వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణా గ్రామాల పేజీల్లో చెయ్యవలసిన మార్పుచేర్పులు

తెలంగాణ గ్రామాల పేజీల్లో చెయ్యవలసిన కొన్ని నిర్దుష్టమైన పనుల కోసం ఈ ప్రాజెక్టును ఉద్దేశించాం. ఇది ఎవ్వరైనా పాల్గొనగలిగే చిన్న ప్రాజెక్టు. తెలంగాణలో 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత, చాలా గ్రామాల మండలాలు మారిపోయాయి. పునర్వ్యవస్థీకరణకు ముందు ఆయా గ్రామాలు ఎక్కడ ఉండేవో తెలిపే పాఠ్యాన్ని ప్రతి గ్రామం పేజీలోనూ చేర్చే ప్రాజెక్టు ఇది. ఈ పని గురించి గతంలో రచ్చబండలో చేసిన ప్రకటనను ఇక్కడ చూడవచ్చు.

ప్రాజెక్టు ఆవశ్యకత ఏమిటి

మార్చు

విజ్ఞాన సర్వస్వానికి ఎంతో ముఖ్యమైన చారిత్రిక సమాచారాన్ని దాదాపు 10,000 పేజీల్లో చేర్చడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

తెలంగాణ గ్రామాల పేజీల్లో - వర్తమాన కాలంలో ఆ గ్రామం ఏ జిల్లాలో, ఏ మండలంలో ఉందో ప్రతి పేజీ లోనూ మొదటి వాక్యంలో ఉంటుంది. అయితే, 2016 లో జరిగిన జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణకు ముందు, ఆ గ్రామం ఏ జిల్లాలో, ఏ మండలంలో ఉండేది అనే చారిత్రిక సమాచారం లేదు. ఈ సమాచారాన్ని చేర్చడమే ప్రస్తుత ప్రాజెక్టు లక్ష్యం. అంటే పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం ఇదే జిల్లాలో/వేరే ఫలానా జిల్లాలో, ఇదే మండలంలో/వేరే ఫలానా మండలంలో ఉండేది అనే వాక్యం చేర్చాలన్న మాట. దానికి తగ్గ మూలాన్ని కూడా చేర్చాల్సి ఉంది.

ఈ చారిత్రిక సమాచారం విజ్ఞానసర్వస్వం పరంగా చాలా ముఖ్యమైనది కాబట్టి, ఈ పని చేసేందుకు ఒక ప్రాజెక్టును సృష్టించాం.

ప్రాజెక్టు సభ్యులు

మార్చు
  1. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:25, 18 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  2. యర్రా రామారావు (చర్చ) 05:31, 18 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  3. చదువరి (చర్చరచనలు)
  4. Nagarani Bethi (చర్చ) 10:44, 18 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  5. Kasyap (చర్చ) 09:11, 19 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వనరులు

మార్చు

10 వేల పేజీల కోసం చారిత్రిక సమాచారాన్ని సేకరించడానికి చాలా శ్రమ, సమయం ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది. అంతర్జాలంలో వికీపీడియా, ప్రభుత్వ వెబ్‌సైట్లు వంటి వివిధ స్థలాల్లో డేటా అందుబాటులో ఉంది గానీ, ఉన్నదున్నట్లుగా దాన్ని వాడుకునే వీలు లేదు. అంచేత ఆ డేటాలను సేకరించి ఒకచోట చేర్చి ఒక పట్టిక లాగా పెట్టాం. ఆ పట్టికను తెలంగాణ జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణ అనే పేజీలో చూడవచ్చు. 2016 నుండి 2021 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వివిధ పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణలలో చేసిన మార్పుచేర్పులన్నిటినీ ఈ పేజీలో చూడవచ్చు. అయితే ఈ మార్పులు ఆయా గ్రామాలు, మండలాలు, జిల్లాల పేజీల్లో కూడా కనిపించాలి కదా? గ్రామాల పేజీల్లో ఆ మార్పులను చేర్చడమే ఈ ప్రాజెక్టులో చెయ్యాల్సిన పని. మండలాల కోసం వేరే ప్రాజెక్టు ఉంది.

