వికీపీడియా:తోలుబొమ్మ

Text-x-generic with pencil.svg ఇది ఒక వ్యాసం; ఇక్కడ ఒకరు లేక అంతకంటే ఎక్కువ సభ్యులు వెలిబుచ్చిన సూచనలు, అభిప్రాయాలు ఉన్నాయి. వీటీని ఇంకా తెలుగు వికీపీడియా విధానంగా పరిగణించడంలేదు, కాబట్టి మిగతా సభ్యులు వీటిని పాటించాల్సిన అవసరంలేదు.

అవసరమైతే ఈ పేజీలో ఉన్న సమాచారాన్ని మార్చటానికి వెనుకాడకండి, లేదా ఇక్కడ ఉన్న సూచనల గురించి చర్చించండి.

తెలుగు వికీపీడియాలో తోలుబొమ్మ (ఆంగ్లవికీలో వీటిని సాక్-పప్పెట్లని పిలుస్తారు), అనేది అప్పటికే సభ్యత్వమున్న ఒక సభ్యుని నకిలీ సభ్యత్వం. ఇలా రెండు మూడు సభ్యత్వాలు కలిగుండటం కొన్ని నిర్వహణాపరమైన కార్యక్రమాలను సులభతరం చేస్తుంది. ఇందుకు ఉదాహరణగా బాట్లకోసం సృష్టించే ఖాతాలను పేర్కొనవచ్చు, ఈ ఖాతాలను బాట్లద్వారా చేస్తున్న పనులను వాటి యజమానులు చేస్తున్న పనుల నుండి వేరుపరచటానికి ఉపయోగపడతాయి. కానీ కొన్ని సందర్భాలలో తమ అసలు ఖాతాను వాదోపవాదాలలో ఇరికించకుండా వాదనలు చేయడానికి అప్పటికే ఒక ఖాతా ఉన్న సభ్యులు ఇంకో కొత్త ఖాతాను సృష్టిస్తారు. ఇలా తోలుబొమ్మ ఖాతాలను సృష్టించడం వలన వాదోపవాదాలు తప్పుదోవపడుతుందని కొంతమంది సభ్యులు భావిస్తూ ఉంటారు.