై తగిన చర్యలు చేపట్టాలిసిన అవసరం ఎంతో ఉంది. రాసికన్నా వాసి ముఖ్యమని మనందరికి తెలుసు. నేను ఎక్కువుగా నాణ్యతకే పెద్దపీట వేస్తాను. యర్రా రామారావు (చర్చ) 15:39, 1 డిసెంబరు 2024 (UTC)
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన (2024-25), తెవికీ ప్రచారం
మార్చుహైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఈ సంవత్సరం 2024 డిసెంబర్, 19 నుండి 29 వరకు జరగనుంది. ప్రతిసంవత్సరం చేసినట్లుగానే తెలుగు వికీపీడియా సభ్యులు బుక్ ఫెయిర్ లో స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించనున్నారు. అయితే తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఈ ప్రచారం కొంత విస్తృతంగా నిర్వహించాలని, ఇంకా తెవికీ లక్ష వ్యాసాలు, వికీసోర్స్ 20000 వ్యాసాల మైలురాళ్లను దాటిన సందర్భంలో అభినందన కార్యక్రమం బుక్ ఫెయిర్ కేంద్ర వేదిక మీద నిర్వహించాలని ఉద్దేశ్యంతో సముదాయం నిర్ణయించినట్లుగా ఫౌండేషన్ నుంచి ఆర్ధిక సహకారం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి మీ అందరి సహకారం కోరుతున్నాము. ఈ ప్రాజెక్ట్ పేజి పరిశీలించి అక్కడ మీ సహకారాన్ని నమోదు చేయవలసినదిగా విన్నపం. (మెటాపేజీ)ఇక్కడ చూడవచ్చు.
ధన్యవాదాలు.
--V.J.Suseela (చర్చ) 07:24, 2 డిసెంబరు 2024 (UTC) (తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్)