పై పేజీ లోని పట్టికలను, వివిధ ప్రభుత్వ వెబ్‌సైట్ల లోని డేటానూ వాడి, ఏయే గ్రామం పేజీలో ఏ సమాచారాన్ని చేర్చాలో చూపించే స్ప్రెడ్‌షీట్లను తయారుచేసాం. పునర్వ్యవస్థీకరణకు ముందు గ్రామం స్థితిని వివరించే పాఠ్యం ఈ ఫైళ్ళలో ఉంటుంది. కోరిన సభ్యులకు వాటిని ఈమెయిల్లో పంపిస్తాం. ఆ ఫైల్లో ఉన్న వాక్యాన్ని కాపీ చేసి పేజీలో పేస్టు చేస్తే సరిపోతుంది. మూలం కూడా అందులోనే చేరుతుంది.

పని చేసే విధం

మార్చు

స్ప్రెడ్‌షీటును అందుకున్నాక దాన్ని తెరిచి కిందివిధంగా పని చెయ్యాలి.

  1. స్ప్రెడ్‌షీటు లోని "బి" నిలువు వరుస లోని గ్రామం వికీపీడియా పేజీని తెరవండి. ఆ పేజీని దిద్దుబాటు స్థితిలో తెరవండి.
  2. స్ప్రెడ్‌షీటు లోని "జి" నిలువు వరుసలో ("పేజీల్లో చేర్చాల్సిన పాఠ్యం") పేజీలో చేర్చాల్సిన పాఠ్యం ఉంది.
  3. "జి" నిలువు వరుసలో ఆ సెల్లులో డబుల్‌క్లిక్కు చెయ్యండి. అప్పుడు అందులోని పాఠ్యాన్ని కాపీ చేసుకోండి. డబుల్ క్లిక్కు చెయ్యకుండా కూడా కాపీ చేసుకోవచ్చు, కానీ దాన్ని వికీపేజీలో పేస్టు చేసినపుడు పాఠ్యం మాత్రమే కాకుండా పెట్టె ఆకారం కూడా పేస్టు అయ్యే అవకాశం ఉంది.,
  4. కాపీ చేసుకున్న పాఠ్యాన్ని దిద్దుబాటు కోసం తెరిచి పెట్టిన వికీ పేజీలో సరైన చోట చేర్చండి. వీలైనంతవరకు ప్రవేశికలో గానీ, లేదా దాని కింద "జిల్లాల పునర్వ్యవస్థీకరణలో" అనే విభాగాన్ని పెట్టి, అందులో గానీ చేర్చండి. అంతకంటే కిందకు వెళ్ళవద్దు. ఎందుకంటే అక్కడి నుండి ఇక జనగణన గణాంకాలు వస్తాయి కాబట్టి.
  5. ఆ షీటుల్లో ఉన్న మిగతా నిలువు వరుసలను పట్టించుకోకండి, వాటిలో మార్పులేమీ చెయ్యకండి.

ప్రాజెక్టు వ్యవధి

మార్చు

దాదాపు 10 వేల దిద్దుబాట్లు అవసరమయ్యే ఈ ప్రాజెక్టును 2022 అక్టోబరు 31 నాటికి పూర్తి చెయ్యాలనేది సంకల్పం. ఒక్కో పేజీలో దిద్దుబాటు చేసేందుకు సాధారణ స్థాయి వాడుకరికి 2 నిమిషాల కంటే ఎక్కువ పట్టే అవకాశం లేదు. అంటే గంటకు 30 దిద్దుబాట్లు - అంటే 30 పేజీలు - అవలీలగా చెయ్యవచ్చు. ఈ విధంగా రోజుకు సుమారు 100 పేజీలు చెయ్యవచ్చు. అంటే 100 రోజుల్లో ప్రాజెక్టు పూర్తౌతుంది. ఇంకో 20 రోజులు కలుపుకున్నా ఒక వాడుకరి 4 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చెయ్యగలరు. నలుగురు కలిస్తే నెల!

