వికీపీడియా:వాడుకరి పేరు మార్పు

ఈ పేజీలో చూపించిన పేరుమార్పు పద్ధతి ప్రస్తుతం పనిచెయ్యదు. మీ అభ్యర్ధనను సార్వత్రిక పేరుమార్పు అభ్యర్ధన పేజీలో చెయ్యాలి.

ప్రస్తుతం ఈ పేరుమార్పు పద్ధతి మారింది. వాడుకరిపేరులన్నీ ఇప్పుడు సార్వత్రికం, స్థానికం కాదు. అంటే.. మీ వాడుకరిపేరు కేవలం తెలుగు వికీపీడియాకు మాత్రమే పరిమితంకాదు. ఒకే వాడుకరిపేరు అన్ని భాషల వికీ ప్రాజెక్టులన్నిటికీ పనిచేస్తుంది - తెలుగు, కన్నడం, ఇంగ్లీషు.. అన్ని భాషలకూ, వికీపీడియా, వికీసోర్సు, విక్షనరీ.. అన్ని ప్రాజెక్టులకూ ఒకే వాడుకరిపేరు, ఒకే లాగిన్! అలాగే పేరు మార్పు కూడా సార్వత్రికమే, స్థానికంగా మార్పు చెయ్యలేం. వాడుకరిపేరు మార్చుకోవాలనుకునేవారు సార్వత్రిక పేరుమార్పు అభ్యర్ధన పేజీలో ఈ మార్పును అభ్యర్ధించాలి.

వాడుకరిపేరు ఎలా ఉండాలనే విషయమై కొన్ని సూచనలను ఇక్కడ చూడవచ్చు

మీరు గతంలో ఎంచుకున్న వాడుకరి పేరు శిలాలిఖితమైనదేమీ కాదు. మీరు కోరితే అధికారులు మీ వాడుకరి పేరును మార్చి, మీరు చేసిన రచనలను, మీ ఎకౌంటు సెట్టింగులను కొత్త పేరుకు బదిలీ చేస్తారు.

సూచనలు

మార్చు

కింది పద్ధతిని పాటించండి. లేకుంటే మీ అభ్యర్ధన స్వీకరించబడదు.

  1. మీరు కోరుతున్న కొత్త వాడుకరి పేరు కింది విధంగా ఉందని నిర్ధారించుకోండి:
    • వాడుకరి పేరు వికీపీడియా విధానాలకు అనుగుణంగా ఉండాలి.
    • ఆ పేరు ఇప్పటికే వాడుకలో ఉండరాదు. వాడుకరుల జాబితా పేజీలో చూసి దీన్ని నిర్ధారించుకోవచ్చు.
    • మీరు ఇంగ్లీషు పేరును ఎంచుకుంటే మొదటి అక్షరాన్ని క్యాపిటలు లెటరు రాయడం తప్పనిసరి . అలా చెయ్యకపోతే అన్వేషణ సరిగా జరగదు; చిన్న అక్షరాలతో మొదలయ్యే పేర్లను వికీపీడియా ఒప్పుకోదు.
  2. మీరు లాగిన్ అయి ఉండాలి. ఐపీ అడ్రసు నుండి గానీ, ఇతర వాడుకరుల నుండి గానీ వచ్చే అభ్యర్ధనలను భద్రతా కారణాల వలన అధికారులు అంగీకరించరు.
  3. మీ అభ్యర్ధనను "ప్రస్తుత అభ్యర్ధనలు" విభాగంలో అట్టడుగున చేర్చండి.

మారిపోయిన తరువాత

మార్చు
  1. మీ పాత పేరు ఇక డేటాబేసులో ఉండదు. మీ పాత ఎకౌంటుకు సంబంధించిన దిద్దుబాట్లు, అభిరుచులు, వీక్షణజాబితా, సంకేతపదం వంటి మీ సమాచారమంతా కొత్త పేరుకు చేరిపోతాయి.
  2. మీ పాత వాడుకరి పేజీని, వాడుకరి చర్చా పేజీని కొత్త పేర్లకు తరలించండి.
  3. దుశ్చర్యలకు పాల్పడేవారు మీ పాత పేరును వాడి మీ పేరు చెడగొడతారని మీరు భావిస్తే, ఆ పాత పేరుతో మీరే ఓ ఎకౌంటును సృష్టించి, ఆ ఎకౌంటును నిరోధించమని ఎవరైనా నిర్వాహకుడిని అడగండి. మీరో ప్రసిద్ధ వాడుకరులైతేనో లేక బాగా ఎక్కువగా దిద్దుబాట్లు చేసేవారైతేనో తప్ప, ఇది అవసరం లేదు.
  4. వాడుకరి పేరు మార్పు కారణంగా గోప్యత ప్రభావితమయ్యే విధం: మీ అభ్యర్ధన మా డేటాబేసులోకి వెళ్తుంది. అది వాడుకరి పేరు మార్పు లాగ్ లోకి ఎక్కుతుంది. పారదర్శకత కోసం చేసిన ఈ పని వలన, మీ పేరుమార్పు విషయం వికీపీడియనులందరికీ తెలుస్తుంది. ఈ లాగ్ లో చేర్చకుండా వాడుకరి పేరు మార్చే అవకాశం లేదు.

గత అభ్యర్ధనలు

మార్చు
  • అయ్యా,

నా సభ్యనామమును యీ క్రింది విధముగా మార్చ గోరుచున్నాను.
పాత సభ్యనామము:Vulapalli Sambasiva Rao ను,
క్రొత్త సభ్యనామము:V Sambasiva Rao గా మార్పు చేయ గోరుతున్నాను. --vsrao 05:35, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]



  • పాత సభ్యనామము:Malathi Nidadavolu,

కొత్త సభ్యనామము:నిడదవోలు మాలతి గా మార్పు చేయగోరుచున్నాను. --సభ్యులు:Malathi Nidadavolu


  • పాత సభ్యనామము:Sureshdaniel51ను

క్రొత్త సభ్యనామము:సూరి గా మార్చగలరు సూరి


  • నా సభ్యనామమును యీ క్రింది విధముగా మార్చ గోరుచున్నాను.

పాత సభ్యనామము:Jainaprasadను క్రొత్త సభ్యనామము:జైన ప్రసాద్ గా మార్చగలరు.

సభ్యనామము అలాగే వుంచి మీ సంతకాన్ని నా అభిరుచులు పేజీలో తెలుగులో రాసి దాచి పెట్టండి. నేరుగా తెలుగులో పెట్టుకుంటే తెలుగుస్థాపించని కంప్యూటర్లపై మీరు వికీపీడియా లో ప్రవేశించలేరు. ఇంగ్లీషు వికీపేజీలలో పనిచేసేటప్పుడు, మీ పేరు తిరిగిరాయడంలో ఇతరులకి ఇబ్బంది వుంటుంది.--అర్జున (చర్చ) 00:22, 8 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]


  • పాతసభ్యనామము:జె.సుబ్బారెడ్ది

కొత్తసభ్యనామము:జె.సుబ్బారెడ్డి గా మార్చగలరు

  • తె.వీకీ. నిర్వాహకులకు నమస్కారం. నా వాడుకరి పేరు మార్చుకోవాలనుకుంటున్నాను.

నా ప్రస్తుత వాడుకరి పేరు R.Karthika Raju గా ఉంది. దీనిని కార్తీక రాజు గా మార్పు చేయగోరుచున్నాను.

- కార్తీక రాజు