వికీపీడియా:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/తెవికీ ముందడుగు - 2025

2025లో WMF సహకారంతో గూగుల్‌తో పనిచేసి స్పాన్సర్‌షిప్ పొంది వివిధ కార్యకలాపాలు చేపట్టే అవకాశం మనకి ఉంది. దీనికి ప్రతిపాదన సమూదాయం ముందు పెట్టడం ఈ పేజీ ఉద్దేశం. మరిన్ని వివరాలు: ఇక్కడ. ఈ పేజీని అక్కడ జరిగిన చర్చను, హిందీవారు రూపొందించుకున్న బెంచ్‌మార్కును, తెవికీ పండుగ 2024లో వచ్చిన వ్యూహాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించాము.

ప్రతిపాదన

మార్చు
లక్ష్యాలు
  • తెవికీ లో కనీసం మూడు వేల కొత్త వ్యాసాల సృష్టి, ఇప్పటికే ఉన్న వ్యాసాల విస్తరణ, మెరుగుదల.
  • అవుట్ రీచ్ కార్యక్రమాల ద్వారా 120 కొత్త వాడుకరులను చేర్చడం, అందులో కనీసం 20% మంది చురుకైన వాడుకరులను పెంపొందించడం.
    • హిందీ ద్వారా గడించిన అనుభవంతో వారు సూచించిన బెంచ్‌మార్క్ (లక్ష్యాలు) ఐదువేల వ్యాసాలు, 80 మంది వాడుకరులు కాగా, మనకు కొత్త వాడుకరుల అభివృద్ధి ముఖ్యం అని చర్చల్లో భావించినందువల్ల వ్యాసాల లక్ష్యం తగ్గించుకుని అవుట్‌రీచ్ లక్ష్యం గణనీయంగా పెంపొందించి ప్రతిపాదించొచ్చు.
కార్యాచరణ
  • తెవికీ బడి అనుభవంతో 2025లో కొత్త వాడుకరులకు 30 ఆన్‌లైన్ శిక్షణా తరగతులు నిర్వహించడం.
  • తెవికీ పండుగ చర్చల్లో వెలువరించిన రోడ్‌మ్యాప్ ఆధారంగా తెలుగు అధ్యాపకులకు, విశ్రాంత ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణా తరగతులు 3-4 వరకూ నిర్వహించడం.
  • 4-5 ఎడిటథాన్స్ వంటి కార్యక్రమాలను నిర్వహించడం.
వనరులు
  • ఈ ప్రోగ్రామ్ మొత్తం నిర్వహించడానికి సంవత్సరం పాటు ఒక కో-ఆర్డినేటర్‌ని నియమించుకోవచ్చు. దీనికి గూగుల్ అందించే వనరుల్లో సగం కన్నా ఖర్చు కావచ్చు.
  • మిగిలిన వనరులను ప్రధానంగా ఆఫ్‌లైన్ కార్యక్రమాల నిర్వహణకు, ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.

అభిప్రాయాలు

మార్చు

మీ అభిప్రాయాలను, ఆమోద తిరస్కారాలను ఇక్కడ రాయవచ్చు

  • ప్రతిపాదన తయారుచేసినందుకు ధన్యవాదాలు. కోఆర్డినేటర్‌ని నియమించడం ద్వారా మన ప్రోగ్రాములు ఇంకా మెరుగ్గా కొనసాగించవచ్చు. ఇంకా అందరికీ ఉపయోగపడే సహాయ వనరులను కూడా రూపొందించవచ్చు.   ' - Saiphani02 (చర్చ) 16:45, 4 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • ప్రతిపాదన బావుందండి. 3000 వరకు వ్యాసాలు తెవికీలో చేర్చడం, దిద్దుబాట్లు, వ్యాసాలు మెరుగుపరచడం వంటివి తప్పకుండా జరగాలి. వీటి నిర్వహణకు ఒక కోఆర్డినేటర్ ప్రత్యేకంగా నియమించడం అవసరం కాబట్టి ఆ ప్రతిపాదనకు నేను సమర్ధిస్తున్నాను. --V.J.Suseela (చర్చ) 06:05, 5 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • 120 మంది కొత్త వాడుకరులను తీసుకురావడం, అందులోంచి 24 మంది చురుగ్గా రాసే వాడుకరులను నిలబెట్టుకోవడం అనే లక్ష్యాలు రెండూ నన్ను ఆకట్టుకున్నాయి. ఖచ్చితమైన ప్రణాళిక రూపొందించుకుని ముందుకువెళ్ళాలని కోరుతూ ఈ ప్రైపాదనకు నా మద్దతు ప్రకటిస్తున్నాను, __ చదువరి (చర్చరచనలు) 08:34, 5 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • వ్యాసాల పరంగా తెవికీ చురుగ్గా ఉన్నప్పటికీ, చురుకైన వాడుకరుల కొరత అనేది తెవికీకి ప్రధాన సమస్యగా మారింది. తెవికీ ముందడుగు - 2025 కార్యక్రమం ద్వారా వ్యాసాల అభివృద్ధితోపాటు అవుట్ రీచ్ కార్యక్రమాల ద్వారా కొత్త, చురుకైన వాడుకరులను పెంపొందించడం అనేది మంచి ప్రతిపాదన. దీనికి నా మద్దతును తెలుపుతున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:58, 5 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం

మార్చు

ఈ ప్రతిపాదనలో పైన జరిగిన చర్చల ప్రకారం ప్రతిపాదన ఆమోదం పొందింది.ఈ ప్రతిపాదనపై తదుపరి చర్యలలో భాగంగా ముందుకు తీసుకువెళ్లటానికి సంబంధిత సంస్థలకు తెలియజేయటానికి నిర్ణయం ప్రకటించటమైనది.--యర్రా రామారావు (చర్చ) 03:30, 17 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు గారూ, ధన్యవాదాలు. ఈ వివరాలను వికీమీడియా ఫౌండేషన్ వారి పార్టనర్ షిప్ టీమ్ వారికి తెలియపరిచాను. పవన్ సంతోష్ (చర్చ) 17:34, 17 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]