ప్రాజెక్టు పురోగతి

మార్చు
క్ర.సం జిల్లా మొత్తం

మండలాల సంఖ్య

పని పూర్తైన

మండలాల సంఖ్య

పనిచేస్తున్న వాడుకరి పనులన్నీ పూర్తైతే

{{Tick}} టిక్కు పెట్టండి

1 ఆదిలాబాద్ జిల్లా 18 18 చదువరి (చర్చరచనలు)  Y
2 కరీంనగర్ జిల్లా 16 16 యర్రా రామారావు  Y
3 కామారెడ్డి జిల్లా 22 22 యర్రా రామారావు  Y
4 కొమరంభీం జిల్లా 15 15 యర్రా రామారావు  Y
5 ఖమ్మం జిల్లా 21 21 కశ్యప్, యర్రా రామారావు  Y
6 జగిత్యాల జిల్లా 18 18 యర్రా రామారావు  Y
7 జనగామ జిల్లా 12 12 యర్రా రామారావు  Y
8 జయశంకర్ జిల్లా 11 11 యర్రా రామారావు  Y
9 జోగులాంబ జిల్లా 12 12 యర్రా రామారావు  Y
10 నల్గొండ జిల్లా 31 31 Nagarani Bethi  Y
11 నాగర్‌కర్నూల్ జిల్లా 20 20 యర్రా రామారావు  Y
12 నారాయణపేట జిల్లా 11 11 యర్రా రామారావు  Y
13 నిజామాబాదు జిల్లా 29 29 యర్రా రామారావు  Y
14 నిర్మల్ జిల్లా 19 19 యర్రా రామారావు  Y
15 పెద్దపల్లి జిల్లా 14 14 యర్రా రామారావు  Y
16 భద్రాద్రి జిల్లా 23 23 కశ్యప్  Y
17 మంచిర్యాల జిల్లా 18 18 యర్రా రామారావు  Y
18 మహబూబాబాదు జిల్లా 16 16 యర్రా రామారావు  Y
19 మహబూబ్​నగర్​ జిల్లా 16 16 యర్రా రామారావు  Y
20 ములుగు జిల్లా 9 9 యర్రా రామారావు  Y
21 మెదక్ జిల్లా 21 21 యర్రా రామారావు  Y
22 మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా
23 యాదాద్రి జిల్లా 17 6
9
ప్రణయ్‌రాజ్ వంగరి
Nagarani Bethi
 Y
24 రంగారెడ్డి జిల్లా 27 27 Nagarani Bethi  Y
25 రాజన్న జిల్లా 13 13 యర్రా రామారావు  Y
26 వనపర్తి జిల్లా 14 14 యర్రా రామారావు  Y
27 వరంగల్ జిల్లా 13 13 యర్రా రామారావు  Y
28 వికారాబాదు జిల్లా 19 19 యర్రా రామారావు  Y
29 సంగారెడ్డి జిల్లా 27 27 Nagarani Bethi  Y
30 సిద్ధిపేట జిల్లా 24 24 Nagarani Bethi  Y
31 సూర్యాపేట జిల్లా 23 23 Nagarani Bethi  Y
32 హనుమకొండ జిల్లా 14 14 యర్రా రామారావు  Y
33 హైదరాబాదు జిల్లా 16 16 ఎటువంటి మార్పులు లేవు N/A

ప్రాజెక్టు నిర్వహణ

మార్చు
  1. చదువరి (చర్చరచనలు)

సంబంధిత ప్రాజెక్టులు

మార్చు