వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/గ్రామ వ్యాసం మార్గదర్శకాలు

వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 63లో ప్రతిపాదించబడి అమలుజరుగుచున్న గ్రామ వ్యాసాల మార్గదర్శకాలు

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాలు నందు పునర్య్వస్థీకరణ ప్రకారం మార్పులు, చేర్పులు చేసేటప్పుడు అలాగే భారత జనగణన డేటా నింపేటప్పుడు కొన్ని పాటించవలసిన పద్దతులు, నియమాలు అవసరమని నేను గమనించాను.లోగడ ప్రత్యేక మండల వ్యాసాలు బహు కొద్ది మండలాలకు మాత్రమే ఉన్నాయి.ప్రస్తుతం ప్రతి మండలానికి ప్రత్యేక వ్యాసం సృష్టించేపనిలో మన వికీపీడియన్లు నిమగ్నమై ఉన్నారు. అందుకోసం కొన్ని మార్పుల తప్పనిసరిగా అవసరమై ఉన్నాయి.కొన్ని మార్పులు గందరగోళానికి తావులేకుండా అవసరమై ఉన్నాయి.నేను గమనించిన, నాకు తెలిసినంతవరకు ఆలోచించి కొన్ని మార్గదర్శకాలు/సూచనలు మీ పరిశీలన/చర్చ నిమిత్తం ప్రతిపాదిస్తున్నాను.మనందరం కోరుకొనేది మన తెలుగు వికీపీడియాలో వ్యాసాలు మెరుగ్గా ఉండాలనే!

జిల్లా, మండల, గ్రామ వ్యాసాలకు ప్రతిపాదించబడిన మార్గదర్శకాలు / సూచనలు మార్చు

  1. మండల వ్యాసం ప్రత్యేకంగా ఉన్నప్పుడు పలానా మండలలోని గ్రామాలు మూస ఎక్కించనవసరం లేదు.
  2. మండల వ్యాసం ప్రత్యేకంగా ఉన్న గ్రామ వ్యాసం పేజీకి పలానా జిల్లా మండలాలు మూస ఎక్కించనవసరం లేదు.
  3. మండల వ్యాసం ప్రత్యేకంగా ఉన్నప్పుడు జిల్లాలోని మండలాలు మూసకు మండల వ్యాసం లంకె మాత్రమే కలపాలి
  4. మండల వ్యాసం ప్రత్యేకంగా ఉన్నప్పుడు మండలంలోని గ్రామాలు మూసకు గ్రామ వ్యాసం లంకె మాత్రమే కలపాలి.
  5. మండలానికి, గ్రామానికి కలిపి ఒకే వ్యాసం ఉన్నప్పుడు మండలంలోని గ్రామాలు మూస, జిల్లాలోని మండలాలు మూస తగిలించాలి.
  6. మండలానికి, గ్రామానికి కలిపి ఒకే వ్యాసం ఉన్నప్పుడు మండలంలోని గ్రామాలు మూసకు, జిల్లాలోని మండలాలు మూసకు రెంటికి ఆ గ్రామ వ్యాసం లంకె కలపాలి.
  7. మండలంలోని రెవిన్యూ గ్రామాలు మాత్రమే మండలంలోని గ్రామాల మూసలో కూర్పు చేయాలి
  8. మూసలో ఉన్న రెవిన్యూ గ్రామాలకు మాత్రమే మండలంలోని గ్రామాలు మూసలు తగిలించాలి.
  9. గ్రామ వ్యాసాలకు పలానా జిల్లాలోని గ్రామాలు అనే వర్గం చేర్చరాదు.
  10. మండలం వ్యాసానికి పలానా జిల్లాలోని గ్రామాలు అనే వర్గం చేర్చరాదు.
  11. రెవెన్యూ గ్రామాలు కాని గ్రామాలు (గ్రామ పంచాయితీలుగాని, శివారు/ఉప గ్రామాలు కానీ వికీపీడియా నిర్వాహకులు చర్చించి నిర్నయం చేసేంతవరకు మూసలో చేర్చటం, మూసలు తగిలించటం, వర్గాలు చేర్చటం చేయరాదు.
  12. రెవెన్యూ గ్రామాలు కాని గ్రామాలు (గ్రామ పంచాయితీలుగాని, శివారు/ఉప గ్రామాలు కానీ మండల వ్యాసంలో మండలంలోని గ్రామాలు (రెవెన్యూ) విబాగంలో చూపరాదు.అటువంటి గ్రామాలు తగిన మూలాలుతో " రెవెన్యూ గ్రామాలు కాని గ్రామాలు" విభాగంలో చూపాలి.
  13. మండల వ్యాసానికి ఆ మండలం పురపాలక సంఘం/పట్టణం అయినంతమాత్రాన పురపాలక సంఘాల మూసను, నగరాలు మరియు పట్టణాల వర్గం చేర్చరాదు.
  14. మండల వ్యాసం ప్రత్యేకంగా ఉన్నప్పుడు గ్రామ వ్యాసంలో మండల వివరాలు అవసరం లేదు.అలాగే మండల వ్యాసంలో గ్రామ వివరాలు అవసరం లేదు.
  15. తెలంగాణా నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో ప్రభుత్వ ఉత్తర్వులు నందు కొన్ని మండల కేంద్రంగల గ్రామాలను మండలం పేరుగల గ్రామంతో కలుపుకొని మండలంలోని గ్రామాలుగా షెడ్యూలు 11లో చూపించాడు.కొన్ని మండల కేంద్రంగల గ్రామాలను మండలంలోని గ్రామాలుగా షెడ్యూలు 11లో చూపలేదు.అనగా అవి మండల కేంద్రాలేగాని,రెవెన్యూ గ్రామాల క్రిందకురావు.మండలంలోని గ్రామాలు మూసలో షెడ్యూలు 11లో ఉన్న గ్రామాలను మాత్రమే మూసలో చూపించాలి.
  16. మండల వ్యాసం, గ్రామ వ్యాసం విడి విడిగా ఉన్నపుడు మండల వ్యాసానికి గ్రామ వ్యాసం లింకు,గ్రామ వ్యాసానికి మండల వ్యాసం లింకు (మొదట్లో) ఇవ్యాలి.
  17. గ్రామానికి సమీప గ్రామాలు మాత్రమే వ్యాసంలో కూర్పు చేయాలి.
  18. మండలానికి సమీప మండలాలు మాత్రమే వ్యాసంలో కూర్పు చేయాలి.
  19. జిల్లాకు సమీప జిల్లాలు మాత్రమే వ్యాసంలో కూర్పు చేయాలి.
  20. రాష్ట్రానికి సమీప రాష్ట్రాలు మాత్రమే వ్యాసంలో కూర్పు చేయాలి.
  21. రాష్ట్రం అంతటికి సంభందించిన ఏదేని ప్రత్యేక సంఘటన/ సాధారణ సంఘటన వివరాలు రాష్ట్ర వ్యాసంలోనే కూర్పు చేయాలి.
  22. అలాగే జిల్లాలకు,మండలాలకు,గ్రామాలకు సంభందించిన ఏదేని ప్రత్యేక సంఘటన వివరాలు ఆ సంఘటనకు సంభందించి జిల్లా,మండల,గ్రామ వ్యాసంలో మాత్రమే కూర్పు చేయాలి.
  23. మండల వ్యాసం పేజీ ఇన్ ఫో బాక్స్ లో సంబందిత జిల్లా పటంలో మండలం యొక్క స్థానం ఉన్న రేఖా పటం మాత్రమే కూర్పు చేయాలి.
  24. వ్యాసంలో లంకెలు కలిపిన తరువాత సరియైన లంకెకు కలిసిందో లేదో నిర్ధారించుకోవాలి.లేదా కలిపేటప్పుడు సరియైన లంకె నిర్ధారించుకొన్న తరువాత మాత్రమే లంకె కలపాలి. సాధ్యమైనంతవరకు ఎర్రలింకులు తగ్గించుటకు ప్రయత్నించాలి.
  25. గ్రామ వ్యాసం పేజీ ఇన్ ఫో బాక్స్ లో సంబందిత మండల పటంలో ఆ గ్రామం యొక్క స్థానం ఉన్న రేఖా పటం మాత్రమే కూర్పు చేయాలి.
  26. భారత దేశం మొత్తం ఒకే టైం జోన్ అయినందున Time zone: IST (UTC+5:30) వ్రాసే అవసరం లేదు.

గమనిక:తెలంగాణ రాష్ట్రానికి సంభందించిన పునర్య్వస్థీకరణ ప్రభుత్వ ఉత్తర్వులు ఇక్కడ వనరులు అనే విభాగంలో పరిశీలించుకోవచ్చు.

గ్రామ వ్యాసాలకు,మండల వ్యాసాలకు వర్గాలు ఉండవలసిన సరియైన పద్దతి మార్చు

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు,మండలాలు,గ్రామాలు నందు పునర్య్వస్థీకరణ ప్రకారం మార్పులు,చేర్పులు చేసేటప్పుడు అలాగే భారత జనగణన డేటా నింపేటప్పుడు వర్గాల విషయంలో కొన్ని గ్రామ వ్యాసాలకు,కొన్ని మండల వ్యాసాలకు ఇవ్వవలసిన వర్గాలు ఇవ్వకపోవటం,అవసరంలేని కొన్ని వర్గాలు ఇవ్వటం గమనించాను. నాకు తెలిసినంతవరకు నేను కొన్ని సవరించుట జరిగింది.నాకున్న అవగాహన ప్రకారం గ్రామ వ్యాసాలకు,మండల వ్యాసాలకు వర్గాలు ఉండవలసిన సరియైన పద్దతితో కూడిన విడివిడిగా చానల్స్ (Proper way Tree) తయారుచేసి దిగువ చిత్రాల ద్వారా వివరించటమైనది. కొన్ని వర్గాలు ఇందులో చూపిన ప్రకారం అమలు జరుగుచున్నాయి.వర్గాలు సృష్టింపు కొత్తగా చేయవలసిన అవసరం లేదు.

  • గ్రామ వ్యాసాలకు వర్గాలు ఉండవలసిన సరియైన పద్దతి
 
గ్రామ వ్యాసాలకు వర్గాలు ఉండవలసిన సరియైన పద్దతి
  • మండల వ్యాసాలకు వర్గాలు ఉండవలసిన సరియైన పద్దతి
 
మండల వ్యాసాలకు వర్గాలు ఉండవలసిన సరియైన పద్దతి

గమనిక: కాకపోతే ‘ము’ స్థానంలో ‘సున్న’ లేదా ‘సున్న’ స్థానంలో ‘ము’ ఉండవచ్చు. ఈ చానల్స్ తెలంగాణ వ్యాసాలు దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడినవి. ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలుకు, మండలాలుకు “తెలంగాణ’ స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ లేదా ఆంధ్రప్రదేశ్ అని ఉన్న వర్గాలు చేర్చాలి.

ఇవికూడా చూడండి మార్చు